taking photos
-
రోగిని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసిన వ్యక్తి అరెస్టు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ఈసీ జీ గదిలో ఒక యువతికి పరీక్షలు చేస్తూ, సెల్ఫోన్లో ఫొటోలు తీసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కొత్తపేట పీఎస్ ఎస్ఐ ఖాజీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన ఒక యువతి అనారోగ్య కారణాలతో ఈసీజీ తీయించుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈసీజీ విభాగంలో పనిచేస్తున్న రాకేష్ వ్యక్తిగత సెలవులో ఉండటంతో అతడి స్థానంలో నల్లచెరువుకు చెందిన బత్తుల హరీష్‌ను ఉంచాడు. ఆస్పత్రిలో నిత్యం హరీష్ ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాత గుంటూరుకు చెందిన యువతికి పరీక్షలు చేస్తున్న సమయంలో ఆమెను హరీష్ సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీన్ని గుర్తించిన యువతి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆమె తల్లి, ఇతర రోగులు, అవుట్‌పోస్ట్ పోలీసులు వచ్చి హరీ‹Ùను పట్టుకున్నారు. -
సెల్ఫోన్లో ఫోటోలు తీసి నానా రభస..
సాక్షి, ఆత్మకూరు : కారుకు సైడు ఇవ్వమని అడిగారన్న కోపంతో బొలెరో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి... కారులో వెళుతున్న వారిని వెంటాడి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన ఏఎస్‌పేట మండలంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేద పండితులుగా పనిచేస్తున్న విఘ్నేష్‌కుమార శర్మ తన కుటుంబసభ్యులతో కారులో ఏఎస్‌పేట మండలంలోని గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జమ్మవరం వద్ద ఓ బొలేరో వాహనం దారికి అడ్డుగా ఉండడంతో విఘ్నేష్‌కుమార్ హారన్ మోగించాడు. తన కారు వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరాడు. బొలేరో వాహన డ్రైవర్ మద్యం మత్తులో కారులో ఉన్నవారిని దుర్భాషలాడుతూ వాహనాన్ని అడ్డు తొలగించాడు. పట్టించుకోని విఘ్నేష్‌కుమార్ తన కారును గుంపర్లపాడు వైపునకు పోనిచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఆ బొలేరో వాహనంలో ఉన్న వ్యక్తి తన వాహనంతో వీరి వాహనాన్ని వెనుకనే తరుముకుంటూ దారి పొడవునా హారన్ మోగిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. విఘ్నేష్‌కుమార్ కుటుంబ సభ్యులు మొత్తానికి గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. వీరి వెనుకనే వచ్చిన బొలేరో వాహనందారుడు విఘ్నేష్‌కుమార్ బంధువుల ఇంట్లోకి వెళ్లి తన సెల్‌ఫోన్‌తో మహిళలని కూడా చూడకుండా అందరి పొటోలు తీస్తూ నా వాహనానికి అడ్డు తగులుతారా అని బెదిరించి దుర్భాషలాడాడు. కారును వెంబడించిన బొలేరో వాహనం గ్రామస్తులు గమనించి బొలేరో వాహనదారుడిని మందలించేందుకు ప్రయత్నించారు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, తనను ఏమైనా అంటే అంతుచూస్తానని మద్యం మత్తులో నానాయాగి చేశాడు. దీంతో గ్రామస్తులు ఏఎస్‌పేట పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి అతడ్ని బైక్‌పై తీసుకుని వెళ్లారు. బొలేరో వాహనం ఏసుబాబు అనే వ్యక్తిదిగా గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు సీఐ పాపారావును సంప్రదించగా తాను పూర్తి విషయాలు తెలుసుకుని విచారణ చేస్తానని పేర్కొన్నారు. -
ఫొటో తీస్తుంటే దూసుకొచ్చిన పులి
ఈ రోజుల్లో స్వీయ చిత్రాలకు(సెల్ఫీలు), వీడియోలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇలాంటివి క్షణికానందాలే అనే విషయం మరిచిపోయి తమకు నచ్చితే చాలు వెంటనే ఓ వీడియో తీసుకుంటూనో, ఓ సెల్ఫీ దిగుతూనో ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అదృష్టం ఉన్నవాళ్లయితే గాయాలతో బయటపడుతుండగా.. ఇంకొందరు చనిపోతున్నారు. అందుకే ఇలాంటి చర్యల విషయంలో కనీసం పరిజ్ఞానం ఉండాలని ఓ సంఘటన చెబుతోంది. ఇటీవల డిసెంబర్ 4న వన్య మృగాలను చూడాలని, అడవిలో సంచరించాలనే ఉత్సాహంతో కొంతమంది వ్యక్తులు ఓ అటవీ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ ప్రోగ్రాంతో వెళ్లారు. వారిలో కొందరు ఏనుగుపై ఎక్కి ముందుకు సాగగా.. ఇంకొందరు జీపులో ముందుకు కదిలారు. అలా వెళుతున్న క్రమంలో ఓ పొదల మాటున పులి కనిపించింది. ఆ సమయంలోనే పులి ఎదురుపడినప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో సరిగ్గా వారు అదే చేశారు. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లాల్సిందిపోయి తమ చేతుల్లోని కెమెరాలు తీసుకొని టకటకా ఫొటోలకు, దూరం నుంచి సెల్ఫీలకు ప్రయత్నించారు. దీంతో కెమెరా క్లిక్ మనే శబ్దంకాస్త పులి చెవిన పడి ఒక్కసారిగా అది గాండ్రుమని దూసుకొచ్చింది. ఏనుగుపై ఉన్నవారికి, జీపులోని నలుగురికి ఆ సీన్ చూసి గుండెలు ఆగిపోయాయి. చచ్చాం దేవుడా అనుకునేలోగా వారి అదృష్టం కొద్ది ఏనుగు ఘీంకారంతో పులి కాస్త అడవిలోకి పరుగులు తీసింది. దీంతో వారంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు తీసే సమయంలో కాస్తంత అప్రమత్తంగా ఉంటే అన్ని విధాల మంచిదని చెబుతూ వన్యప్రాణి సంరక్షణ సేవకుడు బిట్టు సెహగల్ తన ఫేస్ బుక్ పేజీలో వివరాలు పోస్ట్ చేశారు.