Talent Hunt
-
ఉత్తమ ప్రతిభకు ఉజ్వల భవిత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ క్రీడాకారుల్లోని సత్తాను వెలుగులోకి తెచ్చేలా ‘ఆడుదాం ఆంధ్ర’ వేదికను సిద్ధం చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఈ మెగా టోర్నిలో టాలెంట్ హంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో (క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్) మహిళలు, పురుషుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపికచేసి వారి ప్రతిభకు పట్టం కట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాలు, మండలస్థాయి పోటీల అనంతరం 175 నియోజక వర్గాలు, 26 జిల్లాల స్థాయిలో జరిగే పోటీలను నిశితంగా పర్యవేక్షించనుంది. వీటిల్లో రాణించిన క్రీడాకారుల వివరాలతో ప్రత్యేక జాబితాను తయారు చేయనుంది. అత్యుత్తమ శిక్షణ దిశగా.. క్రీడాసంఘాల ప్రతినిధులతో పాటు ఫ్రాంచైజీల ప్రత్యేక బృందాలు ‘ఆడుదాం ఆంధ్ర’ నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను దగ్గరుండి పర్యవేక్షించనున్నాయి. మైదానంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నవారిని నేరుగా ఫ్రాంచైజీలే దత్తత తీసుకుని శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉదాహరణకు క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న యువతకు సీఎస్కే, ఇతర క్రికెట్ ఫ్రాంచైజీల్లో శిక్షణతో పాటు భవిష్యత్తు సీజన్లో జట్టులో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. కబడ్డీ, వాలీబాల్‌లో రాణించిన వారిని కూడా పీకేఎల్, పీవీఎల్లకు ఆయా జట్లు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్‌లో అయితే అంతర్జాతీయ క్రీడాకారులు నెలకొల్పిన అకాడమీల్లో ఉత్తమ తర్ఫీదు లభిస్తుంది. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులకు వారి స్థాయిలను బట్టి వివిధ మార్గాల్లో శిక్షణ లభిస్తుంది. తద్వారా వారి ప్రతిభ మరింత మెరుగుపడనుంది. ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులున్నా.. ఇప్పటివరకు సరైన దిశలో నడిపించేవారులేక గ్రామాల్లోనే నిలిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా వారందరినీ గుర్తించే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. రాష్ట్రంలోని క్రీడాసంఘాలతో పాటు ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలను ఇందులో భాగస్వాములను చేస్తోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి క్రికెట్ టాలెంట్‌ను గుర్తించేందుకు ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) అంగీకారం తెలిపింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీలతోనూ శాప్ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. కబడ్డీలో తురుపుముక్కలను ఎంపికచేసే బాధ్యతను ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) తీసుకుంది. వాలీబాల్‌లో ప్రతిభను ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సంస్థ ఒడిసిపట్టనుంది. అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు ఖోఖో, బ్యాడ్మింటన్ అసోసియేషన్లు సహకారం అందించనున్నాయి. -
ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?
ఇటీవల 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... గత పాలకుల వైఫల్యం, క్రీడల్లో బంధుప్రీతి, అవినీతి, తీవ్రమైన మౌలిక వసతుల కొరత వంటి కారణాలవల్ల ప్రపంచ క్రీడా వేదికలపై మనం వెనుకపడ్డామని అన్నారు. విద్యావిధానంలో భాగంగా క్రీడా విధానాన్ని చూసినప్పుడే క్రీడలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. మన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరచాయి. 1968లో ఇందిరాగాంధీ, 1986లో రాజీవ్ గాంధీ, 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానంలో మార్పులు చేసినప్పటికీ క్రీడలకు సముచిత స్థానం కల్పించలేకపోయాయి. కానీ మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన నూతన విద్యా విధానం – 2020లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘గ్రాస్ రూట్ టాలెంట్ హంట్’ అనే నినాదంతో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌ను తీసుకురావడం కొంతవరకు మంచి సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇంకా అనేక అంశాలలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర జనాభా కన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా ఒలింపిక్స్‌లో మొదటి పది దేశాల జాబితాలో ఉంటున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఈవెంట్స్, ఈత కొలనులో జరిగే పోటీల్లో అత్యంత వెనుకబడిన దేశాలూ ఎన్నో పతకాలను కొల్లగొడు తున్నాయి. కాబట్టి మనం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధపెడితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యాహక్కు చట్టం–2009 ప్రతి పాఠశాలలో క్రీడాస్థలం, క్రీడలకు కావాల్సిన సౌకర్యాలు ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించు కున్నట్టు కనిపించదు. చదువు కన్నా ఆటలను ఇష్టపడే వయసులో ఉన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో ఉంటారు. ఆ వయసులోనే పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న క్రీడా నైపుణ్యాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు కనిపించరు. క్రీడల్లో అగ్రదేశాలకు సవాల్ విసురుతున్న చైనా... అతిచిన్న వయసులోనే పిల్లలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న విష యాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. అందుకే ముందుగా ప్రాథమిక పాఠశా లల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులను నియ మించాలి. పాఠశాలలూ, కళాశాలల్లోనే కాక... గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి శిక్షకులనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడే మన దేశంలో ఎంతో మంది పీవీ సింధులు, నికత్ జరీన్‌లు, నీరజ్ చోప్రాలు మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడిస్తారు. (క్లిక్ చేయండి: వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!) – జంగం పాండు, ఏబీవీపీ ఖేల్ స్టేట్ కన్వీనర్ -
మీలో టాలెంట్ ఉందా..అయితే అప్లై చేయండి
ముంబాయి : మీలో టాలెంట్ దాగి ఉంటే అప్లై చేయండి. టీం ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిరెస్టెన్ యువ క్రికెట్లర్లలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపొందించాడు. ఈ నెల 23 నుంచి వచ్చే మే నెల 18వరకు టాలెంట్ స్కౌట్ కార్యక్రమం ప్రారంభించాడు. భారత్‌లోని 8 నగరాల నుంచి మంచి నైపుణ్యం ఉన్న ఆరుగురు క్రికెటర్లను ఎంపిక చేయనున్నాడు. టాప్‌లో నిలిచిన ఆరుగురు యువ క్రీడాకారులకు పూణెలో వీకెండ్ ట్రైనింగ్ ఇవ్వనున్నాడు. అలాగే టాప్‌లో నిలిచిన ముగ్గురు క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రెండు నెలల పాటు గ్యారీ కిర్‌స్టెన్ క్రికెట్లో ఉండేందుకు సౌకర్యం కల్పించనున్నారు. టాలెంట్ స్కౌట్ ఎంట్రీ ఫీజు రూ.1000. దీనిలో పాల్గొనేందుకు కేవలం టాలెంట్ మాత్రమే అర్హత. టాలెంట్ హంట్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు వారి పేరు, నగరం, కాంటాక్ట్ వివరాలు 9112295566 ఫోన్ నెంబర్‌కు వాట్సప్ చేయడమే. -
క్రీడోదయం
ఫలితాన్నిచ్చిన టాలెంట్ హంట్ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ తొలిసారిగా జిల్లా నుంచి 25మంది ఎంపిక స్పోర్ట్స్ స్కూళ్లతో క్రీడాకారులకు మహర్దశ జిల్లా స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ హంట్ మంచి ఫలితానిచ్చింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన చిన్నారి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది స్పోర్ట్స్ స్కూల్‌కు జిల్లా నుంచి పది కంటే తక్కువగానే ఎంపికయ్యేవారు. కానీ ఈ సారి ఏకంగా 25మంది చిన్నారులు ఎంపికయ్యారు. – మహబూబ్‌నగర్ క్రీడలు జిల్లా గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల్లో సత్తాచాటారు. ఈ ఏడాది తొలిసారిగా 25మంది పాలమూరు విద్యార్థులు రాష్ట్రంలోని హకీంపేట (హైదరాబాద్), కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలలకు ఎంపికై సంచలనం సృష్టించారు. 25 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి 4, 5 తరగతుల్లో ప్రవేశం పొందారు. వీరిలో 15మంది విద్యార్థులు ఆదిలాబాద్ స్కూల్‌కు ఎంపికయ్యారు. 20మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం పొందారు. వీరికి ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో చదువుతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. మూడేళ్ల పాటు ఫెక్సిబిలిటీ కింద శిక్షణ అందజేసి అనంతరం వారు ఎంచుకున్న క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. ఫలించిన టాలెంట్‌హంట్.. కలెక్టర్ టీకే శ్రీదేవి సహకారంతో తెలంగాణలో ఎక్కడాలేని విధంగా డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్లో ఒక తండాను ఎంపిక చేసుకుని ప్రత్యేకంగా టాలెంట్ హంట్‌ను నిర్వహించారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో టాలెంట్ హంట్‌తో క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను వెలికితీశారు. వీరికి ముందుగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికల్లో నిర్వహించే ఎత్తు, బరువు, మెడిసిన్ బాల్ త్రో, షటిల్ రన్, 30 మీటర్ల రన్, షార్ట్ జంపింగ్ తదితర అంశాల్లో ఎంపికలు నిర్వహించి జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు.. స్పోర్ట్స్ స్కూల్ (ఆదిలాబాద్) 4వ తరగతిలో.. మహేశ్వరి (ఖిల్లాఘనపురం), భానుప్రియ (పదర), సింధు (నర్సాయిపల్లి), సవిత (లింగంపల్లి), మోనేశ్వరి (కొల్లంపల్లి), వినోద్ (లింగంపల్లి), నిఖిల్‌గౌడ్ (ముట్పూర్), రాంచరణ్ (బిజినేపల్లి), 5వ తరగతిలో.. పావని (ఉప్పునుంతల), బాలమణి (లింగంపల్లితండా). శ్రీధర్ (టంకర), గోవర్ధన్ (బెక్కం), సాయివరుణ్ (మహబూబ్‌నగర్), భానుప్రకాశ్‌గౌడ్ (కొండూర్), తరుణ్‌కుమార్‌రెడ్డి (ఖిల్లాఘనపురం). స్పోర్ట్స్ స్కూల్ (హైదరాబాద్) 4వ తరగతిలో.. జయ (కొల్లంపల్లి), అరుణశ్రీ (మద్దూర్), హిమబిందు (మానాజిపేట), అర్చన (బొల్గట్‌పల్లి), సహస్ర (బాలానగర్). 5వ తరగతిలో.. రాము (వెల్కిచర్ల). రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ (కరీంనగర్) 4వ తరగతిలో.. సుప్రజ (చిన్నచింతకుంట), ముడావత్ అనూష (తాడూర్), రాకేశ్ (పెనిమిళ్ల), శివమణి (బాలానగర్). స్పోర్ట్హాస్టల్ ద్వారా రాణించిన జిల్లా క్రీడాకారులు స్పోర్ట్ హాస్టల్లో ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జిల్లా క్రీడాకారులు రాణించారు. జిల్లాకు చెందిన అథ్లెట్ శంకర్ జిల్లాస్థాయి నుంచి హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్‌కు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఖిల్లాఘనపూర్కు చెందిన నవత సెపక్‌తక్రాలో ఏషియన్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. వీరితో పాటు భారతి, లలిత, అంజలి, సరిత, పాండు, స్వప్న, నరేశ్, హారిక, రామునాయక్, రాములు, గోపాల్, లక్ష్మిరాం స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటూ ఆయా క్రీడాంశాల్లో రాణిస్తున్నారు. 50మంది ఎంపికయ్యేలా లక్ష్యం.. – సత్యవాణి, డీఎస్డీఓ జిల్లాలోని గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యం ఉంది. దానిని వెలికితీస్తే మంచి క్రీడా ఆణిముత్యాలు వస్తారు. కలెక్టర్ సహకారంతో టాలెంట్ హంట్‌ను నిర్వహించాం. మూడు స్పోర్ట్స్ స్కూళ్లలకు 25 మంది క్రీడాకారులు ఎంపికకావడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని టాలెంట్ హంట్లు నిర్వహించి 50మంది ఎంపికయ్యేలా లక్ష్యంగా శిక్షణ అందజేస్తాం. -
త్వరలో విడుదల!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆధ్వర్యంలో సాక్షి ‘ఫ్యామిలీ’ నిర్వహించిన ‘షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’ కు సుమారు 1300 లఘుచిత్రాలు ఎంట్రీలుగా వచ్చాయి. ఒక్కొక్కటి పది నిమిషాల నిడివి ఉన్న ఇన్ని వందల లఘుచిత్రాలను డౌన్లోడ్ చేసి, ఐడియాల వారీగా వేరు చేసి, ప్రాథమిక పరిశీలన నిమిత్తం సిద్ధం చేయడానికి సహజంగానే చాలా సమయం పట్టింది. మరుగున ఉన్న మాణిక్యాలను వెలికితీసే ఈ ‘టాలెంట్ హంట్’లో సినీ ప్రముఖులతో ప్రత్యేక జ్యూరీని ‘సాక్షి’ ఏర్పాటు చేసింది. ఒక్కో ఐడియా ఎంట్రీలకు ఒక్కో సినీ ప్రముఖుడు జ్యూరీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎంపిక జరుగుతోంది. పూర్తి వివరాలు... త్వరలో... మీ ‘ఫ్యామిలీ’లో...