త్వరలో విడుదల! | Short Film Contest | Sakshi
Sakshi News home page

త్వరలో విడుదల!

Published Thu, Apr 23 2015 10:46 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

త్వరలో విడుదల! - Sakshi

త్వరలో విడుదల!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆధ్వర్యంలో సాక్షి ‘ఫ్యామిలీ’ నిర్వహించిన ‘షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’ కు సుమారు 1300 లఘుచిత్రాలు ఎంట్రీలుగా వచ్చాయి. ఒక్కొక్కటి పది నిమిషాల నిడివి ఉన్న ఇన్ని వందల లఘుచిత్రాలను డౌన్‌లోడ్ చేసి, ఐడియాల వారీగా వేరు చేసి, ప్రాథమిక పరిశీలన నిమిత్తం సిద్ధం చేయడానికి సహజంగానే చాలా సమయం పట్టింది.

మరుగున ఉన్న మాణిక్యాలను వెలికితీసే ఈ ‘టాలెంట్ హంట్’లో సినీ ప్రముఖులతో ప్రత్యేక జ్యూరీని ‘సాక్షి’ ఏర్పాటు చేసింది. ఒక్కో ఐడియా ఎంట్రీలకు ఒక్కో సినీ ప్రముఖుడు జ్యూరీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎంపిక జరుగుతోంది. పూర్తి వివరాలు... త్వరలో... మీ ‘ఫ్యామిలీ’లో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement