యువదర్శకులతో పూరి జగన్నాథ్ చిట్‌చాట్
‘‘సార్ మిమ్మల్ని కలవాలని చాలా ట్రైం చేశాం. అయినా కుదర్లేదు.. మీ షూటింగ్ స్పాట్‌కు వచ్చినా సరే మమ్మల్ని తోసేసేవారు.. అలాంటిది మీతో ఇలా కలిసి మాట్లాడతామని అసలు అనుకోలేదు.. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం...’’
దర్శకుడు పూరి జగన్నాథ్‌ని కలి సిన ఆనందంలో యువదర్శకులు ఆయనతో చెప్పిన మాటలివి. వీళ్లం దరూ పూరీని కలవడానికి వేదికగా నిలి చింది ‘సాక్షి’. సాక్షి మీడియా గ్రూప్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి, నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో పన్నెండు మంది దర్శకులు విజేతలుగా ఎంపికకైన విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో జరిగిన అవార్డు వేడుకలో ఈ యువదర్శకుల అభిమానాన్ని చూసి కదిలిపోయిన పూరి జగన్నాథ్ ఆదివారం వీరిని తన ఆఫీసులో కాఫీ పార్టీకి ఆహ్వానించారు. ‘జ్యోతిలక్ష్మి’ విడుదల బిజీ ఓ వైపు, నితిన్‌తో సినిమాకి సన్నాహాలు మరోవైపు, చిరంజీవి 150వ సినిమాకి కథ తయారు చేసే పని ఇంకోవైపు.. ఇలా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ కాఫీ పార్టీకి సమయం కేటాయించడం అంత సులువు కాదు.
జూబ్లీహిల్స్‌లోని తన కేవ్ (పూరి జగన్నాథ్ ఆఫీస్)లో షార్ట్ ఫిలిం దర్శకులు, వారి బృందంతో రెండు గంట లసేపు ముచ్చటించారు పూరి. తమ అభిమాన దర్శకునితో ఫొటోలు, సెల్ఫీ లు దిగారు. పూరి దర్శకత్వం వహిం చిన చిత్రాల్లోని డైలాగ్స్‌ను తమదైన శైలిలో చెప్పారు. ఇలా రెండు గంటలూ ఆద్యంతం హాయిగా,సరదాగా గడిచి పోయింది. ‘ఆయనతో మాట్లాడతామ ని, కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం కల్పిం చిన సాక్షి మీడియాకు, దర్శకుడు పూరి జగన్నాథ్‌కు కృతజ్ఞతలు’ అని విజేతలు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.
కాఫీ విత్ పూరి
Published Mon, Jun 8 2015 12:37 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
Advertisement
Advertisement