పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ | Puri Jagannadh's hunt for new directors | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

Published Fri, May 8 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

ఐడియా-9 ఫైనల్ లిస్ట్
 ‘‘ ‘సాక్షి’ మీడియా గ్రూప్ - పూరి జగన్నాథ్ కలిసి నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌కు మంచి స్పందన వచ్చింది.  ఐడియా-9 (వేమన పద్యం-‘తప్పులెన్నువారు’)కు నేను న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. వినూత్నమైన ఈ ఐడియాకు చాలా లఘుచిత్రాలు వచ్చాయి. అందులోంచి మూడు ఎంపిక చేశాను.  ‘నా లైఫ్ నా ఇష్టం’, ‘విశ్వదాభిరామ వినురవేమ’, ‘విశ్వదాభిరామ’... నాకు బాగా నచ్చిన లఘు చిత్రాలు.  కథాంశాన్ని ఒడిసిపట్టుకుని కొంత మంది బాగా తీశారు. వేమన పద్యం అందరికీ తెలిసిందే. కానీ కొంత మంది ఇంత ఈజీ కాన్సెప్ట్‌ను సరిగ్గా తీయలేదు. ఇంత మంచి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.
 
  చాలా లఘుచిత్రాలలో మందు, పొగ తాగే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవసరం లేకుండా ఇలాంటి సన్నివేశాలను చొప్పించడం సరికాదనిపించింది. ఇలాంటి ధోరణి మంచిది కాదు కూడా. పది నిమిషాల వ్యవధిలో ైటె టిల్స్‌తోనే సగం సమయం గడిచిపోతే, ఇలాంటి అనవసర సన్నివేశాలు  సహనానికి పరీక్ష పెట్టాయి. స్టార్ దర్శకుడు అయి ఉండి కూడా పూరీ జగన్నాథ్ కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఇది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు నిస్వార్థమైన సేవ అందించింది ‘సాక్షి’. ఇందులో పాల్గొన్నవారికి పేరుపేరునా అభినందనలు. ఇక ముందు కూడా యువతరం ఇలాంటి అవకాశాలు వదులకోకూడదని కోరుతున్నాను.’’
 
 - భాస్కరభట్ల రవికుమార్, పాటల రచయిత
 
 ఐడియా నం.9
 జ్యూరీ మెంబర్: భాస్కరభట్ల రవికుమార్
 
 1)    నా లైఫ్ నా ఇష్టం
     దర్శకుడు: పరమేశ్ రే ణుకుంట్ల
 
 2)    విశ్వదాభిరామ వినురవేమ
     దర్శకుడు: సయ్యద్ అమర్
     syedamer18@gmail.com
 
 3)    విశ్వదాభిరామ
     దర్శకుడు: కె. మోహన్
 
 పోటీలోని లఘు చిత్రాలను sakshi.comలో, ఉదయం 10.30 గంటలకు ‘సాక్షి’ టీవీలో చూడొచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement