DIRECTOR HUNT
-
పూరీ డైరెక్టర్ హంట్ ఫైనల్ ఈవెంట్ పార్ట్ 4
-
పూరీ డైరెక్టర్ హంట్ ఫైనల్ ఈవెంట్ పార్ట్ 3
-
పూరీ డైరెక్టర్ హంట్ ఫైనల్ ఈవెంట్ పార్ట్2
-
పూరీ డైరెక్టర్ హంట్ ఫైనల్ ఈవెంట్ పార్ట్1
-
కాఫీ విత్ పూరి
యువదర్శకులతో పూరి జగన్నాథ్ చిట్‌చాట్ ‘‘సార్ మిమ్మల్ని కలవాలని చాలా ట్రైం చేశాం. అయినా కుదర్లేదు.. మీ షూటింగ్ స్పాట్‌కు వచ్చినా సరే మమ్మల్ని తోసేసేవారు.. అలాంటిది మీతో ఇలా కలిసి మాట్లాడతామని అసలు అనుకోలేదు.. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం...’’ దర్శకుడు పూరి జగన్నాథ్‌ని కలి సిన ఆనందంలో యువదర్శకులు ఆయనతో చెప్పిన మాటలివి. వీళ్లం దరూ పూరీని కలవడానికి వేదికగా నిలి చింది ‘సాక్షి’. సాక్షి మీడియా గ్రూప్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి, నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో పన్నెండు మంది దర్శకులు విజేతలుగా ఎంపికకైన విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో జరిగిన అవార్డు వేడుకలో ఈ యువదర్శకుల అభిమానాన్ని చూసి కదిలిపోయిన పూరి జగన్నాథ్ ఆదివారం వీరిని తన ఆఫీసులో కాఫీ పార్టీకి ఆహ్వానించారు. ‘జ్యోతిలక్ష్మి’ విడుదల బిజీ ఓ వైపు, నితిన్‌తో సినిమాకి సన్నాహాలు మరోవైపు, చిరంజీవి 150వ సినిమాకి కథ తయారు చేసే పని ఇంకోవైపు.. ఇలా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ కాఫీ పార్టీకి సమయం కేటాయించడం అంత సులువు కాదు. జూబ్లీహిల్స్‌లోని తన కేవ్ (పూరి జగన్నాథ్ ఆఫీస్)లో షార్ట్ ఫిలిం దర్శకులు, వారి బృందంతో రెండు గంట లసేపు ముచ్చటించారు పూరి. తమ అభిమాన దర్శకునితో ఫొటోలు, సెల్ఫీ లు దిగారు. పూరి దర్శకత్వం వహిం చిన చిత్రాల్లోని డైలాగ్స్‌ను తమదైన శైలిలో చెప్పారు. ఇలా రెండు గంటలూ ఆద్యంతం హాయిగా,సరదాగా గడిచి పోయింది. ‘ఆయనతో మాట్లాడతామ ని, కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం కల్పిం చిన సాక్షి మీడియాకు, దర్శకుడు పూరి జగన్నాథ్‌కు కృతజ్ఞతలు’ అని విజేతలు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. -
నన్ను మా అమ్మా నాన్న ప్రోత్సహించినట్లే... టాలెంట్‌ని సాక్షి ప్రోత్సహించింది
- పూరి జగన్నాథ్ ‘‘నేను చిత్రపరిశ్రమకు రావాలనుకోలేదు. వస్తాననీ అనుకోలేదు. చిన్నప్పట్నుంచీ కథలు రాసే అలవాటు ఉండేది. డిగ్రీ దువుతున్నప్పుడు ఓ కథ రాసుకుని, నాటకంగా వేస్తూ, దర్శకత్వం వహించా. అది చూసి, మా అమ్మా నాన్న ‘నువ్వు సినిమా ఇండస్ట్రీకి పనికొస్తావ్’ అని పాతిక వేలిచ్చి ప్రోత్సహించారు. ఈ రోజు మీ అందర్నీ (విజేతలు) ‘సాక్షి’ ప్రోత్సహించింది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. పూరి జగన్నాథ్ ఇచ్చిన పది కథల ఐడియాలతో ‘సాక్షి’ పత్రిక నిర్వహించిన ‘డెరైక్టర్స్ హంట్ - షార్ట్ ఫిలిం కాంటెస్ట్’ తుది ఫలితాలను పూరి సారథ్యంలోని పది మంది సినీ ప్రముఖుల జ్యూరీ వెల్లడించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో విజేతలకు పూరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, నగదు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ, ‘‘నేను బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో కృష్ణవంశీ దగ్గరకు తీసుకెళ్లి చేర్చాడు ఉత్తేజ్. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు జేబులో రెండు వందలే ఉంటే, కొత్త దుస్తులు, తాళిబొట్టు కొని, పెళ్లి చేసింది ఝాన్సీ. జీవితంలోని ఇలాంటి చిన్న మలుపులు, సహాయాలే పెద్ద మలుపు తెస్తాయి. అప్పుడు నా వెనక వాళ్లిద్దరూ ఉంటే, ఈ నవ తరం డెరైక్టర్స్ టాలెంట్‌ను ప్రోత్సహించడం వెనుక ‘సాక్షి మీడియా సంస్థ’ ఉంది. ఈ సినిమా పిచ్చి మీ జీవితాన్ని మార్చేస్తుంది’’ అని అన్నారు. ‘‘నచ్చని ఉద్యోగం చేయడం కన్నా.. నచ్చిన పని చేయడమే పెద్ద సక్సెస్. అందుకే, మీకు నచ్చిన పని చేయండి. రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు.. యుద్ధం చేయడం ముఖ్యం’’ అని విజేతలను పూరి ఉత్సాహపరిచారు. అది మాత్రమే కాదు.. విజేతలందర్నీ తమ బృందంతో కలిసి ఆదివారం ఉదయం తన ఆఫీసులో కలసి కాఫీ తాగుతూ, ముచ్చటించేందుకు ఆహ్వానించారు పూరి జగన్నాథ్. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి స్వాగతోపన్యాసం చేస్తూ, ‘‘అన్ని రంగాల్లో భవిష్యత్తు కోసం లీడర్స్‌ని తయారు చెయ్యటం చాలా అవసరం. కానీ చాలా మంది బిజీగా ఉన్నాం అంటూ ఆ బాధ్యతను పక్కకు పెడుతుంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఏకకాలంలో 4 సినిమాలతో బిజీగా ఉన్న పూరి ఈ ఈవెంట్ కోసం ఎంతో సమయం వెచ్చించారు. మంచి సినిమాలు కావాలంటే మంచి దర్శకులు కావాలి. న్యూ ఫిలిం మేకర్స్ మంచి ఎక్స్పరిమెంట్స్ చేసి మంచి సినిమాలు తియ్యాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ ‘డెరైక్టర్స్ హంట్’ విజేతల బహుమతి ప్రదానానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన నటి చార్మి మాట్లాడుతూ, ‘‘ఈ షార్ట్ ఫిలిమ్స్‌లో కొన్ని నేను కూడా చూశాను. బాగున్నాయి. ప్రతిభను ప్రోత్సహించడానికి పూరి జగన్నాథ్ ఎప్పుడూ ముందుంటారు. ఈ వేడుకతో అది మరోసారి నిరూపితమైంది. ప్రతిభను ప్రోత్సహించే దిశలో ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అభినందనీయం. ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఓ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించి, కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘సాక్షి’ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి మాట్లాడుతూ, ‘‘ఏ వ్యక్తిలో అయినా ‘హిడెన్ టాలెంట్’ ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ ‘షార్ట్ ఫిలిం కాంటెస్ట్’లో పూరి జగన్నాథ్ వంద శాతం ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. చాలా సమయం వెచ్చించి, అన్ని చిత్రాలనూ చూసి విజేతలను ఎంపిక చేయడం జ్యూరీ మెంబర్స్‌కి ఓ పెద్ద సవాల్. అలాగే, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించడానికి కారణంగా నిలిచిన విజ్ఞాన్ యూనివర్శిటీ అధిపతి ఎల్. కృష్ణదేవరాయ, ఉమన్స్ వరల్డ్ రాజాలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఐడియా-1 విన్నర్ శ్రీయన్ (టైటిల్- డిడి) ‘‘రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఫిలిం కోర్సు చేశాను. సినిమాల్లోకి ఎవరు రావాలనుకున్నా ఉండే మొదటి సమస్య సరైన ప్లాట్‌ఫాం లేకపోవటం. ‘సాక్షి’ ద్వారా మాకో ప్లాట్‌ఫాం దొరికింది. ఇక్కడ నాకు వచ్చిన పేరుతో కొన్ని అవకాశాలు దొరికాయి’’. జ్యూరీ మెంబర్: సునీల్ కుమార్ రెడ్డి, దర్శకుడు ‘డిజిటల్ మీడియా వచ్చి సినిమాకు ఎంతో మేలు చేసింది. చాలా మంది ఈ కాంటెస్ట్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కాంటెస్ట్ చివరి రోజున వైజాగ్, హైదరాబాద్‌తో పాటు చిన్న చిన్న టౌన్లలో కూడా ఎడిటింగ్ స్టూడియోలు బిజీగా మారిపోయాయి.’’ ఐడియా-2 విన్నర్ పండు (టైటిల్- ఇదేలే తరతరాల చరితం) ‘‘డెరైక్టర్‌గా నిలదొక్కుకోవడానికి మొదటి అవకాశం కోసం చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎలా ఎంటర్ కావాలి, ఎవర్ని అప్రోచ్ అవ్వాలి అనే ఇబ్బంది ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దానికి మార్గంలా ‘సాక్షి’ చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది’’. జ్యూరీ మెంబర్: మదన్, దర్శకుడు ‘‘అందరూ విజువల్‌గా బాగా తీశారు. కానీ కాన్సెప్ట్ మీద గ్రిప్ పెంచుకోవాలనిపించింది. కథ, స్క్రీన్‌ప్లే మీద అవగాహన కుదరాలంటే, సినిమాలు చూడడం మాత్రమే కాదు.. పుస్తకాలు చదవాలి. అప్పుడే మంచి దర్శకులు కాగలుగుతారు.’’ ఐడియా-3 విన్నర్ నాని వూళ్ల (సినిమాకి పేరు పెట్టలేదు) ‘‘మాది ఒంగోలు. ఈ సినిమాకు పూరి గారే పేరు పెట్టాలనుకున్నాను. చివరికి ఆయన పేరు మీదే పూరి-3 అని పెట్టాను. ఎందుకంటే ఆయనే నాకు ఇన్స్పిరేషన్. పూరి కథని సినిమాగా తీసే అవకాశంతో పాటు పబ్లిసిటీ వచ్చింది. ఈ కాంటెస్ట్ పెట్టినందుకు థ్యాంక్స్’’. జ్యూరీ మెంబర్: వీఎన్ ఆదిత్య, దర్శకుడు ‘‘సగానికి పైగా సినీపరిశ్రమ పూరీ టైం కోసం వెయిట్ చేస్తుంటే, ‘సాక్షి’ ఇక్కడికి తెచ్చి కూర్చోపెట్టింది. ఆయన సినిమాలు చూడటానికి ఎంత కూల్‌గా ఉంటాయో, దాని వెనుక ఆయన కష్టం అంత ఎక్కువుంటుంది. జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించటం ఎంజాయ్ చేశా.’’ ఐడియా-4 విన్నర్ విద్యాధర్ కాగిట (యుగోలినో) ‘‘విన్ అవుతానని అసలు అనుకోలేదు. కాన్సెప్ట్ చదివినప్పుడు ఛాలెంజింగ్‌గా అనిపించింది. 2040లో మనుషులు ఎలా ఉంటారనేది చూపించడానికి కొంత రీసెర్చ్, ఇమాజినేషన్ కలిపి సినిమా తీశా. పూరి జగన్నాథ్ సినిమాలు చూడటమే కాదు ఆయన చూపించే స్టైల్స్ కూడా ఫాలో చేస్తాను. ఈ రోజు ఆయనను కలవటం చాలా ఆనందంగా ఉంది’’. ఐడియా-4 విన్నర్ ప్రసాద్ (హ్యుమానిటీ క్వొషంట్) ‘‘2040లో ప్రపంచం ఎలా ఉంటుందనేది పూరి జగన్నాథ్ కాన్సెప్ట్. అయితే స్టోరీ మాత్రం మనం ఎలా అయినా అల్లుకోవచ్చు. 2040లో మనీ కన్నా మానవత్వానికి ఎక్కువ విలువ ఉండే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ చిత్రం రూపొందించాను. ఈ ఐడియాలో ఇద్దరు విన్నర్స్‌లో ఒకరిగా నేను నిలవడం చాలా సంతోషంగా ఉంది’’. జ్యూరీ మెంబర్: చంద్ర సిద్ధార్థ్, దర్శకుడు ‘‘2040 కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. ఈ రెండు సినిమాలు చూడగానే వాళ్లకి ఫోన్ చెయ్యాలనిపించింది. సైంటిఫిక్, ఇమాజినేటివ్ థింకింగ్, లాజిక్, విజువల్స్ ఇలా అన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా వాళ్లు తీసిన చిత్రాలు బాలా ఆలోచింపచేశాయి కూడా.’’ ఐడియా-5 విన్నర్ శ్రీనివాస్ మంగళం (హరివిల్లు) ‘‘గతంలో ‘డి ఫర్ దోపిడి’ సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశా. మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చే ఈ ప్లాట్‌ఫాం వల్ల న్యూ టాలెంట్ బయటకు వస్తుంది. ఆడియన్స్‌కి దగ్గర కావడానికి ఇది మంచి అవకాశం. మంచి పబ్లిసిటీ కూడా లభించింది’’. జ్యూరీ మెంబర్: ఉత్తేజ్, నటుడు ‘‘పవన్ కల్యాణ్ ఇంటి ముందు 2, 3 ఏళ్లు నిలబడి వెయిట్ చేశాడు. ఈ రోజు పూరీ డెరైక్టర్‌గా నిలబడ్డాడు. ఆయన ఈ కాంటెస్ట్‌కి ఇచ్చిన ఐడియాలు చాలా బాగున్నాయి. వాటికి ‘సాక్షి’ అండగా నిలిచింది. దృశ్య ప్రాధాన్యం ఉన్న ఈ మూకీ చిత్రంలో నవరసాలున్నాయి.’’ ఐడియా-6 విన్నర్ శ్రవణ్ కుమార్ (బ్లాక్ నెం.8-నిజాం హాస్పిటల్) ‘‘భయపెట్టటంలో ఒక కిక్ ఉంటుంది. నాకు వచ్చిన ఒక కల, పూరీ ఇచ్చిన కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉండటంతో ఈ ఫిలిం చేశాను. కానీ ఇలా విన్ అవుతానని అనుకోలేదు. ఏమైనా ‘సాక్షి’, పూరి కలిసి అప్‌కమింగ్ ఫిలిం డెరైక్టర్స్ని ఒక స్ట్రీమ్‌లోకి తెచ్చి బూస్ట్ ఇచ్చారు’. జ్యూరీ మెంబర్: కె. దశరథ్, దర్శకుడు ‘‘నేను జ్యూరీ సభ్యుడిగా ఒక కేటగిరీకి చెందిన సినిమాలే చూశాను. ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే మరికొన్ని మంచి సినిమాలు మిస్ అయి ఉండేవాడ్ని. యువ టాలెంట్‌కి ఇంత గొప్ప వేదిక ఏర్పాటు చేసిన ‘సాక్షి’ది అభినందనీయ ప్రయత్నం’’ ఐడియా-7 విన్నర్ రామ్ జగదీశ్ (అధర్మ న్యాయం) ‘‘టైటిల్ ఎలా డిఫరెంట్‌గా ఉందో, కాన్సెప్ట్ కూడా డిఫరెంట్. చంపటం ధర్మం కాదు. కానీ కొన్ని సార్లు అది న్యాయం కావచ్చు. ఇలా న్యాయానికి, ధర్మానికి సంబంధించిన కాన్సెప్ట్ కావటంతో ఇంట్రస్టింగ్ అనిపించి ఈ ఫిలిం చేశాను. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’. జ్యూరీమెంబర్: ఝాన్సీ, నటి-యాంకర్ ‘‘సినీపరిశ్రమకు ఎందరో ప్రతిభావంతుల్ని దగ్గర చేసిన ‘సాక్షికి అభినందనలు. ‘షార్ట్ ఫిలిం కాంటెస్ట్’కి వేల చిత్రాలొచ్చాయి. వాటిని వడపోసి, జ్యూరీ సభ్యులకు పంపారు. ‘సాక్షి’ టీమ్ చేసిన కృషి అసాధారణమైనది.’’ ఐడియా-8 విన్నర్ వాల్మీకి (లివింగ్ టుగెదర్) ‘‘పెళ్లి చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే కలిసి ఉండటం అనవసరం. విడిపోవటమే మేలు. అయితే ఆ విడిపోవటం అనేది కన్విన్సింగ్‌గా ఉండాలి. ఇదే కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించాను. ఇలాంటి ఒక ఆసక్తికరమైన సబ్జెక్ట్‌ని డీల్ చెయ్యటం, ఆ ఫిలింకి ఇలా విన్ అవటం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది’’. జ్యూరీ మెంబర్: ఆర్పీ పట్నాయక్, సంగీత దర్శకుడు ‘‘పూరి ఇచ్చిన ఐడియా నాకు బాగా నచ్చింది. బ్రేక్ అప్ అయిపోదాం అని హీరో హీరోయిన్లు మెసేజ్ పంపించడంతో ఈ సినిమాను ఎండ్ చేశారు. అది చాలా కొత్తగా అనిపించింది. ఈ కాంటెస్ట్‌లో అందరూ విజేతలే.’’ ఐడియా-9 విన్నర్ పరమేశ్ రేణుకుంట్ల (నా లైఫ్ నా ఇష్టం) ‘‘ఎవరికి వారు కరెక్ట్ అని, ఎదుటి వాళ్లదే తప్పని చెబుతారు. పూరి ఇచ్చిన ఈ కాన్సెప్ట్ నాకు కనెక్ట్ అయ్యింది. ఈ ఐడియాని ఫిలింగా తీస్తున్నప్పుడు విన్ అవ్వాలనుకున్నా. ప్రయత్నించా. ఈ కాంటెస్ట్ మా లాంటి యంగ్ డెరైక్టర్స్‌కి ఆక్సిజన్‌లా, కొత్త శక్తినింపింది.’’ జ్యూరీ మెంబర్: భాస్కరభట్ల, గీత రచయిత నేను చూసిన వాటిలో కొన్ని క్రియేటివ్‌గా ఉన్నా సరే, స్క్రీన్‌ప్లే సరిగ్గా రాసుకోలేదు. అయితే ప్రయత్నం చేయడం ముఖ్యం. పూరీగారు కొత్తవాళ్లని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఆయన ఎంకరేజ్ చేయబట్టే నేనీ ఈ స్థాయిలో ఉన్నా. ఐడియా-10 విన్నర్ సమరసింహా రెడ్డి (త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్) ‘‘నాకు షార్ట్ఫిలింస్ అసలు ఆసక్తి లేదు. కానీ నా గురువు, దైవం పూరి గారు కాంటెస్ట్ చెప్పారనే ఈ షార్ట్ ఫిలిం తీశాను. ఆయనే నాకు స్ఫూర్తి. ఇలాంటి కాంటెస్ట్ నిర్వహించాలనే ఐడియా రావటం అద్భుతం. ఈ ఐడియాతో మా లాంటి ఎంతో మంది డెరైక్టర్స్‌కి మంచి అవకాశం లభించింది. పూరి ఇచ్చిన ఈ ఐడియా నాకు చాలా నచ్చింది. నేను తీసిన ఫిలిం విన్ అవటం నా లక్ అనుకుంటున్నా.’’ జ్యూరీ మెంబర్: తనికెళ్ల భరణి, నటుడు అనివార్య కారణాల వల్ల తనికెళ్ల రాకపోవ డంతో, విజేతకు ‘సాక్షి’ అసిస్టెంట్ ఎడిటర్ సరికొండ చలపతిరావు జ్ఞాపికనిచ్చారు. స్పెషల్ అవార్డ్ విన్నర్ మానేపల్లి ఎస్. ఉజ్వల్ (జగన్నాటకం) ‘‘నన్ను కన్నతల్లి ఒక వైపు, నేను కన్న కల ఒకవైపు. నేను అడుగు ముందుకు వేసేందుకు మా అమ్మ సహకారం ప్రతి క్షణం ఉంది. పై నుంచి మా నాన్న గారి ఆశీస్సులున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీ నిర్వహించిన ‘సాక్షి’ మీడియా వారికి నా థ్యాంక్స్. పూరీ ఇచ్చిన పది ఐడియాలనూ కలిపి ఒక ఫిలింగా తీశాను. ఈ కాంటెస్ట్‌లో విన్ కాకపోయినా ఒక స్పెషల్ క్యాటగిరీలో గుర్తింపు లభిస్తుందని ఆశించాను. 10 ఐడియాలు కలిపి తీసిన ఈ ఫిలింకి మా అమ్మ టైటిల్‌ని సజెస్ట్ చేసింది. ఆమె బ్లెస్సింగ్స్ కావచ్చు ఇలా స్పెషల్ రివార్డ్ వచ్చింది.’’ -
ఐడియా-3 విన్నర్ : నాని వూళ్ల (సినిమాకి పేరు పెట్టలేదు)
-
ఐడియా-9 విన్నర్ పరమేశ్ రేణుకుంట్ల (నా లైఫ్ నా ఇష్టం)
-
ఐడియా-10 విన్నర్ : సమరసింహా రెడ్డి (త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్)
-
స్పెషల్ అవార్డ్ విన్నర్ : మానేపల్లి ఎస్. ఉజ్వల్ (జగన్నాటకం)
-
ఐడియా-8 విన్నర్ : వాల్మీకి (లివింగ్ టుగెదర్)
-
ఐడియా-5 విన్నర్ : శ్రీనివాస్ మంగళం (హరివిల్లు)
-
ఐడియా-1 విన్నర్ : శ్రీయన్ (టైటిల్- డిడి)
-
ఐడియా-6 విన్నర్: శ్రవణ్ కుమార్ (బ్లాక్ నెం.8-నిజాం హాస్పిటల్)
-
ఐడియా-7 విన్నర్ : రామ్ జగదీశ్ (అధర్మ న్యాయం)
-
ఐడియా-4 విన్నర్ : విద్యాధర్ కాగిట (యుగోలినో)
-
ఐడియా-2 విన్నర్ : పండు (టైటిల్- ఇదేలే తరతరాల చరితం)
-
ఐడియా-4 విన్నర్ : ప్రసాద్ (హ్యుమానిటీ క్వొషంట్)
-
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-5 ఫైనల్ లిస్ట్ ‘‘సాక్షి మీడియా గ్రూప్ - దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి ఈ ‘షార్ట్ ఫిల్మ్ కాంపిటేషన్’ ద్వారా కొత్త టాలెంట్ కోసం చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. వాళ్ల ప్రయత్నాన్ని రుజువు చేసుకోవడానికి ఇది ఓ మంచి వే దిక. ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఆర్టిస్ట్ కాక ముందు నేను సహాయ దర్శకునిగా పనిచేశాను. అప్పుడు అవకాశం కోసం ఎంతో ఎదురుచూసేవాణ్ణి. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మీరు చాలా లక్కీ. నేను ఐడియా నం.5 కి న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. ఇందుకోసం చాలా లఘు చిత్రాలు చూశాను. మూకీ చిత్రం తీయడం చాలా కష్టం. ఓ సంభాషణ చెప్పలేని భావాన్ని దృశ్యం ద్వారా పలికించాలి. కానీ నాకు చాలా ముచ్చటగా అనిపించింది. తమకు లభించిన ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది బాగా తీశారు. లఘు చిత్రాలకు నేపథ్య సంగీతం, ఎడిటింగ్ చాలా ముఖ్యం. రెండు గంటల్లో చెప్పాల్సిన విషయాన్ని 10 నిమిషాల్లో చెప్పగలగాలి. కొంతమంది ఒక్కో విభాగంలో తమ ప్రతిభను చూపించారు. అంతా బాగుండాల్సిన అవసరం లేదు కానీ, ఉన్నంతలో చాలా బాగా తెరకెక్కించిన మూడింటిని ఎంపిక చేశాను. మిగతా వాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనడమే పాస్ అయినట్టు. తప్పులు సరిదిద్దుకుని ఇంకా ప్రయత్నించండి. తర్వాత గెలుపు మీదే.’’ ఐడియా నం.5 జ్యూరీ మెంబర్: ఉత్తేజ్ 1) పర్ఫెక్ట్ ఇమ్పెర్ఫెక్షన్స్ దర్శకత్వం: ఆదిత్యరఘునందన్ raghunandan@gmail.com 2) లవ్ బాక్స్ దర్శకత్వం: రెడ్స్క్వాడ్ టీమ్ redsquadcinemas@gmail.com 3) హరివిల్లు దర్శకత్వం: శ్రీనివాసమంగళం amail2sri@gmail.com స్పెషల్ కేటగిరి 1) ఐ అండ్ యు దర్శకత్వం: ఒ.ఎస్.ఆర్. కుమార్ osrkumar1979@gmail.com సవరణ: శుక్రవారం ప్రకటించిన ఐడియా నం.10 ఫలితాల్లో ‘త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్’ అనే లఘుచిత్రానికి సంబంధించి ఈ-మెయిల్ చిరునామా పొరపాటు పడింది. ఆ దర్శకుడి పేరు సమరసింహారెడ్డి, ఈమెయిల్ ఐడీ: samarasrg09@gmail.com - ఉత్తేజ్, నటుడు-రచయిత -
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-7ఫైనల్ లిస్ట్ ‘‘సాక్షి మీడియా గ్రూప్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి నిర్వహించిన లఘు చిత్రాల పోటీలో ‘ఐడియా నం. 7’కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. కలలు చాలా మందికి ఉంటాయి. సినిమా అనే కలను నిజం చేసుకోవాలని జీవితాంతం ప్రయత్నించినా అవకాశాలు రానివాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం. చాలా మంది వాళ్ల కలలకు తెరరూపం ఇచ్చి బాగా తీసిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ సినిమా పరిశ్రమ స్వాగతం పలుకుతోంది. పూరి జగన్నాథ్ ఇచ్చిన కథాంశానికి తగ్గట్టుగా ఉన్న మూడు లఘు చిత్రాలను ఎంపిక చేశాను. ఈ పోటీలో పాల్గొన్న మిగతా వాళ్లకు ఆల్ ది బెస్ట్. - ఝాన్సీ, యాంకర్ ఐడియా నం.7 జ్యూరీ మెంబర్: ఝాన్సీ 1) అధర్మన్యాయం దర్శకత్వం: రామ్‌జగదీశ్ ramjagadeesh1@gmail.com 2) కోపంతో ఓ రోజు దర్శకత్వం: బాలాజీ ప్రసాద్ balajiprasad1991@gmail.com 3) ఐడియా-7 దర్శకత్వం: వి.గోపి vgopi0606@gmail.com ఈ లఘు చిత్రాలను sakshi.comలో వీక్షించండి. -
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 6 ) : బ్లాక్‌నంబర్ 8
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 6 ) : జాక్‌పాట్
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 6 ) : దూల
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 6 ) : కొట్టింది ఎవరు
-
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-4 ఫైనల్ లిస్ట్ ‘‘ఏ రంగంలోకైనా ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తేనే అందం. సినిమా రంగంలోకి కూడా అంతే. సరికొత్త ప్రతిభను ప్రోత్సహించడం కోసం సాక్షి మీడియా గ్రూప్, పూరి జగన్నాథ్ కలిసి ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించారు. ఇందులో ఐడియా నం.4 (2040లో పరిస్థితులు ఎలా ఉంటాయి...?)కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. వీటి నుంచి ‘హ్యుమానిటీ కోషెంట్’, ‘యుగోలినో’ లఘు చిత్రాలను ఎంపిక చేశాను. ఈ రెండూ చాలా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. నాకైతే వీళ్ల ఫోన్ నెంబర్లు తీసుకుని అభినందించాలన్న ఆనందం కలిగింది. చాలా బాగా తీశారు. మరి కొన్ని బాగానే తీసినా, ఇచ్చిన కథాంశానికి చాలా దూరంగా వెళ్లిపోయారు. అందుకే వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.’’ - చంద్రసిద్ధార్థ్, దర్శకుడు ఐడియా నం.4 జ్యూరీ మెంబర్: చంద్రసిద్ధార్థ్ 1) హ్యుమానిటీ కోషెంట్ దర్శకుడు: ప్రసాద్ reddy.kvsp@gmail.com 2) యుగోలినో దర్శకుడు: విద్యాధర్ కాగిట nanividmad@gmail.com ఈ లఘు చిత్రాలను sakshi.comÌZ వీక్షించండి. -
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 4):యుగోలినో
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 4):హ్యుమానిటీ కోషెంట్
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 3) : వార్ లాక్ టార్గెట్
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 2) : సారీ..నాన్నతప్పు నాదే
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా ౩) : ఆపిల్‌తో నా ప్రేమకథ
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా ౩) : పూరి ఐడియా-3
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా ౩) : టాప్ సీక్రెట్
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా ౩) : ఇప్పుడే మొదలైంది
-
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-3 ఫైనల్ లిస్ట్ ‘‘కొత్త దర్శకులను ప్రోత్సహించడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ - పూరి జగన్నాథ్ నిర్వహించిన ఈ లఘుచిత్రాల పోటీ అద్భుతమైన ప్రయత్నం. ఐడియా-3కి నేను న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. ఇందులో 90 కి పైగా పోటీకి వచ్చాయి. వాటిని మూడు విభాగాలుగా చేసి, ఫైనల్‌గా మూడింటిని సెలక్ట్ చేశాను. కానీ ఇవి చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కళకు సంబంధించిన ఏ అంశం అయినా జనరంజకంగా తీయాలి. లేకపోతే ఫెయిలవుతాయి. ఈ లఘుచిత్రాలు చూసేటప్పుడు నాకు అదే అనిపించింది. ఎడిటింగ్, డబ్బింగ్, డైలాగ్ డెలివరీ... ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో కొంత మంది జాగ్రత్తలు పాటించలేదు. ఈ కాన్సెప్ట్‌లో మెరుపుతీగ లాంటి అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలి. కానీ కాస్టింగ్‌లో చాలా మంది శ్రద్ధ చూపించలేదు. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలి. లేకపోతే ఎంత పెద్ద సినిమాకైనా భంగపాటు తప్పదు. ఈ లఘు చిత్రాలు చూస్తున్నప్పుడు మళ్లీ అదే విషయం నిరూపణ అయింది. కొంత మంది టెక్నికల్‌గా చాలా బాగా తీశారు. డైలాగ్ చెప్పేటప్పుడు టైమింగ్, వెరైటీ ఉండాలి. ఈ విభాగంలో చాలా సినిమాలు అస్సలు నాణ్యతతో తీయలేదు. కొన్ని సినిమాలైతే చాలా పేలవంగా ఉన్నాయి. మనం ఏమైతే ఇప్పటిదాకా సినిమాలు చూశామో, వాటన్నిటి అనుభవం మనం తీయబోయే సినిమాల్లో కనబడాలి. కానీ చాలా అపరిపక్వతతో తీసిన సినిమాల్లా అనిపించాయి. ‘యాపిల్‌తో నా ప్రేమకథ’ అయితే చాలా బాగా తీశారు. కథను ఊహకు అతీతంగా తెరకెక్కించారు. హీరో, హీరోయిన్లు చాలా బాగున్నారు. ‘ఇప్పుడే మొదలైంది’, పూరి ఐడియా-3 చాలా బాగున్నాయి. ఇవి కాక, మరో రెండింటిని స్పెషల్ కేటగిరీ కింద ఎంపిక చేశాను. అందరికీ అభినందనలు.’’ - వి.ఎన్. ఆదిత్య, దర్శకులు ఐడియా నం.3 జ్యూరీ మెంబర్: వి.ఎన్. ఆదిత్య 1) ఆపిల్‌తో నా ప్రేమకథ దర్శకుడు: శ్రీనివాస్ పుప్పాల sri.puppala@gmail.com 2) ఇప్పుడే మొదలైంది దర్శకుడు: రాజా. జె csensemovies@gmail.com 3) పూరి ఐడియా-3 దర్శకుడు: నాని వూళ్ల voola99@gmail.com స్పెషల్ జ్యూరీ 1) టాప్ సీక్రెట్ దర్శకుడు: భాగ్యరాజు. జి bhagyaraju.gowdara@gmail.com 2) వార్ లాక్ టార్గెట్ దర్శకుడు: ఎన్వీఆర్ సాయికిరణ్ saikishore0007@gmail.com ఈ లఘు చిత్రాలను sakshi.comలో వీక్షించండి. -
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 2) : ఓ నాన్న కథ!
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 2) :నాన్న (బాంధవ్యాలు)
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 2) :సెకండ్ హోమ్ (హిందీ)
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 2): ఇదేలే తరతరాల చరితం!
-
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-2 ఫైనల్ లిస్ట్ ‘‘హాలీవుడ్ రచయిత ఓ.హెన్రీ కథల్లోని క్లైమాక్సుల్లో భలే ట్విస్టు ఉంటుంది. అలాంటి ట్విస్టు ఉన్న కథాంశాన్ని పూరి జగన్నాథ్ గారు ‘ఐడియా నంబర్-2’గా ఇచ్చారు. ఈ ‘వృద్ధాశ్రమం’ ఐడియాకు నేను న్యాయనిర్ణేతగా వ్యవహ రించా. చాలా లఘు చిత్రాలు చూశాను. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే - ఎంట్రీలు పంపిన ఔత్సాహిక దర్శకులందరూ చాలా బాగా తీశారు. నిజానికి, ఈ ప్రయత్నంలో అందరూ విజయం సాధించారు. కానీ, నిబంధనల మేరకు వాటిల్లో నుంచి మొత్తం మూడిం టినే ఎంపిక చేశా. అలాగే ఇతర భాషలకు చెందిన ఇద్దరు హిందీలో లఘు చిత్రాలు తీసి పంపడం విశేషం. ఆ రెండూ చాలా బాగున్నాయి. అందుకే వాటిలో ఒక చిత్రాన్ని స్పెషల్ కేటగిరీ కింద ఎంపిక చేశా. నేను కూడా మీ అంద రితో పాటే పూరి ఎవరిని విజేతగా ఎంపిక చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.’’ - మదన్, దర్శక - రచయిత ఐడియా నం.2 జ్యూరీ మెంబర్: మదన్ 1) ఇదేలే తరతరాల చరితం! దర్శకుడు: పాండు నిర్మాత: వేమూరి సత్యనారాయణ km.c.veera@gmail.com 2) ఓ నాన్న కథ! దర్శకుడు: సూర్య నిర్మాత: స్రవంతి దత్తాత్రేయ peramdattatreya@gmail.com 3) సారీ నాన్నా..! తప్పునాదే! దర్శకుడు: ఈశ్వర్ భాస్కర్ల eshwar.rollingstar@gmail.com స్పెషల్ కేటగిరీ 1) నాన్న (బాంధవ్యాలు) బ్యానర్: పారేపల్లి ప్రొడక్షన్స్ దర్శకుడు: అరుణ్ ఆకుల నిర్మాత: బాలాజీ 2) సెకండ్ హోమ్ (హిందీ) దర్శకుడు: సుమితా వాట్స్ బ్యానర్: హెచ్.ఎల్. ప్రొడక్షన్స్ sumit0181990@gmail.com