పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ | Puri Jagannadhs talent hunt for directors | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

Published Sun, May 10 2015 12:34 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

పూరి జగన్నాథ్  డైరెక్టర్స్ హంట్ - Sakshi

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

ఐడియా-5 ఫైనల్ లిస్ట్
 ‘‘సాక్షి మీడియా గ్రూప్ - దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి ఈ ‘షార్ట్ ఫిల్మ్ కాంపిటేషన్’ ద్వారా  కొత్త టాలెంట్ కోసం చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. వాళ్ల ప్రయత్నాన్ని రుజువు చేసుకోవడానికి ఇది ఓ మంచి వే దిక. ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఆర్టిస్ట్ కాక ముందు నేను సహాయ దర్శకునిగా పనిచేశాను. అప్పుడు అవకాశం కోసం ఎంతో ఎదురుచూసేవాణ్ణి. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మీరు చాలా లక్కీ.  నేను ఐడియా నం.5 కి న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. ఇందుకోసం చాలా లఘు చిత్రాలు చూశాను. మూకీ చిత్రం తీయడం చాలా కష్టం. ఓ సంభాషణ చెప్పలేని భావాన్ని దృశ్యం ద్వారా పలికించాలి.  కానీ నాకు చాలా ముచ్చటగా అనిపించింది. తమకు లభించిన ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది బాగా తీశారు. లఘు చిత్రాలకు నేపథ్య సంగీతం, ఎడిటింగ్ చాలా ముఖ్యం. రెండు గంటల్లో చెప్పాల్సిన విషయాన్ని 10 నిమిషాల్లో చెప్పగలగాలి. కొంతమంది ఒక్కో విభాగంలో తమ ప్రతిభను చూపించారు. అంతా బాగుండాల్సిన అవసరం లేదు కానీ, ఉన్నంతలో చాలా బాగా తెరకెక్కించిన మూడింటిని ఎంపిక చేశాను. మిగతా వాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనడమే పాస్ అయినట్టు. తప్పులు  సరిదిద్దుకుని  ఇంకా ప్రయత్నించండి. తర్వాత గెలుపు మీదే.’’
 ఐడియా నం.5
 జ్యూరీ మెంబర్: ఉత్తేజ్
 
 1)     పర్ఫెక్ట్ ఇమ్‌పెర్ఫెక్షన్స్
     దర్శకత్వం: ఆదిత్యరఘునందన్
     raghunandan@gmail.com
 
 2)    లవ్ బాక్స్
     దర్శకత్వం: రెడ్‌స్క్వాడ్ టీమ్
     redsquadcinemas@gmail.com
 
 3)    హరివిల్లు
     దర్శకత్వం: శ్రీనివాసమంగళం
     amail2sri@gmail.com
 
 స్పెషల్ కేటగిరి
 1)    ఐ అండ్ యు
     దర్శకత్వం: ఒ.ఎస్.ఆర్. కుమార్
     osrkumar1979@gmail.com
 సవరణ: శుక్రవారం ప్రకటించిన ఐడియా నం.10 ఫలితాల్లో ‘త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్’ అనే లఘుచిత్రానికి సంబంధించి ఈ-మెయిల్ చిరునామా పొరపాటు పడింది. ఆ దర్శకుడి పేరు సమరసింహారెడ్డి, ఈమెయిల్ ఐడీ: samarasrg09@gmail.com
 
 - ఉత్తేజ్, నటుడు-రచయిత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement