క్రీడోదయం | talent hunt in sports | Sakshi
Sakshi News home page

క్రీడోదయం

Published Thu, Sep 1 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

టాలెంట్‌ హంట్‌లో షటిల్‌ రన్‌ చేస్తున్న విద్యార్థులు

టాలెంట్‌ హంట్‌లో షటిల్‌ రన్‌ చేస్తున్న విద్యార్థులు

  •  ఫలితాన్నిచ్చిన టాలెంట్‌ హంట్‌ 
  •  రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
  •  తొలిసారిగా జిల్లా నుంచి 25మంది ఎంపిక
  •  స్పోర్ట్స్‌ స్కూళ్లతో క్రీడాకారులకు మహర్దశ
  • జిల్లా స్పోర్ట్స్‌ అథారటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్‌ హంట్‌ మంచి ఫలితానిచ్చింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన చిన్నారి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది స్పోర్ట్స్‌ స్కూల్‌కు జిల్లా నుంచి పది కంటే తక్కువగానే ఎంపికయ్యేవారు. కానీ ఈ సారి ఏకంగా 25మంది చిన్నారులు ఎంపికయ్యారు. 
    – మహబూబ్‌నగర్‌ క్రీడలు  
     
    జిల్లా గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాల్లో సత్తాచాటారు. ఈ ఏడాది తొలిసారిగా 25మంది పాలమూరు విద్యార్థులు రాష్ట్రంలోని హకీంపేట (హైదరాబాద్‌), కరీంనగర్, ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ పాఠశాలలకు ఎంపికై సంచలనం సృష్టించారు. 25 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి 4, 5 తరగతుల్లో ప్రవేశం పొందారు. వీరిలో 15మంది విద్యార్థులు ఆదిలాబాద్‌ స్కూల్‌కు ఎంపికయ్యారు. 20మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశం పొందారు. వీరికి ఆయా స్పోర్ట్స్‌ స్కూళ్లలో చదువుతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. మూడేళ్ల పాటు ఫెక్సిబిలిటీ కింద శిక్షణ అందజేసి అనంతరం వారు ఎంచుకున్న క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు.
    ఫలించిన టాలెంట్‌హంట్‌.. 
    కలెక్టర్‌ టీకే శ్రీదేవి సహకారంతో తెలంగాణలో ఎక్కడాలేని విధంగా డీఎస్‌డీఓ టీవీఎల్‌ సత్యవాణి స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశాలకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌లో ఒక తండాను ఎంపిక చేసుకుని ప్రత్యేకంగా టాలెంట్‌ హంట్‌ను నిర్వహించారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో టాలెంట్‌ హంట్‌తో క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను వెలికితీశారు. వీరికి ముందుగా స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికల్లో నిర్వహించే ఎత్తు, బరువు, మెడిసిన్‌ బాల్‌ త్రో, షటిల్‌ రన్, 30 మీటర్ల రన్, షార్ట్‌ జంపింగ్‌ తదితర అంశాల్లో ఎంపికలు నిర్వహించి జిల్లాస్థాయికి ఎంపిక చేశారు.
    స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు..
    స్పోర్ట్స్‌ స్కూల్‌ (ఆదిలాబాద్‌) 4వ తరగతిలో.. మహేశ్వరి (ఖిల్లాఘనపురం), భానుప్రియ (పదర), సింధు (నర్సాయిపల్లి), సవిత (లింగంపల్లి), మోనేశ్వరి (కొల్లంపల్లి), వినోద్‌ (లింగంపల్లి), నిఖిల్‌గౌడ్‌ (ముట్పూర్‌), రాంచరణ్‌ (బిజినేపల్లి), 5వ తరగతిలో.. పావని (ఉప్పునుంతల), బాలమణి (లింగంపల్లితండా). శ్రీధర్‌ (టంకర), గోవర్ధన్‌ (బెక్కం), సాయివరుణ్‌ (మహబూబ్‌నగర్‌), భానుప్రకాశ్‌గౌడ్‌ (కొండూర్‌), తరుణ్‌కుమార్‌రెడ్డి (ఖిల్లాఘనపురం). 
    స్పోర్ట్స్‌ స్కూల్‌ (హైదరాబాద్‌) 4వ తరగతిలో.. జయ (కొల్లంపల్లి),  అరుణశ్రీ  (మద్దూర్‌), హిమబిందు (మానాజిపేట), అర్చన (బొల్గట్‌పల్లి), సహస్ర (బాలానగర్‌). 5వ తరగతిలో.. రాము (వెల్కిచర్ల).
    రీజినల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ (కరీంనగర్‌) 4వ తరగతిలో.. సుప్రజ (చిన్నచింతకుంట), ముడావత్‌ అనూష (తాడూర్‌), రాకేశ్‌ (పెనిమిళ్ల), శివమణి (బాలానగర్‌). 
     
    స్పోర్ట్‌హాస్టల్‌ ద్వారా రాణించిన జిల్లా క్రీడాకారులు
    స్పోర్ట్‌ హాస్టల్లో ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జిల్లా క్రీడాకారులు రాణించారు. జిల్లాకు చెందిన అథ్లెట్‌ శంకర్‌ జిల్లాస్థాయి నుంచి హకీంపేట స్పోర్ట్స్‌ హాస్టల్‌కు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఖిల్లాఘనపూర్‌కు చెందిన నవత సెపక్‌తక్రాలో ఏషియన్‌ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. వీరితో పాటు భారతి, లలిత, అంజలి, సరిత, పాండు, స్వప్న, నరేశ్, హారిక, రామునాయక్, రాములు, గోపాల్, లక్ష్మిరాం స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ఉంటూ ఆయా క్రీడాంశాల్లో రాణిస్తున్నారు. 
     
    50మంది ఎంపికయ్యేలా లక్ష్యం..
    – సత్యవాణి, డీఎస్‌డీఓ
    జిల్లాలోని గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యం ఉంది. దానిని వెలికితీస్తే మంచి క్రీడా ఆణిముత్యాలు వస్తారు. కలెక్టర్‌ సహకారంతో టాలెంట్‌ హంట్‌ను నిర్వహించాం. మూడు స్పోర్ట్స్‌ స్కూళ్లలకు 25 మంది క్రీడాకారులు ఎంపికకావడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని టాలెంట్‌ హంట్‌లు నిర్వహించి 50మంది ఎంపికయ్యేలా లక్ష్యంగా శిక్షణ అందజేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement