Tamil Channel
-
నిర్మాతగా నీలిమ
తమిళసినిమా: నటిగా తనదైన ముద్రవేసుకున్న నీలిమ తాజాగా నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. దేవర్‌మగన్ చిత్రంలో నాజర్ కూతురి పాత్రలో బాలనటిగా సినీరంగప్రవేశం చేసిన నీలిమ ఆ తరువాత నాన్‌మహాన్ అల్ల, మురణ్, తిమిరు,సంతోష్సుబ్రమణియం, మొళి మొదలగు 50 చిత్రాలకు పైగా వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే విధంగా బుల్లితెరపైనా వాణిరాణి, తామరై, తలైయనై పూక్కళ్ తదితర 80 సీరియళ్లలో నటించారు. అలా తన 20ఏళ్ల నట పయనంలో తదుపరి ఘట్టంగా నిర్మాత అవతారమెత్తారు. ఇసైపిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలుత బుల్లితెరపై నిరం మారాద పూక్కళ్ అనే సీరియల్‌ను తన భర్త ఇసైవనన్తో కలిసి నిర్మిస్తున్నారు. దీని గురించి నీలిమ తెలుపుతూ నిర్మాతనవ్వాలన్నది తన 20 ఏళ్ల కల అని, అది ఇప్పటికి నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సీరియల్ వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మధ్యాహ్నం 2.00 గంటలకు జీ తమిళ్ చానల్లో ప్రసారం కానుందని తెలిపారు. ఇందులో మురళి, నీష్మా, అస్మిత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఇనియన్ దినేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్‌కు విసు చాయాగ్రహణను, అర్జునన్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. దీన్ని నాగర్‌కోవిల్, మట్టం,కన్యాకుమారి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఇదే విధంగా త్వరలో చిత్ర నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు నటి నీలిమ తెలిపారు. -
న్యూస్ చదివిన అంధ బాలుడు
-
న్యూస్ ప్రెజెంటర్‌గా అంధబాలుడు
కోయంబత్తూర్: పట్టుదల, కృషి ఉంటే, శారీరక వైకల్యాలను సైతం అధిగమించి రాణించవచ్చని నిరూపించాడు తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలుడు. సంకల్పాన్ని మించిన బలం లేదని రుజువు చేస్తూ పుట్టుకతోనే చూపును కోల్పోయిన శ్రీరామానుజన్ మరో సంచలనానికి నాంది పలికాడు. ఒక తమిళ న్యూస్ ఛానల్లో న్యూస్ యాంకరింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలని తపన పడిన రామానుజం, దానికి టీవీ మీడియాను వారధిగా ఎంచుకున్నాడు. టీవీలో వార్తలు చదవడం ద్వారా తన గురించి పదిమందికి తెలియజేయాలనుకున్నాడు. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు. నేపాల్ భూకంపం తర్వాత పరిణామాలు, మహింద్రా రాజపక్సే ట్రయల్ తదితర వార్తలతో కూడిన 22 నిమిషాల న్యూస్ బులిటెన్‌ను బ్రెయిలీ లిపి సహాయంగా శ్రీరామానుజం ప్రెజెంట్ చేశాడు. అది చూసిన అతని తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో వర్షించాయి. ముందు రెండు నిమిషాలు కొంచెం తడబడ్డా, అలవాటైన తర్వాత బాగా చదివానంటూ శ్రీరామానుజం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతానికి శ్రీరామానుజానికి వారానికి ఒక స్పెషల్ బులిటెన్ ఇస్తున్నామని.. తరువాత రెగ్యులర్‌గా వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తామని ఛానల్ ఛైర్మన్ తెలిపారు. వికలాంగులను ప్రోత్సహించడంతోపాటు,నేత్ర దానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం తమ ఉద్దేశమన్నారు. ప్రపంచంలో తొలిసారిగా ఒక అంధుడి చేత వార్తలను చదివించిన ఘనత తమ ఛానల్ దక్కించుకుందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే ట్రాన్స్‌జెండర్స్ న్యూస్ యాంకర్లుగా, ప్రోగ్రామ్ ప్రెజెంటర్స్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.