‘బాహుబలి’ కత్తిరింపును ప్రదర్శించొద్దు
మదురై: ‘బాహుబలి’ సినిమా తమిళ వెర్షన్లోని సెన్సార్ బోర్డు తొలగించిన కుల ప్రస్తావన భాగాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ సోమవారం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సినిమాలోని ఒక దళిత కులాన్ని కించపరిచే సంభాషణ ఉందంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు స్పందించింది.