tamilnadu state
-
రాష్ట్రా వ్యాప్తంగా కమల్ పర్యటనలు
-
అభివృద్ధి ప్రమాణాల్లో తమిళనాడు టాప్
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కాస్త బెటర్ న్యూఢిల్లీ: అభివృద్ధికి సంబంధించిన ప్రధాన కొలమానాల్లో దేశవ్యాప్తంగా తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం ఇలా మొత్తం తొమ్మిది ప్రమాణాల్లో ఎనిమిదింట్లో తమిళనాడు అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ఒక్క విద్యలోనే వెనుకబడింది. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కాగా, కేరళ రెండో స్థానంలో నిలిచింది. 2009-2011; 2012-2014 కాలంలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా ఈ ర్యాకింగ్‌లను ఇస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది. నాలుగు అంశాల్లో ఉత్తమ పనితీరు చూపుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మూడు ప్రమాణాల్లో ఉత్తర ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ముందున్నాయని అధ్యయన నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలవీ.. ⇒ ఆదాయం, సమానత్వం విషయంలో చూస్తే... కేరళ, తెలంగాణ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు మంచి పనితీరుతో ముందుకెళ్తున్నాయి. ⇒ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కీలకమైన రోడ్లు, విద్యుత్ లభ్యతలో పురోగతి సాధిస్తున్నాయని.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన గమ్యాలుగా నిలిచేందుకు ఇది దోహదం చేసే అంశమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. ⇒ మొత్తంమీద చూస్తే పనితీరులో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల్లో అసోం, మధ్య ప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, జమ్ము-కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ⇒ పారిశ్రామికాభివృద్ధిలో గుజారాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్లు ముందజవేస్తున్నాయి. -
రిమోట్ విమానం కోసం గాలింపులు
చెన్నై : గ్రానైట్ క్వారీ పల్లపు గుంతలో పడిన రిమోట్ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మదురై పరిసర ప్రాంతాల్లో ఐఏఎస్ అధికారి సహాయం విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఆయన క్వారీల్లో తనిఖీలు జరిపేందుకు మానవ రహిత రిమోట్ విమానాన్ని ఉపయోగించారు. ఈ క్రమంలో ఈ విమానం అదుపుతప్పి హఠాత్తుగా సోమవారం క్వారీ గుంత నీటిలో పడిపోయింది. ఈ గుంత నీటిలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ సోమవారం రాత్రి చీకటి పడడంతో గాలింపు సాధ్యం కాలేదు. మంగళవారం నీటిలో దిగి సిబ్బంది గాలింపులు జరిపారు. గుంత దిగువ భాగాన బురదమయంగా ఉండడంతో రిమోట్ విమానాన్ని వెదకడం కష్ట సాధ్యంగా మారింది. దీంతో దీన్ని ఎలాగైనా వెలికితీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. గ్రైనేట్ క్వారీల విచారణ అధికారి సహాయం సోమవారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. రెండవ రోజుగా గాలింపు చర్యల్లో ఉన్న సిబ్బందికి అధికారులు సహ కరిస్తున్నారు. -
400 మంది ఖైదీలకు క్షమాభిక్ష
చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల మంది ఖైదీలకు పెరోల్ లభించింది. రాష్ట్రంలో ఉన్న తొమ్మిది సెంట్రల్ జైళ్లలో ఐదు వేల మందికి పైా ఖైదీలు నిర్బంధంలో ఉన్నారు. వీరిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తరచూ పెరోల్‌పై విడుదల చేస్తారు. ప్రస్తుతం పొంగల్ పండుగ సందర్భంగా చాలా మంది ఖైదీలు పెరోల్ కోరుతూ జైలు అధికారులకు వినతిపత్రా లు అందజేశారు. దీని ప్రకారం తొమ్మిది సెంట్రల్ జైళ్ల నుంచి సుమారు 400 ఖైదీలకు పెరోల్ అందజేసినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు. దీని ప్రకారం సేలం సెంట్రల్ జైళ్లో 40 మంది శిక్షా ఖైదీలకు పెరోల్ లభించింది. ఒక్కొక్కరికి మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు పెరోల్ అందజేశారు. దీని గురించి జైలు అధికారి మాట్లాడుతూ జైలులో వున్న శిక్షా ఖైదీ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని పెరోల్ అందజేస్తామన్నారు. ఈ పెరోల్ ముగియగానే వారు జైళ్లకు చేరుకోవాలని తెలిపారు. -
పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా
పిచ్చాటూరు, న్యూస్‌లైన్: జిల్లాలో పలు చోరీ కేసులతో సంబంధం ఉన్న అంతర్రాష్ర్ట దొం గల వుుఠాను పిచ్చాటూరు ఎస్ఐ హ నువుంతప్ప ఆధ్వర్యంలోని పోలీ సు ల బృందం చాకచక్యంగా పట్టుకుం ది. కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరువళాంగాడులో వుురుగన్(22), ప్రభాకర్(29), తిరువుూర్తి(26), కేశవన్(19)ను సోమవారం పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వుంగళవారం పిచ్చాటూరు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. వుంగళవారం సాయుంత్రానికి ఒకటిన్నర కిలో బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిసింది. దీని విలువ సువూరు రూ.45 లక్షలు ఉండవచ్చని అంచనా. పిచ్చాటూరు వుండలంలోని రావుగిరి, కీళపూడితో పాటు వరదయ్యుపాళెంలో శనివారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసు, నిండ్ర, నగరి, పుత్తూరు, కేవీబీ పురం వుండలాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో వీరి హస్తం ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ పట్టుబడ్డ నలుగురు దొంగలున్న వుుఠాను వుంగళవారం ఉదయుం నుంచి సాయుంత్రం వరకు డీఎస్పీ అరీఫుల్లా అధ్వర్యంలో పుత్తూరు, నగరి, సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, శివభాస్కర్ రెడ్డి, వునోహరాచ్చారి పిచ్చాటూరు స్టేషన్లో విచారిస్తున్నారు. వీరితో పాటు పిచ్చాటూరు, నిండ్ర, నగరి, కేవీబీ పురం, వరదయ్యుపాళెం వుండలాల ఎస్ఐలు హనువుంతప్ప, సునీల్‌కువూర్, ఆదినారాయుణ రెడ్డి, నెట్టి కంఠయ్యు, వంశీధర్ కూడా ఉన్నారు. అరుుతే వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. ఎస్ఐ హనువుంతప్పను వివరణ కోరగా, రెండు రోజుల తర్వాత జిల్లా ఎస్పీ ఎదుట విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేస్తామన్నారు.