Tanmay Srivastava
-
కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా!
U-19 World Cup Winning Teammates Who Are Umpires Now: ఒక్కసారి క్రికెటర్‌గా ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. ఆటగాడిగానే కాకుండా కామెంటేటర్‌గా, అంపైర్‌గా ఇలా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ప్లేయర్‌గా కోటానుకోట్లు గడించిన వాళ్లు కూడా ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఇలా వేర్వేరు అవతారాల్లో క్రికెట్‌తో మమేకమవుతూనే వీలైనంత ఆర్జిస్తున్నారు. ఇలాంటి జాబితాలో చేరేందుకు సిద్ధమయ్యారు ఒకప్పుడు టీమిండియాను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు క్రికెటర్లు. మలేషియాలో జరిగిన మెగా ఈవెంట్లో విరాట్ కోహ్లి సారథ్యంలో అండర్-19 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వీరు.. ఇప్పుడు అంపైర్లుగా నూతన అధ్యాయం మొదలుపెట్టనున్నారు. తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్ అర్గాల్... 2008లో భారత యువ జట్టును చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరిద్దరు బీసీసీఐ అంపైర్లుగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. యూపీ స్టైలిష్ బ్యాటర్.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్టైలిష్ బ్యాటర్ తన్మయ్ శ్రీవాస్తవ. 2008 అండర్-19 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లలో కలిపి 52.40 సగటుతో 262 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాతో ఫైనల్లో 46 పరుగులతో రాణించి తనదైన ముద్ర వేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన్మయ్ 4918 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 27 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికట్లోనూ తన్మయ్ 44 మ్యాచ్‌లు ఆడి.. ఏడు సెంచరీలు, 10 ఫిఫ్టీల సాయంతో 1728 పరుగులు చేశాడు. ఇక ఇటీవలే అంపైరింగ్ పరీక్ష పాసైన 33 ఏళ్ల శ్రీవాస్తవ.. త్వరలోనే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు. క్రికెటర్.. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్గా..(Ajitesh Argal) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పుట్టి వడోదరలో పెరిగిన అజితేశ్ అర్గాల్.. 2008 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో యువ టీమిండియా గెలుపునకు కారణమయ్యాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అర్గాల్.. ఐపీఎల్లో 2008లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఆ తర్వాత ఆటకు విరామమిచ్చిన అజితేశ్ అర్గాల్.. స్పోర్ట్స్ కోటాలో ఆదాయపన్ను శాఖలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించాడు. క్రికెట్ కెరీర్ కొనసాగించాలన్న తలంపుతో బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణుడై అంపైర్‌గా మారనున్నాడు. కోహ్లితో పాటు జడ్డూ కూడా! కాగా అజితేశ్ అర్గాల్.. దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టు తరఫున 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, ఆడాడు. అదే విధంగా.. ఆరు టీ20లు, లిస్ట్ ఏ క్రికెట్లో 3 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీ-2015 సందర్భంగా అజితేశ్ తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే.. 2008 నాటి వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో రన్‌మెషీన్ కోహ్లితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సభ్యుడు కావడం గమనార్హం. చదవండి: బీటెక్ చదివిన టీమిండియా స్టార్.. ధోని, కోహ్లిలతో పాటు! ఆస్తి 100 కోట్లు! టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ?
టీమిండియా జట్టుకు ఆడాలని ప్రతీ క్రికెటర్ కలగనడం సహజం. కానీ తుది జట్టులో 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నప్పటికి కొందరు అనామక క్రికెటర్లుగా మిగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం జెంటిల్మెన్ గేమ్ అని చెప్పుకునే క్రికెట్లో నీచ రాజకీయాల వల్ల ఆటకు దూరం కావాల్సి వస్తుంది. గతంలో జరిగింది.. ఇప్పుడు జరుగుతుంది.. ఇకపై కూడా ఇలాంటి రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకు సంజూ శాంసన్ చక్కటి ఉదాహరణ. మంచి బ్యాటింగ్ టెక్నిక్ గల సంజూ శాంసన్‌కు టి20 ప్రపంచకప్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. అతన్ని ఎంపిక చేయకపోవడంపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడంటే ఐపీఎల్ లాంటి క్రికెట్ లీగ్స్‌తో జాతీయ జట్టుకు ఆడకపోయినా దండిగానే డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇండియా మహారాజాస్‌కు ఆడిన పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు అద్బుత ప్రదర్శన చేశారు. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగి బౌలింగ్‌లో అదరగొడితే.. మరొకరు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించి క్లాస్ ప్రదర్శన చేశాడు. అద్భుత ప్రదర్శనతో పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు తమ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఎవరీ పంకజ్ సింగ్? ఉత్తరప్రదేశ్‌కి చెందిన పంకజ్ సింగ్, టీమిండియా తరుపున 2 టెస్టులు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన పంకజ్, శ్రీలంకతో జరిగిన ఏకైక వన్డేలో వికెట్ తీయలేక జట్టులో చోటు కోల్పోయాడు. తన రెండో టెస్టులో పంకజ్ సింగ్ జో రూట్, జోస్ బట్లర్‌లను ఔట్ చేశాడు . మొదటి మ్యాచ్‌లో పంకజ్ సింగ్ బౌలింగ్‌లో అలిస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన పంకజ్.. అరంగ్రేట మ్యాచ్‌లో వికెట్ తీయకుండా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంకజ్ సింగ్ ఏకంగా 179 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం పంకజ్ సింగ్‌కి ఘనమైన రికార్డు ఉంది. 117 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పంకజ్ సింగ్ 472 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. 76 లిస్టు ఏ మ్యాచ్‌లో 115 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ద్వారా పరిచయం.. పంకజ్ సింగ్‌తో పాటు తన్మయ్ శ్రీవాస్తవ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ఇండియా మహారాజాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన తన్మయ్.. ఐపీఎల్లో మాత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు.34 మ్యాచుల్లో 649 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్లో తన్మయ్ శ్రీవాస్తవ 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు.లిస్టు ఏ క్రికెట్లో 7 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు చేసిన తన్మయ్... 2020లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!'