Meet Virat Kohli 2008 U19 WC Winning Teammates Umpires Now Income Tax Officer Too; Details Here - Sakshi
Sakshi News home page

Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్‌ గెలిచారు! ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా?

Published Thu, Aug 3 2023 1:00 PM | Last Updated on Thu, Aug 3 2023 1:27 PM

Meet Virat Kohli U19 WC Winning Teammates Umpires Now Income Tax officer Too - Sakshi

U-19 World Cup Winning Teammates Who Are Umpires Nowఒక్కసారి క్రికెటర్‌గా ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. ఆటగాడిగానే కాకుండా కామెంటేటర్‌గా, అంపైర్‌గా ఇలా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ప్లేయర్‌గా కోటానుకోట్లు గడించిన వాళ్లు కూడా ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఇలా వేర్వేరు అవతారాల్లో క్రికెట్‌తో మమేకమవుతూనే వీలైనంత ఆర్జిస్తున్నారు.

ఇలాంటి జాబితాలో చేరేందుకు సిద్ధమయ్యారు ఒకప్పుడు టీమిండియాను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు క్రికెటర్లు. మలేషియాలో జరిగిన మెగా ఈవెంట్‌లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో అండర్‌-19 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వీరు.. ఇప్పుడు అంపైర్లుగా నూతన అధ్యాయం మొదలుపెట్టనున్నారు.

తన్మయ్‌ శ్రీవాస్తవ, అజితేశ్‌ అర్గాల్‌... 2008లో భారత యువ జట్టును చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరిద్దరు బీసీసీఐ అంపైర్లుగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 

యూపీ స్టైలిష్‌ బ్యాటర్‌..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్టైలిష్‌ బ్యాటర్‌ తన్మయ్‌ శ్రీవాస్తవ. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లలో కలిపి 52.40 సగటుతో 262 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాతో ఫైనల్లో 46 పరుగులతో రాణించి తనదైన ముద్ర వేశాడు. 

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తన్మయ్‌ 4918 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 27 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్‌-ఏ క్రికట్‌లోనూ తన్మయ్‌ 44 మ్యాచ్‌లు ఆడి.. ఏడు సెంచరీలు, 10 ఫిఫ్టీల సాయంతో 1728 పరుగులు చేశాడు. ఇక ఇటీవలే అంపైరింగ్‌ పరీక్ష పాసైన 33 ఏళ్ల శ్రీవాస్తవ.. త్వరలోనే ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు.

క్రికెటర్‌.. ఇన్‌కమ్‌ టాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌గా..(Ajitesh Argal)
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పుట్టి వడోదరలో పెరిగిన అజితేశ్‌ అర్గాల్‌.. 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ విన్నర్‌. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. 

అద్భుత ప్రదర్శనతో యువ టీమిండియా గెలుపునకు కారణమయ్యాడు. రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన అర్గాల్‌.. ఐపీఎల్‌లో 2008లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఆ తర్వాత ఆటకు విరామమిచ్చిన అజితేశ్‌ అర్గాల్‌.. స్పోర్ట్స్‌ కోటాలో ఆదాయపన్ను శాఖలో  ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. క్రికెట్‌ కెరీర్‌ కొనసాగించాలన్న తలంపుతో బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణుడై అంపైర్‌గా మారనున్నాడు.

కోహ్లితో పాటు జడ్డూ కూడా!
కాగా అజితేశ్‌ అర్గాల్‌.. దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టు తరఫున 10 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, ఆడాడు. అదే విధంగా.. ఆరు టీ20లు, లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 3 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీ-2015 సందర్భంగా అజితేశ్‌ తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. ఇదిలా ఉంటే.. 2008 నాటి వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో రన్‌మెషీన్‌ కోహ్లితో పాటు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా సభ్యుడు కావడం గమనార్హం. 

చదవండి: బీటెక్‌ చదివిన టీమిండియా స్టార్‌.. ధోని, కోహ్లిలతో పాటు! ఆస్తి 100 కోట్లు!
టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..
ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement