Task Force officers
-
ప్రజలు పట్టించుకోవట్లేదు.. కరోనా ఉధృతి తగ్గలేదు
ముంబై: కరోనా రెండో వేవ్ ఇంకా తగ్గలేదని అందరూ జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పినా ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్నారని కరోనా టాస్క్‌ఫోర్స్ ప్రధాన అధికారి డా.సంజయ్ ఓక్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఇంకా కరోనా ఉధృతి కొనసాగుతోందని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య స్థిరంగా ఉంటున్నా కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, రాయ్‌గఢ్, పుణే, రత్నగిరి, సింధుదుర్గ్, పాల్ఘర్, బుల్డాణా జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపారు. రోజుకు పదివేల కేసులు.. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం ప్రతిరోజు 9 నుంచి 10 వేల వరకు కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అందులో కొల్హాపూర్ జిల్లాలో పాజిటివిటీ రేట్ అత్యధికంగా 10.24 శాతంగా ఉండగా, సతారా 9.94, సాంగ్లీ 8.81 ఉంది. మరోవైపు రాయగఢ్ 7.88, పుణె 7.68, రత్నగిరి 7.29, సింధుదుర్గ్ 6.55, పాల్ఘర్ 5.26, బుల్డాణా 4.57 శాతం పాజటివిటీ రేటుతో కరోనా సంక్రమణ కొనసాగుతోంది. కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, పుణే జిల్లాల్లో కరోనా సంక్రమణ రేటు జూన్ చివరి వారంలో కాస్త తగ్గినట్లు అనిపించినా, జూన్ 27 నుంచి మళ్లీ పెరుగుదల కనిపిస్తోందని డా. సంజయ్ ఓక్ అన్నారు. ఈ జిల్లాల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించే బాధ్యతను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్థానిక పరిపాలనా సంస్థలకే అప్పగించారు. గురువారం నిర్వహించిన జిల్లాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి వేవ్ మార్చ్ 2020లో ప్రారంభమై అక్టోబర్ వరకు తగ్గుముఖం పట్టింది. నవంబర్ 2020 వరకు మొదటి వేవ్ నిమ్నస్థాయికి తగ్గిపోయింది. అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్యకాలంలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు 70 శాతం వరకు తగ్గింది. కరోనా రెండో వేవ్ ఫిబ్రవరి 2021 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్‌లో ఇది తీవ్రంగా వ్యాపించింది. మే నుంచి కాస్త తగ్గుదల కనిపించినప్పటికీ జూన్ నుంచి మాత్రం కరోనా బాధితుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. పరీక్షలు తగ్గిస్తే కేసులు పెరుగుతున్నాయి.. దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ వేగం తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన అలసత్వం మొదలైంది. మాస్క్‌లు ధరించకుండానే బయటకు వెళ్లడం, రద్దీ ప్రాంతాల్లో తిరగడం, సురక్షిత దూరాన్ని పాటించకపోవడం కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కరోనా ప్రొటోకాల్స్‌ను పాటించాలని, ముఖ్యమంత్రితో సహా ప్రముఖులంతా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదని టాస్క్‌ఫోర్స్ సభ్యులు డా. సంజయ్ ఓక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కరోనా బాధితుడి వెనక కనీసం 20 మందిని ట్రేస్ చేయాల్సి ఉంటుందని, కానీ అది అమలు కావడం లేదన్నారు. కరోనా పరీక్షలు తగ్గించడం వల్ల కూడా సంక్రమణ వేగం పెరుగుతోందని తెలిపారు. ఈ రెండు అంశాలపై అత్యధిక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కరోనా నిబంధనలను కూడా కఠినంగా అమలు చేయాలని డా.సంజయ్ ఓక్ అన్నారు. -
ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు, మరో 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళవారం ఆయన కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ జనరేషన్, స్టోరేజ్‌ల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామరాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు పాల్గొన్నారు. చదవండి: అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
కుళ్లిన మాంసం..నాసిరకం అల్లం
అవి మంచిర్యాలలోని ప్రముఖ రెస్టా రెంట్లు... కాబట్టి ఆహార పదార్థాల్లో నాణ్యతను పాటిస్తారని ప్రజలు నమ్ము తారు. కానీ నాణ్యతలేని పదార్థాలు, కుళ్లిన మాంసం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యా లతో చెలగాటమాడుతున్నారు. బుధ వారం పలు రెస్టారెంట్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వాటి బండారం బయట పడింది. అలాగే కళాంజలి పేరుతో తయార వుతున్న అల్లంపేస్ట్, మసాలా దినుసుల్లో నాణ్యత లోపాన్ని అధికారులు గుర్తించారు. మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రముఖ రెస్టారెంట్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పంజా విసిరారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో ఏ–1, సురభి గ్రాండ్, మాధవి, బాబా రెస్టారెంట్లలో ఆకస్మిక దాడులు చేసి ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, మటన్, చికెన్ లభించండంతో కేసు నమోదు చేశారు. వాటి నిర్వా హకులకు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. తదుపరి చర్యల నిమిత్తం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారికి అప్పగించారు. అల్లం పేస్టు.. మసాలాలు సైతం.. జిల్లా కేంద్రంలోని కళాంజలి అహార పదార్థాల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కళాంజలి బ్రాండ్ పేరుతో తయారీ చేసిన నిత్యావసర ఆహార పదార్థాలను నాణ్యత లేకుండా వివిధ కిరాణాలకు సరఫరా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి వాటిని పరిశీలించారు. అల్లం పేస్టు తయారు చేసి శుభ్రంగా లేని డ్రమ్ములో నిలువ ఉంచగా.. వాటి నమూనాలను సేకరించారు. ప్యాకెట్లపై ఎమ్మార్పీ లేకపోవడం, ప్యాకెట్‌పై సూచించిన విధంగా పరిమాణం లేకపోవడం, అల్లం తయారు చేసే మిషనరీ తుప్పు పట్టి ఉండటం, ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్ లేకపోవడంపై అధికారులు ప్రశ్నించారు. సరుకు వివరాల రికార్డులు లేకపోవడంతో మందలించి, పలు రకాల ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. పరీక్షల తర్వాత కల్తీ, నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ బుద్దె స్వామి, ఎస్సై సమ్మయ్య, సిబ్బంది సంపత్‌కుమార్, భాస్కర్‌గౌడ్, సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. -
తిరుపతిలో పేలుడు పరికరాల స్వాధీనం
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ అధికారులకు సోమవారం రాత్రి పేలుడు పరికరాలు లభ్యమవ్వడం కలకలం సృష్టించింది. అధికారుల కథనం మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక బ్యాగును గుర్తించారు. బ్యాగులో పేలుడుకు ఉపయోగించే సర్క్యుట్ బోర్డులు, సెల్‌ఫోను, వాక్‌మెన్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కండెన్సర్లు ఇతర పరికరాలను అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆర్ఎస్సై వాసు ఐజీ కాంతారావుకు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పేలుడుకు ఉపయోగించే పరికరాలుగా నిర్ధారించారు. అనంతరం కాంతారావు బాంబు స్య్వాడ్‌కు సమాచారం అందించారు. వారూ ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు మీడియాతో మాట్లాడుతూ, ఇవి పేలుళ్లు సృష్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అడవిలో ఎవరూ లేనిచోటుకు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొచ్చి వాటిని సిద్ధంచేసినట్లు తెలుస్తోందన్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులతో పాటు ఇతర వీఐపీలు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తుంటారని, అయితే.. ఎవరిని టార్గెట్ చేసి వీటిని తయారుచేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని దర్యాప్తులో తేలుతుందని కాంతారావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సంచీపై తమిళనాడు తిరుచ్చికి చెందిన చిరునామా ఉందని.. లభ్యమైన ఆధారాలకు అనుగుణంగా కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను తిరుమల టూటౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేస్తామన్నారు. అనంతరం కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
కదిలిన ఐపీఎం యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్ : పాలల్లో నాణ్యతా లోపాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’బ్యానర్ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లు స్పందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రి కె.లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం(ఎఫ్ఎస్ఎస్) సమగ్రంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు.. పాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ కె.శంకర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 154 రకాల పాల ప్యాకెట్ల నమూనాలను సేకరించి నాణ్యతను తనిఖీ చేశామని.. ఇందులో 123 నమూనాలను జీహెచ్ఎంసీ పరిధిలోనే సేకరించామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 16, ఇతర ప్రాంతాల్లో 10 బ్రాండ్లకు చెందిన పాల ప్యాకెట్లు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిర్దేశించిన ప్రకారం లేవని తెలిపారు. వీరిపై ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కేసులు నమోదు చేశామని.. ఇందులో 14 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. -
శేషాచలంలో కాల్పులు
ఒక కూలీ అరెస్టు, ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం తిరుపతి క్రైం: శేషాచలం అడవుల్లో బుధవారం రాత్రి మళ్లీ అలజడి రేగింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మంగళం పరిధిలోని రిక్షాకాలనీ వద్ద సుమారు 40మంది ఎర్రచందనం కూలీలు ఉన్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కూలీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడిస్తుండగా ఉన్నట్టుండి పోలీసులపై దాడికి యత్నించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దుండగులు పనిముట్లు, ఎర్రచందనం దుంగలను వదిలి పారిపోయారు. వారిని వెంబడించి ఒక కూలీని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో సుమారు ఏడు దుంగలు దొరికాయి. చీకటిగా ఉన్నందున సరిగా కనిపించడంలేదని, అక్కడ మరికొన్ని దుంగలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. రాత్రంతా కూంబింగ్ కొనసాగించి పరారైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
రెండు చోట్ల 47 ఎర్రచందనం దుంగల పట్టివేత
పట్టుకున్న దుంగల బరువు 340 కేజీలు చెన్నుపల్లెకు చెందిన నలుగురి అరె స్టు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ బేస్తవారిపేట : మండలంలోని పగుళ్లవాగు వద్ద 32, నారువానిపల్లెలో 15 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు శనివారం వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఫారెస్ట్ టాస్క్‌ఫోర్స్ అధికారుల సమాచారం మేరకు రెండు రోజులుగా గిద్దలూరు సీఐ మహ్మద్ ఫిరోజ్, ఎస్సై బి.రమేష్‌బాబుల ఆధ్వర్యంలో పోలీస్‌లు విస్తృతంగా తనిఖీలు చేసినట్లు చెప్పారు. గలిజేరుగుళ్ల, చెన్నుపల్లె, శింగరపల్లె, శింగసానిపల్లె, కోనపల్లె, నారువానిపల్లె కొండ ప్రాంతాలు, అనుమానితుల గృహాల్లో తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ చెప్పారు. చెన్నుపల్లెకు చెందిన నారు చెంచయ్య, పెదమల్లు వెంకటేశ్వర్లు, వీరపునేని వెంకటేశ్వర్లు, చినకొండ వెంకటేశ్వర్లు, వీరినేని చెంచయ్య, లింగయ్యలు అడవిలోని ఎర్రచందనం చెట్లు నరికి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా వారి కుట్రలను భగ్నం చేసినట్లు వివరించారు. చెంచయ్య, లింగయ్యలు పరారిలో ఉన్నారని, మిగిలిన నలుగురిని అరె స్టు చేసినట్లు పేర్కొన్నారు. 47 ఎర్ర చందనం దుంగలు 340 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. శుక్రవారం రాత్రంతా అడవిలో తిరిగి ఎర్రచందనం పట్టుకున్న ఎస్సై బి.రమేష్‌బాబును డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ మహ్మద్ ఫిరోజ్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న‘ఎర్ర’దొంగల వేట
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారుల తో కలిసి అన్ని వైపుల నుంచి పట్టుబిగిస్తున్నా రు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పోలీసు బాస్ నుంచి ఉత్తర్వులు రా వడంతో రాయలసీమ జోన్ ఐజీ నవీన్‌చంద్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌తోపాటు పోలీసు సర్కిల్స్ పరిధిలోని సీఐలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్, చిత్తూరు, వైఎస్సార్ జిల్లా పోలీసులు ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రేణిగుంట, మదనపల్లె సబ్ డివిజన్ల పరిధిలోని వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వైఎస్సా ర్ జిల్లాలోని శేషన్ అనే ఎర్రచందనం స్మగ్లర్ ఇంటిపై రేణిగుంట పోలీసులు దాడులు నిర్వహించి లక్షల్లో సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. సీక్రెట్ ఆపరేషన్ టాస్క్‌ఫోర్స్ వద్దనున్న సమాచారంతో తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లా పోలీసులు కూడా ఎర్రదొంగలవేటలో పడ్డారు. చిత్తూరు జిల్లా పోలీసు నుంచి ఏడుగురు సీఐలను రహస్య ఆపరేషన్ కోసం రంగంలోకి దించారు. వీరు ఈ పనిలోనే ఉన్నట్లు పోలీసు డిపార్టుమెంట్‌లోని కిందిస్థా యి సిబ్బందికి కూడా తెలియదు. ఎర్రచందనం ్మగ్లింగ్ దర్యాపునకు సంబంధించి శాఖాపరమైన సమాచారం బయటకు పొక్కకుండా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లోని పెద్దస్థాయి స్మగ్లర్లు, జిల్లాలోని రెండో శ్రేణి స్మగ్లర్లు, మధ్యవర్తులు, రవాణా సౌకర్యాలు సమకూరుస్తున్న, కూలీలను ఏర్పాటు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. రహస్య విచారణ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అరెస్టుల సమాచారాన్ని వెంటనే వెల్లడించకుండా వారి నుంచి వివరాలు రాబట్టేందుకు రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ అధికారులతోపాటు రేణిగుంట, తిరుపతి సబ్ డివిజన్లోని కొందరు అనుభవమున్న పోలీసు అధికారులను ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖతో సంబంధం లేకుండా పోలీసులు తమకున్న సమాచారం మేరకు పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దు వైఎస్సార్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎర్రచందనం స్మగ్లర్లలో ఇద్దరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం నిధులు మంచి నీళ్లలా ఖర్చుచేశారు. వీరిలో ఒకరు ఏకంగా ఎన్నికల సభలో చంద్రబాబు పక్కన కూర్చుని ఉండగా పత్రికల్లో ఫొటో ప్రచురితం కావడం గమనార్హం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో ఉన్న స్మగ్లర్లను పోలీసులు ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది