Task Force teams
-
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటే చర్యలు
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాలను శుక్రవారం నుంచి అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ప్రకారం.. ఒకసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయడం, దిగుమతి చేయడం, నిల్వచేయడం, పంపిణీ, విక్రయంతో పాటు ఉపయోగించడం చట్ట ప్రకారం నిషేధించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ స్టిక్‌లతో కూడిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్ స్టిక్కులు, ఐస్‌క్రీమ్ స్టిక్స్‌తో పాటు టీ, కాఫీ కలుపుకునేందుకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్‌ను పూర్తిగా నిషేధించినట్లు ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాటిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వార్డు వలంటీర్లు ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అన్ని వార్డుల్లోను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలపై కరపత్రాలను పంపిణీ చేయాలని, కూడళ్లల్లో హోర్డింగ్స్‌ను ఏర్పాటుచేయాలన్నారు. సినిమా థియేటర్లలో స్లైడ్లను ప్రదర్శించడంతో పాటు, టీవీ స్క్రోలింగ్స్, ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఆ వస్తువులు ఉంటే లైసెన్స్ రద్దు వాణిజ్య షాపులు, రిటైలర్లు, అమ్మకందారులు, వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, మాల్స్‌తో పాటు ఇతర సంస్థల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు, క్యారీ బ్యాగులు నిల్వచేయడంతో పాటు వినియోగించినట్లు తేలితే ఆయా దుకాణాలు, షాపుల వాణిజ్య లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తామన్నారు. ఇక శుక్రవారం నుంచి అమలులోకి వచ్చే నిబంధనలను అమలుచేసేందుకు, దుకాణాలను తనిఖీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 805 టాస్క్ఫోర్సు బృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఈ బృందాలు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల 158 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేసి, రూ.1.54 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ వివరించారు. -
ఢిల్లీ వెళ్లొచ్చిందెవరు?
సాక్షి, నెట్వర్క్ : ప్రార్థనల కోసం ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారెవరనే దానిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రం నుంచి చాలామంది ప్రార్థనల నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అలాంటి వారు ఎంతమంది ఉంటారనేది అంచనాకు అందటం లేదు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. అక్కడి నుంచి తిరిగొచ్చాక వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారనే దానిపైనా దృష్టి సారించారు. ఇలాంటి వ్యక్తులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలటంతో ఆ రెండు జిల్లాల అధికారులు అప్రమత్తమై వారిని గుర్తించే పనిలో నిమగ్నమై ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు. చీరాల ప్రాంతం నుంచే 280 మంది.. - ఢిల్లీ వెళ్లిన గుంటూరు వ్యక్తుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారణ కావడంతో.. వారితో తిరిగిన 128 మందిని, చీరాలకు చెందిన పాజిటివ్ వ్యక్తుల్ని కలిసిన సుమారు 35 మందిని ఇప్పటికే గుర్తించారు. - మరోవైపు ఢిల్లీ వెళ్లిన వారి రైల్వే రిజర్వేషన్ వివరాలను బట్టి వారి చిరునామాలు వెతుకుతున్నారు. - చీరాలకు చెందిన మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ కాగా.. ఆయనతో కలిసి ఢిల్లీ ప్రార్థనలకు సుమారు 280 మంది వెళ్లినట్లు గుర్తించారు. వారిలో 200 మంది ఒంగోలు రైల్వేస్టేషన్లో దిగినట్లు గుర్తించి.. ఆచూకీ కోసం గాలిస్తున్నారు. - ఆదివారం రాత్రి వరకు చీరాల పరిసర ప్రాంతాలతో పాటు కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, ఒంగోలు నగరంలో సుమారు 105 మందిని గుర్తించి.. కొందరిని హోం క్వారంటైన్, మరికొందరిని ఆస్పత్రి క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు తరలించారు. - గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన 15 మంది ఢిల్లీ వెళ్లి ఈ నెల 19న స్వస్థలాలకు చేరుకున్నట్లు గుర్తించారు. - వీరిలో ఇద్దరు కారంపూడి వాసులు కాగా.. పట్టణంలోని తూర్పు బావి ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. - వీరిలో ఇద్దరు యువకులు ఇటీవల గుంటూరులో విందుకు హాజరై కరోనా బారినపడ్డారు. ఆ యువకుల కుటుంబ సభ్యులతోపాటు వారిని కలిసిన 32 మందిని అంబులెన్స్‌లలో కాటూరు వైద్యశాలకు తరలించారు. - కనిగిరిలో కజికిస్తాన్ నుంచి వచ్చిన ఓ వైద్యుడు క్వారంటైన్లోకి వెళ్లకుండా ప్రజలకు వైద్య సేవలందిస్తున్నట్లు తేలడంతో అతనిపై కేసు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలించారు. - అతడి వద్ద వైద్యసేవలు పొందిన 150 మంది రోగులను సైతం గుర్తించి క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. -
పెట్రోల్‌కు ‘ఆధార్’ ఇవ్వాల్సిందే
72లక్షల వాహనాలకు, 41లక్షల డ్రైవింగ్ లెసైన్సుదారులకు ఆధార్ కావాల్సిందే ఆయిల్ కంపెనీలతో రవాణాశాఖ సమావేశం ఈ నెల 13 నుంచి బంకుల్లో టాస్క్ఫోర్సు టీమ్‌లు ఇంధనానికి వెళితే సి-బుక్, డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరి సాక్షి, విజయవాడ బ్యూరో: ఆధార్ అనుసంధానంకోసం పెట్రోల్ బంకులను ఆశ్రయించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై హెచ్‌పీసీఎల్, బీపీఎల్, ఐఓసీ ఆయిల్ కంపెనీలతో రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఉన్నతాధికారులు ఇప్పటికే రాష్ట్రస్థాయి కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. రవాణాశాఖ ప్రతిపాదనకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు అంగీకరించడంతో త్వరలోనే జీవో విడుదల కానుంది. రాష్ట్రంలోని 13జిల్లాల్లో 72లక్షల వాహనాలు, 41లక్షల డ్రైవింగ్ లెసైన్సులు ఉన్నట్టు గుర్తించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్(సి బుక్)లు, డ్రైవర్లు(డ్రైవింగ్ లెసైన్సు)లకు నాలుగు నెలల నుంచి ఆధార్ అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితమివ్వలేదు. దీంతో రవాణా శాఖ నేరుగా రంగంలోకి దిగి కృష్ణా జిల్లా గుడివాడ, కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రయోగాత్మకంగా ఇంటింటికి వెళ్లి ఆధార్ అనుసంధానం చేపట్టారు. అయితే పగటిపూట సర్వేకు ఇళ్ల వద్ద జనం అందుబాటులో లేకపోవడంతో ఇకపై పెట్రోల్ బంకుల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం పెట్రోల్ బంకుల్లో ఈ నెల 13 నుంచి టాస్క్ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోను కనీసం 40కి తగ్గకుండా ఆయిల్ బంకుల్లో ఈ పద్ధతిని చేపడతారు. మెప్మా సిబ్బంది, హోంగార్డులు, బంకు డీలర్ల ప్రతినిధులు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. బంకుకు వచ్చే ప్రతీ వాహనం, డ్రైవర్లు ఇకనుంచి సి బుక్, డ్రైవింగ్ లెసైన్సు, ఆధార్ కార్డులను వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. ఒకసారి వాటిని తీసుకుని రాకపోతే మరో అవకాశం ఇస్తారు. అక్కడిక్కడే వాటిని ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఆధార్ అనుసంధానం మేలంటున్న రవాణాశాఖ.. ఆధార్ అనుసంధానంతో ఒకే వ్యక్తికి, ఆయన కుటుంబానికి ఎన్ని వాహనాలు ఉన్నాయి, చిరునామా, ఇతర వివరాలు ఆన్లైన్ చేసే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న సి బుక్, డ్రైవింగ్ లెసైన్సులు మన రాష్ట్రంలో గుర్తించడానికి సరిపోతాయి. అదే ఆధార్ కార్డు ఉంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా వాహనం, డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే వీలుకలుగుతుంది. వాహనాలపై వెళ్లి చోరీలు, ప్రమాదాలు ఇతర వివరాలు సైతం ఆధార్ హబ్‌లో నెంబరు నమోదు చేస్తే ఇట్టే వివరాలు తెలుసుకునే వీలుంటుంది. దీనికితోడు వాహనాల రిజిస్ట్రేషన్ కాలపరిమితి, డ్రైవింగ్ లెసైన్సు రెన్యువల్ వివరాలు సంబంధిత వ్యక్తి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు ఇచ్చి అప్రమత్తం చేసేందుకు కూడా ఈ ప్రక్రియను ఉపయోగించు కోనున్నారు.