Tata Capital
-
టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. అయితే ఇందుకు కంపెనీతో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించవలసి ఉంది. తదుపరి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల(మార్చి) చివరికల్లా విలీనానికి ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అంచనా. దీంతో 2 బిలియన్ డాలర్ల(రూ.17,000 కోట్లు) విలువైన ఐపీవోకు శ్రీకారం చుట్టనుంది. తద్వారా 11 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలవనున్నట్లు అంచనా. ఆర్బీఐ వద్ద అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి ఇప్పటికే సంస్థ బోర్డు అనుమతించింది. ఐపీవోలో భాగంగా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు సైతం కొంతమేర ఈక్విటీని ఆఫర్ చేయనున్నారు.ఏప్రిల్‌లో ఏథర్ ఎనర్జీ ఐపీవోఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ ఏప్రిల్‌లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే సన్నాహాలు చేపట్టింది. ఇందుకు వీలుగా కంపెనీ తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే ఫ్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఈక్విటీగా మార్పు చేస్తోంది. కంపెనీల రిజిస్టర్ (ఆర్వోసీ) సమాచార ప్రకారం 1.73 సీసీపీఎస్‌ను 24.04 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసేందుకు ఏథర్ బోర్డు తాజాగా అనుమతించింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే ముందుగానే సీసీపీఎస్‌ను ఈక్విటీగా మార్పిడి చేయవలసి ఉంటుంది. వెరసి 2025–26లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచే వీలున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?గతేడాది సెప్టెంబర్‌లో ఏథర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మహారాష్ట్రలో ఈవీ ద్విచక్ర వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణ చెల్లింపులకుగాను నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పత్రాలలో పేర్కొంది. ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్ట్‌కానుంది. -
ఎన్బీఎఫ్సీ ఐపీవోల క్యూ
న్యూఢిల్లీ: అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలపై రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనల కారణంగా ఇకపై పలు పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. ఈ విభాగంలో వచ్చే వారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం కనీసం మరో మూడు కంపెనీలు ఈ జాబితాలో చేరనున్నాయి. వీటిలో టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్‌కు ప్రయత్నించనున్నాయి.ఆర్బీఐ నిబంధనల ప్రకారం అప్పర్‌లేయర్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు గుర్తింపు పొందిన మూడేళ్లలోగా ఐపీవోలు చేపట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు జోరుమీదుండటంతో నాణ్యతగల బిజినెస్‌లకు డిమాండ్ ఉన్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగ డైరెక్టర్ సచిన్ మెహతా పేర్కొన్నారు. దీంతో మంచి విలువలు లభించేందుకు వీలున్నట్లు తెలియజేశారు. ఫలితంగా పలు ఎన్బీఎఫ్సీలు లిస్టింగ్ బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. కేవలం ఆర్బీఐ నిబంధనల అమలుకోసమేకాకుండా నిధుల సమీకరణకు సైతం ఐపీవోలను వినయోగించుకోవచ్చని తెలియజేశారు. ఒకసారి లిస్టయితే నిధుల సమీకరణ సులభమవుతుందని వివరించారు. క్యూ ఇలా ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీ నిబంధనల ప్రకారం చూస్తే దిగ్గజాలు టాటా సన్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. వీటిలో పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనంకానుంది. ఇక టాటా సన్స్ లిస్టింగ్‌ను తప్పించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టాటా సన్స్ లిస్టింగ్ గేమ్‌చేంజర్‌గా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇన్వెస్టర్లు లిస్టింగ్ ద్వారా భారీ లాభాలు అందుకునేందుకు వీలుండటమే దీనికి కారణమని తెలియజేశారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అధికస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకోగలదని భావిస్తున్నారు. దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాల హోల్డింగ్ కంపెనీగా నిలుస్తున్న టాటా సన్స్‌కు భారీ డిమాండ్ నెలకొంటుందని అంచనా వేశారు.కీలక పరిణామం ప్రయివేట్ రంగ హోల్డింగ్ దిగ్గజం టాటా సన్స్ లిస్టయితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఇది కీలక పరిణామంగా నిలుస్తుందని డీఏఎం క్యాపిటల్ సీఈవో ధర్మేష్ మెహతా పేర్కొన్నారు. భారత్‌లోనే అత్యంత ప్రముఖ గ్రూప్‌లలో ఒకటైన టాటా సన్స్‌కు దేశ, విదేశాల నుంచి గరిష్ట డిమాండ్ పుడుతుందని తెలియజేశారు.వాటాదారులకు భారీ విలువ చేకూరుతుందని మార్కెట్ నిపుణులు పలువురు అభిప్రాయపడ్డారు. వెరసి కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేస్తే రూ. 55,000 కోట్లకుపైగా నిధులు లభించవచ్చని అంచనా వేశారు. లిక్విడిటీతోపాటు.. ట్రేడింగ్ పరిమాణం సైతం భారీఆ పెరుగుతుందని తెలియజేశారు.లిస్టింగ్‌ను తప్పించుకునే యోచనతో టాటా సన్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆర్బీఐకు స్వచ్చందంగా సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆర్బీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమని నిపుణులు పేర్కొన్నారు. కాగా.. 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనూహ్య పతనానికితోడు.. డీహెచ్ఎఫ్ఎల్ సైతం విఫలంకావడంతో మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. కఠిన లిక్విడిటీ సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా 2021 అక్టోబర్‌లో ఆర్బీఐ సవరించిన ఎస్బీఆర్ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా వ్యవస్థాగత రిస్కులను అడ్డుకోవడం, పాలనను మరింత పటిష్టపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది.ఇవీ నిబంధనలుఎస్బీఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎన్బీఎఫ్సీలను నాలుగు విభాగాలు(లేయర్లు)గా విభజించింది. ప్రాథమిక(బేసిక్), మాధ్యమిక(మిడిల్), ఎగువ(అప్పర్), అత్యున్నత(టాప్) లేయర్లుగా ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీల పరిమాణం, కార్యకలాపాలు, రిస్క్ స్థాయిల ఆధారంగా వీటికి తెరతీసింది. దీనిలో భాగంగా అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలుగా గుర్తింపు పొందిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయ్యేలా నిబంధనలను సవరించింది. ఇందుకు అనుగుణంగా 2022 సెప్టెంబర్‌లో 16 సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. అయితే 2023లో జాబితా నుంచి సంఘ్వీ ఫైనాన్స్‌ను తప్పించింది.వెరసి 15 సంస్థలు అప్పర్లేయర్లో చేరాయి. వీటిలో పిరమల్ క్యాపిటల్, టాటాసన్స్లను మినహాయిస్తే 9 కంపెనీలు ఇప్పటికే లిస్టయినట్లు మెహతా వెల్లడించారు. బజాజ్ హౌసింగ్ ఐపీవో ప్రారంభంకానున్న కారణంగా మిగిలిన మూడు కంపెనీలు ఏడాదిలోగా లిస్ట్‌కావలసి ఉంటుంది. ఈ మూడు సంస్థలు 2025 సెప్టెంబర్‌లోగా పబ్లిక్ ఇష్యూలను చేపట్టవలసి ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలియజేశారు. -
‘సలామ్’ కొడితే రుణం!
♦ సిబిల్ స్కోర్ కాదు.. నెటిజన్ల లైక్‌లు చాలు ♦ వ్యక్తిగత రుణాలకు టాటా క్యాప్ కొత్త రూటు ♦ సోషల్ మీడియా ఓట్లకు అగ్రాసనం; గరిష్ట పరిమితి రూ.లక్ష ♦ 3లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి చాన్స్ ముంబై: వ్యక్తిగత రుణాలకు టాటా క్యాపిటల్ సోషల్ మీడియా టచ్ ఇచ్చింది. టీవీల్లో డ్యాన్స్, మ్యూజిక్ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు తమ ప్రదర్శన నచ్చితే ఓటు వేసి గెలిపించాలని వీక్షకులను కోరడం తెలిసిందే. ఇదే మాదిరిగా రుణాలు కావాలనుకున్న వారు కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ఓట్లను గెలవాల్సి ఉంటుంది. ఎన్ని ఓట్లు వచ్చాయనేదాన్ని బట్టి వారికి రూ.లక్ష వరకూ రుణాన్ని టాటా క్యాపిటల్ మంజూరు చేస్తుంది. అదీ కథ. ప్రక్రియ ఇలా... వ్యక్తులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన, తక్కువ ఆదాయ వర్గాల వారు, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు దాటని వారు ఈ రుణాలను పొందొచ్చని టాటా క్యాపిటల్ చెబుతోంది. దరఖాస్తుదారులు రుణం ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పాలి. అప్పుడు ఆ సమాచారాన్ని టాటా క్యాపిటల్ ఠీఠీఠీ. ఛీౌటజీజజ్టి. జీn అనే వెబ్సైట్లో 3, 4 వారాల పాటు ప్రదర్శిస్తుంది. సోషల్, డిజిటల్ మీడియా వేదికలపై దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతుంది. ఈ దరఖాస్తు భవితవ్యాన్ని తేల్చాల్సింది నెటిజన్లే. సంబంధిత దరఖాస్తుదారుడికి తమ మద్దతును ‘సలామ్’ అంటూ తెలియజేస్తే చాలు. అది రుణం ఆశిస్తున్నవారికి ప్లస్ అవుతుంది. ఓ రుణ దరఖాస్తుకు తగినన్ని లైక్స్ లేదా సలామ్‌లు వస్తే అప్పుడు దాన్ని రుణానికి ప్రాథమిక అర్హతగా టాటా క్యాపిటల్ తీసుకుంటుంది. నాణ్యతా సమీక్ష చేపడుతుంది. దరఖాస్తుదారుడితో మాట్లాడి, అతడి రుణ అవసరాలు, చిత్తశుద్ధిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనిద్వారా మోసపూరిత దరఖాస్తులను నివారించొచ్చన్నది కంపెనీ యోచన. దరఖాస్తు దారుడికి లాభమేంటి..? రుణం కోసం ఇన్ని పాట్లు అవసరమా...? అనుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఇలా ఎక్కువ సలామ్‌లను గెలుచుకున్న వారికి మార్కెట్లో ఉన్న వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే రెండు నుంచి మూడు శాతం తక్కువకే రూ.లక్ష వరకు రుణాన్ని టాటా క్యాపిటల్ అందజేస్తుంది. మరో ప్రయోజనం ఏంటంటే... రుణం పొందేందుకు సిబిల్ స్కోరు అవసరం లేదు. ఒకరి హామీ కూడా అక్కర్లేదు. టాటా క్యాపిటల్ రిటైల్ బిజినెస్, హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గోవింద్ శంకరనారాయణన్ దీనిపై స్పందిస్తూ... ‘‘ఈ ప్రయత్నం పరిశ్రమ ప్రయోజనాలకు కూడా ఉపకరిస్తుంది. ఇతర రుణదాతల్లోనూ నమ్మకం ఏర్పడుతుంది. రుణాలకు ఈ గ్రూపులు (తక్కువ ఆదాయ వర్గాలు) కూడా అర్హులేనని అర్థం చేసుకుంటారు’’ అని చెప్పారు. విద్యావసరాలు, ఆరోగ్యం, ఇతర అవసరాల కోసమూ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చని టాటా క్యాపిటల్ చెబుతోంది. ఉదాహరణకు కిరణ్జోహార్ ఉన్నత విద్య కోసం రూ.88వేలు రుణం కావాలంటూ టాటా క్యాపిటల్‌కు చేసుకున్న దరఖాస్తుకు ఇప్పటి వరకు 96 సలామ్‌లు వచ్చాయి. నాసిక్‌కు చెందిన రూపేష్ బలరావ్ చిన్నప్పుడే పోలియోతో అంగవైకల్యం బారినపడ్డాడు. ఓ జనరల్ స్టోర్ పెట్టుకుని తన కాళ్లపై తాను నిలబడాలని ఆశించాడు. రుణం కావాలని బ్యాంకులను కోరితే తిరస్కరణ ఎదురైంది. ఇప్పుడు ఇతడి కథనాన్ని టాటా క్యాపిటల్ ఆన్లైన్లో ఉంచగా 123 ఓట్లు వచ్చాయి. -
మహిళలకు టాటా ప్రత్యేక హోమ్‌లోన్
ముంబై: టాటా క్యాపిటల్ సంస్థ మహిళల కోసం తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థల మాదిరి టాటా క్యాపిటల్ కూడా ఈ తరహా రుణాలను అందిస్తోంది. మహిళలకు రూ.40 లక్షల లోపు రుణాలను 10.15 శాతానికే అందిస్తామని కంపెనీ పేర్కొంది. గతంలో ఈ వడ్డీరేటు 10.50 శాతంగా ఉండేదని పేర్కొంది. ఈ పథకం అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన వచ్చే నెల 8 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించింది. మహిళలు తాము కలలు గన్న ఇంటిని సొంతం చేసుకోవడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారితకు తోడ్పడం తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలు 10.10% వడ్డీకే అందిస్తోంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మహిళల కోసం ప్రత్యేక గృహరుణ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.