breaking news
TDP
-
కూటమిలో చైతన్య చిచ్చు!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిథి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవరాలైన చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు జెండాలు మోసి పలువురి విజయానికి కృషి చేసిన తమ పరిస్థితి ఏమిటని చిత్తూరులోని రెండు సామాజిక వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. చైతన్య స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరు నగర మేయర్ పదవి ఆశిస్తుండడం కూటమి పార్టీ లో చిచ్చు రేపుతోంది. ఎవరికేమి చేశారని? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల కాలంలో జిల్లాలో ఎన్నో నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇందులో కాణిపాకం వినాయక స్వామి ఆల య బోర్డు చైర్మన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా), ఏపీ వన్నెకుల క్షత్రియ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్, ఆర్టీసీ చైర్మన్, కుప్పం రెస్కో, కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్, చిత్తూ రు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, పెనుమూరు, కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ నేతలకే దక్కింది.పేరుకు కూటమి ప్రభుత్వమని చెప్పుకుంటున్నా, పదవుల భర్తీలో తమను ఏ మాత్రం గుర్తించడం లేదని కూటమి లోని బీజేపీ, జనసేన నేతలు పలు సందర్భాల్లో సామాజిక మాధ్యమాల వేదికగా బహిరంగంగా పోస్టులు పెట్టారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో చిత్తూరు మేయర్ స్థానంపై కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు పట్టుగా ఉన్నాయి. మేయర్ కుర్చీ జనసేనదే! 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గురరజాల జగన్మోహన్ నాయుడు అందర నీ ఆశ్చర్యపరిచారు. అసలు గెలుపు వరిస్తుందనే విష యం ఆయన కూడా ఉహించి ఉండరు. అప్పటి వరకు ఎమ్మెల్యే సీటు కోసం చిత్తూరు టీడీపీలోని బలిజ (కాపు) సామాజికవర్గ నేతలు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటికే జనసేన పార్టీలో చేరిన ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక కూడా జనసేన పార్టీ తరపున చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చిత్తూరు మేయర్ సీటుపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చిత్తూ రు నగరంలో కాజూరు చెరువు అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్తో కలిసి పర్యటించి మేయర్ పోటీలో తాను కూడా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రెండు రోజుల క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ను కలిసిన ఈమె.. మేయర్ సీటు కోసం మురళీమోహన్ మద్దతు కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్తూరు సీటు జనసేన పారీ్టకే దక్కాలని ఇప్పటికే స్థానిక జనసేన సైనికులు పట్టుబడుతున్నారు. తమ నాయకుడి మాట కోసం సర్వం ఒడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమకు చిత్తూరు మేయర్ కుర్చీ ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. ఆశా..? నిరాశ..? ఆదికేశవులు కుటుంబం నుంచి చిత్తూరు మేయర్ కోసం తన తాత పేరుతో పాటు, జనసేన కార్డు వా డుతుండడం చైతన్య రాజకీయ భవిష్యత్తుకు చావో, రేవో తేల్చనుంది. ఇదే సమయంలో చైతన్య రాకతో చిత్తూరులో ఇప్పటికే మేయర్ కుర్చీ ఆశిస్తు న్న రెండు సామాజిక వర్గాల్లోని ప్రధాన నాయకులు కారాలు– మిరియాలు నూరుతున్నారు. ఆదికేశవులు నాయు డు, ఆయన సతీమణి సత్యప్రభతోనే చిత్తూరులో ఆ కుటుంబం రాజకీయ పయణం ముగిసిందని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న వాళ్లంతా కాలక్షేప రాజకీయాలు, ఆర్థిక హోదాకు ఓ పదవి కావాలని చూస్తున్నారని, సేవ చేయడానికి కాదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అది ముమ్మాటికీ చైతన్యకు అడ్డు కట్ట వేయడానికేనని స్పష్టమవుతోంది. కూటమి కుంపటిలో చైతన్య రాక చిచ్చురేపుతున్నా, ఇన్నాళ్లు పలు నామినేటెడ్ పదవులను వదులుకున్నట్లు చిత్తూరు మేయర్ కుర్చీని సైతం టీడీపీ నేతలకు జనసేన–బీజేపీ నేతలు త్యాగం చేస్తారో..? పోటీలో తమ తరువాతేనని కాలుదువ్వుతారో వేచి చూడాల్సి ఉంది. ఇదీ చదవండి: మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం! -
వైఎస్ఆర్సీపీ పాటలు పెట్టారని.. కున్నంపల్లిలో రాళ్ల దాడి!
-
మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం!
గుంటూరు: రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణంలో అనేక అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సభా వేదికపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫొటోను ప్రొటోకాల్ అధికారులు ఏర్పాటు చేయడం మరిచారు. విషయాన్ని తెలుసుకున్న జనసేన నేతలు అధికారుల దష్టికి తీసుకువెళ్లడంతో ఆగమేఘాలపై అరగంట తరువాత మంత్రి మనోహర్‌తో కూడిన ఫొటోను వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పొందుపరిచారు.హెలీప్యాడ్ ప్రాంగణానికి వెళ్లేందుకు ఆ గ్రామ రైతులు, టీడీపీ ముఖ్య నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి, చివరకు చేసేది లేక అక్కడి నుంచి నిష్క్రమించారు. ఒకానొక దశలో టీడీపీ మహిళా నాయకురాలు ఎన్నిసార్లు హెలీప్యాడ్ ప్రాంగణానికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కష్టపడి పనిచేసే వారికి ఇటువంటి అవమానాలు తప్పవని సీనియర్ నాయకుల ఎదుట ఒకింత అసహనం వ్యక్తం చేసింది. హెలీప్యాడ్ ప్రాంగణానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటే, దాదాపు 80 మంది వివిధ మార్గాల గుండా రావడంతో ఎన్ఎస్జీ కమెండోలు పలువురిని పక్కకు తోశారు. వీరిలో జనసేన నాయకులు ఉన్నారు. ఆలస్యంగా సీఎం ప్రసంగం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో శంకుస్థాపన చేసి సభా ప్రాంగణానికి వెనుదిరిగి వచ్చారు. ఒంటి గంట దాటినా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాకపోవడంతో కొంతమంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గ్యాలరీల దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనేక అపశ్రుతుల మధ్య చంద్రబాబు బహిరంగ సభ కొనసాగింది. సభ ముగియడంతో ప్రజలు ‘బతికిపోయాంరా బాబు’ అంటూ బయటకు వచ్చారు. తీవ్ర ఉక్కపోత, ఎండ తట్టుకోలేక సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందిపడ్డారు. రైతులను అడ్డుకుంటున్న పోలీసులు ఇదీ చదవండి: నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్! -
నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని ఆయన చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే పని చేస్తున్నానని ఆయన అన్నారని ఎల్లో మీడియా అత్యంత ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఇండియా టుడే మీడియా కేరళంలో నిర్వహించిన ఒక సదస్సులో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.నిజంగా ఆయన అదే ప్రకారం పనిచేస్తే మంచిదే. కాని ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిలో లేరన్న మాట మినహాయించి, ప్రభుత్వంలో లోకేష్‌కు తెలియకుండా ఏమి జరగవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది ఏమైనా మంచి పనుల కోసం అయితే ఫర్వాలేదు. పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని రెడ్‌బుక్ పేరుతో ఏపీలో సాగుతున్న అరాచకాలన్నిటికి ఆయనే బాధ్యుడున్న విమర్శ వైఎస్సార్సీపీతో సహా వివిధ సంఘాలు చేస్తుంటాయి. ఇందులో చాలావరకు నిజం ఉందనిపించేలా ఆయన పార్టీ సమావేశాలలో వైఎస్సార్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టించడం గురించి రెడ్‌బుక్ పేజీలు అంటూ ప్రసంగిస్తుంటారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని రెచ్చగొట్టేవారు. అధికారంలోకి వచ్చాక టీడీపీవారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయించే పనిలో ఉన్నారు. ఎక్కడైనా అలా ఎత్తివేయకపోతే డీజీపీని పంపిస్తానని ముఖ్యమంత్రి మాదిరే ప్రకటనలు చేశారు. నిజానికి ఇదంతా సీఎం లేదా, హోం మంత్రి పరిధిలో ఉండే విషయం. అయినా పెత్తనం అంతా లోకేష్‌దే అన్నమాట.ఇక పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఎక్కడ ఉంటారో తెలియదు. కాని మొత్తం ఆ పరిశ్రమకు సంబంధించిన అంశాలన్నిటిపైన నిర్ణయాలు ఈయనే ప్రకటిస్తుంటారు. విదేశాలకు టూర్లు వెళుతుంటారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినా పారిశ్రామికవేత్తలతో తాను చర్చలు జరుపుతానని ఆయనే ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 99 పైసలకే పరిశ్రమలకు భూములు ఇస్తా.. తన ఇష్టం అన్నట్లుగా కొంతకాలం క్రితం ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అదే పరిస్థితి. లోకేష్ పేషీకి తెలియకుండా బిల్లులు పాస్ అవడం అరుదని చెబుతున్నారు.గత టరమ్‌లో టీడీపీ ప్రభుత్వంలో చెట్టు-నీరు స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేల కోట్ల అవినీతి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. దాని ప్రకారం కొందరి బిల్లులు నిలిచిపోయాయి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటున్నారట. లోకేష్ ఏ బిల్లుల గురించి చెప్పారో కాని, ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే చాలావరకు బిల్లులు క్లియర్ చేశామని, మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో ఆర్దిక మంత్రి ప్రస్తావనను తెచ్చినప్పటికి అది నామమాత్రమే అన్నది తెలుస్తూనే ఉంది.ప్రభుత్వ విషయాలలోనే కాదు.. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లే ఇస్తామని స్పష్టం చేసింది కూడా ఆయనే. ఒకవైపు పార్టీపరంగా సమావేశాలు నిర్వహిస్తూ, మరో వైపు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ, ఇంకో వైపు తన ఇమేజీని పెంచుకోవడం కోసం ఎల్లో మీడియాను, ఐటీడీపీ తదితర సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.సాధారణంగా దేశస్థాయిలో జరిగే సదస్సులకు చంద్రబాబే వెళుతుండేవారు. కాని ఈ మధ్యకాలంలో ఢిల్లీ, లేదా ముంబై తదితర నగరాలలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు లోకేషే హాజరవుతున్నారు. ఆయా సభలలో లోకేష్, చంద్రబాబులు పరస్పరం పొగుడుకోవడం, తండ్రికి బహిరంగ కార్యక్రమాలలో పాదాభివందనం చేస్తున్న ఘట్టాలు అందరు గమనిస్తున్నవే. ఇదంతా పీఆర్లో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?కాగా, డీఎస్సీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం తండ్రి మాదిరి అసత్యాలు చెప్పడానికి ఆయన పెద్దగా ఫీల్ అవలేదు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆయన ఇచ్చిన జవాబు తన తండ్రికే వర్తిస్తుందన్న సంగతి ఆయన గమనించనట్లే వ్యవహరించారు. గతంలో ఓటమి ఎదురైనప్పుడు ఈసీపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసింది తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే తనకు సీఎం పదవి ఇప్పుడు ప్రాధాన్యం కాదని ఆయన చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే సీఎం పదవిలో లేరన్నమాటే కాని, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆఫీస్ వద్దే జనం ఎక్కువగా కనిపిస్తారట.2014 టరమ్‌లో లోకేష్ ఎన్నికలలో పోటీచేయలేదు. కాని పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలానికి చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రిగా చేయించారని అంటారు. అప్పట్లో షాడో ముఖ్యమంత్రి అన్న విమర్శ రాలేదు. ఆ తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి జనంలో తిరగడానికి కృషి చేశారు. వాటిలో యువగళం ఒకటి.2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ప్రధానంగా పర్యటనలు, ఉపన్యాసాలకే పరిమితం అవుతుంటే, లోకేష్ కథ నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా చంద్రబాబుతో దాదాపు సమానంగా సానుకూల కథనాలు అనండి.. భజన స్టోరీలు అనండి.. నిత్యం ఇస్తుంటాయి. లోకేష్‌ను సీఎం చేయాలన్న వాదన కుటుంబంలోను, ఆయన మద్దతుదారులలో బలంగా ఉన్నప్పటికి, వివిధ కారణాల రీత్యా అది జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేయవలసి ఉందని అంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ సంభోధించడమే కాక, సభలలో వారిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నిస్తున్నారు. పవన్ ఈయనను ఓరే అన్నంత చనువు ఉన్నంతగా ఆ మధ్య చెప్పారు. కాని పవన్ అసలు ఎవరిని ఓరేయ్, అరేయ్ అనరని ఆయన మద్దతుదారులు చెబుతూ లోకేష్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది వేరే కథ. బహుశా తను సీఎం పదవి తీసుకున్నా పవన్ సహకారం అవసరమన్న భావనతో ఆయనతో సలహా, సంప్రదింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కల్పించడం లోకేష్ లక్ష్యం కావచ్చు. కాని, పవన్‌కు తెలియకుండానే ప్రభుత్వంలోని అనేక విషయాలు జరుగుతుంటాయి. డీఎస్సీకి అక్రమాల ఆరోపణలపై పవన్ ఇంతవరకు ప్రత్యక్షంగా లోకేష్‌కు మద్దతుగా ఖండన ఇవ్వకపోవడం కూడా గమనించదగిందే.ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిని రెండేళ్లపాటు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని జనసేనలో కొందరు ప్రచారం చేశారు. కాని మొహమాటం లేకుండా అది కుదిరే పని కాదని లోకేష్ మీడియా ముందు ఆ రోజుల్లోనే కుండబద్దలు కొట్టారు. బహుశా ఆ అవకాశం పవన్‌కు వస్తే తన భవిష్యత్తుకు అడ్డంకి అవుతుందని అనుకొని ఉండవచ్చు. అంతేకాక పవన్‌కు డిప్యూటి సీఎం పదవిపై కూడా టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ కాకుండా సర్దుకుపోయారు. ఇప్పుడు పవన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో బయటపడడం లేదు. లోకేష్ తనకు సీఎం పదవి ప్రాధాన్యం కాదని అన్నారే తప్ప, ఈ టరమ్ అంతా చంద్రబాబే సీఎంగా ఉంటారని, వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్ధి కూడా ఆయనే అని లోకేష్ స్పష్టంగా చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.2029 ఎన్నికలలో లోకేష్‌నే సీఎం అభ్యర్ధిగా ఫోకస్ చేస్తారా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం క్రితం లోకేష్ సీఎం కాబోతున్నారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కాని అది జరగలేదు. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలలో ఒక వైఎస్ జగన్ తప్ప మరే సీఎం కుమారుడు, లేదా కుమార్తె ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం కోసం లోకేష్ ఎదురుచూస్తుండవచ్చు.1986 ప్రాంతంలో ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడుగా ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కాని ఆ తర్వాత అతనిలో ఉన్న పొటెన్షియాల్టిని గమనించి, లోకేష్ భవిష్యత్తుకు ఆటంకం అవుతాడని సందేహించి ఆయనను పక్కన పెట్టేశారని చెబుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్ వద్ద కర్షక పరిషత్ చైర్మన్‌గా ఉంటూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు లోకేష్ ఆ పాత్ర పోషిస్తున్నారు.లోకేష్ తన కుమారుడు కనుక వారసత్వ, కుటుంబ రాజకీయాల సమస్య, విమర్శలు రావని చంద్రబాబు భావిస్తుండవచ్చు. అందుకే పార్టీలోను, ప్రజలలోను లోకేష్ పట్ల సానుకూలత పెంచేందుకు వివిధ ప్లాన్లు అమలు చేసున్నారనుకోవచ్చు. కాలచక్రం అలా ఉంటుందన్నమాట. కాకపోతే లోకేష్ పాజిటివ్ కోణం కన్నా, నెగిటివ్ ధోరణిలోనే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లోకేష్ కోరిక ఈ టరమ్‌లో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మనసులో ఎంత బలమైన కోర్కె ఉన్నా కొంత కాలం అణచుకోక తప్పదు కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బొచ్చు కూడా పీకలేరు... బాబు, కొలికపూడిపై టీడీపీ నేత సంచలన కామెంట్స్
-
జనసేన మహిళా నేతపై TDP కార్యకర్తల రాళ్ల దాడి
-
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల వీరంగం
సాక్షి, కృష్ణాజిల్లా: వెదురుపావులూరు టోల్ ప్లాజా దగ్గర టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్‌గేట్‌ను చింతమనేని బ్యాచ్ బ్లాక్ చేసేసింది. ఫీజు కట్టమన్న టోల్ ప్లాజా సిబ్బందిపై బెదిరింపులకు దిగారు. ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు వచ్చే రోడ్డును బ్లాక్ చేసిన చింతమనేని వర్గం.. టోల్ ప్లాజాకు అడ్డంగా లారీలను అడ్డు పెట్టింది. చింతమనేని అనుచరుల దౌర్జన్యంతో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.దీంతో వాహనాలు భారీగా బారులు తీరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేం ఎమ్మెల్యే చింతమనేని మనుషులంటూ.. ట్యాక్స్ ఎందుకు కట్టాలంటూ టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలంటూ పోలీసులకు కూడా చింతమనేని అనుచరులు ఎదురు ప్రశ్నలు వేశారు.ఇదీ చదవండి: రైతులకు బాబు లక్ష మోసాలు -
పక్షపాతం చూపితే ప్రశ్నిస్తాం.. కాకాణి హెచ్చరిక
సాక్షి, నెల్లూరు జిల్లా: మనుబోలులో 19 గ్రామపంచాయతీల వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కాకాణి పూజిత సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కాకాణి దిశానిర్దేశం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారంపై నేతలు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకోవద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని అధికారులను కాకాణి కోరారు.పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని డిమాండ్ చేసిన కాకాణి.. అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తే చట్టపరంగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీకి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, పారదర్శక సేవలు అందించాల్సిందేనని కాకాణి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ వర్గీయుల దాడి
పల్నాడు జిల్లా: మాచవరం ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యేసుపొంగు రామారావు, సురేశ్, నవీన్, ప్రసన్న తీవ్ర గాయాలపాలయ్యారు. టీడీపీ వర్గీయుల తీరు పట్ల వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. -
తిరువూరు టీడీపీలో మళ్లీ రాజకీయ వేడి.. కొలికపూడి తాజా పోస్టులతో కలకలం
-
కడపలో టీడీపీ క్యాడర్ కు షాక్? 100 మంది YSRCP లో చేరిక
-
టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు తెలిసే ఇదంతా జరుగుతోందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.జేసీ అరాచకాలపై అనంతపురం ఎస్పీ జగదీష్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీసిన కేతిరెడ్డి.. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరించే వారిని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ‘‘నా గన్‌మెన్‌ను ట్రాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. నా కదలికలపై జేసీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సాక్షాత్తూ పోలీసులే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కోవర్ట్‌గా మారడం దురదృష్టకరం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు.‘‘పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరించడం దుర్మార్గం. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ కల్పించలేని పోలీసులు ఎందుకు?. థర్డ్ పార్టీ విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని మాజీ కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: అమెరికా రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి మృతి -
కడప TDPలో మహిళా నేతల మధ్య వార్.. రెచ్చిపోతున్న మాధవి రెడ్డి
-
తాటతీస్తా.. టీడీపీ నేతకు కొలికపూడి వార్నింగ్
ఎన్టీఆర్ జిల్లా: తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరువూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన ప్రచారాలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోపణలు నిరూపిస్తే తలదించుకుంటానని, లేదంటే ఆరోపించిన వ్యక్తులు క్షమాపణ చెప్పాలని కొలికపూడి హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలని, తాను టీచర్‌ను తిట్టినట్టు, కొట్టినట్టు ఏవైనా సాక్ష్యాధారాలుంటే బయట పెట్టాలని కోటయ్యకు సవాల్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో రెండేళ్లుగా బాలకోటయ్య ఇష్టానుసారం మాట్లాడుతూ అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బురద చల్లితే తుడుచుకోడానికి సిద్ధంగా లేమని, తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీస్తామని, చెప్పులు కుట్టడమే కాదు, చరిత్ర రాయడం, చరిత్రను మార్చడం కూడా తమకు తెలుసని కొలికపూడి హెచ్చరించారు. -
మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
రైల్వేకోడూరు అర్బన్: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో 5వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త చీర్ల రమేష్ నాయుడు పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజులు ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాధిత బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. చీర్ల రమేష్ నాయుడు బుధవారం రాత్రి 8 గంటలకు బాలికను తన ఆటోలో తీసుకెళ్లాడు. తిరిగి ఓ గంట తరువాత ఇంటివద్ద వదిలి వెళ్లాడు. రెండు రోజులుగా బాలిక మౌనంగా ఉండడాన్ని గమనించిన తల్లి నిలదీసి అడిగింది. దీంతో రమేష్ నాయుడు తనపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక వివరించింది. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే, కార్యకర్త రమేష్ నాయుడుపై నమోదైన ఈ కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరో వైపు బాలికకు న్యాయం చేయని పక్షంలో సహించేది లేదని మహిళలు హెచ్చరిస్తున్నారు. -
కాపు నేతపై టీడీపీ మూక దాడి
సాక్షి, రాజమహేంద్రవరం : రాజకీయ పలుకుబడి, అధికారం అండతో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎదుటే విధ్వంసానికి పాల్పడుతున్నారు. కాపు నాయకుడు, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి రామదాసుపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ డిప్యూటీ మేయర్, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రాంబాబు కుమారుడు వాసిరెడ్డి బాబీ చేసిన దాడే ఇందుకు తాజా నిదర్శనం. బాబీ తన అనుచరులతో కలిసి రామదాసు ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి, పోలీసుల ఎదుటే దాడికి పాల్పడటంపై కాపు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారం అండతో టీడీపీ నాయకులు, గూండాలు కాపులపై దాడి చేస్తే సహించేదిలేదని కాపు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. రామదాసుపై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధంలేని వ్యవహారంలో దాడికి పాల్పడిన బాబీ చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి వెంకట రామదాసు కుటుంబం మోడల్ కాలనీలోని పల్లవి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తోంది. బుధవారం రామదాసు భార్య మొక్కలకు నీళ్లు పోస్తుండగా అక్కడి వాచ్‌మేన్ దురుసుగా, అనుచితంగా ప్రవర్తించడంతో రామదాసు అతన్ని చీవాట్లు పెట్టాడు. దీంతో వాచ్‌మేన్ వారితో వాగ్వాదానికి దిగాడు. అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాసిరెడ్డి బాబీ సోదరి అతనికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. సంబంధంలేని వ్యవహారమే అయినప్పటికీ బాబీ వెంటనే 15 మంది అనుచరులను వెంటేసుకుని పల్లవి ఎన్‌క్లేవ్‌లోకి చొరబడ్డాడు. వస్తూనే రామదాసుపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే రామదాసు ప్రకాశం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్లు అపార్ట్మెంట్ వద్దకు వచ్చి అడ్డగిస్తున్నప్పటికీ బాబీ, అతని అనుచరులు దాడి ఆపలేదు. రామదాసుతో పాటు అతని భార్య, వారి కుమారుడు సిద్ధార్థ, గుమాస్తా రాజుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ ప్రాంతాన్ని రణరంగంలా మార్చేశారు. గాయాలపాలైన బాధితులు ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, అక్కడికీ బాబీ, అతని అనుచరులు వచ్చి కేసు పెట్టొద్దంటూ రాద్ధాంతం చేశారు. దాడికి పాల్పడిన వాసిరెడ్డి బాబీని రూమ్‌లో కూర్చోబెట్టిన పోలీసులు.. బాధితులైన వెంకట రామదాసును, మిగిలిన వారిని రోడ్డుపైనే నిలబెట్టడం గమనార్హం. రెండ్రోజులుగా ఎవరో అనుసరిస్తున్నారు.. ఇక.. హఠాత్తుగా వచ్చి తమపై దాడిచేశారని, రెండు రోజులుగా తాను ఎక్కడికి వెళ్లినా గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని చేగొండి రామదాసు మీడియా వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణరక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోపక్క.. రాజీ చేసుకోవాలని పోలీసులు రామదాసుపై ఒత్తిడి తెస్తున్నారని తెలుసుకున్న కాపు సంఘాల నాయకులు ఆయనకు మద్దతుగా శనివారం సాయంత్రం ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చివరకు.. పోలీసులు బాబీ, అతని అనుచరులు ఐదుగురిని అరెస్టుచేశారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడితో అపార్ట్మెంట్ వాచ్‌మేన్ పోలీసుస్టేషన్‌కు వచ్చి రామదాసు, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపైనా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.ప్రభుత్వం తీరుపై కాపు సంఘాల ఆగ్రహం చేగొండి రామదాసుపై టీడీపీ గూండాలు దాడి చేయడంపై కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచీ చులకన భావనతోనే ఉందని ధ్వజమెత్తారు. కాపు సామాజికవర్గానికి చెందిన రామదాసుపై టీడీపీ గూండాలు దాడి చేసి మూడు రోజులైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. రౌడీలు, గంజాయి బ్యాచ్ రాష్ట్రంలో పేట్రేగిపోతున్నారని, మాజీ హోంమంత్రి కుమారుడికే రాష్ట్రంలో రక్షణ లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో టీడీపీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాపులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కాపు సంఘాల నాయకులు ఆందోళన చేశారు. -
ఆగని ఆగడాలు.. కనీవినీ ఎరు‘గని’ దోపిడీ
చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇష్టారీతిన మట్టి, గ్రావెల్, ఇసుక, సహజ వనరుల దోపిడీకి తెగబడుతోంది. కొండలనూ కబళిస్తోంది. గుల్లచేసి సొమ్ము చేసుకుంటోంది. విలువైన ఖనిజాలను కబళిస్తోంది. ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా సాగుతున్న ఈ అరాచకపర్వం ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే సాగుతోంది. ఈ దందాకు సర్కారు పెద్దల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఫలితంగా కొండలు కుదేలవుతున్నాయి. నదీగర్భాలకు తూట్లు పడుతున్నాయి. తాజాగా చీరాల నియోజకవర్గంలో సాగుతున్న ఇసుక దందాపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా అధికార పార్టీ నేతల ఆగడాలు ఆగలేదు. అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి.సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనే టీడీపీ నేతలు మైనింగ్‌కు తెగబడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కృష్ణానదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. డ్రెడ్జింగ్ పడవలతో నదీగర్భానికి తూట్లు పొడుస్తున్నారు. రాత్రీపగలూ తేడాలేకుండా తవ్వకాలు చేస్తున్నారు. సేకరించిన ఇసుకను పలుచోట్ల డంపుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రాజధాని నిర్మాణాల పేరుతోనూ ఇసుక దోపిడీకి తెగబడుతున్నారు. తాడికొండ నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. రాజధాని నిర్మాణాల పేరిట టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుండడంతో చేష్టలుడిగి చూస్తున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో అక్రమార్కులు కొండలను గుల్ల చేసి గ్రావెల్, కంకర యథేచ్ఛగా దోచుకుంటున్నారు. పట్టా భూముల్లోనూ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుల ఆధ్వర్యంలోనే యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. రీచ్‌లలో పాగా వేసి రాత్రీపగలూ ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుల దందా సాగుతోంది. పంట భూములను కబళించి యథేచ్ఛగా మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల నియోజవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలో మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. గ్రావెల్, మట్టి అక్రమంగా తరలిపోతోంది. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క క్వారీ నుంచి రోజుకు రూ.30 లక్షలకుపైగా మట్టి, గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. ఈ ఒక్క నియోజవకర్గంలోనే రోజుకు రూ.పది కోట్ల మేర అక్రమ సొమ్మును టీడీపీ నేతలు జేబుల్లో వేసుకుంటున్నారని సమాచారం. ఈ దందా అంతా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ కన్నుసన్నల్లోనే సాగుతోంది. పల్నాడు జిల్లా బీరవల్లిపాయ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు.... పెన్నాకు తూట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడట్టకూడదని నిషేధం ఉన్నా..భారీ యంత్రాలతో నదీగర్భాన్ని కుళ్లబొడుస్తున్నారు. దీంతో సోమశిల ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రాజెక్టు సున్నిత ప్రాంతంలోనూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించడం ఆందోళన కలిగిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి షాడో ఎమ్మెల్యేగా మారి దందా సాగిస్తున్నట్టు సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక అనుచరుడే ఇసుక దందా సాగిస్తున్నారు. ఒక్క పీకేపాడులోనే నెలకు రూ.వంద కోట్ల ఇసుక దోపిడీకి తెగబడినట్టు సమాచారం. నెల్లూరు పెన్నాబ్యారేజీ, సంగం బ్యారేజీ వద్ద కూడా డీసిల్టింగ్ పేరుతో యథేచ్ఛగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. ⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మార్కాపురం జిల్లాలో పేదలు, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లోనూ అక్రమ తవ్వకాలకు బరితెగించడం గమనార్హం. దర్శి మండలంలో ఎర్రమట్టి అక్రమ రవాణాతో నెలకు రూ.రెండు కోట్ల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూరు నియోజకవర్గంలోని పాలేరు, ఉప్పుటేరు, మున్నేరు తదితర నదులను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. గోదావరి ఘోష తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతల తవ్వకాలతో గోదారమ్మ నదీగర్భానికి భారీగా తూట్లు పడుతున్నాయి. ఇసుక రాత్రీపగలూ తేడా లేకుండా భారీగా తరలిపోతోంది. ప్రతి ఇసుక లారీకీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి రూ.2 వేలు చొప్పున చెల్లించాల్సిందేనని ర్యాంపుల నిర్వాహకులు బహిరంగంగానే ఇక్కడ చెబుతుండడం గమనార్హం. కాతేరులోనూ టీడీపీ ఎమ్మెల్యే కన్నసన్నల్లోనే దందా సాగుతోంది. ⇒ కాకినాడ జిల్లా పెద్దాపురం మైనింగ్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రెండు నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉన్న రామేశంమెట్టను గ్రావెల్ కోసం అక్రమార్కులు తవ్వేస్తున్నారు. తుని మండలం లోవ కొత్తూరులో పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకంలో ఏర్పడిన మట్టి గుట్టలను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ⇒ ఏలూరు జిల్లాలో మట్టి అక్రమ రవాణా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో తమ్మిలేరులో అక్రమ రవాణా నిలిచిపోవడంతో మెట్ట ప్రాంతంలో మట్టి దందాకు తెరలేపారు. పోలవరం నియోజకవర్గంలో జనసేన నేతలు మట్టిని పొక్లెయిన్లతో అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. నెల్లూరు వేంకటేశ్వరపురం వద్ద పెన్నా నదిలో బ్రిడ్జికి సమీపంలోనే ఇసుకను అక్రమంగా తోడేస్తున్న దృశ్యం ఉత్తరాంధ్రలో గ్రానైట్, తెల్లరాయి, నల్ల ఇసుక దందా శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టెక్కలిలో నీలి గ్రానైట్‌కు డిమాండ్ బాగుండడంతో టీడీపీ నేతలు యథేచ్ఛగా కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక నేత సోదరుడు ఆయన కుమారుడు అండతో అక్రమ గ్రానైట్ తవ్వకాలు, తరలింపు సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలో రాత్రి వేళ నల్ల ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలోనూ గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పెందుర్తి మండలం దువ్వపాలెంలో తెల్లరాయి మెటల్ కొండను పూర్తిగా తొలిచేశారు. దీంతో రాళ్లు కూలిపోతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అనుచరగణం రోజూ రూ.లక్షల విలువైన మట్టి దోచేస్తున్నారు. ఎస్‌ఆర్‌పురంలోని తెల్లరాయిమెటల్ని జనసేన నాయకులు అక్రమంగా తరలించేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోనూ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పలు మండలాల్లో అక్రమ గ్రావెల్ క్వారీయింగ్ చేస్తున్నారు. యలమంచిలి నియోజక వర్గంలోని అచ్యుతాపురం అందలాపల్లి కొండపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీయింగ్ జరుగుతోంది. అలూరి సీతారామరాజు మన్యం జిల్లాలోనూ పపలు గెడ్డలలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. అమరావతి పరిధిలో యథేచ్ఛగా కృష్ణా నదిలో ఇసుక డ్రెడ్జింగ్ సాగుతోందిలా... రాయలసీమలో టీడీపీ నేతల జేబుల్లోకి ఖనిజ సంపద రాయలసీమలో టీడీపీ నేతలు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. కొండలను కొల్లగొట్టేస్తున్నారు. విలువైన ఖనిజ సంపదను రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో యథేచ్ఛగా అక్రమ క్వారీలను నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో బెరైటీస్ నిక్షేపాల ద్వారా రూ.వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్ పెద్ద ఎత్తున కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు తరలిపోతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రానైట్‌తోపాటు కంకర క్వారీయింగ్ అక్రమంగా సాగుతోంది. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో మైకా, క్వార్‌ట్టŠజ్ తదితర విలువైన ఖనిజాల దోపిడీ సాగుతోంది. -
రూ.9 లక్షల డొల్ల కంపెనీకి రూ.1400 కోట్ల ప్రాజెక్టా?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తమ అనుయాయులకు, బినామీ కంపెనీలకు అడ్డగోలుగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వడమే కాకుండా, పలు రాయితీల రూపంలో వందల కోట్లు దోచిపెడుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు.గతంలో విశాఖపట్నంలో ఉర్సా లాంటి డొల్ల కంపెనీకి రూపాయికే ఎకరం చొప్పున భూములు కట్టబెట్టిన తరహాలోనే, ఇప్పుడు రాయలసీమలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మరో భారీ దోపిడీకి తెర లేపారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు. ప్రెస్మీట్లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..:బినామీ సంస్థలకు ప్రజా ఆస్తులు:ఏర్పాటై ఏడాది కూడా పూర్తి కాని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎలాంటి అనుభవం లేని, కేవలం రూ.9 లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో రిజిస్టర్ అయిన సంస్థకు ఏకంగా రూ.1388.14 కోట్ల ప్రాజెక్టు ఆపాదించారు. ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ఏపీఐఐసీకి చెందిన విలువైన 40.50 ఎకరాల భూమితో పాటు, రూ.592.22 కోట్ల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లను జీవో ఎంఎస్ 259 ద్వారా ధారాదత్తం చేశారు. అలా తమ వారి లబ్ధి కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బినామీ సంస్థలకు ప్రజల ఆస్తులను యథేచ్ఛగా దోచిపెడుతున్నారు.రూ.9 లక్షల కంపెనీకి రూ.1400 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఎక్కడిది?:గత ఏడాది నవంబరు 20న ప్రారంభమైన రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం రూ. 9 లక్షలు మాత్రమేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) రికార్డులే చెబుతున్నాయి. కనీసం రూ.2.5 లక్షల రుణం పొందే అర్హత కూడా లేని ఈ పసిగుడ్డు కంపెనీ ఏకంగా రూ.1388.14 కోట్ల పెట్టుబడి పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఈ కంపెనీ వెనుక ఉండి నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్న బడా బాబులు ఎవరు? కేవలం పేపర్ మీద కంపెనీ పెట్టి, ప్రభుత్వ భూములు చేజిక్కించుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పారిపోయే కుట్ర కాదా ఇది?సర్జికల్ గ్లౌజులు చేసే వారికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది?:ఈ సంస్థ డైరెక్టర్లకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీస అనుభవం ఉందా? వీరికున్న మరో కంపెనీ ఈజిస్ గ్లోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం ఏఎంటీజెడ్‌లో సర్జికల్ హ్యాండ్ గ్లౌజులు తయారు చేస్తుంది. గ్లౌజులు తయారు చేసే వారికి, టమోటా, మామిడి ప్రాసెసింగ్ చేసే అనుభవం ఎలా ఆపాదించారు? పైగా వీళ్ల అనుబంధ సంస్థ ’దిసూత్ర ల్యాబ్స్’ను, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభించారు.జీవోకు ముందే రూ.1090 కోట్ల మెషినరీ ఆర్డర్లు ఎలా ఇచ్చారు?:ఈ కంపెనీకి భూకేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు గత నెల జారీ అయ్యాయి. ఆ మేరకు జీఓ ఎంఎస్ నెం:259ని సెప్టెంబరు 25న జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన తొలుత సెప్టెంబరు 7న జరిగిన ఎస్ఐపీసీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలోనూ, ఆ తర్వాత 11 రోజుల అనంతరం, సెప్టెంబరు 18న జరిగిన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో వచ్చింది. కాగా, అప్పటికే దాదాపు రెండు నెలల ముందే జూలై 1 నాటికే ఆ సంస్థ రూ.1090 కోట్ల విలువైన ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్డర్ ప్లేస్ చేసింది! నిజంగా ఆ కంపెనీకి అంత ఆర్థిక స్థోమత ఉందా? అదే నిజమైతే అంత తక్కువ మూలధన పెట్టుబడి మాత్రమే పెడతారా? లేక ఇదంతా ముందస్తు కుమ్మక్కు కాదా?రూ.592 కోట్ల ఇన్సెంటివ్ ఎవరి జేబుల్లోకి?:రూ.1388 కోట్ల ప్రాజెక్టు విలువలో ఏకంగా 46.61 శాతం, అంటే రూ.592.22 కోట్లను టైలర్ మేడ్ ఇన్సెంటివ్లుగా ప్రకటించడం విడ్డూరం కాదా? కేవలం రూ.9 లక్షల మూలధన పెట్టుబడి ఉన్న కంపెనీకి రూ.592 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా?. ఇలా 40.50 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడమే కాకుండా, వివిధ రూపాల్లో మరో రూ.592 కోట్లు ప్రభుత్వం నుంచే దోచి పెడుతుంటే ఇది బినామీ దందా కాక మరేమిటని పుత్తా శివశంకర్ నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్ -
యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?
దేశంలోని ఎన్డీఏ రాష్ట్రాలలో ఉమ్మడి పౌర స్మృతి(యూనిఫాం సివిల్ కోడ్)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం కొత్త వివాదం అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీ(యు) ఈ ప్రతిపాదనకు ఓకే చేస్తున్నా, బిహారులో మాత్రం అమలు చేయరాదని డిమాండ్ చేస్తోంది. అలాగే మరికొన్ని ఎన్డీఏ పక్షాలు కూడా ఈ ప్రతిపాదనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అమిత్ షా ప్రకటనతో ఇబ్బందిలో పడిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడానికే సిద్దపడుతున్నట్లు కనబడుతోంది.ఒకప్పుడు తలాఖ్ చట్టాన్నే వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు యూసీసీకి మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు దీనిపై నేరుగా వ్యాఖ్య చేయనప్పటికీ , ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చాలా స్పష్టంగా అమిత్ షా ప్రకటన మేరకు నడుచుకుంటామని తెలిపారు. నిజానికి దేశం అంతటికి కలిపి పార్లమెంటులో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు పెట్టవలసి ఉంటుంది. కాని బీజేపీ అందుకు సిద్దపడడం లేదు. రాష్ట్రాలవారీగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ఉంది.ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడంలో తప్పేముంది? దేశంలో ఉన్న పౌరులందరికి సమానమైన నియమ, నిబంధనలు పెట్టడం మంచిదే కదా అన్న అభిప్రాయం కలగడం సహజమే. ప్రత్యేకించి వ్యక్తిగత విషయాలైన పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం తదితర అంశాలలో యూసీసీ తీసుకువస్తామని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెబుతోంది. 2014 నుంచి బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కూడా వివిధ కారణాలతో ఈ ప్రతిపాదనను అమలు చేయలేకపోయింది. అయితే గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ యూసీసీని అమలు చేయడం ఆరంభించింది. ఇందులో ఉన్న అంశాలలో ప్రజలకు మేలు చేసేవి అయితే స్వాగతించవలసిందే. ఉదాహరణకు ఆయా విషయాలలో అన్ని మతాలలోని మహిళలకు సమానత్వం కల్పించడం మంచిదే. కాని ఇది అన్ని మతాలలో ఒకే విధంగా ఉండాలి. కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి ఈ చట్టం తెస్తున్నారన్న భావన కలగనివ్వరాదు.బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సీఎఎ, త్రిబుల్ తలాఖ్ తదితర చట్టాలను తెచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది రాలేదు. ప్రత్యేకించి త్రిబుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని చాలామంది భావించారు. కాని ముస్లిం సమాజంలో కొంతమంది వ్యతిరేకించారు. బీజేపీ హిందూ మతాన్ని ఏకీకృతం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తోందన్నది కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాల విమర్శ. అయినప్పటికీ, బీజేపీ చిత్తశుద్దితో అందరిని సమానంగా చూసే చట్టాలు తెస్తే తప్పు లేదు. కాని అనేక మతపరమైన విషయాలలో బీజేపీ అనుసరిస్తున్న విధానం అంత సమర్ధనీయంగా లేదన్నది బుద్దిజీవుల భావన.గోవాలో అమలు చేస్తున్న యూసీసీపై పలువురు తమ అసమ్మతి తెలియచేస్తున్నారు. అందులో పురుషాధిక్యతను చాటే విధంగా నిబంధనలు రూపొందించారన్నది ఆరోపణ. అలాగే వివిధ మతాలలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గౌరవించకపోతే సమాజంలో అశాంతి ప్రబలే ప్రమాదం ఉంటుంది. అన్ని మతాలవారిని ఒప్పించి ఇలాంటివాటిని తేగలిగితే బాగుంటుంది. కాని అది అంత తేలిక కాదు. ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ చేసిన యూసీసీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఈ యూసీసీని అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక దానిని అమలు చేయరు.పైగా మైనార్టీలు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో వారి మనోభావాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ భావిస్తుంది. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితి కొనసాగవచ్చు. బీజేపీ కనుక పవర్లోకి వస్తే అప్పుడు యూసీసీ అమలు ప్రతిపాదన ముందుకు రావచ్చు. అయితే అంతకుముందు ఎన్నికల మానిఫెస్టోలో ఈ అంశం చేర్చుతారా? లేదా? అన్నది చెప్పలేం.ఇక ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వానికి ఈ అంశం ఇబ్బంది కలిగించేదే. బీజేపీతో స్నేహం తప్పనిసరి కనుక కేంద్రంలోని ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్లు తెలుగుదేశం, జనసేన కూడా వినకతప్పదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన గత ఐదేళ్లుగా బీజేపీ విధానాలకు వంతపాడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎటువచ్చి తెలుగుదేశం పార్టీకే కొంత సమస్య అవుతుంది. ఒకప్పుడు ఈ విషయంలో బీజేపీపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ తెచ్చిన త్రిబుల్ తలాఖ్ చట్టాన్నే ఈయన వ్యతిరేకించారు. 2019లో బీజేపీ మళ్లీ గెలిస్తే ముస్లింలకు రక్షణ ఉండదని విమర్శించేవారు. కాని ఆ తర్వాత పరిణామాలలో 2024లో అధికారంలోకి రావడానికి బిజెపి అవసరం తప్పనిసరి అని గుర్తించి మెల్లగా ప్లాన్ మార్చేసుకున్నారు. ఎలాగైతేనేం మళ్లీ అధికారంలోకి రాగలిగారు. తదుపరి ప్రధాని మోదీని విపరీతంగా పొగడడం ఆరంభించారు. బీజేపీకన్నా తాము మతవాదంలో తక్కువేం కాదన్న చందంగా వ్యవహరించడం ఆరంభించారు.ఇదీ చదవండి: బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, ముస్లింల హక్కులకు భంగం కలిగితే ఒప్పుకోబోమని అనేవారు. కాని ఇప్పుడు ఆ మాట కూడా అనలేని పరిస్థితి ఏర్పడినట్లు ఉంది. యూసీసీని అంగీకరించబోమని గతంలో చంద్రబాబు అన్నారు. కాని పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం అమిత్ షా ప్రకటనను సమర్ధించడంతో టీడీపీ యూటర్న్ తీసుకున్నట్లయింది. దేశ సమైక్యతకోసం యూసీసీని బలపరుస్తామని ఆయన అన్నారు. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించారో చెప్పలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో ఎంత బలహీనంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. బిహార్ వంటి రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయు, లోక్ జనశక్తి పార్టీలోని రెండు వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. కాని టీడీపీ ఏపీ అధ్యక్షుడు మాత్రం పూర్తిగా సరెండర్ అయిపోయిన విధంగా మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతానికి దీనిపై చర్చ జరగలేదని అన్నారు.వివిధ రాష్ట్రాలలో పలు రకాలు సంస్కృతులు ఉంటాయి. అలాగే ఆచారాలు ఉంటాయి. మతాలలోని అనాచారాలను సంస్కరించడం, మహిళలకు సమాన గౌరవం ఇవ్వడం వంటివి చేయడం స్వాగతించదగినవే. కాని బీజేపీ అధినేతలు ఆయా సందర్భాలలో మతాన్ని తమ రాజకీయం కోసం వాడుకుంటున్నారన్న విమర్శ ఎక్కువగా ఉంది. చివరికి ప్రధాని సైతం మత ఆధారిత ప్రసంగాలు చేస్తుంటారు. అందువల్లే వారి చిత్తశుద్దిపై సందేహాలు వస్తున్నాయి. కాకపోతే టీడీపీ వంటి పార్టీలు యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏపీలో ఈ ప్రతిపాదన అమలు చేస్తారో చెప్పలేం కాని, అదే జరిగితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటారు. ఏపీలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరిగి, తెలంగాణలో అమలు కాకపోతే ఒక విభిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ముగ్గురం కలవడం వల్లే.. చంద్రబాబు సీఎం: అయ్యన్న
విశాఖపట్నం జిల్లా: ‘గత సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురం కలవడం(టీడీపీ, బీజేపీ, జనసేన) వల్లే కదా ప్రభుత్వం వచ్చింది.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మరి వచ్చే పంచాయతీ, మండల ఎలక్షన్స్‌లో కూడా వాళ్లకి టికెట్లు ఇవ్వాలి కదా.. అది ధర్మం కదా’ అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో శుక్రవారం జరిగిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలంలో ఉన్న 31 పంచాయతీల్లో కొన్ని జనసేన, బీజేపీలకు ఇచ్చేస్తున్నానని చెప్పారు. మిగిలినవి తెలుగుదేశం పార్టీ వారికి ఇద్దామన్నారు. ఏ పార్టీకి ఎక్కడ ఇస్తానో ఏంటో తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా క్యాడర్ సిద్ధం కావాలని, ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో తెలియదన్నారు. ఇదీ చదవండి: 10 నెలల కంపెనీకి.. ఫ్రీగా 40 ఎకరాల భూమి -
చట్టం.. వీరికి చుట్టమా..?
అనంతపురం క్రైం: ఫేక్ డాక్యుమెంట్లతో రిజి ్రస్టేషన్.. ఆస్తిపై హక్కు.. ఆపై బెదిరింపుల ఆరోపణల కేసులో ఆ ఇద్దరు నిందితులు. అయితే వీరు అనంతపురం అర్బన్ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధికి బంధువులు. ఒకరు సోదరుడు, మరొకరు బావమరిది అవుతారు. అయితే వారిని అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు మినహాయింపు ఇచ్చారు. వారి జాడ లేదని న్యాయస్థానానికి విన్నవించారు. వాస్తవానికి ఆ ఇద్దరూ అధికార తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నగరపాలక సంస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ బహిరంగంగానే తిరుగుతున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు.. చట్టం సామాన్యులకే కానీ.. అధికార పార్టీ వారికి వర్తించదేమోనని చర్చించుకుంటున్నారు. అసలు కేసు ఏంటంటే.. అనంతపురం శారదా నగర్‌లోని డోర్ నంబర్ 28–3–535 వద్ద 2025 డిసెంబరు 20న జరిగిన ఘటనకు సంబంధించి గడ్డం సాయి మనోహర్ ఫిర్యాదుతో అదే నెల 25న వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో క్రైం నంబర్ 359/2025 కింద కేసు నమోదైంది. హైకోర్టు ఉత్తర్వుల్లో నమోదైన ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. మృతి చెందిన డాక్టర్ ఎస్.కనకదుర్గ పేరుతో 2025 జూలై 1వ తేదీతో విల్లు సృష్టించారు. దాని ఆధారంగా అధికారపత్రం రూపొందించి.. తద్వారా రిజిస్ట్రేషన్ చేయించి, అలా ఆస్తిపై హక్కు పొందేందుకు ప్రయత్నించారు. ఫోర్జరీ ద్వారా మోసం, అక్రమ ప్రవేశం, ఆస్తికి నష్టం, బెదిరింపులకు సంబంధించిన నేరాల కింద పలువురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కీలక పరిణామం ఈ కేసులో మరో కీలక పరిణామం దర్యాప్తు సమయంలో చోటుచేసుకుంది. తొలుత నమోదైన ఫిర్యాదులో పేర్లు లేని బోయపాటి శివరామ్ అలియాస్ అశోక్, పోలూరు నాగ సుందర్‌కుమార్ అలియాస్ సుందర్‌ను.. దర్యాప్తులో సేకరించిన సమాచారం ఆధారంగా ఏ9, ఏ10 నిందితులుగా చేర్చినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇందులో ఏ7 నుంచి ఏ10 వరకు ఉన్న నలుగురు నిందితులు పర్యవేక్షణ లేని భూములను గుర్తించి, నకిలీ పత్రాల ద్వారా వాటిపై హక్కులు సృష్టించి, తద్వారా మోసం చేసి ఆర్థిక లాభం పొందే వారని పేర్కొన్నారు. నిందితుల తరఫు న్యాయవాది మాత్రం వారికి నేరంతో సంబంధం లేదని వాదించారు. వారు కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ విద్యావంతులని నివేదించారు. అక్కడితో విషయం ఆగలేదు. ఏ9, ఏ10గా ఉన్న అశోక్, సుందర్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడం లేదా ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు 2026 మార్చి 11న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సదరు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు ‘జాడ కనిపించలేదని’ మిన్నకుండిపోయారు.సాక్షులను ప్రభావితం చేయరా..? ఫేక్ డాక్యుమెంట్లతో ఆస్తి దక్కించుకునే ప్రయత్నం చేసిన కేసులో ఏ–9, ఏ–10 నిందితులుగా ఉన్న అశోక్, సుందర్ నగరంలో బహిరంగంగా తిరుగుతున్నారు. ప్రభుత్వ, నగరపాలక సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నగరపాలక సంస్థ పనులు, టెండర్లు, ఇతర వ్యవహారాల్లోనూ కల్పించుకుంటున్నారు. ఇది అందరికీ కనిపిస్తున్న పోలీసులకు మాత్రం కన్పించడం లేదు. ఇలా అయితే సదరు నిందితులు.. కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం.. ఆధారాలను తారుమారు చేసే ప్రమాదమూ ఉంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ముఖ్యప్రజాప్రతినిధి ఈ కేసు విషయంలో నిందితులుగా ఉన్న తన సోదరుడు, బావమరిది అరెస్టు కాకుండా రక్షణ కవచంగా నిలిచారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రమైన నేరారోపణలు నమోదైనప్పుడు వారిని చట్ట ప్రక్రియకు పూర్తిగా సహకరించేలా చేయడం ప్రజాప్రతినిధి నైతిక బాధ్యత అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. నిందితుల అరెస్టులో జాప్యంపై ఎస్పీ జగదీ‹Ùను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
కరువు వేళ ఈవెంట్లు కాదు.. రైతులను ఆదుకోండి..
సాక్షి, తాడేపల్లి: రాయలసీమ తీవ్ర కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ఈవెంట్లతో కాలం గడుపుతున్నారని.. ‘రైజింగ్ రాయలసీమ’ ఈవెంట్లు ఎవరి కోసం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుకు కావాల్సింది ఈవెంట్లు, పబ్లిసిటీ కాదు.. కష్టకాలంలో ప్రభుత్వ భరోసా. రైతులకు తక్షణమే రుణాల రీ షెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించాలి’’ అని డిమాండ్ చేశారు.‘‘కేవలం 388 మండలాలకే కరువు పరిమితం చేయడం అన్యాయం. వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హమైన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. జూన్ నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నా సెప్టెంబరు చివరి వరకు కరువు ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు?. వేల ఎకరాల్లో చీనీ సహా పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. రైతులు లక్షలు ఖర్చుపెట్టి కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టమోటా, అరటి, బత్తాయి, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఈ రెండేళ్లలో ఉద్యాన రంగానికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే ఇప్పుడు ‘హబ్‌లు ఏర్పాటు చేస్తాం’ అంటూ కొత్త ప్రకటనలు చేయడం వల్ల రైతుకు తక్షణ ప్రయోజనం ఏమిటి?. గతంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రచారం చేశారు. ప్రకటించిన వాటిలో ఎన్ని ప్రాజెక్టులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’ అని పొగిడే వారు ఒక్కసారి రాయలసీమలో ఎండిపోయిన పొలాలు, రైతుల కష్టాలను చూడాలి. విశాఖకు తన ప్రార్థనల వల్లే వర్షం వచ్చిందని చంద్రబాబు చెప్పుకున్నారు. అదే నిజమైతే నాలుగు నెలల ముందే ప్రార్థించి కరువును ఎందుకు నివారించలేకపోయారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఇప్పుడు ‘రోడ్డు డాక్టర్లు’ అంటున్నారు.. ముందు ‘కరువు డాక్టర్లను’ తీసుకొచ్చి రైతులను దుర్భిక్షం నుంచి బయటపడేయండి. ఈవెంట్లతో కరువు పోదు.. పబ్లిసిటీతో రైతు కష్టాలు తీరవు. ‘రైజింగ్ రాయలసీమ’ అని పేరు పెట్టడం కాదు.. కరువుతో కుంగిపోతున్న రాయలసీమ రైతును కాపాడండి’’ అని కన్నబాబు హితవు పలికారు.‘‘మదనపల్లెలో సీఎం చంద్రబాబు మొదలుకాని సినిమాకే విజయోత్సవ సభ నిర్వహించారు. ప్రచారం తప్ప పని చేయకుండా తనకు తానే డబ్బా కొట్టుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. మదనపల్లెలో ప్రకటించింది లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కాదు... లక్ష అబద్ధాల ప్రభుత్వం. పంటలు, తోటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే హార్టికల్చర్ హబ్ పేరిట సంబరాలు జరుపుతారా?. వ్యవసాయాన్ని గబ్బు పట్టించి, ఇప్పుడు హబ్లంటూ సరికొత్త విన్యాసాలు చేస్తున్నారు...గతంలో అమరావతికి హైపర్‌లూప్, బుల్లెట్ ట్రైన్, మెట్రో, సీ-ప్లేన్ అన్నట్లే ఇదీ ఒక పిట్టల దొర కథ. లాక్‌హీడ్ ప్లాంట్, సౌదీ అరాంకో, ఎయిర్‌బస్, అలీబాబా డేటా సెంటర్ తరహాలోనే ఈ హబ్ ప్రచారం కూడా గాల్లో కలిసిపోతుంది. రోజూ మాటలు, ఈవెంట్లతో ప్రజలను మభ్యపెట్టడమే కూటమి ప్రభుత్వ నైజం. 2026-27 బడ్జెట్లో హార్టికల్చర్ శాఖకు కేటాయించింది కేవలం రూ. 1,123 కోట్లే. లక్ష కోట్ల ప్రాజెక్టు అని ప్రచారం చేసుకుంటున్న హబ్‌కు బడ్జెట్లో పెట్టింది కేవలం రూ. 200 కోట్లా?. హబ్‌లో రూ. 60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు ఎవరు పెడుతున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం -
నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత
-
తెలిసే వంచన!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు మరోమారు వెన్నుపోటు రుచి చూపించారు. 34 శాతం రిజర్వేషన్లు కోర్టుల ముందు నిలబడవని తెలిసీ దారుణంగా వంచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు మొక్కు బడిగా కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేయడంతో బాబు బండారం బట్టబయలైంది. కేవలం జీవో ఇచ్చి ఊరుకుంటే కోర్టులు కొట్టేస్తాయని ఆయనకు తెలుసు. రిజర్వేషన్లు 50శాతం దాటరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు తీర్పులిచ్చిన సంగతీ చంద్రబాబుకు తెలుసు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. కేంద్రంలో టీడీపీ బలంపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ కేంద్రంపై వత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేయించే పని చేయకుండా ఓ జీవో ఇచ్చి బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ కురిపించారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే హైకోర్టు ఆ జీవోను కొట్టేసింది. అలా బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలో మరో అంకం పూర్తయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని ఆయన అంటున్నారు. డ్రామాలో ఇది ఇంకొక అంకం. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ డ్రామాను మరికొన్ని రోజులు నడిపించవచ్చు. బీసీల కోసం చంద్రబాబు నిజంగా ప్రయత్నిస్తున్నాడని కొంతమందినైనా నమ్మించవచ్చు. కానీ చంద్రబాబు ఆడుతున్న నాటకం బీసీలకు అర్థమయ్యింది. తమకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబులో ఏ కోశానా కనిపించడంలేదని వారు మండిపడుతున్నారు. టీడీపీ బలంపై కేంద్రప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయడానికి ఇదో మంచి అవకాశమని అందరూ భావిస్తున్నారు. కానీ చంద్రబాబులో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్తామంటూనే, మరోవైపు అన్ని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారు. బీసీల కోసం కేంద్రంపై ఒత్తిడి చేసిందెక్కడ? వాస్తవానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చట్టం ఏం చెబుతోంది.. సుప్రీంకోర్టు తీర్పులు ఏమంటున్నాయి.. అన్న విషయాలు తెలుసుకోకుండానే ఆయన ఈ హామీని ఇచ్చారని అనుకోవడానికి వీలేలేదు. బీసీల పట్ల నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రంలో తనకున్న పలుకుబడిని, కేంద్రం తమపై ఆధారపడి ఉన్న పరిస్థితిని ఉపయోగించుకుని బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చేందుకు ప్రయత్నించొచ్చు. నెలనెలా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే చంద్రబాబు, ఏ రోజు కూడా బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించిన దాఖలాల్లేవు. కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే రూ.4వేల పెన్షన్ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్లలో బీసీ లకు సబ్‌ప్లాన్ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్‌మెడల్ హోల్డరని.మోసాన్ని దాచి ప్రతిపక్షంపై విమర్శలు బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వాళ్లే హైకోర్టులో కేసులు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారనే అబద్ధాలతో కొత్త డ్రామాలకు తెరతీశారు. వాస్తవానికి ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ముగిసిన తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత స్థానిక సంస్థలను నిర్వహించాలని మాత్రమే వైఎస్సార్సీపీ హైకోర్టును కోరింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరలేదు. అయితే చంద్రబాబు మాత్రం రిజర్వేషన్ల వైఫల్యాన్ని వైఎస్సార్సీపీకి ముడిపెట్టి ప్రతిపక్షాన్నే నిందిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను గతంలో అడ్డుకున్నది చంద్రబాబే.. 2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28నే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాపరెడ్డి ఓ నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పారీ్టలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..? చేతులు దులుపుకునేందుకే సుప్రీంకోర్టుకు అప్పీలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేస్తూ తీర్పునివ్వడంతో దానిపై సుప్రీంకోర్టుకెళతామని చంద్రబాబు ప్రకటించేశారు. తద్వారా త్వరగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసి, అంతే త్వరగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సబబు కాదని చెప్పించాలన్నదే ఆయన వ్యూహం. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించిన ఏ కేసులో కూడా సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను సమర్థించిన దాఖలాలే లేవు. ఇదే పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు చేసిన రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటినప్పుడు అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పుల ఆధారంగానే ఇపుడు ఏపీ హైకోర్టు కూడా బీసీలకిచ్చిన 34 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మళ్లీ వెళ్లినా కూడా ఏం జరుగుతుంది? గతంలో ఇచ్చిన తీర్పునే ఇస్తుంది. ఈ విషయం తెలిసీ కాలయాపన కోసమే చంద్రబాబు డ్రామాలు... రిజర్వేషన్లను కోర్టులు కొట్టేశాయి కాబట్టే, తానేం చేయలేకపోతున్నానని బీసీలను వంచించేందుకు చంద్రబాబు నాటకాలు.. వాస్తవానికి హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. అయితే సుప్రీంకోర్టుకెళ్లడానికి ముందే నోటిఫికేషన్ ఇస్తే, వంచన బయటపడుతుందన్న భయంతో ఆ పని చేయకుండా ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు ఆపారని అధికారవర్గాల్లో వినిపిస్తోంది. బాబు సర్కార్ తీరును అనుమానించిన హైకోర్టు... అసలు రాజీవ్ రంజన్ మిశ్రా క్షేత్రస్థాయిలో బీసీల గురించి ఎలాంటి సర్వే చేయలేదు. బీసీ స్థితిగతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కోర్టుకు మాత్రం కమిషన్ నివేదిక, సిఫారసుల మేరకే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన హైకోర్టు, రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కంగుతిన్న చంద్రబాబు ప్రభుత్వం విధి లేని పరిస్థితుల్లో కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టుకు, ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని గ్రహించింది. దీంతో ఎలాంటి శాస్త్రీయ సర్వే లేకుండా, బీసీల స్థితిగతులను తెలుసుకోకుండా వారికి నామమాత్రంగా, మొక్కుబడిగా ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను కొట్టేసింది. అసలు కమిషన్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. దాన్ని అత్యంత రహస్యంగా ఉంచింది. నివేదికను ఎందుకు బహిర్గతం చేయడంలేదని హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకోలేదు. బీసీ రిజర్వేషన్లపై ఎప్పడు ఏం జరిగిందంటే.. ⇒ 2019 డిసెంబర్ 28: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ 176 ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకుడు బిర్రుప్రతాపరెడ్డి చేత చంద్రబాబు కేసువేయించారు. ⇒ 2020 మార్చి 2: బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌తో మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు అవుతాయని ఆ జీఓను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ⇒ 2021 మార్చి 4: వికాస్ కిషన్‌రావు గవాలి తీర్పులో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు మూడు అంశాలు(ట్రిపుల్ టెస్ట్)ను స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ⇒ 2026 ఆగస్టు 20: స్థానిక సంస్థలైన గ్రామాల్లో 34 శాతం(జీఓ105), పట్టణాల్లో 33.33 శాతం(జీఓ 1065) ద్వారా బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వం జీఓలు ఇచ్చింది. ⇒ 2026 సెప్టెంబర్: 34 శాతం నిర్ణయానికి ఆధారమైన గణాంకాలు, కమిషన్ నివేదిక, చట్టపరమైన ప్రాతిపదికను ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ⇒ 2026 అక్టోబర్ 1: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. బాబుకు గుణపాఠం చెప్పడం ఖాయం చట్టబద్ధత లేకుండా తెచ్చిన జీవోలు హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు కుటిల నైజం మరోసారి బట్టబయలైంది. యావత్ బీసీ సమాజానికి చంద్రబాబు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో బాబుకు బీసీ సమాజం గుణపాఠం చెప్పడం ఖాయం. – చెల్లుబోయిన వేణు, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి బాబు కల్లిబొల్లి మాటలు బీసీలు నమ్మరు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. బీసీలను అణగదొక్కేందుకు రిజర్వేషన్ల పేరిట రాజకీయ కుట్రకు తెరతీశారు. బాబు చెప్పే కల్లిబొల్లి మాటలు, అబద్ధపు జీవోలతో బీసీలను మరోసారి మోసం చేయలేరు. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ మోసకారితనం బట్టబయలైంది బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసి బాబు ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేసింది. ఇదంతా బీసీలను దగా చేయడానికి చంద్రబాబు ఆడిన నాటకం. బాబు ప్రభుత్వ మోసకారి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. – వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిచిత్తశుద్ధి లేదని రుజువైంది బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రుజువైంది. ‘మేము ఇవ్వాలనుకున్నాం.. కానీ కోర్టు కొట్టేసింది’ అనే సాకుతో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. ఇకనైనా బీసీలపై కపట ప్రేమ మానుకొని, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. – కె.రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యదర్శి పార్లమెంటులో చట్టం చేయించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయించాలి. – కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు మోసానికి ఫుల్స్టాప్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేయాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో ఫుల్స్టాప్ పడింది. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు చేయడం, ఆ తర్వాత కోర్టుల్లో ఎదురుదెబ్బలు తినడం చంద్రబాబుకు అలవాటే. – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి 34 శాతం రిజర్వేషన్లపై బీసీలకు బాబు వెన్నుపోటు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, చట్టపరమైన చర్యలు చేపట్టి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలి. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం సిగ్గుచేటు. – వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ?: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: గ్రామంలో కష్టం వచ్చిన ప్రతీ ఇంటి దగ్గర వైఎస్సార్సీపీ కార్యకర్త ఉండాలని.. ప్రజల్లో మమేకమయ్యేవాడినే మీరు ఎన్నుకోండీ. డబ్బులతో మనుషులను కొనలేరు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు సాగునీరివ్వాలనే ఆలోచన ఎమ్మెల్యేకు లేదు. నీళ్లు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కాల్వల్లో సాగునీరు పారకపోయినా... సారా మాత్రం పారుతుంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జనం గొంతు తడపడానికి తాగు నీరు లేదు కానీ బెల్ట్ షాపులకు మాత్రం కొదవ లేదు. నీరు లేదు వరి పండించడం మానేయండని చంద్రబాబు అంటున్నాడు. అక్టోబర్ 1 తేదీన కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. మీటింగ్ పెట్టి పాత వాళ్లకే పెన్షన్లు ఇచ్చి చంద్రబాబు జారుకున్నాడు. మూడు సెంట్ల స్థలం ఇస్తా.. సైట్ ఓపెన్ అయ్యిందని హడావుడి చేస్తున్నాడు. చంద్రబాబు జీవితంలో పేదవారికి ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘పేదలకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్‌లకే దక్కుతుంది. కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తేనే గతంలో ఇళ్ల స్థలాలు వచ్చేవి. కానీ ఎలాంటి ఉద్యమాలు లేకుండా వైఎస్ జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. నిజాయితీగా బతికిన కమ్యూనిస్టు నాయకుడు పాటూరి రామయ్య వైఎస్ జగన్‌ను మెచ్చుకున్నారు. ఇంతకంటే ఏం కావాలి మనకు. రిజర్వేషన్లపై కోర్టు ఏం చెప్పిందో వైఎస్ జగన్ అదే చేశారు. కానీ చంద్రబాబు దుర్మార్గంగా జగన్‌పై నిందలు వేస్తున్నారు..ఇవాళ కోర్టులో అన్ని కేసులు కొట్టించుకున్నారు. మరి రిజర్వేషన్లపై కేసును ఎందుకు నీకు అనుకూలంగా తెచ్చుకోలేదు. డబ్బున్నోళ్లకు, పారిశ్రామిక వేత్తలకు లోకేష్ డోలో 650 అవుతా అంటున్నాడు. పేదలకు లోకేష్ పేరు గుర్తొస్తే పురుగుల మందు గుర్తుకొస్తుంది. హామీల గురించి విలేకరి అడిగితే మమ్మల్ని నమ్మడానికి జనానికి బుద్ధి లేదా అని లోకేష్ అంటున్నాడు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్ -
వెన్నుపోటు పార్టీ బీసీలకు మరోసారి ‘వెన్నుపోటు’: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు నిజంగా న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి వెన్నుపోటు పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి ఉంటే.. వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి సవాల్ చేశారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం కూటమి పార్టీల ఎంపీలు రాజీనామాలు చేస్తే, ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తద్వారా కేంద్రం దిగివచ్చి బడుగులకు అవసరమైన 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపడుతుందని సలహా ఇచ్చారు.కేంద్రంపై ఒత్తిడి తేకుండా బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ హామీని ఎలా అమలు చేస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కేవలం రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా, రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు.రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన పరిమితులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని, వాటిని అనుసరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రాజకీయ అవసరాలకు కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి సమాజంలో అట్టడుగున ఉన్న బడుగులకు ద్రోహం చేయడం తగదని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.50 శాతం పరిమితిని అధిగమించాల్సి వస్తే అవసరమైన రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలన్న జ్జానం చంద్రబాబుకు లేదా అని నిలదీశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరమైన ప్రక్రియ అవసరం అనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఇంకా ఏం మాట్లాడరంటే..ఆ కమిషన్ల నివేదికలపై చర్యలు ఏవీ..?గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. మంజునాథ కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వంటి కమిషన్లను ఏర్పాటు చేసి నివేదికలు తీసుకున్న తర్వాత వాటిని బుట్టదాఖలు చేసింది. ఆ నివేదికల పరిస్థితి ఏమిటో ప్రజలకు వివరించాలి. కమిషన్ల నివేదికలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రకటనలతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం వెనుకబడిన వర్గాలకు వెన్నపోటు పోడవడమే. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టం జరిగింది.ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే బీసీలకు లభించే రాజకీయ అవకాశాలు మరింతగా ఉండేవి. వేలాది స్థానిక సంస్థల పదవులను బీసీలు కోల్పోయారు. అంతేగాక భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు కాకుండా నిలిచిపోయాయి. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో చంద్రబాబు బాధ్యతగా లేకుండా, రాజకీయ అవసరాలే పరమావధిగా వ్యవహరించారనడానికే ఇదే నిదర్శనం.గ్రామగ్రామానికి వెళ్లి బాబు ద్రోహాన్ని వివరిస్తాంకేంద్రంలో కూటమి ప్రభుత్వానికి భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు తమ రాజకీయ బలాన్ని ఉపయోగించి బీసీల రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దు. 34 శాతం రిజర్వేషన్ల అమలుపై కూటమి పార్టీలు వెనుకబడిన వర్గాలకు చేస్తున్న దగాను గ్రామగ్రామానకు వెళ్లి బీసీలకు వివరిస్తాం. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిపై ద్రోహం చేస్తున్న తీరును ప్రజలకు వివరిస్తాం. వైఎస్సార్సీపీ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది. గ్రామగ్రామాన పర్యటించి బీసీలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తాం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పించాలి. బీసీలకు సంబంధించిన సంస్థలు, పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.వైఎస్ జగన్ హయాంలోనే బీసీలకు భరోసావైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు అనేక చర్యలు చేపట్టింది.139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, డైరెక్టర్లుగా బీసీలకు అవకాశం కల్పించింది. బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యత కల్పించాం. బీసీల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా ప్రైవేట్ బిల్లులు కూడా ప్రవేశపెట్టించాం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీసీలకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందించాం. డీబీటీ ద్వారా రూ.1,22,451 కోట్లు, నాన్-డీబీటీ ద్వారా రూ.50,657 కోట్లు, మొత్తంగా రూ.1,73,109 కోట్లు బీసీలకు అందించాం. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.పారదర్శక ఎన్నికలే మా లక్ష్యంఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించడంతో అనేక అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరాం. వలసలు, మరణాలు, ఇతర కారణాలతో తొలగించాల్సిన ఓట్లను సరిచేసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలి. తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితాపై మరింత స్పష్టత ఉంటుంది.సవరణ ప్రక్రియ పూర్తికాకముందు పాత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే తొలగించాల్సిన ఓట్లు కూడా అందులో ఉండే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయి తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే అనవసరమైన వివాదాలకు అవకాశం ఉండదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ఓటర్ల జాబితా విషయంలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కోరారు.ఇదీ చదవండి: ‘పాన్ ఇండియా జోకర్ నారా లోకేష్’ -
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేత
సాక్షి, ప్రకాశం జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులతో చీమకుర్తిలోని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేశారు. గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే బూచేపల్లిఫై కూటమి సర్కార్.. రాజకీయ వేధింపులతో పాటు ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రకు తెరతీసింది. దీంతో ఇవాళ(బుధవారం) నుంచి గ్రానైట్ క్వారీని మూసివేశారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి.. ఆయన సూర్య గ్రానైట్ క్వారీని ఇవాళ నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వ వేధింపులతో కార్మికులను ఇబ్బంది పెట్టలేక క్వారీని మూసి వేస్తున్నట్లు బూచేపల్లి ప్రకటించారు. ఇవాళ కార్మికులతో సమావేశమైన బూచేపల్లి.. ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోవాలని క్వారీలోని కార్మికులకు సూచించారు. ఇటీవల విజిలెన్స్, మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు పాల్పడ్డారంటూ రూ.78 కోట్ల జరిమానా విధించింది. ఆ ఫైనాల్టీ ఆర్డర్‌ని హైకోర్టు డిస్మిస్ చేసింది.అయినా క్వారీపై చంద్రబాబు సర్కార్ రాజకీయ వేధింపులు ఆపలేదు. మూడు నెలలుగా క్వారీ నుండి ఒక్క రాయి కూడా కదలకుండా మైనింగ్ శాఖ నిలిపివేసింది. దీంతో ప్రతి నెలా క్వారీఫై మూడు కోట్ల భారం పడుతోంది. చివరకు క్వారీ మూసివేయాలని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నిర్ణయించారు. నేటితో కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించిన యాజమాన్యం.. కార్వీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.ఇదీ చదవండి: హైదరాబాద్ షాపుల్లో ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ -
BC రిజర్వేషన్ అంటే ఏంటి.. చంద్రబాబు 34% వల్ల ఎంత నష్టం
-
అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మరు: ఉషశ్రీ చరణ్
సాక్షి, తాడేపల్లి: 34 శాతం బీసీ రిజర్వేషన్ చెల్లదని తెలిసీ చంద్రబాబు డ్రామా చేశారని.. కేవలం బీసీలను మోసం చేయటానికే ఈ నాటకమంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చట్టమే తీసుకురావచ్చు.. కానీ అలా చేయకపోవటానికి కారణం బీసీలు ఎదగటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు’’ అంటూ ఆమె దుయ్యబట్టారు.‘‘అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, జడ్పీలు, మేయర్లు, ఎంపీపీలు.. ఇలా అన్ని పదవుల్లోనూ వైఎస్ జగనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల బతుకుల్లో వెలుగు నింపినది వైఎస్ జగన్ మాత్రమే. బీసీల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదన చేసిందీ వైఎస్ జగనే. బీసీల్లోని కులవృత్తుల వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నదీ వైఎస్ జగనే.. ఇలా అనేక రకాలుగా ఆయన బీసీలకు మేలు చేశారు’’ అని ఉషశ్రీ చరణ్ వివరించారు.కానీ చంద్రబాబు పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయి. జోగి రమేష్, విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు.. ఇలా అనేకమంది బీసీ నేతలపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేశారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది’’ అని ఉషశ్రీ చరణ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు డ్రామాలు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలు, మోసపూరిత వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును నిలదీశారు.సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మళ్లీ జీవోల పేరుతో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. న్యాయపరమైన అంశాలపై స్పష్టత లేకుండా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మాయ మాటలతో మభ్యపెట్టి మోసం చేసే కుట్రకు తెరలేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు నిజంగా 34 శాతం రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే, కేవలం జీవోలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు అదే స్థాయిలో అవకాశాలు కల్పించాలని సవాల్ విసిరారు.స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాల్సిందే అన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన న్యాయపరమైన ఆధారాలు, రిజర్వేషన్ పరిమితిని ఎలా సమర్థిస్తారన్న అంశాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరాలు కోరిందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ధర్మాన ప్రసాదరావు గణాంకాలతో సహా వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...కోర్టు తీర్పులు తెలిసే డ్రామాలు:సుప్రీంకోర్టులో ఉండే తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. వివిధ కేటగిరీల రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదు అనేది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అత్యున్నత తీర్పు. ఇది దేశంలో అమల్లో ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా బాగా తెలుసు. అయినప్పటికీ, ఏపీలో మళ్లీ 34శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ జీవో ఇచ్చి అమలు చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి?ఈ జీవో ఇచ్చిననాడే మేము స్పష్టంగా చెప్పాం.. ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కోర్టులో నిలబడదని, కొట్టేస్తారని ముందే చెప్పాం. ఇది తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన జీవోలు ఇచ్చి హడావుడి చేయడం కేవలం ప్రజలను, ముఖ్యంగా బీసీలను మోసగించే చర్య కాక వేరే ఏమవుతుంది? రేపో మాపో సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేస్తుందని తెలిసినా కావాలనే ఈ నాటకాలు ఆడుతున్నారు. అమాయకులైన బీసీలను మోసం చేయడానికి ఇదొక ఆయుధంగా వాడుకుంటున్నారు.నిజమైన ప్రేమ ఉంటే ఇప్పుడు అమలు చేసి చూపించండి:మీకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, 34శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంటే.. ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసి చూపించండి! మీకంటే ముందు ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్ గారు బీసీలకు ఏకంగా పదవుల్లో ఎలా పెద్దపీట వేసి చూపించారో చూడండి.వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు రాజ్యాధికారం:రాష్ట్రంలోని మొత్తం 13 మేయర్ స్థానాల్లో ఏకంగా 9 స్థానాలు (69%) బీసీలకే కేటాయించి వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది.13 జెడ్పీలలో 6 (46%) బీసీలకు ఇవ్వడం జరిగింది.14 రాజ్యసభ స్థానాల్లో 4 (36%), అలాగే లోక్‌సభ పోటీల్లో 25 స్థానాలకు గాను 11 (44%) బీసీలకే కేటాయించారు.ఎమ్మెల్సీలలో 48%, మున్సిపల్ చైర్పర్సన్లలో 53%, మండల పరిషత్తులలో 68% మేర బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే.చంద్రబాబువి కేవలం మాటలే.. చేతలు శూన్యం:మంత్రివర్గంలోనూ, ఉన్నత పదవుల్లోనూ బీసీలను ఎప్పుడైనా సమానంగా గౌరవించారా? కేవలం మాటలు చెప్పడం, జీవోల పేరుతో కాలయాపన చేయడం తప్ప బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. నిజమైన సామాజిక న్యాయం కేవలం వైఎస్సార్సీపీ అధినాయకుడు వైఎస్ జగన్ గారి హయాంలోనే సాధ్యమైంది. మోసపూరిత మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నవారి పట్ల బీసీ సోదరులు ఐక్యంగా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని వంచించే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
34% రిజర్వేషన్ల హామీ ఏమైంది? బీసీలకు బాబు క్షమాపణ చెప్పాలి..
-
ఏదో ఒకటి చేసి గెలుద్దాం.. స్థానిక ఎన్నికలపై లోకేష్
సాక్షి, తిరుపతి: ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే. వైఎస్సార్సీపీ శ్రేణులు పోటీలో లేకుండా చూసుకోవాలి. ఎవరైనా నామినేషన్ వేసినా పరిశీలనలో తిరస్కరించే బాధ్యత అధికారులు చూసుకుంటారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలోని బలమైన నేతలకు మన కండువా కప్పేయండి. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ఏం చేసినా ఉన్నతాధికారులు సహకారం అందిస్తారు. ఈ పోరులో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయలేకపోతే అక్కడి ఎమ్మెల్యేలకు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఉండవు’’ అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి నారా లోకేష్ శ్రీవారి దర్శనం కోసం సోమవారం రాత్రి రేణిగుంటకు చేరుకుని నేరుగా తిరుమలకు వెళ్లారు. మంగళవారం శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తేనే టికెట్ స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తేనే టికెట్ ఉంటుందని.. ఒకవేళ పార్టీని గెలిపించలేకపోతే 2029 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టమేనని హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల బాధ్యతను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో ఈ రెండు మండలాలు స్వీప్ చేయిస్తేనే ఎమ్మెల్యే టికెట్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే.. స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి చాలా ప్రతిష్టాత్మకమని.. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి లోకేష్ స్పష్టం చేసినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ శ్రేణులు నామినేషన్ వేయకుండ పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒక వేళ ఎవరైనా నామినేషన్ వేస్తే.. పరిశీలనలో వాటిని తిరస్కరించేలా చర్యలు తీసుకునే బాధ్యత జిల్లా ఉన్నతాధికారికి అప్పగించినట్లు టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఏదైనా గొడవలు జరిగితే.. కేసులు పెట్టి జైల్లో పెట్టాలని పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు. పార్టీని గెలిపించేందుకు అధికార యంత్రాంగమంతా టీడీపీ నేతలు, కార్యకర్తలకు పూర్తి సహకారం అందిస్తారని ఎమ్మెల్యేలకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ విజయం కోసం ప్రతి నియోజకవర్గంలో బలమైన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ఎలాగోలా ఆకర్షించి పసుపు కండువా కప్పేయాలని సూచించినట్లు సమాచారం. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది.లోకేష్ దిశా నిర్దేశం తిరుపతిలో ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ప్రకటించే అవకాశముందని, ఈ మేరకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని.. చిత్తూరుతో పాటు మిగిలిన మున్సిపాలిటీలన్నీ స్వీప్ చేయాలని ఆదేశించారని ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించే పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుందని, ఇది వారి పనితీరుకు పరీక్షగా భావిస్తామని లోకేష్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
వీడియో బయటపెట్టినందుకు అరెస్ట్ చేయిస్తావా! గుర్తుపెట్టుకో ఒకటికి రెండు తిరిగిస్తాం..!
-
సెంటు భూమి సేకరించకుండా ‘పట్టా’భిషేకమా?
సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల కోసం చంద్రబాబు ప్రభుత్వం 27 నెలల్లో ఒక్క సెంటు భూమి కూడా సేకరించలేదు. అయినా విశాఖలో 28,445, మంగళగిరిలో 5,800, విజయవాడలో 26,401.. మొత్తం 60 వేల మందికి పట్టాలిచ్చామని ‘పట్టాభిషేకం’ సభలు పెట్టారు. భూమే లేకుండా పట్టాలు ఎక్కడివనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇవి కొత్త స్థలాలు కావు. పేదలు దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న స్థలాలకే క్రమబద్ధీకరణ కాగితాలు ఇచ్చారు. విశాఖలో ఇచ్చిన పట్టాలన్నీ ప్రభుత్వ స్థలాలు, కొండవాలు, చెరువు గట్లు, గాజువాకం ఇనాం, యూఎల్సీ భూముల్లో ఏళ్లుగా ఉంటున్న వారికే ఇచ్చారు. ఇప్పుడు కన్వేయన్స్ డీడ్లు ఇచ్చి మళ్లీ పట్టాభిషేకం అంటున్నారు. విజయవాడలో కొండలపై ఇళ్లకు, మంగళగిరిలో రెండు దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లకే పట్టాలు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న ఇళ్లకు పట్టాలిచ్చి పేదల పాత ఇళ్లకు రూ.52 వేల కోట్ల భూముల పంపిణీ అంటూ చెప్పడం చంద్రబాబు మార్కు గారడీయే. ఇచ్చింది కాగితం.. లాక్కున్నది స్థలం వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నిలువ నీడ లేని 50,793 మంది పేద మహిళలకు 1,402 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసింది. అప్పట్లో దాన్ని అడ్డుకున్న టీడీపీ.. అధికారంలోకి రాగానే ఆ స్థలాలన్నీ రద్దు చేసి అన్యాయం చేసింది. ఇప్పటి వరకు వారికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. 50 వేల మంది పేదల నుంచి స్థలాలు లాక్కున్న చేతులతోనే ఇప్పుడు పట్టాభిషేకం చేస్తుండడం విశేషం. 2, 3 సెంట్ల హామీ ఏమైంది? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పటి దాకా ఒక్కరికీ కొత్త స్థలం ఇవ్వలేదు. ఇంత వరకు భూ సేకరణ కూడా మొదలు పెట్టలేదు. నవంబర్‌లో మొదలు పెడతామని లీకులు ఇచ్చారు. అసలు పని మొదలు పెట్టకుండా పట్టాభిషేకం అంటూ హడావుడి చేయడం పబ్లిసిటీ స్టంట్ కాక మరేమిటని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ హయాంలో 71,800 ఎకరాల్లో 31 లక్షల మందికి పైగా మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కూటమి సర్కారు 27 నెలల్లో సేకరించింది సున్నా ఎకరాలు. ఇళ్లు జగన్‌వి.. రిబ్బన్ బాబుది 5.5 లక్షల ఇళ్లు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అవన్నీ జగన్ హయాంలో మంజూరైన ఇళ్లే. దాదాపు పూర్తయిన వాటికి రంగులేసి రిబ్బన్లు కట్ చేస్తున్నారు. స్థలం జగన్‌ది, ఇల్లు జగన్‌ది.. క్రెడిట్ మాత్రం చంద్రబాబుది. -
టీడీపీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడి వీరంగం
సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో టీడీపీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడి వాసిరెడ్డి బాబి వీరంగం సృష్టించాడు. తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి వెంకట రామదాసుపై దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో రామదాసుతో పాటు ఆయన భార్య, కుమారుడు, గుమస్తాలపై కూడా దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించి వాసిరెడ్డి బాబిపై ప్రకాశ్‌నగర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు కూడా వాసిరెడ్డి బాబిపై ఉన్నాయి.ఓ మహిళపై వాచ్ మెన్ అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంగా గొడవ మొదలు కాగా వాచ్ మెన్‌పై చేగొండి వెంకట రామదాసు చేయి చేసుకున్నారు. దీంతో రామదాసుపై వాచ్ మెన్‌తో వాసిరెడ్డి బాబి ఫిర్యాదు చేయించారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు రామదాసుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ గొడవలో పోలీసులు మొత్తంగా మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా
-
‘కోర్టు తీర్పు.. చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు’
సాక్షి, తాడేపల్లి: తెనాలిలో పోలీసుల చేతిలో దారుణంగా హింసకు గురైన నలుగురు దళిత యువకులకు జరిగిన అవమానం, మానసిక క్షోభకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, అందుకుగాను బాధిత కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తెనాలిలో నలుగురు దళిత యువకులను రోడ్డుపై దారుణంగా కొట్టి హింసించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన గుర్తు చేశారు.ఆ కుటుంబాల గౌరవం కాపాడాలి:ఈ కేసులో యువకులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించి క్లీన్ అక్విటల్ ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని గోరంట్ల మాధవ్ అన్నారు. బాధిత యువకుల డిగ్నిటీ, డిసెన్సీ, వారికి జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు, వారి గౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల హక్కు కాలరాస్తున్నారు:పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ వంటి చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ, లోకేష్ చేతిలో ఉన్న ఎర్రబుక్‌ను అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థకు డిసిప్లిన్, డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉండాలని, అయితే కొందరు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. దీని వల్ల పోలీసు వ్యవస్థ డిసెన్సీ, డిగ్నిటీ దిగజారిపోతోందని గోరంట్ల మాధవ్ అన్నారు.ఇదీ చదవండి: కన్నీటితో చంద్రబాబు సర్కార్‌కు హెచ్చరిక -
స్కూల్స్ లో పచ్చ పార్టీ అరాచకాలు.. మీరే చూడండి
-
కన్నీటితో చంద్రబాబు సర్కార్‌కు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనానికి లోనైన ఆ సంఘం నేత మధుబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడుతుంటే ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. తక్షణమే సస్పెన్షన్లు, పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులపై చర్యల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని మధుబాబు కోరారు. ఉద్యమ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కేసులు ఎత్తివేసి, సస్పెన్షన్లు తొలగించాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అక్టోబర్ 2లోపు కేసులు, సస్పెన్షన్లపై నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. అప్పటిలోగా సమస్య పరిష్కారం కాకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు.ఒంటరిగానే..డెడ్‌లైన్ లోపు ఉద్యోగులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని మధుబాబు స్పష్టం చేశారు. అప్పటిలోగా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 3 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. తన హక్కుల కోసం, ఉద్యమంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల న్యాయం కోసం ఒంటరిగానే దీక్ష చేస్తానని తెలిపారు.శ్రీకాకుళంలో ఆమరణ దీక్షఆమరణ నిరాహార దీక్షను శ్రీకాకుళంలో చేపడతానని మధుబాబు ప్రకటించారు. మహిళలను ఇబ్బంది పెట్టిన వారికి వారి ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. మధుబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరింతగా కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే విజయవాడలో జరిగిన ధర్నాలో పాల్గొన్న పలువురు ఉద్యోగులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించిన ప్రభుత్వం.. తాజాగా ఆ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులందరి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 27వ తేదీ విజయవాడలో నిర్వహించిన ధర్నాకు అనుమతి లేకపోయినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆ ధర్నాలో పాల్గొన్నారని ఎత్తి చూపుతూ ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కార్యాలయం సోమవారం ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలు జారీ చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్ల సూచనతో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల నుంచి మండలాలు, పట్టణాల వారీగా మంగళవారం సాయంత్రానికే జాబితాలు సేకరించి పంపారు. తమ సమస్యల గురించి రెండేళ్లుగా పలుమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు 27వ తేదీ ఆదివారం ‘ఛలో విజయవాడ’ చేపట్టారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మరింతగా కక్ష గట్టింది.వాస్తవానికి 27వ తేదీ ఆదివారం ఉద్యోగులకు సెలవు. అయినప్పటికీ వారంతా ఆ రోజు ఎక్కడ ఉన్నారని ప్రభుత్వం ఆరా తీయడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగుల తీవ్ర స్థాయి ఆందోళనల నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి ఏమైనా ఇబ్బందులెదురవుతాయా.. అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంది. పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. మరో వైపు ప్రభుత్వం ఈ నెల 27న విజయవాడ ధర్నాలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మేజర్ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న 9 మంది సచివాలయ ఉద్యోగులకు మెమోలు ఇచ్చింది. మీకు జీతాలు ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని అడగడం కలకలం రేపుతోంది.ఇదీ చదవండి: మేం చేసిన పాపమేంటి బాబూ? -
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో రెచ్చిపోయిన ‘పచ్చ’గూండాలు... రాజకీయ రణరంగంగా మార్చి బరితెగింపు
-
మేం చేసిన పాపమేంటి బాబూ?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఇంటింటికీ వెళ్లి నేరుగా అందించాం. అధికారుల చుట్టూనో.. నాయకుల చుట్టూనో తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరినీ నేరుగా కలిసి.. వారు ఏ పథకానికి అర్హులో చెప్పి మరీ దాన్ని అందజేశాం. అదికూడా ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అనేది చూడకుండా.. ప్రకృతి వైపరీత్యాలొస్తే ప్రభుత్వం తరఫున సైన్యంలా పనిచేశాం. రాష్ట్రంలోని ప్రతి మూలకూ వెళ్లి సేవలందించాం. యావత్తు ప్రపంచాన్నీ కోవిడ్ మహమ్మారి కమ్మేసినప్పుడు.. ఇంట్లోంచి బయటకు రావటానికే జనం భయపడ్డప్పుడు... నేరుగా ఇళ్లకు వెళ్లి మందులిచ్చి మరీ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నది మా సైన్యమే. అలాంటి మాకు గౌరవ పారితోషికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.5,000 మొత్తాన్ని ఉగాది సాక్షిగా రూ.10 వేలకు పెంచుతానని చెప్పి మరీ మోసం చేయటమే కాక... ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక్కో పోస్టుకు రూ.15 వేలు చెల్లిస్తామంటూ వెన్నుపోటు ప్రభుత్వం పాలసీ తీసుకురావడం దారుణం’ అని చంద్రబాబుపై వలంటీర్లు మండిపడుతున్నారు. ‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన సంక్షేమ పథకాలన్నిటినీ తానూ ఇస్తానని, మాకు గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని చెప్పి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని తీసేయటమే కాదు.. గత ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను కూడా అమలు చేయటం లేదు. కానీ ఇప్పుడేమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలకు ఒక్కో పోస్టుకు రూ.15 వేలు ఇస్తామనటం అన్యాయం? ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను అందజేసే మాకు నెలకు రూ.5 వేలు ఇవ్వటం భారమని, దుబారా అని భావించిన చంద్రబాబు ఇపుడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టించుకుని ఒకో పోస్టుకు రూ.15 వేలు చెల్లిస్తామనటం దివాలాకోరుతనానికి పరాకాష్ఠ. ప్రజల సొమ్మును ఈ రకంగా దుర్వినియోగం చేయటం ఘోరం... నేరం కూడా’’ అని పలువురు వలంటీర్లు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తమను తొలగించాక... దుబారాను తగ్గించారంటూ ఎల్లో మీడియా ఆయనను బాగా ప్రశంసించిందని వారు గుర్తుచేశారు. ‘‘కానీ విజయవాడకు భారీ వరదలొస్తే అక్కడ సేవలందించడానికి చంద్రబాబుకు, ఆయన మీడియాకు, ఆయన యంత్రాంగానికి అక్కరకు వచ్చింది మాత్రం మేమే. మళ్లీ విధుల్లోకి తీసుకుంటామంటూ పిలిచి మమ్మల్ని మరోసారి మోసం చేశారు’ అని వలంటీర్లు వాపోతున్నారు. లబ్ధిదారు ఇంటికే వెళ్లి పింఛన్లు ఇస్తున్న వలంటీర్ (ఫైల్) ఇది తెలుగుదేశం పార్టీ నిధి కాదు కదా?ఇదంతా ప్రభుత్వ ఖజానాను నేరుగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు దోచిపెట్టడానికి దారుణమైన స్కెచ్ అని వలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. ‘ఎన్నికల్లో గెలవటానికి సోషల్ మీడియా ప్రచారం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికి పార్టీ తరఫున డబ్బులివ్వాలి తప్ప రాష్ట్ర ప్రజలంతా పన్నుల రూపంలో చెల్లించిన ధనాన్ని ప్రచార యావ కోసం ధారాదత్తం చేయటం అన్యాయం. మేమైతే ఇంటింటికీ వెళ్లి కష్టపడ్డాం గనుక మాకు గౌరవ పారితోషికంగా రూ.5వేలు చెల్లించారు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చేసేదేంటి? సోషల్ మీడియాలో ప్రభుత్వానికి డప్పుకొడుతూ ఒక పోస్టు పెడితే రూ.15వేలు చెల్లిస్తామనటం ఎక్కడైనా ఉందా?’ అని వలంటీర్లు వేస్తున్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గరైతే సమాధానం లేదు.మా కడుపులు కొట్టి ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలా?2019 నుంచి 2024 వరకు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచాం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికీ చేర్చాం. రూ.5 వేలు గౌరవ వేతనం తీసుకొని ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందించాం. అలాంటి మమ్మల్ని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు రూ.5 వేలు కాదు రూ.10 వేలు ఇస్తామన్న మాటలు నమ్మాం.. ఆశపడ్డాం. చివరకు ఈ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసింది. – తాటిపాటి తిరుపాల్, 47వ సచివాలయ మాజీ వలంటీర్, కర్నూలుదోచిపెట్టే కొత్త పాలసీ ఇదిగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటింటికి అందించిన మాపై అప్పట్లో మీరు ఎన్నో నిందలు వేశారు. గౌరవ వేతనం రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచుతానని చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మాత్రం ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు కొత్త పాలసీ తీసుకురావటం దారుణం. – బి.చాందిని, మాజీ వలంటీర్, బాపులపాడు, కృష్ణా జిల్లారూ.వందల కోట్లు ఖర్చు చేయడం సమంజసమా?కరోనా మహమ్మారికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోయినా ప్రాణాలకు తెగించి సేవలందించాం. నెల రోజులు పనిచేసి గౌరవ వేతనం రూ.5వేలు పొందేవాళ్లం. దానికే ప్రజాధనం దుర్వినియోగం అంటూ నాడు నానా రాద్ధాంతం చేసిన కూటమి పెద్దలు.. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ పాలసీ పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలి. – ఉయ్యాల ఈశ్వర్‌కుమార్, మాజీ వలంటీర్, చాగంటివారిపాలెం, పల్నాడు జిల్లా -
చొర‘బడి’.. తెగబడ్డారు
అధికారమదంతో తెలుగుదేశం నేతలు పేట్రేగిపోతున్నారు. గుడి, బడి తారతమ్యం మరిచి బరితెగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపు, వసతుల కల్పన పర్యవేక్షణ కోసం ఉద్దేశించిన పాఠశాలల నిర్వహణ కమిటీ ఎన్నికలను రాజకీయ రణరంగంగా మార్చి బాహాబాహీకి దిగారు. బడుల్లోకి చొరబడి గురువులపైనా గూండాగిరికి తెగబడ్డారు. పల్నాడు జిల్లాలో ఏకంగా ప్రధానోపాధ్యాయుడినే కిడ్నాప్ చేసిన ఘటన విద్యావ్యవస్థలో మునుపెన్నడూ చూడని చీకటి అధ్యాయాన్ని కళ్లకు కట్టింది. పసిపిల్లల ముందే టీడీపీ నేతలు సాగించిన ఈ రాక్షస కాండకు సభ్యసమాజమే విస్తుపోయింది. సాక్షి, అమరావతి: పాఠశాలల నిర్వహణ కమిటీ ఎన్నికలు(ఎస్ఎంసీ) టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు అడ్డాగా మారాయి. మంగళవారం నిర్వహించిన ఎన్నికలను పూర్తిగా రాజకీయం చేస్తూ, పసిపిల్లల ముందే తెలుగుదేశం కూటమి నేతలు బాహాబాహీకి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయగా, మరికొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులనే ఏకంగా కిడ్నాప్ చేసి దౌర్జన్యాలకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిబంధనల ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే పాఠశాల ప్రాంగణాల్లోకి అనుమతి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు చొరబడ్డారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎస్ఎంసీ ఎన్నికల్లో కొట్లాటలకు దిగి భయోత్పాతం సృష్టించారు. 44,059 ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించగా అనేక చోట్ల ఘర్షణలకు పూనుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం జెడ్పీ స్కూల్ హెచ్ఎంను ఏకంగా కిడ్నాప్ చేశారు. టీడీపీ సానుభూతిపరులు తక్కువగా ఉన్నచోట్ల కోరం లేదంటూ ఎన్నికలను అడ్డుకుని వాయిదా వేయించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎస్ఎంసీ ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. గతంలోనూ 2024 ఆగస్టు 8న రాష్ట్ర వ్యాప్తంగా 45,193 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ కమిటీ ఎన్నికలు నిర్వహించగా, నాడు 631 స్కూళ్లలో గ్రామస్థాయిలోని కూటమి నాయకులు గొడవలకు దిగారు. ఇప్పుడూ మరోమారు బడులను రణరంగంగా మార్చారు. ఇవిగో నిదర్శనాలు » గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ కూటమి నేతలు చొరబడి రౌడీషీట్, పోక్సో కేసు నమోదైన వ్యక్తిని అక్రమంగా, అడ్డదారుల్లో చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎన్నికకు ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నిక ఏకగ్రీవం చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన ఓ విద్యార్థి తండ్రి సంకూరి కిషోర్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. రౌడీషీట్, పోక్సో కేసులు ఉన్న వ్యక్తిని పాఠశాల చైర్మన్‌గా చేస్తే విద్యార్థులకు రక్షణ, భద్రత, పాఠశాల అభివృద్ధి ఏ విధంగా సాధ్యపడతాయని వారు ప్రశ్నించారు. » పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం జెడ్పీ స్కూల్ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం పాఠశాలకు వస్తున్న హెడ్ మాస్టర్ దండా శ్రీనివాసప్రసాద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఎంఈవో నాగరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా కొందరు వ్యక్తులు పాఠశాలలోకి చొరబడ్డారు. అడ్డుకునేందుకు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఘటనలో పలువురు గాయపడ్డారు. టీడీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన నాగండ్ల రాంబాబు, అదే పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు వర్గాలు ఈ ఎస్ఎంసీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం. » వైఎస్సార్ జిల్లా, కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే టీడీపీ నేతలు చొరబడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు ఉన్నాయని దూషణలకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎన్నికను వాయిదా వేశారు. ఈ సమయంలో ఖాజీపేట సీఐ వంశీధర్.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి భార్యను ఉద్దేశించి ‘ఆడదానివి నువ్వు పోకపోతే..’ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. మదనపల్లె డీఎస్పీ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని సీఐ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. బాధితులకు నచ్చజెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. వైఎస్సార్సీపీకి మెజారిటీ ఉన్నా టీడీపీ నాయకులు అధికార బలంతో ఎన్నికలు వాయిదా వేయించడంపై గ్రామంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. » చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 40 శాతం మంది తల్లిదండ్రులూ హాజరుకాలేదు. చాలా పాఠశాలల్లో ఎన్నికలకు అవసరమైన సభ్యులు లేకపోయినా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. » చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్పేట జెడ్పీ హైసూ్కల్లో మెజారిటీ సభ్యులు ఉన్నా టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేయించేందుకు హెచ్ఎం, అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ పాఠశాలలో స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. » గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం డీఎంపురం జెడ్పీ హైస్కూల్లో ఘర్షణలు తలెత్తాయి. గతంలో ఆ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్‌గా ఉన్న త్యాగరాజను తిరిగి ఎన్నుకోవాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. అతను వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో నిబంధనలకు విరుద్ధంగా మరొకరిని చైర్మన్‌గా ప్రకటించారు. కమిటీలోని ఐదుగురు సభ్యులు వాకౌట్ చేసినా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఏకపక్షం చేశారు. దీంతో ఆ పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. » ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో టీడీపీ నేతలు చొరబడి ఎన్నికలను నిలిపివేశారు. ముక్త్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళలకు కనీసం కమిటీలో ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. » అనంతపురం జిల్లాలో జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. మొత్తం 1,723 పాఠశాలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 1,687 పాఠశాలల్లో పూర్తయ్యాయి, 36 పాఠశాలల్లో వాయిదా పడ్డాయి. 27 చోట్ల కోరం లేక, తొమ్మిది చోట్ల శాంతిభద్రతల సమస్యలతో వాయిదా వేశారు. కొన్నిచోట్ల కోరం ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో ఎన్నికలు వాయిదా వేశారు. » తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని ఆర్లపాడు గ్రామంలోని బడిలో ఎన్నికల సందర్భంగా వివాదం తలెత్తింది. దీనిని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వాటంబేటి చంద్రశేఖర్ దాడికి పాల్పడ్డాడు. దుర్భాషలాడుతూ ఇద్దరు విలేకర్లపై దాడులకు పాల్పడ్డాడు. » మార్కాపురం జిల్లా పుల్లలచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు అధికారపార్టీ కనుసన్నల్లో ఏకపక్షంగా జరిగాయని నిరసిస్తూ విద్యార్థి తండ్రి నీలబోయిన యోగేశ్వరరావు తన బిడ్డ టీసీ తీసుకెళ్లిపోయారు. » అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మహంతపురం యూపీ పాఠశాల, కరిగానిపల్లి ఉన్నతపాఠశాలలో కోరం లేదనే సాకుతో ఎన్నికలను టీడీపీ నేతలు వాయిదా వేయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. తమ పిల్లల టీసీలిచ్చేయాలని ధర్నా చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోటలో పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తున్న టీడీపీకి చెందిన వ్యక్తి సనపల అప్పలనాయుడు జెడ్పీ పాఠశాలలో ఎన్నికల ప్రక్రియను నడిపించారు. మైక్ పట్టుకుని ఎవరేం చేయాలో నిర్దేశించారు. » స్కూల్ కమిటీ ఎన్నికలో ఓటమిని సహించలేక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం పనుకువలస మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు కోట అజయ్‌కుమార్‌పై కూటమి నాయకులు దాడిచేశారు. అటుగా వస్తున్న ఎస్సై డోల వెంకన్న కూటమి నాయకులను చెదరగొట్టి అజయ్‌కుమార్‌ను రక్షించారు.4,171 పాఠశాలల్లో ఎన్నికలు ఒకటోతేదీకి వాయిదా సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల నిర్వహణ కమిటీల(ఎస్ఎంసీ) ఎన్నికలు మంగళవారం పారదర్శకంగా ముగిశాయని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 44,059 పాఠశాలల్లో ఎన్నికలకు ఏర్పాట్లుచేయగా, 39,888 పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. 4,171 పాఠశాలల్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదని, ఇందులో 321 పాఠశాలల్లో కోరం లేక, 3,850 పాఠశాలలకు పరిపాలనా కారణాలతో ఎన్నికలను అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేశామని ఎస్పీడీ తెలిపారు. -
‘బాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది’
సాక్షి, కాకినాడ జిల్లా: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియంత సామ్రాజ్యంలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.. ప్రశ్నించేవారిని అణిచివేసేలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అధికారులను అడ్డదారుల్లో వాడుకుంటుందన్నారు. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చాలా చులకన. అన్ని వర్గాలాన్నే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసపోయారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు మోసపోయారు. పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంతో వైఎస్ జగన్ సచివాలయాలు ఏర్పాటు చేయాలని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 15,004 సచివాలయాలు నిర్మించి.. 1,34,000 ఉద్యోగులను నియమించారు. సచివాలయం వ్యవస్థే వృధా అన్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారు’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘అక్రమ కేసులు పెట్టి సచివాలయం ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆంద్రజ్యోతిలో సచివాలయాల మీద పచ్చి అబద్దాలను వండి వర్చారు. గ్రామాల్లోకి వెళ్లి సచివాలయాల ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో అడగండి. వైఎస్ జగన్ మీద ద్వేషం తప్పా.. మీకు మరేమీ లేదు. ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటానని చంద్రబాబు ఎన్నికల మానిఫెస్టోలో చెప్పారు. తమ హక్కుల కోసం అడిగితే ఉద్యోగులపై కేసులు పెడతారా?...చంద్రబాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది. సచివాలయం ఉద్యోగులకు ఎలాంటి జీవోలు గత పాలనలో ఇచ్చామో ఆఫీస్‌కి వెళ్లి వెతుక్కోండి. సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తారా? అని సూటిగా చంద్రబాబును అడుగుతున్నా?. సచివాలయ వ్యవస్థను కుదించే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు. కోవిడ్‌లో సచివాలయం ఒక యూనిట్‌గా ప్రజలకు సేవలందాయి. సచివాలయం ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా గౌరవంగా చూసింది. మీ చేతగానితనాన్ని సచివాలయం ఉద్యోగులపై ఎందుకు రుద్దుతారు చంద్రబాబు?..ఉద్యోగుల మీద ప్రజల్లో నెమ్మదిగా పాయిజన్ ఎక్కిస్తున్నారు. వచ్చిన ప్రభుత్వ ఆదాయం ఉద్యోగులకు సరిపోతుందని చెబుతున్నారు. పి-4 పథకంలో దాతలు దొరకకపోతే.. ఉద్యోగులే దాతలుగా మారాలని ఒత్తిడి తెచ్చారు. ఇప్పడు సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తున్నారు. మీ ఎల్లో మీడియా ఉందని పేట్రేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదూ?. పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకువచ్చారు. మీ తండ్రి కొడుకులను వాళ్లు తమ భుజాన ఎత్తుకుని మోయాలిఇన్ఫ్లుయెన్స్ కోల్పోయిన వాళ్లే ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటారు. అసలు సమస్యలను వదిలేసి వైఎస్ జగన్‌పై దూషణలతో ఎంతకాలం నెట్టుకొస్తారు. ఉద్యోగులు ఏం పాపం చేశారని వారిపై మీ రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. ఉద్యోగులు వాళ్ల హక్కుల కోసం ప్రశ్నిస్తే తప్పా..? ఎకరం రూ.99 లకు కార్పోరేట్ సంస్థలకు కట్టబెడితే ఒప్పా? అని ఎల్లో మీడియాను అడుగుతున్నా....భీమడోలు షుగర్ ఫ్యాక్టరీని పప్పు బెల్లంలా గతంలో చంద్రబాబు అమ్మేశారు. ఇప్పుడు మరికొన్ని సహకార చక్కెర కర్మాగారాలను అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది. రైతులు దీనికి ఒప్పుకోవడం లేదు. త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టడం దుర్మార్గం.. అమానుషం’’ అంటూ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్: పేర్ని కిట్టు -
నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్
-
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, కృష్ణా జిల్లా: కొల్లు రవీంద్రలా కడుపులో కత్తులు పెట్టుకుని తిరిగేవాళ్లం కాదని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అన్నారు. ఇవాళ(మంగళవారం) మచిలీపట్నం నియోజకవర్గ ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు పేర్ని నాని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. కులం చూసి ఓటేయమని తానెప్పుడూ అడగలేదన్నారు. కొల్లు రవీంద్ర నీకు ఎన్ని బూతులు వచ్చో.. నాకు అంతకంటే ఎక్కువే బూతులు వచ్చు. నేనూ బందరులోనే పుట్టా.. బందరులోనే చదువుకున్నా. నేను తిట్టాలంటే శత సహస్ర నామాలు లాగా నువ్వు పుస్తకం రాసుకున్నా సరిపోదు. గాలి ఉంటే గెలుస్తావ్.. గాలి లేకపోతే గెలవలేవు. బందరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘నా తండ్రి, నేను బందరుకు ఏం చేశామో ప్రజలకు తెలుసు. తరకటూరు పంపుల చెరువు నా తండ్రి చేసిందే. బందరులో 132కేవి పవర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేయించింది నా తండ్రి. తీర ప్రాంత గ్రామాలకు మంచినీరు అందించిన ఘనత నా తండ్రిది. బందరులో 25 వేల మందికి ఇళ్లపట్టాలిచ్చిన చరిత్ర మాది. నువ్వు ఇప్పుడు టిడ్కో ఇళ్లు కట్టామని చెప్పుకుంటున్న భూమి కొన్నది కూడా మేమే...నీ మంత్రి పదవి కోసం బెల్ కంపెనీని నిమ్మకూరుకు తాకట్టు పెట్టిన చరిత్ర నీది. కృష్ణా యూనివర్శిటీ బందరుకు తెచ్చాం. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ బందరుకు తెచ్చాం. మెడికల్ కాలేజీను బందరుకు తీసుకొచ్చాం. గ్రామ గ్రామానికి తరకటూరు చెరువు నుంచి మంచినీరు తీసుకెళ్లాం. తారు రోడ్డు అంటే తెలియని అనేక గ్రామాలకు రోడ్డు వేయించాం.’’ అని పేర్ని నాని వివరించారు.‘‘కరెంట్ ఆపితే తప్ప మంచినీటి ఇవ్వలేని పరిస్థితి. నేను మంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వాలని ధర్నా చేయించావు. ఇప్పుడు నువ్వు మంత్రివే కదా... అధికారం మీదే కదా? గంట పాటు కరెంట్ ఆపకుండా ఎందుకు మంచినీరు ఇవ్వలేకపోతున్నారు?. కాపులకు ఏం చేశావ్.. అని నన్ను అడుగుతున్నావ్. నువ్వేం చేశావ్.. కాపులకు సమాధానం చెప్పు. మున్సిపల్ ఛైర్మన్ పదవిని ఆర్యవైశ్యుల వద్ద 60 లక్షలు వసూలు చేసింది నువ్వు. ఫలానా పదవి ఇస్తానని... నేను ఏనాడూ ఎవరికి టిక్కెట్లు ఇవ్వలేదు...కష్టపడి పనిచేసే వారికి ... నికార్సైన వారికే మేం టిక్కెట్లు ఇచ్చాం. జనసేనలో నిఖార్సైన డబ్బులేని కాపులెవరూ కనిపించలేదా నీకు?. ఎందుకు డబ్బున్నోడికే మేయర్ టిక్కెట్ ఇస్తామంటున్నారు. వైఎస్ జగన్ సాయంతో స్థలాలు కొని నిజాయితీగా 25 వేల ఇళ్లపట్టాలిచ్చాం. 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన నాకు దొంగ పట్టాలివ్వాల్సిన కర్మ పట్టలేదు. మేం ఇచ్చింది దొంగ పట్టాలైతే ఇంటింటికి వీఆర్వోలను ఎందుకు తిప్పుతున్నావు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు అధికారులను ఇబ్బంది పెడుతున్నావు. పేర్ని నాని ఏరోజూ ఏ ఒక్కరి ఇల్లు కూల్చలేదు...నీ కోసం పనిచేసిన జనసేన కార్యకర్తను కూల్చి వేయించిన చరిత్ర నీది. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ గుమ్మటాల చెరువులో ఈరోజుకీ నువ్వు ఇళ్లు అమ్ముకుంటున్నావు. బందరుకు నువ్వేం చేశావో.. నువ్వు ఏం తెచ్చావో చెప్పే దమ్ముందా?. గిలకలదిండిలో 22 బెల్టు షాపులు పెట్టించావ్. దొంగతనంగా బయోడీజిల్ అమ్మే దొంగవి నువ్వు. పాపపు సొమ్ముతో బీచ్‌లో 63 అడుగుల వినాయకుడు పెడితే మీ పాపాలు పోతాయా?. రైతులు సాగుకు నీరు లేక నానా అవస్థలు పడుతుంటే నువ్వు పట్టించుకున్నావా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.ఇదీ చదవండి: కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్: పేర్ని కిట్టు -
జగన్ సెక్యూరిటీ..! చేతులెత్తేసిన రెడ్ బుక్ పోలీసులు
-
Bolisetty: మీరు ఇలా చేస్తే తిరుగుబాటు ఖాయం..
-
కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్: పేర్ని కిట్టు
సాక్షి, కృష్ణా జిల్లా: అధికారం పోగానే కొందరు తెల్లారికే కండువా మార్చేసి దర్జాగా తిరిగేస్తున్నారని.. కానీ కార్యకర్తలే పార్టీకి, మాకు అండగా ఉన్నారని వైఎస్సార్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ పేర్ని కిట్టు అన్నారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటిపై టీడీపీ జెండా ఉన్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకాలు అందించాం. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా కూటమి సర్కార్ నెరవేర్చిందా? అంటూ ప్రశ్నించారు.‘‘కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్. గతంలో టీడీపీ తరపున మేయర్ క్యాండెట్ కోసం నువ్వెంత తీసుకున్నావు? నేను చెప్పింది అబద్ధమైతే బందరుకోటలో కట్టిన గుడిలో ప్రమాణం చేద్దాం. కొల్లు రవీంద్ర దయచేసి మాతో నిన్ను పోల్చుకోకు. సీట్లు అమ్ముకునే నీకు, పార్టీ శ్రేణులను కుటుంబసభ్యులు అనుకునే మాకు చాలా తేడా ఉంది...బయట ఒకలా.. లోపల ఒకలా బతికే నువ్వు కూడా మాకు నీతులు చెబితే ఎలా?. పోర్టు పేరుతో 33 వేల ఎకరాలు తీసుకుని జనాన్ని మింగేయాలనుకుంది మీరు.. కేవలం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్ జగన్ పోర్టు కట్టి చూపించారు’’ అని పేర్ని కిట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కూటమికి బిగ్ షాక్.. బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు -
కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాలపై టీడీపీ గూండాల దాడి
-
సుత్తివేలు వచ్చి చిరంజీవికి వార్నింగ్ ఇచ్చినట్లు.. రెడ్ బుక్ కు మించి డిజిటల్ బుక్...
-
బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?
ఏపీ ప్రభుత్వం ప్రచారం విషయంలో వెనుకడుగు వేయడం లేదు. కొత్తగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి ప్రభుత్వం పరోక్ష వేతనం చెల్లించడానికి రెడీ అయింది. ఇది ఒకరకంగా పరీక్ష లేకుండానే క్రీడా కోటాలో కొందరికి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన చందంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, ఇప్పటికే తనకు అనుకూలంగా పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం ప్రధాన మీడియాకాని, వందల సంఖ్యలో ఉన్న యూట్యూబ్ చానళ్లు తమ ప్రచారానికి సరిపోవడం లేదని అనుకుంటోందా? లేక వాటిని జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చిందా అన్నది తెలియదు కాని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో అంటే ప్రభావశీలురతో కంటెంటె పెట్టిస్తారట. దానికి భారీగా చెల్లింపులు చేస్తారట.కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికి నాలుగువేల రూపాయల చొప్పున మంజూరు చేయడానికి డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉద్యోగుల జీతాలకే ప్రభుత్వ ఆదాయంలో 94-98 శాతం ఖర్చు అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు. సంపద సృష్టించే మార్గాలు కనబడడం లేదని, ఐడియాలు ఉంటే ఇవ్వండని ప్రజలనే ఆయన సలహా కోరారు. అవన్ని వాస్తవమా? కాదా? అన్నది మనం చెప్పలేం.కాని, చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పక్షాన, చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ల పక్షాన ప్రచారం చేయడానికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు ఇస్తారట. ప్రభుత్వం ఇచ్చే కంటెంట్ పోస్టు చేస్తే ఒక రేటు, స్వయంగా తయారు చేసే కంటెంట్‌కు మరో రేటు ఉంటుందట. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్ పోస్టింగ్‌లకు కేటగిరిని బట్టి 500 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇస్తారట. ఆడియో, వీడియో పోస్టింగ్లకైతే 750 నుంచి రెండువేల రూపాయల వరకు ఇస్తారట. సొంతంగా తయారు చేసే వీడియోలకు గాను క్రియేటర్స్‌కు 2500 నుంచి ఇరవైవేల వరకు చెల్లిస్తారట. దీనికి ఏవో కండిషన్లు అని చెప్పినా, చివరికి ఏమి జరుగుతుందో ఊహించుకోవచ్చు.ఎన్నివేల మందిని ఇందుకోసం వినియోగించుకుంటారో, ఎంత బడ్జెట్ కేటాయిస్తారో వెల్లడించలేదు. హిమచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లలో వివిధ పద్దతులలో ఇలాంటి స్కీములను అమలు చేస్తున్నారట. యూపీలో ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ పారంలకు నేరుగా డబ్బులు ఇస్తారట. వీటిని కాపీ చేసి ఏపీ ప్రభుత్వం వీటిని అమలు చేస్తోందన్నమాట. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్‌తో ప్రభుత్వ ప్రచారం చేస్తుంటుంది. అందులో కూడా కంటెంట్ తయారు చేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదతర మీడియా సంస్థలకు ప్రచార ప్రకటన రూపంలో, ఇతరత్రా భారీగానే లబ్ది చేకూర్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారు మరీ ఏకపక్షంగా టీడీపీ కరపత్రాలుగా ప్రచారం చేస్తుండడంతో ప్రజలలో విశ్వసనీయత తగ్గిపోతోంది.ఈ నేపథ్యంలో ఈ కొత్త ఐడియాను తీసుకువచ్చి ప్రజాధనాన్ని వెచ్చించబోతున్నారన్నమాట. నిజంగానే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైనా పోస్టు చేస్తే ఫర్వాలేదు. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్, వీడియోలు అంటే కేవలం ప్రభుత్వ నేతల ప్రచారమే అత్యధికశాతం ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. దానికి తోడు ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లూయేన్సర్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో వచ్చే విషయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నమాట. అలాగే ఇండిపెండెంట్‌గా పనిచేసే యూట్యూబర్లు వెలికితీసే వాస్తవాలను ఖండించాలన్నమాట. వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లే పనిలో నేర్పరితనం ప్రదర్శించాలన్నమాట. డైవర్షన్ రాజకీయాలలో భాగస్వాములవ్వాలన్నమాట.ఇదీ చదవండి: దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్? ఉదాహరణకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధారాలు చూపుతున్నప్పుడు అవేవి సరికావన్నట్లుగా ప్రచారం చేయాలి. ఇలాంటి డైవర్షన్ విషయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఉండకపోవచ్చు. డీఎస్సీ స్కామ్‌పై నిరసన చెప్పడానికి వెళ్లిన వైఎస్సార్సీపీవారిపై దాడి చేసింది టీడీపీవారు లేదా టీడీపీ యువగళం టీమ్ అన్నది బహిరంగ రహస్యమే. వారే ఈ విషయం చెప్పుకున్నారు. కాని వ్యూహాత్మకంగా గురువులపై వైఎస్సార్సీపీ దాడి అని చంద్రబాబే ప్రచారం ఆరంభించారు. అది నిజం కాదని ఆయనకు తెలుసు. పోలీసులకు తెలుసు. లేదా రెండు వైపులా ఏమైనా గొడవ జరిగితే ఇరుపక్షాలకు చెందినవారిమీద కేసులు పెట్టవచ్చు.అదేమి కాకుండా వైఎస్సార్సీపీపైన ఎంత వీలైతే అంత బురద చల్లడం, జగన్‌పై పిచ్చి, పిచ్చి ఆరోపణలు చేయడంతో అసలు స్కామ్‌ను దారి మళ్లించాలన్నది వారి వ్యూహమన్నమాట. దీనికోసం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఎంత బాగా పనిచేసి అంతగా వ్యూస్ సంపాదిస్తే వారికి అంతగా డబ్బు వస్తుందన్నమాట. ఇదంతా టీడీపీ తరపున ఇప్పటికే పనిచేస్తున్నవారికి డబ్బులు ఇవ్వడానికే ఈ స్కీమ్ తెచ్చారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డీఎస్సీలో పరీక్షలు లేకుండా టీచర్ ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చి అప్రతిష్ట తెచ్చుకున్న నేపథ్యంలో ఈ స్కీమ్ ప్రకారం తమకు కావల్సిన వారికి ప్రభుత్వం డబ్బు ఇష్టారీతిన వెచ్చించే అవకాశం ఉండవచ్చన్నది కొందరి అనుమానం.ఒకవైపు ఇలా జనం డబ్బుతో వారినే మభ్య పెట్టడానికో, నమ్మించడానికో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, మరో వైపు పోలీసుల ద్వారా తమకు వ్యతిరేకంగా స్కామ్‌లను బయటపెడుతున్న సోషల్ మీడయాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో చివరికి అమెరికాకు చెందిన పోలీస్ వ్యవస్థ ఎఫ్‌బీఐ పేరుతో కూడా నకిలీ ఫిర్యాదులు చేయడానికి ఏపీ పోలీసు వ్యవస్థ సిగ్గుపడకపోవడం దారుణంగా ఉంటుంది.ఎవరైనా వేరే సంస్థ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టే పోలీసులే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు నకిలీ ఫిర్యాదులు చేయడం ఏమిటి? తద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వాస్తవ పోస్టులను తొలగించేలా చూడడం ఏమిటి? ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంతసేపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడం, వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం, వారి అక్కౌంట్లను మూసివేయించడం పనిలోనే బిజీగా ఉంటున్నట్లు కనిపిస్తుంది.ఎక్స్‌లో 150 ఖాతాలు తొలగింపచేశారట. సుమారు 800 పోస్టులు తొలగించారట. చివరికి జడ శ్రవణ్ వంటివారు మీడియా సమావేశాలలో చేసే విమర్శల వీడియోలు కొన్నిటిని సైతం ఇండియాలో కనబడకుండా చేస్తున్నారంటే ప్రభుత్వం సోషల్ మీడియాకు ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కొత్త ఐడియాను ప్రవేశపెట్టి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఉపాధి స్కీము కింద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారన్నమాట. అంత మాత్రాన ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత తగ్గుతుందా? అన్నది సందేహమే!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కడప టీడీపీలో కోల్డ్ వార్.. మాధవి రెడ్డిపై కాపు నేతల ఫైర్
-
పిచ్చికుక్క అని ముద్ర వేస్తావా.. మేమేంటో చూపిస్తాం
-
కోట్ల జయసూర్యప్రకాష్ పై బాబు సీరియస్..?
-
ఎలమంచలిలో కూటమి కొట్లాట వైరల్ అవుతున్న న్యూస్
-
టీడీపీలో పదవి చిచ్చు.. అర్ధరాత్రి ఇవేం దాడులు?
సాక్షి, కడప: కడప టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కడప మేయర్ పదవిని బలిజలకు కేటాయించాలని కోరుతూ కాపు జేఏసీ కన్వీనర్ విజయ్‌కుమార్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దీపక్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వ్యతిరేకంగా మేయర్ పదవి కోసం డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో.. అర్ధరాత్రి విజయ్‌కుమార్‌కు చెందిన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు బలిజ నేతలు ఆరోపిస్తున్నారు.జిల్లాకు వచ్చిన టీడీపీ ఎన్నికల పరిశీలకుడు దీపక్‌రెడ్డిని కలిసిన విజయ్‌కుమార్.. కడప మేయర్ సీటును బలిజలకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం స్థానిక టీడీపీలో వర్గ విభేదాలను మరింత తీవ్రతరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ప్రశ్నిస్తున్నందుకే తమ వర్గానికి చెందిన నేతలపై దాడులు జరుగుతున్నాయని కొందరు టీడీపీ బలిజ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే తీరును మరో బలిజ నేత చెన్నంశెట్టి మురళీ బహిరంగంగా ప్రశ్నించినట్లు వారు చెబుతున్నారు.మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం పంపిన నేతలను టీడీపీలోని కొందరు స్థానిక నాయకులు కలుస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కడప టీడీపీలో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. విజయ్‌కుమార్ కారును ధ్వంసం చేసిన ఘటనపై సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీలోని బలిజ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులెవరు, రాజకీయ విభేదాలే కారణమా అన్నది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: ‘డబ్బులిస్తాం.. డప్పుకొట్టిండి’ -
బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతుంది అందుకే చంద్రబాబు హడావిడి
-
దాడిపై అబ్బయ్య చౌదరిపై స్టాంగ్ రియాక్షన్
-
టీడీపీ ప్రాభవం కోల్పోవడం వల్లే పార్టీ మారా. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
-
టీడీపీ ప్రాభవం కోల్పోవడం వల్లే నేను పార్టీ మారా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ప్రాభవం కోల్పోయిందని, నాయుడు (చంద్రబాబునాయుడు)తో కలిసి పనిచేస్తే తెలంగాణలో ఇబ్బందని ప్రజలు చెప్పడం వల్లే పార్టీ మారానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నాడు కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యంతో ఉన్న ఎన్డీఏతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో పోరాడటానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. దేశ భవిష్యత్తును పునర్నిమించడంలో యువతకు ప్రాధాన్యత అవసరమన్నారు. జెన్ జీ సవాళ్లు, వారి ఆకాంక్షలను ప్రతిబింబించేలా పరిపాలన సాగాలని, యువతకు రాజకీయ ప్రాతినిధ్యం, విస్తృత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో వినూత్నంగా ప్రారంభించిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ద్వారా యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యలను రేవంత్ వివరించారు. మోదీకి మన్మోహన్సింగ్ సహకరించారు ‘నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి విషయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకరించారు. కానీ ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి విషయంలో సహకరించట్లేదు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు పిలిచే సమయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులను అడ్డుకుంది. ఇది నార్త్ వర్సెస్ సౌత్ కాదు.. గుజరాత్ వర్సెస్ మిగతా భారతదేశం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎంపీగా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ.. నిధులు మాత్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారు. ఎలక్షన్ కమిషన్‌ను మోదీ వాడుకుంటున్నారు.. నాడు బ్రిటిష్ వారు సైమన్ కమిషన్‌ను తీసుకొచ్చినట్లుగా ఇప్పడు మోదీ ఎలక్షన్ కమిషన్‌ను ఉపయోగించుకుంటున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారు. దేశంలో జనాభా తగ్గనప్పుడు ఓట్లు ఎలా తగ్గుతాయి? నాడు సైమన్ గో బ్యాక్ అని నినదించినట్లు ఇప్పడు ‘సర్’గో బ్యాక్ అని దేశమంతా ముక్తకంఠంతో నినదించాల్సిన సమయం వచ్చింది. ఆ రెండింటినీ ముడిపెట్టడం సరికాదు.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అనేవి పూర్తిగా భిన్నమైన అంశాలు. మహిళా రిజర్వేషన్ల అమలును జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ నిలిపేయకుండా, 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ను ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంది. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను విభజిస్తే, జనాభా నియంత్రణను సమర్థంగా పాటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఉత్తరాదికి ఎక్కువ సీట్లు వచ్చి, పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. కేవలం జనాభాను కాకుండా రాష్ట్రాల జీఎస్డీపీ, దేశాభివృద్ధికి ఇస్తున్న సహకారాన్ని పరిగణనలోకి తీసుకునే ‘హైబ్రిడ్ డీలిమిటేషన్ మోడల్’ను రూపొందించాలి. డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలి. తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం కావాలన్నారు.. సోనియాగాంధీ ఏ లక్ష్యాలతోనైతే తెలంగాణ ఇచ్చారో వాటన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను ఎందుకు పంపడం లేదని వారి తల్లిదండ్రులను అడిగితే ఇంగ్లిష్ మీడియం కావాలన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలో లోపాలు గుర్తించి, వాటిని సరిచేస్తున్నాం. పదో తరగతి తర్వాత చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఇస్తున్నాం. ఇంటరీ్మడియట్ తర్వాత స్కిల్స్ నేర్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం..’అని సీఎం చెప్పారు. -
టీడీపీ గూండాగిరి.. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత
ఏలూరు: వైఎస్సార్సీపీనే లక్ష్యంగా పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు.. మళ్లీ రెచ్చిపోయిన ఘటన ఏలూరులోని అశోక్‌నగర్‌లో చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ఆపీస్‌పై దాడికి యత్నించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు అశోక్‌నగర్‌లో భారీగా పోలీసులను మోహరించారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం.. టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. అటు దెందులూరు, ఇటు ఏలూరులోని వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా పేట్రేగిపోయాయి. టీడీపీ కార్యకర్తల దుశ్చర్యపై దెందలూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘ లా అండ్ డాక్టర్ ఏమైందో అర్థం కావటం లేదు. నిన్నే మా కార్యకర్తలపై రక్తం వచ్చేలా కొట్టి దాడి చేశారు. కొత్త రాజ్యాంగం ఏమన్నా నడుస్తుందో ఏమో అర్థం కావడం లేదు. జంగారెడ్డిగూడెం మా పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేగివాడలో.. మా కార్యకర్త కుటుంబంలో వివాహానికి వెళ్లి.. వస్తుండగా.. నా కారు పైకి వచ్చి నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. మాజీ శాసనసభ్యుడునైన నాకు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదా....?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: చంద్రబాబు సర్కారుపై కాకర్ల ధ్వజం -
అబ్బయ్య చౌదరిపై TDP గుండాల దాడి
-
ఫ్యామిలీ టూర్ పేరుతో నువ్వు నీ కొడుకు ఎక్కడి వెళ్తున్నారో చెప్పమంటావా
-
'పరిపాలన గాలికి వదిలేశారు' ప్రభుత్వంపై బొత్స సీరియస్
-
చంద్రబాబు మోహంలో ఆ రోజే మార్పు... ఆ కక్ష అంతా ఈ రోజు లాఠీ ఛార్జ్ తో తీర్చుకున్నాడు
-
ఉద్యోగాలు చేస్తాం.. ఊడిగం చేయం..! బాబు ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం
-
డేటా ఎందుకు తొలగించారు? YSRCP అశోక్ కుమార్ సూటి ప్రశ్నలు
-
పాపాఘ్నికి గర్భశోకం
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం అండతో టీడీపీ నేతలు రోజురోజుకు మరింత పేట్రేగిపోతున్నారు. ప్రకృతి సంపదను నిలువునా దోచేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పాపాఘ్ని నదిలో ఇసుకను తోడేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె నుంచి బెంగళూరుకు నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. చంద్రబాబు కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక తెలుగుతమ్ముళ్ల అక్రమార్జనకు మార్గంగా మారింది. కోట్లాది రూపాయలు సంపదను కొల్లగొడుతున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వెరశి పాపాఘ్ని నదికి గర్భశోకం తప్పడంలేదు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో పాపాఘ్ని నది ప్రవహిస్తోంది. పాపాఘ్నిలో నాణ్యమైన ఇసుక ఉంది. బెంగళూరు నగరంలో ఇసుక డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు దృష్టి పాపాఘ్నిపై పడింది. వేంపల్లె నుంచి నిత్యం 60కి పైగా టిప్పర్లు, వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలించుకెళ్తున్నారు. బెంగళూరులో టిప్పర్ ఇసుక ధర రూ.లక్షకు పైగా పలుకుతుండటంతో వీరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్లతో తవ్వకాలు తెలుగుదేశం పార్టీ నాయకులు వేంపల్లె, చక్రాయపేట మండలాల్లోని పాపాఘ్ని నదిలో పొక్లెయిన్లు పెట్టి యథేచ్చగా ఇసుక తవ్వేస్తున్నారు. రెండు మండలాల్లో నిత్యం వంద టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సమీప బంధువు కనుసన్నల్లో రెండు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా కోసం పాపాఘ్ని నదిలో ఏకంగా గ్రావెల్ మట్టితో రోడ్డు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఇసుకను డంప్ చేసి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలించారు. ఆపై ఏకంగా పాపాఘ్ని నదిలోకి గ్రావెల్ మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్లు, టిప్పర్లతో నేరుగా తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన గోతుల్లోని వర్షపునీటిలో చిక్కుకుని అద్దాలమర్రి వద్ద అన్నదమ్ములైన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. అయినా అధికారుల్లో చలనం కనిపించలేదు. మరోవైపు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, ఇసుక తరలింపు ఆపాలని రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగినా అధికారులు పట్టించుకోలేదు. పైగా అక్రమార్కులు రైతులపై దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే బంధువు అండ పాపాఘ్ని నది జిల్లాలో పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో ప్రవహిస్తోంది. వేంపల్లె, చక్రాయపేట ప్రాంతాల్లో పులివెందుల టీడీపీ నేత సమీప బంధువు కనుసన్నులల్లో ఇసుక అక్రమ రవాణా నడుస్తుంటే, వీరపునాయునిపల్లె, పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు అండతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. టీడీపీ నేతలు ప్రధాన పట్టణాలు, నగరాలకు ఇసుక తరలిస్తున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య అధికారికి నెల మామూళ్లు అందుతుండటం వల్లే ఇసుక అక్రమ రవాణా గురించి రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
‘చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఎవరికీ రక్షణ లేదు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఈ నిరంకుశ పాలనలో ఎవరికీ రక్షణ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యలపై నిరసనలు తెలిపితే అరెస్టులు చేయటం దుర్మార్గం అంటూ దుయ్యబట్టారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతారా?’’ అంటూ నిలదీశారు.‘‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు సహించలేక పోతోంది?. ఉన్నతాధికారులతో గ్రామ సచివాలయ ఉద్యోగులను వేధించటం అన్యాయం. ఉద్యోగులపై వేధింపులను చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంటోంది. సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు విదేశాలలో రహస్య పర్యటనకు వెళ్లటం సిగ్గుచేటు. శాప్ ఆఫీసు ఎదుట నకిలీ టీచర్లతో నకిలీ ధర్నాలు చేయించిన ఘనత ఈ ప్రభుత్వానిది’’ అని లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గ్రామ సచివాలయ ఉద్యోగులు ధర్నా చేయిద్దని పోలీసులతో నోటీసులు ఇప్పిస్తారా?. ఉద్యోగులకు సమస్యలు ఉండవా? పరిష్కారం కోరుకోకూడదా?. ఉద్యమిస్తే ఉక్కుపాదంతో అణచివేయడం దుర్మార్గపు చర్య. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా చిన్నవారు. అలాంటి వారిపైకి పోలీసులను ఉసిగొల్పటం అన్యాయం. సాటి ఉద్యోగుల విషయంలో పోలీసులు కూడా సంయమనం పాటించాలి. తోటి ఉద్యోగులపై లాఠీలు ఝుళిపించటం సరికాదు’’ అంటూ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా పని చేసింది ఈ నిరుద్యోగులే. అలాంటి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి. సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వటం లేదు. ఈ దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘రక్షక భటులు.. రాక్షస భటులుగా మారిపోయారు’ -
‘రక్షక భటులు.. రాక్షస భటులుగా మారిపోయారు’
సాక్షి, తాడేపల్లి: గ్రామ సచివాలయ ఉద్యోగులపై ఉక్కు పాదం అన్యాయం.. వారు రాజ్యాంగబద్దంగా గళాన్ని విప్పితే అణచివేస్తారా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే అరెస్టు చేసిన వందలాది మంది ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను తెస్తే చంద్రబాబు దాన్ని సర్వనాశనం చేశారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులను లాఠీలతో కొట్టించటం అన్యాయం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరితే కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం చేసిన మా వాళ్లపై పోలీసులతో దాడులు చేయించారు. ఆ దాడుల్లో మా నేత కాకుమాను రాజశేఖర్ చనిపోయారు. రక్షక భటులు రాక్షస భటులుగా మారిపోయారు’’ అని టీజేఆర్ ధ్వజమెత్తారు.ఈ ఘటనకు బాధ్యడిని చేస్తూ డీజీపీపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు సహేతుకమైనవి. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం వేధింపులకు దిగటం అన్యాయం. శాప్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?. మా ఎమ్మెల్సీలు తలశిల, లేళ్ల అప్పిరెడ్డి రౌడీషీటర్లు అయితే చంద్రబాబు, లోకేష్ కూడా రౌడీషీటర్లే. కరోనా సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులే ప్రజలను కాపాడారు. అలాంటి వారి సమస్యలు పరిష్కారం చేయకపోగా పోలీసులతో కొట్టిస్తారా?’’ అంటూ టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సీఎం పర్యటనల ఈవెంట్స్ ఖర్చు రూ.44.62 కోట్లు -
మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు
-
రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ కర్కశం: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకి నష్టాలేనని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మండలంలో ఈదురుగాలులకు నేలకు ఒరిగిన బొప్పాయి, అరటి పంటలను బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పరిశీలించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అరటి, బొప్పాయి రైతులకు లక్షల్లో పెట్టుబడి నష్టం కలిగిందన్నారు.‘‘ఈ సర్కార్‌కు దయ దాక్షిణ్యం లేదు. ఎంతసేపు దోచుకోవడమే. మీ ప్రభుత్వం తాలూకా రైతు విధానం ఏంటి? విపత్తుల్లో ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. చాలా కర్కశంగా ఉంది. బొప్పాయి, అరటికి పెట్టుబడి నష్టం ఇవ్వండి. అరటి, బొప్పాయికి ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలి. మొక్కజొన్నకి రూ.50 వేలు ఇవ్వాలి. గత తుపాను నష్టం కూడా ఇప్పుడు కలిపి ఇవ్వాలి’’ అని బొత్స డిమాండ్ చేశారు.‘‘మూడు రోజులుగా గ్రామాల్లో కరెంటు లేదు.. ఇప్పటికి పునరుద్ధరణ చేయలేదు. కరెంటు ఆగితే ప్రత్యామ్నాయం ఎందుకు చేయలేదు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు నష్టం జరిగింది క్రాప్ ఇన్సూరెన్స్ కాకి ఎత్తుకెళ్లిపోయింది. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టేది. ఈ ప్రభుత్వం కట్టడం లేదు.. ఈ ప్రభుత్వంలో రైతులు ఎలా బతుకుతారు?. ఏమైనా అడిగితే, సమాధానం చెప్పకుండా రాజకీయం చేస్తున్నారు’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.ఇదీ చదవండి: 8 చక్కెర కర్మాగారాల అమ్మకం -
చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్
-
మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం
-
పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాల దాడి...
-
చంద్రబాబు సర్కార్‌పై అమరావతి రైతుల ఆగ్రహం
సాక్షి, గుంటూరు: ‘‘అధికారులు వస్తారు.. పోతారు.. గ్రామ కంఠం విషయంలో తొలిరోజు నుంచి మాకు నష్టమే. బంగారం బిస్కెట్లు, డబ్బులు ఇచ్చినవారికి కిలో మీటర్ దూరం కూడా గ్రామకంఠం కిందే ఇచ్చారు. గతాన్ని తవ్వితే చాలా ఇబ్బందులు వస్తాయని పెమ్మసాని చెప్పారు. గతంలో జరిగింది అధికారుల పొరపాటు కాదు.. రాజకీయ ప్రేరేపితంతోనే ఇచ్చారు’’ అంటూ అమరావతి రైతులు మండిపడ్డారు.‘‘అసైన్డ్ భూములు, ఎండోమెంట్ భూములు, లంక భూములు , గ్రామకంఠం భూముల మీద సిట్ విచారణ జరిపించాలి. వీటన్నింటికీ మూల కారకుడు మంత్రి నారాయణ. నారాయణకు రైతు బాధలు తెలియవు. నారాయణ కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చాడు. రైతులను మభ్య పెట్టి లబ్ధి పొందడం తప్ప నారాయణ మరొకటి తెలియదు...మంత్రి నారాయణపై సిట్ విచారణ జరపాలి. సిట్ విచారణలో అధికారులను రెండో పార్ట్‌గా చేర్చాలి. సిట్ వేయడం వల్లే సాయికృష్ణ కేసులో నిజం బయటికివచ్చింది. గ్రామం కంఠాల విషయంలో చంద్రబాబు ఎందుకు జోక్యం చేసుకోడు. గ్రామ కంఠాల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలి’’ అని అమరావతి రైతులు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే? -
చేతకాని సన్నాసులు.. దద్దమ్మలు... మతం, కులం అంటూ కొట్టుకుంటున్నారు
-
YSRCP అంటే నీకు భయం..! ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ నేత సంచలన ఆడియో
-
వంగవీటి రంగాను ఘోరంగా అవమానించిన టీడీపీ నేతలు
-
టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి భారీ షాక్
సాక్షి, కడప: కడపలో అధికార టీడీపీలో రాజకీయ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ నేత చెన్నంశెట్టి మురళీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల బలంతో గెలిచారని, ఇప్పుడు అదే కార్యకర్తలను పక్కనపెట్టి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘దమ్ముంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు నిలబెట్టే అభ్యర్థులను గెలిపించుకోండి’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. దీంతో, టీడీపీ నేతల రాజకీయం చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లలో కడప టీడీపీని నాశనం చేశారని ఆరోపిస్తూ చెన్నంశెట్టి మురళీ ఆడియో విడుదల చేశారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులను విస్మరించి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంట అసలైన టీడీపీ కార్యకర్త ఒక్కరూ లేరని వ్యాఖ్యానించారు. కడప కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మాధవిరెడ్డి గెలుపు కోసం పోరాడి, కేసులు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలను సైతం విస్మరించారని మురళీ ఆరోపించారు. చివరకు సొంత పార్టీ కార్యకర్తలపైనే దాడులకు దిగుతూ కేసులు పెట్టించడం దారుణమని అన్నారు.మంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేసినా, పోలీసుల అండతో.. రౌడీషీటర్ల సహకారంతో ఎన్నికలకు వెళ్లినా ఓటమి తప్పదని మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా మీ ఓటమి ఖాయం. ప్రస్తుతం ఎమ్మెల్యే మాధవి రెడ్డి కంటే వ్యతిరేక వర్గానికే అధిక బలం ఉందని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే ఇప్పుడు మీ సొంత బలంతో గెలవండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కడప టీడీపీలోని అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి.ఇదీ చదవండి: వరదల్లో ప్రజలు.. ఫారిన్ టూర్లో చంద్రబాబు ఫ్యామిలీ -
అనపర్తిలో ఆగని కూటమి అరాచకాలు
అనపర్తి(తూర్పుగోదావరి జిల్లా): జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో కూటమి అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన కుటుంబంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఒకే కుటుంబానికి చెందిన ముత్యం వీరబాబు, సత్తిబాబు, సూర్యవేణిలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. తొలుత వారితో ఘర్షణకు దిగి వారు ఉంటున్న ఇంటిని కూల్చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పరామర్శించారు. -
ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషి పై అలాంటి నిందలు వేయడానికి సిగ్గుగా లేదా చంద్రబాబు
-
ఇదేనా లోకేష్ మీకు నేర్పిన సంస్కారం.. యువగళం టీమ్ వార్నింగ్
-
‘అక్రమాలపై ప్రశ్నిస్తే అర్ధరాత్రి ఇళ్లలో చొరబడతారా?
సాక్షి, తాడేపల్లి: తమపై అక్రమ కేసులకు నిరసనగా రేపు(శనివారం) సీపీని కలుస్తాం.. అక్రమ కేసులపై ప్రశ్నిస్తామని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలో చొరబడతారా? అంటూ దుయ్యబట్టారు. జైల్లో ఉంచటానికి అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. నారా లోకేష్ పెత్తనంలో పోలీసులు వైఖరి ఇలా ఉంది’’ అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అసలు ఈ సెక్షన్లు ఎలా పెడతారని కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వ లాయరు దగ్గర సమాధానం లేదు. వైఎస్సార్సీపీ నేతలందరిపై రౌడీముద్ర వేయాలని చూస్తున్నారు. కాదంబరి జత్వానీ కేసులో కూడా పోలీసులు దగ్గరుండి దుర్గగుడికి తీసుకెళ్లారు. ఇప్పుడు దొంగ టీచర్లను కూడా అలాగే దుర్గ గుడికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. అప్పుడు జత్వానీనీ, ఇప్పుడు దొంగ టీచర్లను కాక పడుతున్నారు. కానీ ఈ కేసులు ఏవీ నిలబడవు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.‘‘కాకుమాను రాజశేఖర్ మృతికి పోలీసుల వైఖరే కారణం. శాప్ ఎదుట ధర్నాలో పాల్గొన్న రాజశేఖర్‌పై పోలీసులు దాడి చేశారు. రౌడీషీట్లు ఇష్టానుసారం ఓపెన్ చేయటం సిగ్గుచేటు. ఈడీ కేసులకు భయపడను. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. ఎల్లోమీడియాలో ఊహా కథనాలు రాస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: సాయం అంటే ఇది.. థాంక్యూ జగన్ మామయ్య -
నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి
-
వంచనలన్నీ దాచేసి.. ప్రజాధనంతో అబద్ధాల ప్రచారమా?
ముఖ్యమంత్రిగారూ.. 20 లక్షల ఉద్యోగాలన్నారు.. లేదంటే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,000 చొప్పున ఇస్తానన్నారు. రెండున్నరేళ్లలో రూ.90 వేలు ఎగ్గొట్టారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మోసాన్ని ప్రచారం చేయడానికేనా? ఓ నిరుద్యోగి ప్రశ్న ఇది.ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తానన్నారు. రెండున్నరేళ్లలో రూ. 45 వేలు ఎగ్గొట్టారు. సోషల్ మీడియాలో ఈ మోసాన్ని ఎలా ప్రచారం చేయించబోతున్నారు? 18 ఏళ్లు నిండిన ఓ యువతి ప్రశ్న ఇది.50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పించన్లన్నారు. ఈ రెండున్నరేళ్లలో రూ. 1,20,000 ఎగ్గొట్టారు. ఈ వంచనను ఎలాంటి వీడియోలతో పాపులర్ చేయబోతున్నారు? 50 ఏళ్లు దాటిన అనేకమంది వేస్తున్న ప్రశ్న ఇది.ఐదు డీఏలు పెండింగ్.. పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు.. రూ. 40వేల కోట్లకు పైగా పెండింగ్.. అధికారంలోకి రాగానే అమలుచేస్తానని అనేక వాగ్దానాలు చేశారు.. మోసపోయాం.. ఈ అన్యాయాన్ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు? ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రశ్న ఇది. సాక్షి, అమరావతి: రెండున్నరేళ్లయింది. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మనసు రావడం లేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి అమలు చేయడానికి, 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి చేతులు రావడం లేదు. ఉద్యోగుల బకాయిలకు దిక్కులేదు. సున్నావడ్డీ పథకానికి సున్నా చుట్టేయడంతో డ్వాక్రా మహిళల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిల ఊసెత్తకపోవడంతో విద్యార్థులు చదువులు మానేయాల్సిన పరిస్థితి. లేదా అప్పులు చేసి కట్టాల్సివస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. సూపర్‌సిక్స్, సూపర్ సెవన్ వాగ్థానాలన్నీ అటకెక్కాయి. ఇచ్చిన హామీలే కాదు.. గత ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలకు నీళ్లొదిలేశారు. ‘ఎంత మోసగాడివయ్యా బాబూ’ అని జనం చర్చించుకుంటున్నారు. సంపద సృష్టిస్తానంటూ బీరాలు పలికి లక్షల కోట్ల అప్పులతో బండి నడిపిస్తూ అదేదో గొప్ప విజనరీ పరిపాలనలా ఎల్లో మీడియాలో ప్రచారం చేయించుకోవడం.. ‘వాట్ ఎ థాట్.. వాట్ ఏ విజన్’.. పాలన పాతాళంలో... ప్రచారం మాత్రం ఆకాశంలో... చేయనిది చేసినట్టు చెప్పుకోవడంలో చంద్రబాబును మించినవారెవరూ లేరు. ఇప్పటికే సాగుతున్న ఈ బూటకపు ప్రచారాన్ని ఇంకా కొత్త ఎత్తులకు తీసుకెళ్లడం కోసం చంద్రబాబు సర్కార్ కొత్త కొత్త మార్గాలను వెతుకుతోంది. కొత్తగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో సొంత డబ్బా కొట్టించుకునేందుకు ఓ పాలసీ తెచ్చారు. ఇందుకోసం కోట్లు కోట్లు కుమ్మరించబోతున్నారు. అంటే ఐటీడీపీ వంటి ఆన్లైన్ పసుపు దళానికి దీపావళి ముందుగానే వచ్చేసిందన్నమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆ ముసుగులో తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం జోరుగా చేస్తున్న వారి కోసమే ఈ పాలసీ. వాళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికే ఈ పాలసీ. ఎంపిక చేసిన ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు నెలకు రూ.1.5 లక్షల వరకు ఇవ్వబోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేయబోతున్నారో.. భగ్గుమంటున్న రాష్ట్రం.. ఎన్నికల మేనిఫెస్టోలో అలవిమాలిన హామీలిచ్చిన చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు ఎగ్గొట్టి దాదాపు రూ.2,06,744.46 కోట్లకు పైగా పంగనామం పెట్టడంపై రాష్ట్రప్రజలు రగిలిపోతున్నారు. ఈ మోసాలపై ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం ప్రచారం చేస్తారని నిలదీస్తున్నారు. హామీ ఇచ్చిన పథకాలకు దిక్కులేదు కానీ ప్రచారం కోసం కోట్లు కోట్లు ప్రజాధనం వ్యయం చేస్తుండటం మరింత ఆగ్రహావేశాలను రగిల్చింది. చేసిందేమీ లేకపోయినా ప్రచారం కోసం కొత్తగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాలసీ తీసుకురావడంపై నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకాలకు డబ్బులు లేవంటూనే ప్రచారం కోసం కోట్లు కుమ్మరిస్తుండడంపై మండిపడుతున్నారు. ముందు మాకిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంత ప్రచారం చేస్తే అంత డబ్బు.. ఇప్పటికే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా సోషల్‌మీడియా ప్రచారానికి కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వీరిని మరింత విస్తృతంగా వినియోగించుకోవడానికి ఏకంగా ఒక పాలసీనే తీసుకువచ్చింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాలసీ(ఎస్ఎంఐఎస్)కి ఆమోదముద్ర వేసింది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను గుర్తించి వారి చేత ప్రచారం చేయించడానికి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయనున్నారు. డిజిటల్ ప్రచారం, ప్రజా సమాచారాన్ని బలోపేతం చేయడానికి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లతో సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీ ముసాయిదాను రూపొందించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు. ఈ పాలసీ కింద లక్ష మందికిపైగా ఫాలోయర్స్ ఉన్నవారు వారే స్వయంగా ఒక వీడియో తయారు చేస్తే రూ15,000 చెల్లిస్తారు. అదే ఫాలోవర్స్ సంఖ్య 50,000 నుంచి లక్షలోపు ఉంటే రూ.7,500, ఫాలోవర్స్ 25,000 నుంచి 50వేలు లోపు ఉంటే రూ.5,000, 10వేల నుంచి 25వేల లోపు ఫాలోవర్స్ ఉంటే రూ.2,500 ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. అదే ప్రభుత్వమే కంటెంట్ ఇస్తే రూ.500 నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారు. ఈ విధంగా ఒకొక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌కు గరిష్టంగా నెలకు రూ.1.50 లక్షలు చెల్లించనున్నారు. ఇందుకోసం విశ్వసనీయ ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి, ధ్రువీకరించి వీరందరినీ ఎంప్యానల్ చేసి తొలుత ఏడాదిపాటు వినియోగించుకుంటామని, ఆపైన అవసరమైతే మరో రెండేళ్లు వినియోగించుకుంటామని తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కోసమే.. లోకేశ్ యువగళం పాదయాత్రలో పనిచేసిన టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను అడ్డంగా వాడుకుంటున్నారు. కార్యకర్తలను భారీ వేతనాలతో ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో నియమించుకున్నారు. సోషల్ మీడియా ప్రత్యేక అధికారి, కంటెంట్ డెవలపర్స్, అనలిస్టులు, డిజిటల్ ప్రచారకులు పేరిట 85 మందికిపైగా ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకొని వీరికి నెలకు రూ.25 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. వీరికి అదనంగా ప్రతీ మంత్రి పేషిలో జరిగే కార్యకలాపాలు తక్షణం తెలుసుకోవడానికి 48 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించారు. వీరంతా ఆ మంత్రిత్వ శాఖలో జరిగే కార్యక్రమాలు కాకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తూ పోస్టింగ్‌లు, కథనాలను తయారు చేస్తుంటారు. గత రెండేళ్ల కాలంలో కేవలం సోషల్ మీడియా కార్యకర్తల కోసమే సుమారు రూ.160 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయడం గమనార్హం. ఇప్పుడు దీనికి అదనంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను నియమించుకొని మరిన్ని వందల కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. అబద్ధపు ప్రచారానికి ప్రజల సొమ్మా?చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నమ్మి పింఛన్ కోసం ఎదురు చూస్తున్న 50 ఏళ్లు దాటినవారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారందరికీ మొండిచేయి చూపించి సోషల్ మీడియా వారికి నెలనెలా లక్షలకు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గం. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేసేవారికి ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తున్నారంటే ఇంతకంటే అన్యాయం ఎక్కడా ఉండదు. – గుణ్ణం రామకృష్ణ, కొత్తూరు, రామచంద్రపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాహామీలకు దిక్కులేదు కానీ..హామీలు అమలు చేసేందుకు ఖజానాలో సొమ్ములేదని చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులకు లబ్ధి చేకూర్చేందుకు జీఓ జారీచేశారు. ప్రజాధనంతో ప్రచారానికి తెరతీశారు. ఇదెక్కడి అన్యాయం. నిరుద్యోగ భృతి లేదు. ఆడబిడ్డ నిధి లేదు. పింఛన్లు లేవు. పార్టీ అనుకూల వర్గాలకు లబ్ధిచేకూర్చడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. – రాజేంద్రనాయుడు, పొట్లి గ్రామం, విజయనగరంజిల్లామీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకేనా..చంద్రబాబు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. హామీలను అటకెక్కించారు. రాజకీయ లబ్ధి కోసమే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ఐటీడీపీ కార్యకర్తలకు భారీగా నిధులు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఆడబిడ్డ నిధిలేదు. 50 ఏళ్లకే పింఛన్ లేదు. కానీ సోషల్ మీడియా పేరుతో ఏ విధంగా డబ్బులు ఇస్తారు? – గాతల సందీప్, జువ్వలపాలెం, పశ్చిమగోదావరి జిల్లాసొంత డబ్బాకు... ప్రజాధనమా....!బాబు సర్కార్ సొంత ప్రచారం కోసం ప్రజాధనాన్ని వెచ్చించేందుకు మరో ఎత్తు వేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్స్ పాలసీ అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇది కేవలం టీడీపీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని ధారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండన్నరేళ్లు గడిచినా నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అంటూ ప్రగల్భాలు పలికి మహిళలను నిలువునా ముంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50ఏళ్లకే పింఛన్ మాటే ఎత్తడంలేదు. ఇంతదారుణంగా ఇచ్చిన హామీలకు తిలోదకాలు వదిలి, టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఇన్‌ఫ్లూయన్సర్ పాలసీని తెస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను నమ్మించే ప్రయత్నం తప్ప ప్రజలకు ఒరిగేది ఉండదు. – సుందరరాజు, నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, తిరుపతి -
గవర్నర్ ఆశ్చర్యపోయారు: అంబటి
సాక్షి,గుంటూరు: ‘‘డీఎస్సీ స్కామ్‌లో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది’’ అని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్.. డీఎస్సీలో జరిగిన స్కాం గురించి చెబుతుంటే గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి.. వారి కోసం పోరాటం కొనసాగిస్తామని అంబటి అన్నారు.‘‘డీఎస్సీలో అన్యాయం జరిగిందని విజయవాడ శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాం. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసినట్లు మా నాయకులు, కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తే చూస్తూ ఊరుకోం. 21వ తేదీన ఆందోళన చేస్తామని కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. అక్కడకు వాళ్లు చెబుతున్న గురువులు ఎందుకు వచ్చారు?. లోకేష్ దళం మాపైన దాడి చేస్తే పోలీసులు మాపైన కేసులు పెట్టారు. కొంతమంది పోలీసులు లోకేష్ చెప్పినట్లు చేస్తున్నారు. వాళ్లు పోలీసులు రూపంలో ఉన్న రౌడీలు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.డీజీపీ, సీపీకి చెప్తున్నా.. మీకు ఎవరెవరు కావాలో పేర్ల లిస్టు ఇస్తే వాళ్లందరం ప్రత్యేక బస్సుల్లో విజయవాడ కమిషనర్ కార్యాలయానికి వస్తాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి. రాత్రిపూట దొంగచాటుగా కోర్టులో హాజరు పరచడానికి సిగ్గుండాలి. ఎస్సీలుపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి పోలీసులకు సిగ్గుండాలి. నన్ను ఇవాళ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీలో వికసించిన 'అవినీతి' -
ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...
-
క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!
-
బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు.. తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించారు. పోలీసులకు ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు వార్నింగ్ ఇస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ నెల 20న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరగ్గా.. పోలీసులకు టీడీపీ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.టీడీపీ నేత చిట్టి రాయల్ అనుచరుడు గిరి, చిట్టి రాయల్ తల్లి హేమలత వీరంగం సృష్టించారు. తమవాళ్లను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. తాను ఎమ్మెల్యే పులివర్తి అనుచరుడునంటూ వీరంగం సృష్టించిన గిరి.. లోకేష్‌తో చెప్పి అందరినీ సస్పెండ్ చేయిస్తానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. వీడియో తీస్తున్న ఓ పోలీసును కొట్టడానికి టీడీపీ కార్యకర్త గిరి దూసుకెళ్లాడు. చంద్రబాబుకు చెప్పిన భయపడేది లేదంటూ గిరి రెచ్చిపోయారు.ఇదీ చదవండి: కడుపు మండి.. జనసేన నేతపై గన్‌తో దాడి -
అయ్యప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వచ్చే ఎన్నికల్లో కూటమి కొట్టుకుపోవడం పక్కా
-
టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి
-
రౌడీ షీట్లకు బ్రేక్.. బాబు యూ టర్న్
-
సీట్లు ఎవరో వేసే బిచ్చం కాదు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
నా కార్యకర్త జోలికొస్తే... సినిమా చూపించేస్తాం..
-
కడుపు మండి.. జనసేన నేతపై గన్‌తో దాడి
ప్రశాంత విశాఖ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. అది ఎంతగానంటే.. బిహార్ నుంచి గన్ కొనుగోలు చేసి మరీ.. కాల్పులు జరిపేంత! తాజాగా నగరంలో కలకలం రేపిన జనసేన నేతపై గన్ కాల్పుల వ్యవహారంలో.. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యానికి ఉపాధి కోల్పోయిన ఓ వ్యక్తి కడుపు మంటే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా బయటపడుతోంది.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండు బిర్యానీ పాయింట్ల వ్యవహారంలో మొదలైన పంచాయితీ.. ఓ వ్యక్తి కడుపు మంటకు కారణమయింది. ఆర్థిక నష్టం కాస్తా.. కక్షగా మారి గన్ కాల్పుల దాకా వెళ్లింది. ప్రతి నెలా రూ.6 లక్షల లాభాన్ని తెచ్చిపెట్టే తన వ్యాపారాన్ని బలవంతంగా లాక్కోవడమే ఎమ్మెల్యే అనుచరుడు మద్ది రాజశేఖరరెడ్డిపై గునుకుల సాయినారాయణ గన్ కాల్పులకు తెగబడేందుకు దారి తీసింది. బిర్యానీ పాయింట్ల విషయంలో జరిగిన ప్రైవేటు పంచాయితీనే ఈ ఘటనకు మూలమని దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సాయి నారాయణతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. రూ.20 వేల రోజువారీ ఆదాయంపై కన్ను? విశాఖ సౌత్ జైల్ రోడ్ పరిధిలో నరేంద్ర, సాయినారాయణ కలిసి రెండు బిర్యానీ పాయింట్లు నిర్వహిస్తున్నారు. వ్యాపారం బాగుండటంతో ఒక్కో పాయింట్ నుంచి రోజుకు సుమారు రూ.10 వేల చొప్పున నెలకు రూ.6 లక్షల ఆదాయం వచ్చేది. దీంతో వీటిపై సదరు ఎమ్మెల్యే అనుచరుడి కన్ను పడింది. ఈ క్రమంలో మొదట టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ వద్ద పంచాయితీ జరిగింది. చెరో బిర్యానీ పాయింట్ తీసుకోవాలని సూచించినా వినకపోవడంతో.. ఎమ్మెల్యే కీలక అనుచరుడి దగ్గరకు పంచాయితీ వెళ్లింది. రూ.10 లక్షలు డీడీ తీసుకుని రెండు బిర్యానీ పాయింట్లను రాజశేఖరెడ్డికి వదిలి వెళ్లిపోవాలంటూ సాయిని హెచ్చరించారు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజీకి ఒప్పించి, తీవ్ర ఆర్థిక నష్టానికి కారణమైన రాజశేఖర్‌రెడ్డిపై సాయి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. మూడున్నర నెలలు...మూడు రౌండ్ల ట్రయల్...! నాలుగు నెలల క్రితం ఈ ప్రైవేట్ పంచాయితీ జరిగింది. మూడున్నర నెలల నుంచి అక్రమ ఆయుధ కొనుగోలుకు సాయి ప్రయతి్నంచాడు. బిహార్‌కు వెళ్లి మరీ గన్ కొనుగోలు చేశాడు. బిహార్‌లో ఎక్కడెక్కడ గన్స్ విక్రయిస్తారో తెలుసుకుంటూ గల్లీగల్లీ తిరిగి మరీ ఓ వ్యక్తిని కలిశాడు. సదరు వ్యక్తి సాయి కళ్లకు గంతలు కట్టి, అక్రమ ఆయుధాల కారాగారం వద్దకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు చెల్లించి 7.65 ఎంఎం సైజ్ గన్, పది రౌండ్ల బుల్లెట్లు కొనుగోలుచేశాడు. అక్కడే మూడు రౌండ్ల బుల్లెట్లు కాల్చి మరీ కాల్పులు జరిపేందుకు ట్రయల్ వేశాడు. మిగిలిన బుల్లెట్లతో పాటు గన్ తీసుకుని విశాఖ చేరుకున్నాడు. సౌండ్ వచ్చింది.. బుల్లెట్ రాలేదు దాడికి రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 12న రాత్రి 11:30 నుంచి 12 గంటల సమయంలో నీలమ్మ వేపచెట్టుకు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం ఎదురుగా రాజశేఖర్‌రెడ్డి తన బైక్ అపి దిగేటపుడు కాల్పులు జరిపాడు. తుపాకీ నుంచి శబ్దం వచ్చినా.. గుండు పేలనట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన రాజశేఖర్ పెద్దగా కేకలు వేయడంతో... అక్కడి నుంచి సాయి బైక్ మీద పరారయ్యాడు. కానిస్టేబుల్‌కు తెలిసినా.. రాజశేఖరరెడ్డి గతంలో హోంగార్డుగా పనిచేశాడు. స్థానిక స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్‌కు తనపై దాడి సమాచారం అందించాడు. ఫిర్యాదు మాత్రం చేయలేదు. సదరు కానిస్టేబుల్ కూడా ఈ కాల్పుల వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం గమనార్హం. చివరకు ఘటన జరిగిన 9 రోజుల తర్వాత తనకు ప్రాణ హాని ఉందని భావించి రాజశేఖర్ ఈ నెల 21 న టూ టౌన్ పోలీసులకు పిర్యాదు చేశాడు. విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు... గొల్లల పాలెంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కాల్పులకు తెగబడ్డ సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాటు తుపాకీ స్వా«దీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనపై ముందే సమాచారం ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లని కానిస్టేబుల్‌ను కనీసం హెచ్చరించకపోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారానికి కీలకమైన ప్రైవేట్ పంచాయితీ చేసిన మాజీ కార్పొరేటర్‌తో పాటు ఎమ్మెల్యే కీలక అనుచరుడి జోలికి మాత్రం పోలీసులు వెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పూ–నిప్పూ కలిసే పంచాయితీ! దక్షిణ నియోజకవర్గంలో జనసేన–టీడీపీ మధ్య వ్యవహారం ఉప్పూ–నిప్పులా ఉంది. అయితే జనసేన ఎమ్మెల్యే అనుచరుడు చేసిన ఈ దందాలో టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కూడా చేయి కలపడం గమనార్హం. జనసేన ఎమ్మెల్యే అంటే మండిపడుతూ ఉండే సదరు టీడీపీ మాజీ కార్పొరేటర్ కాస్తా... ఈ ప్రైవేట్ సెటిల్మెంట్లో తలదూర్చినట్టు పోలీసు విచారణలో కూడా తేలిందని సమాచారం. అయితే, ఈ కాల్పుల ఘటనను కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంగా చూపిస్తూ... కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే కీలక అనుచరుడితోపాటు మాజీ కార్పొరేటర్ జోలికి పోలీసులు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం
-
ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..
-
చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం
-
రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఉండదు.. ఏ జైలో నువ్వే సెలెక్ట్ చేసుకో..
-
లోకేశ్‌తో చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా
సాక్షి, తిరుపతి: పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు హల్చల్ చేసిన ఘటన తిరుపతి రూరల్‌లో కలకలం రేపింది. వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన గొడవలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. వారిని విడిపించేందుకు వచ్చిన స్థానిక టీడీపీ నేతలు ఆదివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేసిన వీడియో మంగళవారం వెలుగులోకివచ్చింది. తిరుపతి రూరల్ మండలం, లింగేశ్వరనగర్ పంచాయతీ, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అనుచరులైన చిట్టి రాయల్, అతని తల్లి హేమలత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా యువకుల మధ్య గొడవ జరగడంతో పరస్పరం బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారన్న ఫిర్యాదులపై పోలీసులు ఒక వర్గం నుంచి ఇద్దరు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ విషయం తెలుసుకున్న చిట్టి రాయల్ తన తల్లి టీడీపీ మహిళా నాయకురాలు హేమలతతో కలసి ఆదివారం అర్ధరాత్రి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై చిందులేశారు. గట్టిగట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారు. పోలీసులు తీసుకువచ్చిన యువకులను బలవంతంగా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు తీసుకువచ్చిన యువకులను బలవంతంగా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న చిట్టిరాయల్ పోలీసుల విధుల్లో జోక్యంపై చర్చ ఒక కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న టీడీపీ నాయకులు.. సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, హెచ్చరికలు చేయడం వంటి పరిణామాలు పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీశాయి. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లోకేష్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా పోలీసులతో వాగ్వాదం సందర్భంగా చిట్టి రాయల్ మాట్లాడుతూ ‘ఖాకీ యూనిఫాం లేకుంటే ఇక్కడే సినిమా చూపించుండే వాడిని.. మా వాళ్లను ఎలా తీసుకొస్తారు ? విజయవాడకు వెళ్లి మంత్రి నారా లోకేష్‌కు చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా. మీకు ఎంత ధైర్యం ఉంటే మా వాళ్లను తీసుకొస్తారు.. మీ సంగతి తేలుస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలను ఓ పోలీసు కానిస్టేబుల్ వీడియో రికార్డు చేస్తుండగా.. అతనిపైకి చిట్టి రాయల్ దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: సాయికృష్ణ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం -
జనసేనకు ఎన్ని సీట్లు? '100% స్ట్రైక్ రేట్' వెనుక పవన్ వ్యూహమేంటి?
-
బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?
ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆవేదన కలిగిస్తాయి. ఈవీఎంలు మాయ కాకుండా నిజంగానే ప్రజల ఓట్లతోనే బీజేపీ, టీడీపీ,జనసేన కూటమి గెలిచి ఉంటే ఇంత అరాచకంగా, అధ్వాన్నంగా పాలన సాగిస్తుందా?అన్న సందేహం రోజురోజుకు బలపడుతోంది. విజయవాడలో స్పోర్ట్స్ అధారిటీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా చేయడానికి వెళ్లినప్పుడు వారిపై దాడి జరిగిన తీరు, తదుపరి అరెస్టులు, కేసులు వారిపైనే పెట్టిన వైనం గమనిస్తే , ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు నిజాలు మాట్లాడుతూ ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలి. కాని దురదృష్టవశాత్తు చంద్రబాబు అందుకు విరుద్దంగా నిత్యం అబద్దాలు చెబుతూ, ఏపీని అబద్దాల సమాజంగా మార్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విషయం చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక అసత్యం చెబితే సరిపోతుందన్న ధోరణితో ఆయన సాగుతున్నారన్న భావన ఏర్పడుతోంది. విజయవాడలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి జరిగితే ఆయన గురువులపై వైఎస్సార్సీపీ గూండాలు దాడి చేశారని కుప్పంలో స్పీచ్ ఇచ్చారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి అసలు టీడీపీ వారు కాని, టీచర్ల పేరుతో వచ్చిన గూండాలు కాని, లోకేష్ యువగళానికి చెందినవారుకాని చేసిన దుశ్చర్యల గురించి మాట మాత్రం రాయకుండా వైఎస్సార్సీపీ వారే దాడులు చేశారన్నట్లుగా తెగబడి రాశాయంటే ఏమిటి అర్దం?. డీఎస్సీ అక్రమాల కేసు ఆధారాలతో సహా బయటపడటంతో ఏం చేయాలో దిక్కుతోచక ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న భావన కలగదా!. ఒక వేళ ఈ ఘటనలో వైఎస్సార్సీపీ వారి వైపు నుంచి కూడా ఏదైనా తప్పు ఉంటే అది రాయవచ్చు. అలాగే టీడీపీ వారు ఎందుకు అలా అరాచకంగా ప్రవర్తించారో తెలియచేయాలి. అదేమీ లేకుండా పూర్తి ఏకపక్షంగా కదనాలు ప్రచారంలోకి తెచ్చారంటే విద్యా శాఖ మంత్రి లోకేష్ ను ఈ స్కామ్ నుంచి బయట వేయడానికి ఎదురుదాడి ఒకటే మార్గమని ఎంచుకున్నట్లు అనిపించదా!అధికారం ఉంది కనుక ,పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారి నిష్పక్షపాతంగా పనిచేయడం మానివేసింది కనుక దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టవచ్చు. వారిని అరెస్టు చేయవచ్చు. అంతమాత్రాన ప్రభుత్వం ఎస్కేప్ అయిపోతుందని అనుకుంటే పొరపాటు.ఎందుకంటే సోమవారం నాటి ఈ ఏపీసోడ్ మొత్తం ప్రభుత్వ బలహీనతను బయటపెట్టింది. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని అనుమానాలు పెంచింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ దర్నాకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించడమే ఆశ్చర్యం. అంత ప్రమాదం ఏమి వచ్చిందని వారి నిరసనకు అనుమతి ఇవ్వలేదు? అయినావైఎస్సార్సీపీ నిరసనపై ముందుకు వెళ్లింది. అలా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు పోలీసులను తోసుకుంటూ ముందుకువెళ్లలేదా? అనివైఎస్సార్‌సీపీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తే తప్పేమిటన్నది వారి వాదన. డీఎస్సీ అభ్యర్దుల పేరుతో ప్రభుత్వం చేయించిన ర్యాలీలకు ఎలా పర్మిషన్ లభించింది?అంటే చట్టం అన్ని పక్షాలకు ఒకరకంగా ఉండడం లేదన్న విషయం అర్ధం అవుతూనే ఉంది కదా? టీడీపీ కార్యకర్తలు,గూండాలు, టీచర్ల ముసుగులో వచ్చిన రౌడీలు శాప్ కార్యాలయ ఆవరణలోకి ఎలా వెళ్లారు? అక్కడ వారికి షామియానాలు, కుర్చీలు వేసి ఎలా సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్సీపీ నేతలు నిరసన నిమిత్తం అక్కడకు వెళితే వారు ఎలా ఎగబడ్డారు? కొందరైతే పోలీసుల నుంచి లాఠీలు లాక్కుని మరీ దాడి చేశారట. నోటికొచ్చిన బూతులతోవైఎస్సార్సీపీ నేతలను తిట్టారట. ఎంత వీలైతే అంత వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టారన్నమాట. అలా చేసినప్పుడు ఎవరైనా కొంతమంది ఆవేశపడుతుంటారు. అప్పుడు వారికి రౌడీ ముద్ర వేసి ప్రచారం చేస్తారన్నమాట. దాడులలో గాయపడ్డది వైఎస్సార్సీపీ నేతలు కదా!అయినా వారిపైనే కేసులు పెట్టారు. పైగా కొందరిపై హత్యాయత్నం కేసు వరకు పెడుతున్నారట. పోనీ దాడులు చేసిన టీడీపీవారిపై కూడా కేసు పెట్టారా అంటే అలాంటిదేమీ లేదట. టీడీపీ పక్షాన గూండాయిజం చేసిన కొందరు తాము యువగళం టీమ్ అని ఓపెన్ గానే చెప్పుకున్నారే. ఎల్లో మీడియా ఈ ఉదంతం మొత్తాన్ని వక్రీకరించి ప్రచారం చేసే క్రమంలో తొలుతటీడీపీవారిపైనే వైఎస్సార్సీపీ దాడి అని స్టోరీలు ప్రచారం చేసింది.కాని అంతలో వారికి కొత్త ఐడియా వచ్చినట్లు ఉంది. టీడీపీ వారిపైన దాడి అంటే,వైఎస్సార్సీపీ నిరసన సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారని జనం అనుకుంటారని భావించి మొత్తం కధను మార్చి గురువులపై దాడి అని కొత్త స్టోరీ అల్లారట. ముఖ్యమంత్రి సైతం ఇదే ప్రకారం ఉపన్యాసం ఇచ్చారు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారని అర్ధం అవుతోంది కదా! గొడ్డలి పార్టీ అని చంద్రబాబువైఎస్సార్సీపీని ఉద్దేశించి అంటే, వెన్నుపోటు పార్టీ టీడీపీ అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ఇదంతా చంద్రబాబుకు గౌరవం అయిన సంగతేనా? అర్హులైన టీచర్ అభ్యర్ధులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రసంగంలోని కొన్ని అంశాలు చూడండి.క్రీడా కోటాలో తప్పులు జరిగాయని, ఆ ఉపాధ్యాయులంతా బోగస్ అని అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.ఇదీ చదవండి: అందుకే ఈ అరాచకాలా..?వైఎస్సార్సీపీ ఎన్నడూ అందరూ బోగస్ అని అనలేదు. తప్పుడు క్రీడా సర్టిఫికెట్లు తెచ్చి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు పొందిన పలువురి వివరాలు వెల్లడించి విమర్శలు చేస్తోంది. ఆ నిర్దిష్టమైన కేసులలో ఇంతవరకు చంద్రబాబు,లేదా మంత్రి లోకేష్ వివరణ ఇవ్వలేకపోయారు. వైఎస్సార్సీపీ హయాంలో పోటీలలో పాల్గొని వారి చేతుల మీదుగానే ధృవపత్రాలు పొందినవారిని ఫేక్ అంటున్నారని ఆయన చెప్పారు. ఇందులోను నిజం లేదు. ఫేక్ పత్రాలతో కొంతమంది పోస్టులు సాధించారా? లేదా? అన్నదాని పై ఆయన మాట్లాడడం లేదు. విజయవాడలో గురువులపై రౌడీలు దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది కూడా నిజం కాదు. వైఎస్సార్సీపీ ధర్నా చేయాలని తలపెడితే అక్కడ టీడీపీ గూండాలు, టీచర్ల ముసుగులో రౌడీలు ఎందుకు ఉన్నారని ఎవరికైనా సందేహం వస్తుంది కదా! అసెంబ్లీకి వచ్చే ధైర్యంవైఎస్సార్సీపీకి లేదని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. కాని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు హాజరవుతున్నారు కదా!అక్కడ ఎందుకు చర్చకు టీడీపీ వెనుకాడింది అంటే జవాబు ఇవ్వరు. లోకేష్ మండలికి హాజరైనా దాని గురించి ఎందుకు వాదన వినిపించలేకపోయారు.వైఎస్సార్సీపీ సహభ్యుల ప్రశ్నలకు బదులు ఇవ్వలేదంటే సమాధానం ఇవ్వరు. కొందరు టీచర్లను తీసుకువచ్చి ర్యాలీలు చేయించి ఒక రాజకీయ పార్టీని ఇష్టం వచ్చినట్లు దూషింపచేస్తారా?మాజీ ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకువస్తున్నట్లు అనిపించదా!ఇవన్ని ఎందుకు! అసలు డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్న నమ్మకం ఉంటే వైఎస్సార్సీపీ అదినేత జగన్ సవాల్ చేసినట్లు సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా! పైగా తన టైమ్ లో జరిగిన ఏపీపిఎస్సిపై కూడా సిబిఐ విచారణ వేసుకోండని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కదా!దాని గురించి ప్రస్తావించకుండా ఏపీపిఎస్సిపై వైఎస్సార్సీపీ మాట్లాడడం లేదని చంద్రబాబు అనడం ఏమిటో అర్దం కాదు..టీచర్ల నియామకాలపై అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చని,కోర్టు ఆదేశిస్తే చర్య తీసుకుంటామని అన్నారు. ఉద్యోగాలు రాని అనేక మంది కోర్టుకు వెళితే అసలు కేసే విచారణకు రాకుండా చేస్తున్నారని వారు బహిరంగంగానే చెబుతున్నారే? కోర్టులో విచారణకు రెడీ అయిన ప్రభుత్వం వారు సిబిఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారు?జగన్ మళ్లీ సోమవారం నాడు కూడా డీఎస్సీ స్కామ్ పై 14 ప్రశ్నలు వేశారు. చంద్రబాబు, లోకేష్ లు తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. జగన్ ప్రశ్నలపై చంద్రబాబు ఎప్పటికైనా స్పందిస్తారా?అన్నది అనుమానమే. ఒక్క మాట చెప్పాలి. డెబ్బైఆరేళ్ల వయసులో ఎంతో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హోదాకు తగ్గట్లు వ్యవహరించలేకపోతున్నారనిపిస్తుంది. ఇదంతా పుత్ర ప్రేమా?లేక సహజంగా వచ్చిన అలవాటా?అంటే ఏమి చెబుతాం!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీరే తలలు పగల కొడతారు.. పైగా మాపై అలాంటి కేసులా..
-
టీడీపీ ఉన్నంత కాలమే వాళ్ళు టీచర్లు.. ప్రభుత్వం మారితే వాళ్ళ పరిస్థితి ఇదే
-
నిరసన తెలపడం తప్పా?.. ఇది జంగిల్ రాజ్
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో కుంభకోణాలపై నిరసన తెలుపడమే పాపమైపోతోంది. నిరసన తెలిపిన వారిపై యువగళం మూకతో దాడులు చేయించడమే కాక, బాధితులపైనే కేసులు పెట్టి.. అరెస్టులు చేయిస్తుండటం జంగిల్‌రాజ్ పాలనకు అద్దం పడుతోంది. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేయడంతో ఆగకుండా అక్రమ కేసులు బనాయించడం కలకలం రేపుతోంది. పరీక్ష రాయకుండానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద వందలాది మందికి టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారు. స్పోర్ట్స్‌లో మెరిట్ చూడకుండా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల ద్వారా ఆయా పోటీల్లో పాల్గొనకపోయినా కూడా పాల్గొన్నట్లు తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసి పప్పు బెల్లాల్లా ఉపాధ్యాయ ఉద్యోగాలను పంచిపెట్టేశారు. ఆధారాలతో సహా ఈ స్కామ్ బయట పడటంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ బాధ్యత వహించి.. లెంపలేసుకోవాల్సింది పోయి.. దొంగే దొంగా దొంగా అనిఅరచినట్లు వ్యవహరిస్తుండటం విస్తుగొలుపుతోంది. డీఎస్సీ కుంభకోణానికి సంబంధించి ఎన్నో ఆధారాలను వైఎస్సార్సీపీ బయట పెట్టినా, వాటికి మంత్రి లోకేశ్ నుంచి ఒక్క మాట కూడా సమాధానంగా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21∙శాప్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని వైఎస్సార్సీపీ ముందుగానే ప్రకటించింది. ఆ మేరకు సోమవారం విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ, నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళనకు పోటీగా ప్రభుత్వమే పోటీ ఆందోళన నిర్వహింప చేసింది. ఇందుకోసం జిల్లాల నుంచి స్పోర్ట్స్ కోటాలో నియమితులైన టీచర్లను రప్పించింది. వారి ముసుగులో టీడీపీ గూండాలనూ రంగంలోకి దించింది. జీ హుజూర్ అన్న పోలీసులు వైఎస్సార్సీపీ శాంతియుత నిరసనను అడ్డుకునేందుకు లోకేశ్ యువగళం మూకలు.. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు పొందిన వారిని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడ్డాయి. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు.. రెడ్‌బుక్ అరాచకాలకు జీ హుజూర్ అంటూ చోద్యం చూశారు. వారి చేతుల్లోని లాఠీలు లాక్కుంటున్నా మిన్నకుండిపోయారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు మంత్రి లోకేశ్ బదులివ్వలేక సమీకరించిన ఉపాధ్యాయులు, యువగళం మూకలను ఎగదోసినట్లు స్పష్టమవుతోంది. ఆ టీచర్లంతా సోమవారం సెలవుపై వచ్చారా? లేక ఆన్ డ్యూటీపై వచ్చారా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వమే పనిగట్టుకుని వారిని పిలిపించి.. పథకం ప్రకారం వారితో గూండాలను కలిపి వైఎస్సార్సీపీ శ్రేణులపైకి ఉసిగొల్పిందని ఆ ఘటన తాలూకు వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. నిరసనకారులనే కొట్టి.. తిరిగి వారిపైనే తప్పుడు కేసులు శాప్ కార్యాలయం ఎదుట జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవానికి సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు పెట్టాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి టీడీపీ గూండాలు ముందే ఎలా వచ్చారు? ఎవరు పంపితే వచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ ప్రమేయం లేకుండా యువగళం ముఠా ఇలా రెచ్చిపోయిందంటే ఎవరూ నమ్మరని చెబుతున్నారు. వాస్తవానికి వీరి చేతిలో దాడికి గురైంది దగాకు గురైన అభ్యర్థులు, విద్యార్థులు, యువత, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు. వీరి ఫిర్యాదుల మేరకు టీడీపీ గూండాలపై కేసులు నమోదు చేయాలి. అయితే అలా కాకుండా టీడీపీ నేతలు చెప్పిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దుర్మార్గపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదీ ఏకంగా 500 మందికి పైగా కేసులు నమోదు చేయడం చూస్తుంటే ఆటవిక రాజ్య పాలనను తలపిస్తోంది. వారిని తమతో పోల్చొద్దంటున్న మెరిట్ టీచర్లు పరీక్ష రాయకుండా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు ఎలా ఇస్తారని.. మెరిట్‌పై టీచర్ ఉద్యోగాలు తెచ్చుకున్న వారు ప్రశ్నిస్తున్నారు. అలా తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు టీచర్లు ఎలా అవుతారని నిలదీస్తున్నారు. అలాంటి వారందరితో తమను కలిపి పోలిక పెట్టవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే తమ గౌరవం తగ్గించే కార్యక్రమం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ఉద్యోగులను రాజకీయంగా వాడుకోవడం సరికాదని, ఉద్యోగ వర్గాల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఎల్లో మీడియా సైతం వాస్తవాలు దాచి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల లాఠీలు లాక్కొని దాడి చేసిన గూండాలు వీడియోల్లో కనిపిస్తుంటే.. వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేశారని తిమ్మినిబమ్మి చేస్తోంది. -
అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డు.. మరోసారి అప్పు చేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో కూటమి ప్రభుత్వం తన రికార్డును తానే బద్ధలు కొడుతుంది. తాజాగా ఈరోజు మంగళవారం రూ. 2,600 కోట్లు అప్పు చేసింది. ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు చేసింది.ఈ తాజా అప్పుతో మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో 3.97 లక్షల కోట్లు అప్పు చేసి దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఈ మెుత్తం నిధులలో రూ.2.24 లక్షల కోట్లు బడ్జెటరీ అప్పు కాగా రూ. 1.25 లక్షల కోట్లు కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు అదేవిధంగా అమరావతి కోసం రూ. 47, 687 కోట్లు చంద్రబాబు సర్కార్ అప్పు చేసింది. ఈ మెుత్తం అప్పులతో రూ. 4 లక్షల కోట్ల అప్పుకు చేరువలోకి కూటమి ప్రభుత్వం చేరుకుంది. చరిత్రలో ఏ సిీఎం చేయనంతగా చంద్రబాబు అప్పులు చేయడంతో ఆర్థిక శాఖ అధికారుల్లో ఆందోళన నెలకొంది. -
టీడీపీ గూండాగిరీ చేస్తోంది.. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనర్హుడు: జూపూడి
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై శాప్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులలపై టీడీపీ మూకలు దౌర్జన్యాయానికి దిగాయని వైస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఏపీలో ప్రభుత్వమే గూండాగురీకి దిగింది.శాంతియుత నిరసన ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులు చేస్తారా?.పోలీసుల చేతిలోని లాఠీలను లాక్కుని దాడులకు దిగుతారా?.నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దివ్యాంగుల చేతిలోని కర్రలను లాక్కుని దాడి చేశారు. లోకేష్‌ని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు. అసలు శాప్ ఆఫీసు దగ్గర ఈ ప్రైవేటు వ్యక్తులకు ఏం పని?.మా ఇష్టం వచ్చినట్లు పాలన చేస్తామని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఎందుకు తట్టుకోలేక పోతున్నారు?. యువగళంలో పాల్గొన్న వారికి టీచరు ఉద్యోగాలు ఇచ్చేస్తారా?.అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వటం సబబేనా?.విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు.టీచర్లను రెచ్చగొట్టి పోటీ ధర్నాలు చేయించటం ఇక్కడే చూస్తున్నాం.రేపు ప్రభుత్వం మారితే వారి పరిస్థితి ఏంటి?. డీఎస్సీ అక్రమాలపై కచ్చితంగా సీబిఐ విచారణ జరపాల్సిందే.ఇలా దాడులు చేయించేవారు విద్యాశాఖకు మంత్రిగా పనికి రారు.అధికారులను పంపటం కాకుండా లోకేష్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు?. డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగుతుంది.అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించరా?.ఈ అక్రమాలపై కచ్చితంగా సీబిఐతో విచారణ జరపాల్సిందే. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు నోరు మెదపటం లేదు?’అని ప్రశ్నించారు. -
టీడీపీ రౌడీల అరాచకాలు... మీకు రోజులు దగ్గరపడ్డాయ్
-
‘ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’
సాక్షి, తాడేపల్లి: శాప్ కార్యాలయం ఎదుట ధర్నాతో ప్రభుత్వ కూసాలు కదిలాయని.. జెన్ జీ కదిలి వచ్చి నిరసనల్లో పాల్గొందని.. దీన్ని జీర్ణించుకోలేక ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. మా నిరసన కార్యక్రమంపై నాలుగు రోజుల క్రితమే పర్మిషన్ కోరాం.. కానీ మాకు పోటీగా కొందరు రౌడీ దళాన్ని ఎందుకు తెచ్చారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘నారా లోకేష్ రౌడీ దళం మాపై దాడులు చేశారు. పోలీసుల చేతిల్లోని లాఠీలు లాక్కుని మాపై దాడి చేశారు. పోలీసుల తుపాకులు కూడా వారికి దొరికి ఉంటే మా పరిస్థితేంటి?. డీఎస్సీలోని అక్రమాలపై ప్రశ్నిస్తే లోకేష్ ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్నారు. మా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పటం లేదు?. నిరసనలు తెలిపితే మాపై దాడులా?. మీ బ్యారికేడ్లు మా భావజాలాన్ని ఆపలేక పోయాయి...మీ అరెస్టులు మా ధైర్యాన్ని నిలవరించలేవు. డీఎస్సీ అక్రమాలపై సీబిఐ విచారణ జరపాల్సిందే. అప్పటిదాకా మా ఉద్యమం ఆగదు. శాప్ ఆఫీసు దగ్గరకు గురువుల ముసుగులో గూండాలు వచ్చారు. ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు -
గూండాలతో దాడి చేయిస్తారా..? పుష్ప శ్రీవాణి ఫైర్
-
అందుకే ఈ అరాచకాలా..?
అధికారం ఉంటే ఎలాగైనా చేయవచ్చని ఏపీలో కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నట్లుగా ఉంది. తమ హయాంలో జరిగిన స్కామ్‌ల కేసులను పోలీసు వ్యవస్థ ద్వారానే ఎత్తివేయించుకోవడం, అదే పోలీసులను ప్రయోగించి విపక్ష వైఎస్సార్సీపీ నేతలపై కల్పిత కేసులు పెట్టడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. బహుశా గతంలో ఏ ప్రభుత్వం ఇంత అరాచకంగా వ్యవహరించి ఉండకపోవచ్చన్నది ఎక్కువ మంది భావన.2014-19 టరమ్‌లో జరిగిన స్కిల్ స్కామ్‌తో సహా ఆయా కేసులను ఎత్తివేసేలా పావులు కదపడం, అదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ ఒక కల్పిత మద్యం కేసును సృష్టించి, అవసరమైనప్పుడల్లా దానిని ప్రచారానికి వాడుకోవడం ఈ ప్రభుత్వం అలవాటుగా మార్చుకున్నట్లుంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని విద్యాశాఖలో జరిగిన టీచర్ల నియామక స్కామ్‌ను కప్పిపుచ్చడానికి ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఇదే కాదు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసిన కేసు మూలలోకి వెళ్లకుండా కథ నడిపిస్తున్న తీరు కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక జనాన్ని ఏమార్చే పనిలో ఉంటోంది. మరో వైపు ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్‌లు, పోలీసు శాఖ ద్వారా జరుగుతున్న అరాచకాలు కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వీటికి తోడు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని ఈడి కూడా తేల్చడంతో ప్రభుత్వ పెద్దలు అపచారం చేసినట్లయిందని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని వెరసి ప్రభుత్వం ప్రజలలో పరపతి బాగా కోల్పోతోందన్న భావన వచ్చినప్పుడల్లా దానిని డైవర్ట్ చేయడానికి వైఎస్సార్సీపీపై ఏవేవో పిచ్చి ఆరోపణలు చేయడం, ఆ పార్టీ నేతలపై పిచ్చి కేసులు పెట్టడం చేస్తున్నారు.డీఎస్సీ అక్రమాలపై ఆధార సహితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ ఇతర నేతలు ఆరోపణలు చేస్తుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. ఎంత బుకాయించాలని చూస్తున్నా, స్కామ్ వివరాలు, కొత్త సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. హర్యానాలో జరిగిన టీచర్ల ఎంపిక స్కామ్‌తో పోల్చుతూ కొందరు మేధావులు విశ్లేషణలు ఇస్తున్నారు. గతంలో హర్యానా ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు, కొందరు అధికారులు జైలుకు వెళ్లిన ఘటన తీరుతెన్నులను పోల్చుతూ ప్రముఖ మేధావి, ఫ్రొఫెసర్ రామచంద్రయ్య ఒక వీడియో చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో, కేసు విచారణ దశకు వెళ్లకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని వేధిస్తూ కాలం గడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలు డీఎస్సీ స్కామ్ గురించి మరీ ఎక్కువగా చర్చించుకోకుండా ఉండాలన్న లక్ష్యంతో అవసరమైనప్పుడల్లా మద్యం స్కామ్ అంటూ తెరపైకి తీసుకువచ్చి ఎల్లో మీడియాతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా బెవరేజ్ కార్పొరేషన్లో ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్ అనే ఉద్యోగి వాంగ్మూలం పేరుతో ఒక కథను సృష్టించారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. సత్యప్రసాద్ కూడా ఈ కేసులో ఒక నిందితుడే. కాని ఆయన అరెస్టు కాకుండా చూసి, అతనిని నయానో, భయానో అప్రూవర్‌గా మార్చుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఈ రెండేళ్లలో రకరకాల విన్యాసాలు చేసిందన్న అభిప్రాయం కలుగుతోంది. అనేక మందిని ఈ కేసులోకి తీసుకురావడం, అరెస్టులు చేయడం, ఎప్పటికప్పుడు ఒక కొత్త స్టోరీని అల్లడం చేస్తోందన్న భావన ఉంది. మద్యం తయారీదార్ల నుంచి లంచాలు తీసుకున్నారన్నది సిట్ అబియోగం. ఇందుకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా అంటే అదేమి లేదు. ఎవరో రహస్య లేఖ రాస్తే వెంటనే పోలీసులను రంగంలోకి దించి విచారణ ఆరంభించారు. ఈ లంచం డబ్బును ఒకసారి రియల్ ఎస్టేట్‌లో పెట్టారని, మరోసారి సినిమాలు తీశారని, ఇంకోసారి విదేశాలకు తరలించారని, వేరొక సారి ఆ డబ్బును గత ఎన్నికలలో ఓటర్లకు పంచడానికి వెచ్చించారని ఆరోపణలు చేశారు. సత్య ప్రసాద్‌తో కోర్టులో కూటమి పెద్దలు కోరుకున్న విధంగా వాంగ్మూలం ఇప్పించారన్నది వైఎస్సార్సీపీ అభియోగం.ఇదీ చదవండి: ‘హూ ఈజ్ మోదీ’ నుంచి గ్రేట్ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?మాజీ మంత్రి పేర్ని నాని ఈ కేసుపై పార్టీ వాదనను సమర్ధంగా వినిపించారు. సత్యప్రసాద్ వాంగ్మూలంలో చెప్పిన అంశాలలోని వైరుధ్యాలపై పలు ప్రశ్నలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి వద్ద మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు సమావేశం జరిగిందని సత్యప్రసాద్ చెప్పారట. ఆయన వద్ద దీనికి ఆధారం ఏమైనా ఉందా అంటే అదేమీ కనిపించదు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో ఒక కాలేజీలో 11 కోట్ల డబ్బు దొరికిందని పోలీసులు హడావుడి చేశారు. అది ఈ కేసులో ఒక నిందితుడైన రాజ్ కసిరెడ్డిదని ఆరోపించారు. దానిని ఆయన తోసిపుచ్చి ఆ డబ్బును కోర్టులో పెట్టాలని, నెంబర్లు నోట్ చేయాలని కోరగా, కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసు అధికారులు ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేశామని చెప్పడంతోనే ఈ కేసులో డొల్లతనం బహిర్గతం అయింది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన ఒక కానిస్టేబుల్‌కు ప్రమోషన్ ఇవ్వడం, అందుకు ఇష్టపడని మరో కానిస్టేబుల్‌ను తీవ్రంగా వేధించడం చేశారట. నెలకు ఏభై, అరవై కోట్లు వసూలు చేసేలా నిర్ణయించుకున్నారని, దానిని జగన్‌కు చేర్చేవారని లాజిక్ లేకుండా సత్యప్రసాద్ కోర్టుకు తెలిపారట. అది నిజమే అయితే అది ఎలా జరిగింది. సిసిటీవీ ఫుటేజ్ ఉందా? అంటే అదేమీ కనిపించదు.నిజంగానే మూడువేల కోట్ల డబ్బు ఎన్నికలలో పంచిఉంటే ఏ ఒక్క ఎన్నికల పర్యవేక్షణ అధికారి అయినా తన రిపోర్టులో తెలిపారా అని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి కేసులు పెట్టి ఏమి సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏ కేసు అయినా కేవలం అప్రూవర్ ఇచ్చే వాంగ్మూలం తోనే బలంగా ఉంటుందనుకుంటే పొరపాటని శ్రవణ్ అన్నారు. డబ్బు ఎక్కడనుంచి ఎక్కడకు వెళ్లింది? డబ్బును సీజ్ చేశారా? నిజంగానే మద్యం డిస్టిలరీల వారు లంచాలు ఇచ్చి ఉంటే వారందరిపైన కూడా కేసులు పెట్టాలి కదా అని ఆయన అడిగారు.ఇక సత్యప్రసాద్ ఇంతకుముందు రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జగన్ పేరే ఎందుకు ప్రస్తావించలేదు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని కూడా వేదించి అప్రూవర్‌గా మార్చుకునే యత్నం చేశారు. తొలుత అంగీకరించినా, ఆ తర్వాత ఆయన ఒప్పుకోకపోవడంతో కొత్త కేసులు పెట్టి వేదిస్తున్నారట. స్కిల్ స్కామ్‌లో డబ్బు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లింది? చివరికి టీడీపీ ఆఫీస్‌కు ఎలా చేరింది? బ్యాంకు స్టేట్ మెంట్లతో సహా సీఐడీ అప్పట్లో అభియోగాలు మోపింది. అంతేకాక సంబంధిత ఫైళ్లలో చంద్రబాబు సంతకాలు కూడా ఉన్నాయి. అలాంటి కేసులో ఏమీ జరగలేదని సీఐడీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా నివేదిక ఇచ్చిందో తెలియదు. పైగా ఈ కేసు మూలం ఈడి దర్యాప్తుతో మొదలైంది. అయినా ఇప్పుడు ఈడి ఎక్కడా సీన్లో కనిపించదు.మాజీ మంత్రి అంబటి రాంబాబు డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆయనకు మద్యం కేసులో నోటీసులు రావడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అమరావతికి సంబంధించిన స్కామ్‌లు కొన్నిటిలో కొందరు ఐఏఎస్ అధికారులు వాంగ్మూలాలు ఇచ్చినా, అవన్ని ఇప్పుడు ఎలా పూర్వపక్షం అవుతున్నాయో అర్థం కావడం లేదని ఈ కేసులను గమనిస్తున్న ఒక ప్రముఖుడు అన్నారు. న్యాయ వ్యవస్థ వీటిని ఎలా అనుమతిస్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును వీలైనంతమేర సాగదీస్తున్న సిట్ అధికారులు ఇంతవరకు ఎందుకు అతనిని హింసించారు అన్న మూలాలలోకి వెళ్ళినట్లు సమాచారం లేదు. ఏ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు అతనిని మార్కాపురం నుంచి పట్టుకువచ్చారు? పై అధికారులను విచారించే పరిస్థితి ఉందా? లేదా? ఇలాంటి సందేహాలు ఎన్నో వస్తున్నాయి ఏ కేసునైనా నిష్పక్షపాతంగా చేస్తే అభ్యంతరం ఉండదు. అధికారంలో ఉన్నవారిపట్ల ఒకరకంగా, విపక్షంవారిపై మరో రకంగా వ్యవహరిస్తేనే సమస్య. ఇది వ్యవస్థలకు కూడా మంచిది కాదు. అన్నిటికి మించి సత్యప్రసాద్ మానసిక పరిస్థితిపై ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఆసక్తికరంగా ఉంది. అప్పుడు ఆయన వాంగ్మూలం చెల్లుతుందా? లేదా? అన్నది చూడాలి.మరో విషయం ఏమిటంటే మద్యం కేసులో ప్రభుత్వం తరపున వాదించే ఒక లాయర్ ఏకంగా జడ్జినే బెదిరించిన ఘటన గతంలో జరిగింది. అయినా ఆయనకు ఏమీ కాలేదు. ఇలా రకరకాల సందేహాలతో, సంశయాలతో కొనసాగుతున్న కల్పిత మద్యం కేసు ద్వారా వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టి తమపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవచ్చని పాలకులు భావిస్తున్నారేమో తెలియదు. కాని అది అన్నివేళలా సాధ్యపడకపోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సివిల్ గొడవల్లో మీ జోక్యమేంటి? AP పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్..
-
జగన్ పై DSC ఫేక్ అభ్యర్థి వ్యాఖ్యలు ఆధారాలతో లైవ్ లో ఇచ్చిపడేసిన కారుమూరి
-
విజయవాడలో TTD గూండాల దాదాగిరి..పచ్చరౌడీలకు ఖాకీల మద్దతు
-
టీడీపీ గూండాలను వదిలి.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. శాప్ ఆఫీస్ వద్ద డీఎస్సీ అక్రమాలపై నిరసన చేసినందుకు కేసులు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసు నమోదైంది. ఆయనతో పాటు మురళి, ఫాతిమా, డైమండ్ బాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు.వైఎస్సార్సీపీ నేతలపై మాచవరం స్టేషన్లో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు అర్ధరాత్రి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రేసిడెంట్ రవిచంద్ర, వైసీపీ నేత సుందరపాల్ను అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేయగా.. టీడీపీ గూండాలను వదిలి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శాంతియుత నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ గూండాలు.. పోలీసుల చేతిలో ఉన్నా లాఠీలతో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రశ్నిస్తూ.. బాధితులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా చేపట్టింది. శాంతియుతంగా జరుగుతున్న పోరుబాట కార్యక్రమాన్ని కూటమి సర్కారు కుట్రలతో అడ్డుకుని ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలకు దారితీసేలా రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపింది.ప్రశాంతంగా జరుగుతున్న నిరసనలపై చంద్రబాబు సర్కారు గూండాలను మోహరించి రాక్షస క్రీడకు తెగబడింది. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు బరి తెగించి అరాచక దాడులకు పురిగొల్పింది. కళ్లెదుట కనిపిస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలకు సమాధానం చెప్పలేక, నిజాయతీని నిరూపించుకోవడం చేతగాక.. ప్రశ్నించిన వారిపై ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పింది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన వారిపై లాఠీచార్జీ జరిపి అక్రమ అరెస్టులకు పాల్పడింది.ఇదీ చదవండి: ఖాకీలు తోడుగా టీడీపీ గూండాల దాడి -
గణేశుడి గ్రామోత్సవంలో తెగబడిన టీడీపీ గూండాలు
తాడేపల్లి రూరల్: విద్యాశాఖ మంత్రి, సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, ఆ పార్టీ రౌడీషీటర్లు రెచ్చిపోయారు. గణేశుడి గ్రామోత్సవాన్ని అడ్డుకుని కర్రలు, రాడ్లు, మద్యం సీసాలతో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, రెడ్డి సామాజిక వర్గీయులే లక్ష్యంగా అర్ధరాత్రి నుంచి 4 గంటలపాటు అరాచకం సృష్టించారు. సీఐ వీరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు సైతం వత్తాసు పలకడంతో టీడీపీ రౌడీల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. తాడేపల్లి మండలం పెనుమాకలో వినాయకుడి గుడివద్ద రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామివారి గ్రామోత్సవం పంచాయతీ కార్యాలయం వద్దకు రాగా.. అప్పటికే దారికాచిన టీడీపీ మండల ఉపాధ్యక్షుడు కొల్లి శేషు ఆధ్వర్యంలో అల్లరిమూకలు ఊరేగింపును అడ్డుకుని గొడవకు దిగారు. తిరుగు ప్రయాణంలో కొల్లి శేషు ఆధ్వర్యంలో తాడేపల్లి, ప్రకాష్ నగర్ ప్రాంతాల నుంచి వచి్చన రౌడీషిటర్లు భారీగా అల్లరి మూకలు గణేశ్ ఊరేగింపును మళ్లీ అడ్డుకున్నాయి. పోలీసులు కూడా ముందుకు వెళ్లడానికి వీల్లేదంటూ హల్చల్ చేశారు. కమిటీ సభ్యులపై సీఐ బూతులతో విరుచుకుపడ్డారు. ధర్నాకు దిగిన ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులు, టీడీపీ రౌడీమూకల ఆగడాలకు నిరసనగా కమిటీ సభ్యులైన పెనుమాక సొసైటీ చైర్మన్ గోవిందరెడ్డి, మిగిలిన సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ మూకలు కర్రలు, రాడ్లు, కారంతో వెంటాడుతూ చితకబాదారు. టీడీపీ నాయకుడు కొల్లి శేషు రోడ్డుపై కారు అడ్డుపెట్టి రెడ్డి సామాజిక వర్గీయులను దుర్భాషలాడారు. సీఐ టీడీపీ శ్రేణులు, టీడీపీ రౌడీలను నియంత్రించకుండా ఉత్సవ కమిటీ సభ్యులపై పలుమార్లు లాఠీచార్జి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉండవల్లిలో కొండవీటి వాగు వద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుంటే, కొల్లి శేషు కొందరు రౌడీషిటర్లతో ఆ ప్రాంతానికి చేరుకుని వైఎస్సార్సీపీ శ్రేణులను, రెడ్డి సామాజిక వర్గీయులను కవి్వస్తూ దుర్భాషలాడారు. అక్కడ ఉన్న పోలీసులు కట్టడి చేయకపోగా కొల్లి శేషుకు వత్తాసు పలికారు. -
ఖాకీలు తోడుగా టీడీపీ గూండాల దాడి
సాక్షి, అమరావతి: పచ్చమూకల పైశాచికంతో ప్రజాస్వామ్యం మంటగలిసింది. ప్రశాంతంగా జరుగుతున్న నిరసనలపై చంద్రబాబు సర్కారు గూండాలను మోహరించి రాక్షస క్రీడకు తెగబడింది. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు బరి తెగించి అరాచక దాడులకు పురిగొల్పింది. కళ్లెదుట కనిపిస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలకు సమాధానం చెప్పలేక, నిజాయతీని నిరూపించుకోవడం చేతగాక.. ప్రశ్నించిన వారిపై ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పింది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన వారిపై లాఠీచార్జీ జరిపి అక్రమ అరెస్టులకు పాల్పడింది. ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో చంద్రబాబు సర్కారు దమనకాండను చూసి యావత్ రాష్ట్రం నిర్ఘాంతపోయింది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ అరాచకాలు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. తప్పు జరుగుతోందని నిలదీస్తే.. అక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. లాఠీలతో తలలు పగలగొడతామనేలా, సంకెళ్లు వేసి నడిరోడ్డుపై ఈడ్చి పడేస్తామనేలా చంద్రబాబు, లోకేశ్ నడుపుతున్న గూండారాజ్యంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరింది. మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రశ్నిస్తూ.. బాధితులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా చేపట్టింది. శాంతియుతంగా జరుగుతున్న పోరుబాట కార్యక్రమాన్ని కూటమి సర్కారు కుట్రలతో అడ్డుకుని ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలకు దారితీసేలా రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపింది. ఖాకీలు.. గూండాలు కుమ్మక్కు! ‘శాప్’ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ ముందుగానే సమాచారం ఇచ్చింది. అందుకు అనుమతినివ్వాల్సిందిగా పోలీస్ శాఖను లిఖిత పూర్వకంగా కోరినా ఇవ్వలేదు. ముందుగా ప్రకటించిన మేరకు శాప్ కార్యాలయం వద్దకు దివ్యాంగ నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు ఉదయమే చేరుకున్నాయి. వారంతా కేవలం బ్యానర్ పట్టుకుని శాప్ గేటు వద్ద బైఠాయించి నినాదాలు మాత్రమే చేశారు. మెగా డీఎస్సీలో నకిలీ సర్టిఫికెట్లతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ యువగళం ప్రైవేట్ గూండాలు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు. కనీసం దివ్యాంగులని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారు. కాళ్లు లేని వారు తెచ్చుకున్న ఊతకర్రలను లాక్కుని వాటితోనూ, రాళ్లతోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగులను విచక్షణారహితంగా చావబాదారు. టీడీపీ అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలు టీచర్ల ముసుగులో చొరబడి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. దాడులకు పాల్పడుతున్న వారు తాము లోకేశ్ అభిమానులమని, యువగళం సభ్యులమని ప్రకటించుకున్నారు. వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. పాశవికంగా దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం అడ్డుకోలేదు. శాప్ కార్యాలయం గేటు వద్ద తిష్ట వేసిన టీడీపీ గూండాలను అక్కడి నుంచి పంపించపోగా వారికి భద్రత కల్పించారు. వారేమీ డీఎస్సీ అభ్యర్ధులు కాదు.. నిరుద్యోగులు అంతకంటే కాదు.. మరి అలాంటి వారిని ఇక్కడ ఎందుకు మోహరించారని పోలీసులను పలువురు ప్రశ్నించినా స్పందించలేదు. గేటు వద్ద గూండాలను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొద్ది సేపటికి వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున శాప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రైవేటు సైన్యాన్ని పక్కకు పంపేసి పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దొరికినవారిని దొరికినట్లుగా, ఆడమగా అనే తేడా లేకుండా లాఠీలతో చితకబాదారు. అటుగా వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సుపై ఎక్కి నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేసి అదే బస్సులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను ఈడ్చి పారేశారు. ఈ క్రమంలో జరిగిన లాఠీచార్జిలో వైఎస్సార్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు గౌతంరెడ్డి సొమ్మసిల్లి కిందపడిపోయారు. పార్టీ నేతలు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విజయవాడ శాప్ కార్యాలయానికి వస్తున్న డీఎస్సీ బా«ధిత అభ్యర్థులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగులను బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పోలీసులు పక్కా కుట్ర.. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాటను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు పక్కా కుట్ర పన్నింది. అందులో భాగంగానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిని ముందురోజే విజయవాడకు రప్పించింది. వారితో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి, వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది. వారందరికీ నగరంలోనే రాత్రి బస కల్పించింది. సోమవారం ఉదయమే వారందరినీ శాప్ కార్యాలయం వద్దకు తరలించింది. అక్కడ వారికి ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలు వేసి మైకులు, ప్లకార్డులు సమకూర్చింది. వారంతా అసభ్య పదజాలంతో నిరసన కారులను రెచ్చగొట్టేలా అరుపులు, కేకలు వేశారు. అనుకూల మీడియాను మాత్రమే లోపలికి అనుమతించి వారితో మాట్లాడించి ఆ ఛానళ్లలో తప్పుడు ప్రచారం చేయించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ శ్రేణులు లోపలికి రాకుండా శాప్ కార్యాలయం గేట్లకు తాళం వేశారు. గేటు బయట అడ్డంగా టీడీపీ యువగళం బ్యాచ్ గూండాలను నిలబెట్టారు. ఇలా పక్కా ప్రణాళికతో వైఎస్సార్సీపీ, నిరుద్యోగుల ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగా కుట్రలు పన్నింది. వైఎస్సార్సీపీ ధర్నాకు అనుమతివ్వని చంద్రబాబు సర్కారు.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని శాప్ కార్యాలయం ప్రాంగణం లోపలే కూర్చోబెట్టి ప్లకార్డులతో నినాదాలు చేసేందుకు అనుమతించడంలోనే కుట్ర బట్టబయలు అవుతోంది. ఇక వారంతా బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులమనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగులపై లాఠీచార్జి చేస్తూ తరిమికొడుతున్నప్పుడు మైకుల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ తాము ముందుగా రూపొందించుకున్న పాటలను ఆలపించారు. ఎక్కడికక్కడ ఆంక్షలు.. అక్రమ అరెస్టులు కుట్రల్లో భాగంగా చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలను ప్రయోగించింది. శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేసేందుకు వస్తున్న నిరుద్యోగులు, నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంది. ముందుగానే హౌస్ అరెస్టులు, అరెస్టులకు పాల్పడింది. శాప్ కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారుల్లో భారీగా పోలీసులను మోహరించింది. అడుగడుగునా బారికేడ్లు పెట్టించింది. విజయవాడకు వస్తున్న వైఎస్సార్సీపీ నేతలను జిల్లాల సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులను కాజా టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించిన అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు పలువురు నేతలను అరెస్టు చేశారు. బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన్ను బాపట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏలూరు నుంచి విజయవాడకు వస్తున్న వైఎస్సార్సీపీ యువజన నాయకుడు కామిరెడ్డి నానిని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పోలీసులను మోహరించారు. అడ్డుగోడలు బద్ధలు కొట్టుకుని.. పోలీసులను మోహరించి చంద్రబాబు సర్కారు విధించిన ఆంక్షలు, అడ్డంకులను లెక్కచేయకుండా వైఎస్సార్ సీపీ నేతలు భారీ ఎత్తున తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, వరుదు కళ్యాణి, ఇశ్రాయేలు, మురుగుడు హనుమంతరావు, కవురు శ్రీనివాస్, సీహెచ్ ఏసురత్నం, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, నల్లగట్ల స్వామిదాస్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ని కిట్టు, విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, జగ్గయ్యపేట ఇన్చార్జీ తన్నీరు నాగేశ్వరరావు, నందిగామ ఇన్చార్జీ మొండితోక జగన్మోహన్రావు, పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి రాష్ట్ర అధికార ప్రతినిధులు నాగార్జున యాదవ్, ఆరె శ్యామల, పూనూరు గౌతంరెడ్డి, పోతిన మహేష్, కాకుమాను రాజశేఖర్, అంజిరెడ్డి, వంగవీటి నరేంద్ర, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, పెనమలూరు పార్టీ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి, గిరిజన నేత గుండా సురేంద్ర, పార్టీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి శాప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. డీఎస్సీలో అక్రమ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినదించారు. వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు లబ్బీపేట (విజయవాడతూర్పు): నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ నేతలపై విజయవాడ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. హత్యాయత్నానికి సంబంధించిన 109(1)తోపాటు బీఎన్ఎస్189, 221, 223, 127, 132, ఎస్సీ,ఎస్టీ యాక్ట్ 3(2)(వి) సెక్షన్లను అక్రమంగా బనాయించారు. 17 మందిని నిందితులుగా పేర్కొనగా వారిలో జక్కంపూడి రాజా, పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్ ఉన్నారు. వీరిని 11.30కి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి.. రాత్రి 11 గంటలవరకు అక్కడే ఉంచారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణకుమార్, లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి తదితరులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడిన తర్వాత 41, 151 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు.రోడ్డుపై పడుకుని ఎమ్మెల్సీల నిరసన..శాప్ కార్యాలయం వద్ద తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, నాయకులు రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. మెగా డీఎస్సీ–2025లో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని స్పష్టం చేశారు. తప్పుడు క్రీడా ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ని కిట్టు, తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ దౌర్జన్యకాండ కొనసాగింది. -
పిఠాపురం తాలూకా.. కొండలు మాయం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘దోపిడీకి కాదేదీ అనర్హం’ అన్న చందంగా మారింది కూటమి నేతల అక్రమ వ్యవహారం. అధికారం అండతో మైనింగ్ మాఫియా అవతారం ఎత్తారు. సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. బోడి గుండ్లుగా మార్చేస్తున్నారు. చెరువులను చెరబడుతున్నారు. మట్టి, ఇసుక తవ్వి అక్రమంగా తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారం మాది.. మేం చెప్పిందే వేదమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కూటమి నేతల అక్రమ దందాలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. చివరకు ఆధ్యాత్మిక క్షేత్రాలను సైతం వదలడం లేదంటే ధన దాహానికి ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొడవలి గ్రామంలో ధనకొండకు కూటమి నేతలు గుండు కొట్టేశారు. బౌద్ధక్షేత్రం ఉన్న చారిత్రక తురుక్కుల కొండను కూడా పిండి తొలిచేశారు. ధనకొండ విధ్వంసం పిఠాపురం నియోజకవర్గం కొడవలి గ్రామంలో సర్వే నంబర్ 133/1లో ధనకొండ విస్తరించి ఉంది. కొండపై కూటమి మట్టి మాఫియా కన్నుపడింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి కొండను ధ్వంసం చేసింది. పెద్ద పెద్ద యంత్రాలతో కొండను పిండి చేసింది. కొండ చుట్టూ తవ్వకాలు చేపట్టింది. పైకి చూసేందుకు కొండలా కనిపిస్తున్నా.. చుట్టూ తవ్వకాలతో గుల్ల చేసేసింది. ఎంతగా అంటే సుమారు 40 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇక్కడ కొండ ఉండేదా? అన్న భావన కలుగుతోందంటే ఎంతగా విధ్వంసం సృష్టించారో అర్థమవుతుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. వేల లారీలు, టిప్పర్ల మట్టి, రాళ్లు తెగనమ్ముకున్నారు. తద్వారా రూ.10 కోట్లకు పైగా కూటమి నేతలు కొల్లగొట్టినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పచ్చదనంతో కనిపించిన ఈ ప్రాంతం ఇప్పడు మట్టి దిబ్బగా మారిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కొండను తొలిచేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెబుతున్నారు. చారిత్రక తురుక్కుల కొండ పిండి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో బౌద్ధక్షేత్రం కలిగి ఉన్న చారిత్రక తురుక్కుల కొండను కూటమి మాఫియా పిండి చేసింది. కొండ చుట్టూ మట్టి తవ్వకాలు చేపట్టి కొండను తొలిచేసింది. ఎంతగా అంటే కొండపైన ఉన్న బౌద్ధ స్తూపాలు కుంగిపోయే పరిస్థితి తీసుకువచి్చంది. కొండ వెనుక భాగంలో సుమారు వంద అడుగుల మేర తవ్వకాలు జరిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) రక్షణలో ఉన్న కొండను సైతం వదల్లేదంటే కూటమి మట్టి మాఫియా ఎంతకు తెగిస్తోందో అర్థమవుతుంది. అనుమతి కొంత.. తవ్వేది కొండంత మట్టి తవ్వి తరలించేందుకు కొంత మేర మాత్రమే అనుమతులు పొందుతున్నారు. అనంతరం ఆ అనుమతుల పేరుతో రెచి్చపోతున్నారు. అనుమతులు ఎకరం విస్తీర్ణానికి తీసుకుంటే.. వంద ఎకరాల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మాఫియా సభ్యులు ఒక ధర నిర్ణయించి మామూళ్లు ముట్టజెపుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికే అక్రమంగా తవ్వేసి కొండలను పిండి చేసిన మట్టి మాఫియా ఇటీవల తిరిగి తవ్వకాలకు అనుమతులు కోరుతూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సైతం ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలను సైతం సేకరించారు. ఇక అనుమతులు ఇవ్వడమే తరువాయి అన్నట్లు ప్రక్రియ వేగవంతమైంది. వైఎస్సార్సీపీ నేతల ఆందోళనతో ఆగిన అనుమతులు పిఠాపురం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా ఆగడాలపై వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. సహజ సంపదను దోపిడీ చేస్తున్నా పాలకులు, అధికారులు ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నిలదీశారు. చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. దాంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మైనింగ్ అనుమతులను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా, మైనింగ్ మాఫియా జడలు విప్పినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. మట్టి మాఫియాలో కూటమి నేతలంతా ఉండబట్టే ఆయనేమీ మాట్లాడడం లేదన్న విమర్శలున్నాయి. -
తాడేపల్లిలో ‘పచ్చ’ డ్రామా
సాక్షి, అమరావతి: డీఎస్సీలో అక్రమాలతో అర్హులైన యువతకు ఉద్యోగాలు దక్కకుండా చేసి, అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమం నుంచి ప్రజలను పక్కదారి పట్టించే డైవర్షన్ డ్రామాల్లో చంద్రబాబు సర్కారు మరో అంకానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఘం పేరుతో కొందరిని వైఎస్సార్సీపీ కార్యాలయంపైకి పంపింది.వారికి తోడుగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ వారిని కెమెరాలతో పంపింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టులకు పరీక్షలు నిర్వహించడానికి వైఎస్సార్సీపీ కారణమంటూ సోమవారం వారంతా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గొడవకు దిగారు. వారంతా పసుపు రంగు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏ పరీక్షా లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా తరహాలోనే పశు వైద్యుల పోస్టు (వీఏఎస్ పోస్టు)లను ఎటువంటి పరీక్షలు లేకుండా తాము కోరుకున్న వారికి కట్టబెట్టేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నంచింది. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించటంతో ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో వెనక్కు తగ్గింది. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క చంద్రబాబు కూటమి నేతలు వీఏఎస్ పోస్టుల అభ్యర్థుల పేరుతో కొందరిని వైఎస్సార్సీపీ పైకి ఉసిగొల్పారు. డీఎస్సీలో అక్రమాలపై సోమవారం వైఎస్సార్సీపీ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సమయంలోనే వీరు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు.వీఏఎస్ పోస్టులకు పరీక్ష వద్దంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ‘పరీక్షలు రాయం.. ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తే మీకేమి నొప్పి’ అంటూ కొందరు అనటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి వారి వద్దకు వచ్చి ఎంత సర్ది చెప్పినా వారు మరింత రెచి్చపోయి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన ముగియగానే వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద గొడవ చేస్తున్న వారికి టీడీపీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఆ వెంటనే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవడం కొసమెరుపు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు బరితెగిస్తున్నారు. సోమవారం తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బెస్త వెంకటేశులుపై వేటకొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి వద్ద చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వరదాయపల్లి మాజీ సర్పంచ్ వెంకటరాముడు కుమారుడు బెస్త వెంకటేశులు చెన్నేకొత్తపల్లిలో కౌలుకు తీసుకుని అరటి తోట సాగు చేస్తున్నాడు. జేసీ వర్గీయులతో ఉన్న రాజకీయ తగాదాల కారణంగా కొంత కాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. వెంకటేశులు చెన్నేకొత్తపల్లి సమీపంలోని టీ స్టాల్ వద్ద ఒంటరిగా ఉండగా, ముసుగులు ధరించి వచ్చిన ఐదుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశారు. కాలు, తలపై నరికారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశులును 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్లారు. -
అదే బ్యాచ్
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తనయుడు లోకేశ్ రౌడీలు, గూండాలతో ఓ ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకున్నారు. తమ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ, వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపైన, తమ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలపైనా వారిని ప్రయోగిస్తున్నారు. మెగా డీఎస్సీలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగులు శాప్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమాలను అడ్డుకున్న ఆ బ్యాచ్, గతంలో సాక్షి పత్రిక కార్యాలయంపై దాడులకు తెగబడ్డ దుండగులు ఒక్కరేనని తేలింది. నాడు విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంపై దాడిచేసిన టీడీపీ రౌడీలు నేమ్ బోర్డును సైతం పెకిలించారు. వారే ఇప్పుడు డీఎస్సీపై జరుగుతున్న ఆందోళనలను అడ్డుకోవడానికి రంగంలోకి దిగారు. సాక్షిపై జరిగిన దాడులకు సంబంధించిన ఫొటోల్లోను, డీఎస్సీ నిరసనలపై జరిగిన దాడులకు సంబంధించిన ఫొటోల్లోను వారు స్పష్టంగా కనిపిస్తున్నారు. దారినపోయే వాళ్లమంటూ బుకాయింపు ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ శ్రేణులతో గొడవ పెట్టుకుని, ఘర్షణకు పాల్పడ్డారు. ‘అసలు మీరు ఎవరు? మీకు, ఈ ఆందోళన కార్యక్రమానికి ఏమిటి సంబంధం? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని శాప్ కార్యాలయం గేటు వద్ద సాక్షి ప్రతినిధి వారిని ప్రశ్నించారు. అయితే తాము రోడ్డు మీద వెళుతూ శాప్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనను చూసి వచ్చామని, తమ అభిమాన నాయకుడు లోకేశ్‌ను కొందరు దూషిస్తుంటే చూసి తట్టుకోలేక అడ్డుకున్నామని వారు బుకాయించారు.కానీ అంతకుముందే ఈ గూండాలు డీఎస్సీ అభ్యర్థులను స్టేడియం గేటు నుంచి సురక్షితంగా లోపలికి పంపిస్తూ కనిపించారు. పోలీసులు వీరికి రాచమర్యాదలు చేశారు. సాక్షాత్తు షాడో పోలీసుల్లా ప్రతిచోటా లా అండ్ ఆర్డర్‌ను వారే తమ చేతుల్లోకి తీసుకున్నారు. వారు అనుకున్నది పూర్తయిన తరువాత.. అప్పటికే వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకోవడం చూసి, పోలీసులే దగ్గరుండి ఈ ప్రైవేటు గూండాలందరినీ జాగ్రత్తగా అక్కడి నుంచి పంపించేశారు. -
పంచదార వేసుకొని మజ్జిగ తాగు తియ్యగుంటది.. లోకేష్ పై శ్యామల సెటైర్లు
-
YSRCP నేతలపై టీడీపీ గుండాల దాడి సజ్జల ఫస్ట్ రియాక్షన్
-
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?: సజ్జల
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీలో అక్రమాలు చేసి, ఆ తప్పుల నుంచి బయటపడేందుకే వెన్నుపోట్ల పార్టీ దాడుల్ని కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వ ఆటలు సాగవని. న్యాయ స్థానాల ద్వారా పోరాడుతామని ఆయన హెచ్చరించారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారాయన.సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన సజ్జల.. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి శ్రేణులు దాడులకు తెగబడుతున్న ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘దబాయించడం, బుకాయించడమే కాదు... ఎదురుదాడికి దిగుతున్నారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. నియంతల పాలన సమయంలో కూడా ఇలా జరగలేదు. అబద్ధం, దుర్మార్గం, బరితెగింపు, క్రూరత్వం కలిపితే అది వెన్నుపోట్ల పార్టీ. చంద్రబాబుకు కొడుకు తోడయ్యాక ఈ పరిస్థితులు మరింత దిగజారాయి.ఇదీ చదవండి : నిన్నెలా నమ్మాలి బాబూ?డీఎస్సీ అభ్యర్థి కోర్టుకు వెళితే అసలు బండారం బయటపడింది. డీఎస్సీలో మోసపోయిన అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఎలా? డీఎస్సీలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో అన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. టెట్ పాస్ కానీ వారికి ఉద్యోగాలు ఇచ్చారు. సంబంధం లేని సబ్జెక్ట్‌లలోనూ ఉద్యోగాలు ఇచ్చారు. చివరికి పరీక్షా పేపర్లు కూడా అమ్ముకున్నారనే వార్తలు వచ్చాయి. మాపై దాడులు చేస్తూనే.. మరోవైపు ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ నేతలే దాడులు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తప్పు చేసి కూడా దబాయించాలని చూస్తున్నారు.ఇక, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటాలో నకిలీ పత్రాలు సృష్టించారు. డీఎస్సీ అక్రమాల బేరసారాల వీడియోలు దొరికినా, వాటిని వదిలేసి కేవలం అనుమానితుడిపైనే కేసులు పెట్టారు. 'సెవెన్ స్టెప్స్' అంటే కూటమి ప్రభుత్వంలో వేరే అర్థం ఉంది. స్పోర్ట్స్ కోటాను దాటేసి మరీ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వీటికి పొలిటికల్ కలర్ ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
అధికారంలోకి రాగానే... లైవ్ లో ఇచ్చిపడేసిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
-
నీ ఆఫీస్‌కు 10 మీటర్ల దూరంలో ఉన్నాం. దమ్ముంటే రా..
-
తలలు పగలగొట్టారు.. YSRCP నిరసనలో టీడీపీ గుండాలు..
-
పోలీసుల ముందే YSRCP నేతలపై టీడీపీ గుండాలు దాడి
-
‘హూ ఈజ్ మోదీ’ నుంచి గ్రేట్ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటి? ఆయన ఏ లక్ష్యంతో బీజేపీ పట్ల, ప్రధాని మోదీ పట్ల అంత విధేయత చూపుతున్నారు? ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందింది. అదంతా ఏమైందో కాని, ప్రస్తుతం ఆత్మాభిమానంతో సంబంధం లేకుండా టీడీపీ ముఖ్యనేతలు ప్రవర్తిస్తున్నారేమిటా అని పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా వారణాసికి వెళ్లి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ కాదనరు. కాని వారణాసి వెళ్లి బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి పూజలు చేసి హారతి ఇచ్చిన వైనంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పనే వైఎస్ జగన్ వంటి నేతలు ఎవరైనా చేసి ఉంటే, చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి ఉంటే, ఇక ఇల్లెక్కి గోలచేసినంత పని చేసేవారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిందని ఎల్లో మీడియాలో హోరెత్తించేవారు. కేసుల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించేవారు.రాజకీయాలలో ప్రధాని మోదీ కన్నా చంద్రబాబు నాయుడు చాలా సీనియర్. ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పుకునేవారు. ఆ సీనియారిటీని పక్కనబెట్టి మోదీ కోసం చంద్రబాబు పూజలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ అవసరాలా? లేక తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తగు సహకారం పొందడానికా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది చర్చగా ఉంది.చంద్రబాబు 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టరమ్‌లో మంత్రి అయ్యారు. ఆయన మామ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ నుంచి జంప్ చేసి పెత్తనం సాగించారు. కర్షకపరిషత్ ఛైర్మన్‌గా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మెడలు వంచి అధికారం సాధించామని ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. అలాంటి నేత బీజేపీ విషయంలో పలుమార్లు పిల్లిమొగ్గలు వేశారు.1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు. 1998 నాటికి ఎన్డీఏలోకి వచ్చి, 1999 ఎన్నికలలో కలిసి పోటీచేశారు. 2001 ప్రాంతంలో గుజరాత్ మత కలహాల నేపథ్యంలో మోదీని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోబోనని ప్రతిజ్ఞ చేశారు. కాని 2014 నాటికి ప్రధాని అభ్యర్ది అయిన మోదీని కలవడానికి లాబీయింగ్ చేసుకుని సఫలం అయ్యారు. ఆ తర్వాత 2018లో మళ్లీ బీజేపీకి దూరం అయి కాంగ్రెస్‌తో కలిశారు. 2019లో ఓటమి తర్వాత మళ్లీ బీజేపీవైపు వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసి 2024లో పొత్తు పెట్టుకోగలిగారు. రాజకీయాలలో పొత్తులు మార్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాని విమర్శలు, ఆరోపణల విషయంలో పెద్ద నేతలు సంయమనంగా ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం ఆ విషయంలో హద్దులు పాటించలేదు. ప్రధానిని ఏవైతే అనగూడదో ఆ మాటలన్నీ అన్నారు. దేశానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా, ముస్లింలను బతకనివ్వని మనిషిగా, భార్యను ఏలుకోవడం లేదని అంటూ హూ ఈజ్ మోదీ అనేంతవరకు వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో మోదీ కూడా చంద్రబాబును అవినీతిపరుడని ధ్వజమెత్తారు. అయినా ఇరు పార్టీలు, ఇద్దరు నేతలు మళ్లీ కలవడం ద్వారా ఇవా రాజకీయాలు.. ఔరా అనిపించారు.తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తుకోసం డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాచారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇష్టపడలేదని, తాను ఈ విషయంలో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్‌లో వెల్లడించారు. కూటమి ఎన్నికల ప్రచారానికి మోదీ వచ్చినా చంద్రబాబుతో అంతంతమాత్రంగానే మాట్లాడారని అంటారు. ఆయా సందర్భాలలో మొక్కుబడిగానే వీరిమధ్య సంబంధాలు సాగాయి. ఈ లోక్ సభ ఎన్నికలలో 16 సీట్లు రావడం టీడీపీకి కలిసి వచ్చింది. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ సీట్లు కీలకం అయ్యాయి. ఆ తర్వాత మోదీ, చంద్రబాబుల మధ్య సంబంధాలు మెరుగుపడడం ఆరంభం అయిందని చెప్పాలి.ఇదీ చదవండి: రేవంత్ వర్సెస్ కేసీఆర్.. భూముల లెక్కల్లో అసలు ట్విస్ట్ ఇదేనా?అయినా చంద్రబాబును బీజేపీ పెద్దలు నమ్మడం అంతంత మాత్రమేనని చెబుతారు. చంద్రబాబు పలుమార్లు డోకా చేశారని, కాంగ్రెస్‌తో కూడా కలిసి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో వ్యతిరేక ప్రచారం చేశారన్న అసంతృప్తి బీజేపీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనపై బీజేపీలో నమ్మకం పెరగడానికి గాను 2024 నుంచి తెగ పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. మోదీని అవసరం ఉన్నా, లేకపోయినా పొగడడం, అది కూడా బీజేపీవారికే ఎబ్బెట్టుగా ఉండేంతగా చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఉదాహరణకు ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మోదీని ఆకాశానికి ఎత్తేశారు. మోదీ, మోదీ అంటూ సభికులతో నినాదాలు ఇప్పించారు. మోదీ ప్రపంచానికే నాయకుడని మెచ్చుకుంటున్నారు. మోదీ కోసం ప్రత్యేకంగా యోగా దినోత్సవం నాడు కోట్లు వెచ్చించి ఒక రోజు కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా వైఎస్సార్సీపీ, మరికొన్ని పక్షాలు చేశాయి. కేంద్రం బాగా సహకరిస్తోందని ఒకటికి రెండుసార్లు ప్రకటనలు చేస్తున్నారు.జగన్ టైమ్‌లో రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు తదితర స్కీములకు భారీగానే నిధులు వచ్చాయి. ఆనాటితో పోల్చితే ఈ రెండేళ్లో అమరావతి అప్పు మినహా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించింది అంతంత మాత్రమే. అయినా ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. వారణాసిలో సైతం మోదీని కొనియాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడు అని అభివర్ణించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు కూడా మోదీని పొగిడే పనిలో ఉంటున్నారు.గతంలో గుజరాత్‌కే అన్ని చేస్తున్నారని, ఏపీ అంటే మోదీకి అసూయ అని, అమరావతికి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించేవారు. కాని జత కలిసిన తర్వాత మాట మార్చారు. అది వేరే సంగతి. ఇటీవలికాలంలో ఎందుకు ఇంతగా తగ్గి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఒత్తిడి ఆయనపై అధికంగా ఉందని అంటారు. జనసేన, బీజేపీల నుంచి దానిపై ఒక క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన అభిప్రాయం వెల్లడించలేదు. మోదీ ఒప్పుకుంటే ఆ విషయం ఒక కొలిక్కి రావచ్చు.అంతేకాదు... అది జరిగితే తను జాతీయ స్థాయిలో ఏదైనా పదవికి వెళ్లడానికి చంద్రబాబు టార్గెట్ పెట్టుకుని ఉండవచ్చు. అది సాధించాలంటే బీజేపీ ఓకే చేయవలసి ఉంటుంది. కేంద్ర స్థాయిలోకాని, ఇతరత్రా ఏమైనా కేసులు ఉంటే వాటిని పరిష్కరించుకునే పనిలో కూడా ఉండి ఉండవచ్చన్నది కొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా మోదీ జన్మదినోత్సవ పూజలకు వెళ్లడం ద్వారా చంద్రబాబు తన సీనియారిటీని తానే తగ్గించుకున్నట్లు అయిందా అన్న భావన టీడీపీతో సహా ఆయా వర్గాలలో ఏర్పడింది. ఆత్మగౌరవం వంటివాటితో సంబంధం లేకుండా, ఇలాంటి రాజకీయ వ్యూహాలలో ఆయన దిట్టే అన్న అభిప్రాయం కూడా ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మరి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మరి... నిన్న మొన్నటి వరకూ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎంపీలను తన గుమ్మం ముందు వెయిట్ చేయించిన చిన్న శ్రీను ఇప్పుడు కారు నిండా బొకేలు శాలువాలు పట్టుకుని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేల గుమ్మానికి బయలు దేరుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని కొత్త చుట్టరికానికి చేతులు చాస్తున్నారు. అటువైపు నుంచి ఇష్టం లేకున్నా అయిష్టంగానే ఆహ్వానించక తప్పని పరిస్థితిలో వారు మొహం మీద నవ్వును పులుముకుని రండి.. రండి.. అంటూ ఆ ఎపిసోడ్‌ను ముగిస్తున్నారు. గత 20 ఏళ్లుగా చిన్న శ్రీను అనుభవించిన పొలిటికల్ సెలబ్రిటీ స్టేటస్‌ను కళ్లారా చూసిన వాళ్లంతా ఔరా... పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదే కదా! అని లోలోన ముక్కున వేలేసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. ఆఖరుకు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కానీ జిల్లాలో చిన్న శ్రీను మాటకు తిరుగుండేది కాదు. పలు సందర్భాల్లో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఆయనపై కటువైన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఆయన్ను రాజ్యాంగేతర శక్తి అని.. అవినీతిపరుడు అని పోరాటాలు.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎకాఎకిన ఎలా ఆహ్వానించి కౌగిలించుకుంటాం అనే ప్రశ్నలు వేస్తున్నారు. కడుపులో కత్తులు.. కళ్లలో నవ్వులు 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చిన్న శ్రీనుపై కత్తులు నూరుతూనే ఉంది. జిల్లాపై ఆయన పెత్తనాన్ని పెద్దరికాన్ని పలు సందర్భాల్లో విమర్శిస్తూ ఆయనపై పోరాటం చేస్తూనే వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు మంత్రులుగా ఉన్నవారు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు, గవర్నర్‌గా ఉన్న వారు సైతం ఆయనను టార్గెట్ చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఒక్కసారిగా చిన్న శ్రీనును తమలో కలుపుకోవాలి అంటే కష్టంగా ఉందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించడం ఆయన పట్ల వారిలో ఉన్న అయిష్టతను స్పష్టం చేస్తుంది. 20 ఏళ్లుగా ఉన్న వైరం ఒక్కసారిగా ఎలా పోతుంది అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. పార్టీకి నాయకత్వ లోటు ఏం లేదే ? చిన్న శ్రీనును తమలో చేర్చుకొని ఆయనకు పెద్దరి కం ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు లోలోన గుర్రుమంటున్నారు. తమకు ఏ ఇబ్బంది లేదని, తమవైపు ఎవరూ లేకున్నా జిల్లా మొత్తాన్ని గెలిచామని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన్ను తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే ఎలా సహిస్తాం అని అంటున్నారు. నలభయ్యేళ్లుగా ఉన్న పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని గుర్తు చేస్తూ ఇప్పటికిప్పుడు చిన్న శ్రీను వచ్చి తమను ఏం ఉద్ధరిస్తారని.. ఆయన రాకతో తమకు ఉన్నఫళంగా ఏం లాభం కలుగుతుందని అంటున్నారు. భోజన భేటీలో అప్పడాలు కరకర.. నాయకులు కొరకొర ప్రతి నెలా ఓ ఎమ్మెల్యే ఇంట్లో భోజనం పెట్టే పేరిట ఎమ్మెల్యేలంతా కలసి కూర్చుని మాట్లాడుకోవడం టీడీపీలో ఈ మధ్య వచ్చిన కొత్త సాంప్రదాయం. ఇందులో భాగంగా తాజాగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంట్లో రణస్థలంలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆయన పెద్దరికాన్ని, తమతమ నియోజకవర్గాల్లో ఆయన జోక్యాన్ని ఏమాత్రం సహించరాదని వారంతా కూడబలుక్కుని తీర్మానించినట్లు తెలిసింది. ఆయనకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా తమ ఉనికికి ముప్పు కలుగుతుందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని వారంతా మౌఖికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన చేరిక తమకు సుతరామూ ఇష్టం లేదని.. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక సైలెంట్‌గా ఉన్నామని చెబుతూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకుంటే లేనిపోని చిక్కులు.. గ్రూపు తగదాలకు ఆస్కారం కలుగుతుందని, దానికి అవకాశం ఇవ్వొద్దని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: డీజేలకు అనుమతి ఇచ్చేయండి అనిత గారు! -
యువతిని వేధిస్తున్న టీడీపీ యువ నాయకుడు
తిరుపతి: మండలంలోని పొయ్యకొత్తూరుకు చెందిన టీడీపీ యువ నాయకుడు సురేష్ వేధింపులు ఎక్కువయ్యాయి. పట్టణంలోని సాలిపేటకు చెందిన ఓ యువతి వద్ద అతను ఏడాది క్రితం కుక్కపిల్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపేందుకు యువతి సెల్‌ఫోన్ నంబర్ తీసుకున్నాడని, ఆ తర్వాత నుంచి ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె బీవైసీ పార్టీ రాష్ట్ర మహిళా కో కనీ్వనర్ హిమబిందు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేష్‌పై శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటికీ బెదిరింపులు ఆగలేదని, మహిళకు జరిగిన అన్యాయంపై సామాజిక బాధ్యతతో అండగా నిలిచినందుకు తనపై కూడా దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాడని హిమబిందు ఆరోపించారు. ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేసినా..! ఈ నేపథ్యంలో గత గురువారం హిమబిందుతో కలిసి మహిళలు పొయ్యకొత్తూరులోని సురేష్ ఇంటికి వెళ్లారు. అతని వేధింపులపై కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సురేష్ హిమబిందు ఇంటికి వెళ్లి విధ్వంసానికి పాల్పడ్డాడు. పొయ్యకొత్తూరు నుంచి వస్తున్న ఇద్దరు మహిళలను అడ్డుకుని వారిపై దాడికి యత్నించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సురేష్ తాను టీడీపీ నాయకుడినని, ఎమ్మెల్యే తనకు తెలుసంటూ హంగామా చేశాడని, ‘మీ అంతు చూస్తానంటూ’ పోలీసులను సైతం బెదిరించినట్లు బాధితులు ఆరోపించారు. కొందరు టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సురేష్‌కు మద్దతుగా మాట్లాడినట్లు సమాచారం. మహిళలు రాజీకి అంగీకరించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆగని బెదిరింపులు ఇప్పటికే కేసు నమోదైనా బెదిరింపులు ఆగలేదని హిమబిందు ఆరోపించారు. ఓ మహిళకు అండగా నిలిచినందుకు తనపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయగా.. మరుసటి రోజు అయిన ఆదివారం ఉదయానికే సురేష్ తన ఇంటి వద్దకు వచ్చి అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం అద్దాలు, లైట్లు ధ్వంసం చేసి ఇబ్బందులకు గురిచేశాడని హిమబిందు ఆరోపించారు. అండగా నిలిస్తే చంపేస్తారా? ఈ ఘటనపై హిమబిందు సోషల్ మీడియా వేదికగా ఆదివారం తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘సామాజిక బాధ్యతతో ఓ మహిళకు అండగా నిలిస్తే చంపేస్తామని బెదిరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పేరును ప్రస్తావిస్తూ.. టీడీపీ యువ నాయకులు మహిళలకు చేస్తున్న అన్యాయాలు, తన∙పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలు ఆయనకు తెలియవా?.. లేక వారికి నిజంగానే ఎమ్మెల్యేయ అండదండలు ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మహిళలను కాపాడాలని, తనకు జరిగిన పరిణామాలపై కూడా స్పందించి న్యాయం చేయాలని హిమబిందు కోరారు. హిమబిందు సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై పోలీసులు స్పందించినట్లు సమాచారం. సురేష్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి 13 రోజుల రిమాండ్‌కు తరలించారు.యువతిని వేధిస్తున్న టీడీపీ యువ నాయకుడు -
AP: డీజేలకు అనుమతి ఇచ్చేయండి అనిత గారు!
అమలాపురం టౌన్: వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజే శబ్దాలకు పలువురు గుండెలు ఆగి చనిపోతున్నారు. డీజేలపై పోలీసు ఆంక్షలు ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతాలో ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి కోరుతూ మెసేజీలు వస్తున్నాయని, హోం మంత్రి అనితను డీజేలకు ఓకే చెప్పాలని సూచిస్తూ పోస్టు పెట్టడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లలో ఇటువంటి ఊరేగింపుల్లో డీజేల వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే అపరిమిత శబ్దం వల్ల ఓ వ్యక్తి దుర్మణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ పోస్టును ఉద్దేశించి ఇలాగైతే తాము డీజేలను అదుపు చేయలేమని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’ వద్ద అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇది బాధ్యతా రాహిత్యమే డీజే శబ్దాలతో పలువురి ప్రాణాలు పోతుంటే మంత్రి లోకేష్ బాధ్యతారాహిత్యంగా అనుమతులు ఇవ్వడం సరికాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది పోయి ఇలా తప్పుడు పోస్టులు, ప్రకటనలు చేయడం దేనికి సంకేతం? ఓటు బ్యాంక్ రాజకీయాలతో మంత్రి లోకేష్ డీజేలకు అనుమతులు ఇవ్వాలని అభిప్రాయపడడమే కాకుండా దాని అమలుకు కసరత్తు చేయడం బాధాకరం. – కాశి రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి, వైఎస్సార్ సీపీ ఇదీ చదవండి: ఇలాగైతే ఎదిగేదెలా? -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు గూండాగిరి ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ నేత హరినాథ్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ముసుగులు ధరించి టీడీపీ నేతలు దాడి చేశారు. తాడిపత్రి పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఘటన జరిగింది. వైఎస్సార్సీపీ నేత హరినాథ్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారు. గాయపడిన హరినాథ్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.ఇదీ చదవండి: నెల్లూరు మేయర్ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి! -
‘బాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య’
సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు వచ్చిన ప్రతిసారీ లిక్కర్ కేసును తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. లేని స్కామ్‌ను ఉన్నట్టుగా చూపించి వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేసే కుట్ర జరుగుతోందని, లిక్కర్ స్కామ్ అంటూ చెబుతున్న లెక్కల్లో భారీ తేడాలే అందుకు నిదర్శనమన్నారు.ఎన్నికల ముందు లక్ష కోట్లుగా చెప్పిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు రూ.3 వేల కోట్లకు చేరిందని.. కానీ, దానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని గుర్తు చేశారు. సిట్ దర్యాప్తు పేరుతో వ్యక్తులను ఒత్తిడికి గురిచేసి, ప్రలోభపెట్టి వాంగ్మూలాలు తీసుకుంటున్నారని తెలిపారు. సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి ఆయన వాంగ్మూలాల ఆధారంగా కేసును ముందుకు నడిపించే కుట్ర చేస్తున్నారని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా..:ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతున్న ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించేందుకు లిక్కర్ కేసును తెరపైకి తెస్తున్నారు. ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ రూ.లక్ష కోట్లు అని చెప్పిన చంద్రబాబు.. పవన్ కల్యాణ్ రూ.44 వేల కోట్లు, టీడీపీ నేతలు రూ.33 వేల కోట్లు, అసెంబ్లీ శ్వేతపత్రంలో రూ.18 వేల కోట్లు, చివరకు సిట్ రూ.3 వేల కోట్లు అంటోంది.ఒకే కేసులో ఇన్ని రకాల లెక్కలు రావడం వెనుక వాస్తవాలు లేవనే విషయం స్పష్టమవుతోంది. రూ.3 వేల కోట్ల స్కామ్ జరిగిందని చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి అక్రమ లావాదేవీని కూడా నిర్దిష్ట ఆధారాలతో చూపలేకపోయారు. రెండేళ్లుగా దర్యాప్తు సాగుతున్నా కొత్త పాత్రలు, కొత్త వాంగ్మూలాలతో కేసును సాగదీస్తున్నారు.సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి కేసును నడిపించే ప్రయత్నం:సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి ఆయన వాంగ్మూలం ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఆయన 2025 ఫిబ్రవరి 21న దర్యాప్తు అధికారి ముందు, ఫిబ్రవరి 25న మేజిస్ట్రేట్ ముందు, జూలై 16న మరోసారి, తాజాగా మరో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన చెబుతున్న భారీ మొత్తాల చెల్లింపులను స్వయంగా చూశారా? సంబంధిత వ్యక్తులతో సమావేశాల్లో పాల్గొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 57 మంది వ్యక్తులు, సంస్థలను కేసులోకి లాగి 17 మందిని అరెస్ట్ చేశారు. పలువురికి బెయిల్ వచ్చింది. కుటుంబ సభ్యులను బెదిరించడం, ప్రలోభ పెట్టడం వంటి పద్ధతులతో వాంగ్మూలాలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.దర్యాప్తు పేరుతో ఒత్తిళ్లు.. హైకోర్టు వరకు వెళ్లిన బాధితులు:దర్యాప్తు అధికారుల మాట విన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్‌మ్యాన్‌కు జీతం పెంపు, ప్రమోషన్లు ఇచ్చిన వ్యవహారం ఉంది. మరో గన్‌మ్యాన్ వాస్తవాలు చెప్పినందుకు థర్డ్ డిగ్రీకి గురై హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వెంకటేష్ నాయుడిని కూడా తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని డబ్బులు ఇస్తామంటూ ప్రలోభపెట్టిన విషయాన్ని కోర్టులో వెల్లడించారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని ఫార్మ్‌హౌస్‌లో రూ.11 కోట్ల నగదు వ్యవహారంలోనూ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. సీజ్ చేసిన ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంలో ఆలస్యం జరిగింది. ఇలాంటి పరిణామాలన్నీ దర్యాప్తు తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.ఇదీ చదవండి: ‘ఆగు నాయనా.. వచ్చే ఏడాది నీకోసం పెద్ద బావి తవ్విస్తా’ -
టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు
-
నెల్లూరు మేయర్ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి!
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలవకముందే అధికార టీడీపీలో మేయర్ పీఠం చిచ్చు రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థిత్వంపై నేతలు తమ వర్గాల బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేయర్ పీఠం తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఎవరికి వారు అభ్యర్థిత్వాలపై ప్రతిపాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ పీఠంపై తమ మాటే నెగ్గించుకోవాలన్న పట్టుదల కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వర్గం నుంచి డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ పేరు ప్రచారంలో ఉండగా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన వర్గం నుంచి ప్రత్యామ్నాయ పేర్లను తెరపైకి తీసుకురావడం ఆసక్తి రేపుతోంది. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానికంటే.. పార్టీలో ఎవరి రాజకీయ ఆధిపత్యం నిలుస్తుందన్నదే ఇప్పుడు నెల్లూరులో హాట్‌టాపిక్‌గా మారింది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీలో మేయర్ పీఠం కుంపటి రగులుతోంది. త్వరలో జరగబోయే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మేయర్ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ కీలక నేతల మధ్య అంతర్గతంగా మంటలు రాజకున్నాయి. ఇటీవల టీడీపీ ముఖ్య నేత లోకేశ్ పర్యటన నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి. మేయర్ పీఠంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెక్ పెట్టేందుకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి కలిసి ప్రయోగించిన అస్త్రం గురి తప్పలేదు. అధిష్టానం వద్ద కోటంరెడ్డి పరపతి ఇంతేనని ఆఖరి క్షణంలో నెల్లూరు రూరల్‌లో లోకేశ్ పర్యటనను రద్దు చేయించడంతో ఘోర పరాభవం తప్పలేదు. ఈ పరిణామాలతో రగిలిపోతున్న కోటంరెడ్డి మేయర్ అభ్యర్థిత్వంపై తన మాటే చెల్లుబాటయ్యేలా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మైనార్టీ మెలిక.. వ్యూహం కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే మేయర్ అభ్యర్థిత్వంపై మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి మెలిక ఆ పార్టీని అంతర్మథనంలో పడేస్తోంది. రోస్టర్ ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ జనరల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీకి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. కానీ టీడీపీలో మాత్రం మేయర్ అభ్యర్థిత్వంపై నెల రోజులుగా నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న నెల్లూరురూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మేయర్ పీఠం తన గుప్పెట్లో పెట్టుకునేందుకు, రానున్న రోజుల్లో మైనారిటీల్లో తన పట్టును నిలబెట్టుకునేందుకే ముందుగానే నెల్లూరు మేయర్ సీటు మైనారిటీలైన ముస్లింలకు ఇవ్వాలని మెలిక పెట్టారు. ఒక వేళ పార్టీ ఓకే అంటే ఆ క్రెడిట్ తనదిగా చెప్పుకోవచ్చు.. లేదంటే నేను మైనార్టీలకు ఇవ్వాలని చెప్పినా మంత్రి నారాయణ ఒప్పుకోలేదని ఆ నెపం ఆయనపై నెట్టేయొచ్చు అనే రాజకీయ వ్యూహంతో కోటంరెడ్డి తుట్టెను కదిలించారు. నెల్లూరు రూరల్‌పరిధిలో మైనార్టీ ఓట్లను ఆకట్టుకునేందుకు ఈ అస్త్రం ఉపయోగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోటంరెడ్డిని ఆయనకు అత్యంత సన్నిహితుడైన కోడూరు కమలాకర్‌రెడ్డి కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. రూప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోటంరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ ఖరారు చేయిస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే కోటంరెడ్డికి మింగుడు పడలేదు. రూప్‌కుమార్‌కు మేయర్ అభ్యర్థిత్వం అయితే తన పవర్ సెంటర్‌కు చిల్లు పడుతుందని, ఎలాగైనా రూప్ అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు తన రాజకీయ అస్త్రాలు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. జనరల్ సీటులో బీసీకి ఎలా ఇస్తారంటూ మెలిక పెట్టి తాజాగా తన సోదరుడు గిరిధర్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. చాపకింద నీరులా ప్రయత్నాలు తీవ్ర తరం చేస్తున్నారు. ఒక వేళ తన సోదరుడు కాకుంటే తన అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డిని పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రూప్ అభ్యర్థిత్వానికి నారాయణ.. వేమిరెడ్డి పావులు నెల్లూరు కార్పొరేషన్లో విజయావకాశాలు పక్కన పెట్టి.. టీడీపీ అభ్యర్థిత్వంలో తన మాటే నెగ్గాలని మంత్రి నారాయణ తన ఆధిపత్య అ్రస్తాన్ని ప్రయోగిస్తున్నారు. జిల్లా టీడీపీలో కీలకంగా మారిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు సైతం నారాయణ నిర్ణయానికే జైకొడుతున్నారు. బీసీ వర్గానికి చెందిన రూప్‌కుమార్ జనరల్ సీటులోనైనా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని వేడుకోవడంతో ఈ క్రమంలో మంత్రి, ఎంపీలకు ఇష్టుడుగా ఉన్న డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ పేరు తెరపైకి తెచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి రూప్ పేరు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్ వద్ద కూడా రూప్ పేరునే ఖరారు చేయమని ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నారాయణ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మద్యం అక్రమ కేసులో కొత్త నాటకం... సత్యప్రసాద్ చేత విజయవాడ ఏసీబీ కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం
-
‘ఈ కీలుబొమ్మ సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితుల్లో ఉంటే నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమస్యపై స్పందించకుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు.విశాఖలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్, గృహ నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల జీతాలు, ఉద్యోగుల తొలగింపులు, ప్లాంట్ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.నగరంలో మూడు, నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉందని, ట్యాంకర్ల ద్వారా కూడా నీరు దొరకడం లేదని ప్రచార కార్యక్రమాలను, రాజకీయ విమర్శలు పక్కనపెట్టి తక్షణమే విశాఖ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా విలువైన భూములను అనామక కంపెనీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:విశాఖ నీటి సమస్యపై సీఎం సమాధానం చెప్పాలిముఖ్యమంత్రి విశాఖపట్నానికి వచ్చినప్పుడు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై మాట్లాడతారని ఆశించాం. కానీ విశాఖలో నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. మూడు రోజుల నుంచి నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉంది. కనీసం ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుందామన్నా దొరకడం లేదు. పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు అందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రేపటి నుంచి నీటి సమస్య తీరుతుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారని ప్రజలు ఎదురుచూశారు. కానీ ఆ సమస్యను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై, వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రభుత్వం విశాఖ ప్రజలకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు అని ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది.విశాఖ భూములపై ఎన్నో ప్రశ్నలు2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు వందలాది ఎకరాలు ఇచ్చారు. వాటిలో ఒక్క కంపెనీ అయినా నిర్మాణం చేపట్టిందా? స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన కంపెనీల్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలుగా కనిపిస్తున్నాయి.విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్‌కు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. విశాఖకు నీరు కూడా అందకుండా పోతే పెట్టుబడిదారులు ఈ నగరం వైపు ఎందుకు చూస్తారు? విశాఖను అభివృద్ధిని పణంగా పెట్టి మరీ అమరావతిని ప్రమోట్ చేసుకోవాలన్న ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదు.స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలివిశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1,000 కోట్లు ఇచ్చాం. రూ.10 వేల కోట్లు ఇచ్చాం. రూ.20 వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ డబ్బులు ఎందుకోసం ఇచ్చారు? బ్యాంకు రుణాలు చెల్లించకపోతే ప్లాంట్ వేలానికి వెళ్లే పరిస్థితిని నివారించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసి ఉంటే, దాన్ని కార్మికులను, ప్లాంట్‌ను ఉద్ధరించినట్లు చెప్పుకోవడం ఏమిటి? కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 6,500 మందిని ఎందుకు తొలగించారు?పర్మినెంట్ ఉద్యోగులకు ఎందుకు వీఆర్ఎస్ ఇచ్చారు? ఈ రెండున్నరేళ్లలో కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులు కలిపి దాదాపు 10 నుంచి 12 వేల మందిని తొలగించిన అంశానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నాలుగున్నర నెలలుగా కార్మికులకు జీతాలు లేవు. ప్లాంట్ భవిష్యత్తు ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేకపోతే ఇప్పటివరకు ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేదు? కార్మికులకు ఎందుకు భరోసా ఇవ్వలేదు?ఇళ్ల పట్టాల పేరుతో డ్రామా వద్దుఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. 2019 నుంచి 2024 వరకు జగన్ గారి ప్రభుత్వం పేద కుటుంబాలకు భూములు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. విశాఖ నగరంలో సుమారు 1.30 లక్షల కుటుంబాలకు సొంత స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకునే కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారు. పేదల సొంత ఇంటి కలను ఆపేశారు.2019లో జీవో 463 ద్వారా అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వ భూములను రూపాయికే రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పించాం. 2021లో జీవో 225, 2023లో మరిన్ని రాయితీలు, జీవో 60 ద్వారా పట్టాలు పొందిన వారికి హక్కులు కల్పించాం. గాజువాక హౌస్ కమిటీ సమస్యకు కూడా జీవోలు తీసుకొచ్చి పరిష్కారం చూపాం. వీటి ద్వారా మా ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లను భరించి పేద కుటుంబాలకు ప్రయోజనం కల్పించింది. ఇప్పుడు అదే కార్యక్రమాలను కొత్తవిగా చూపించుకోవడం ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదు.ముందు ప్రజల దాహం తీర్చండిప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు విశాఖ ప్రజలు పెన్షన్లు వద్దు, మహిళలకు ఇస్తామన్న రూ.1,500 వద్దు, పిల్లలకు ఇస్తామన్న రూ.15 వేలు వద్దు, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలూ వద్దు.. కనీసం గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ముడసర్లోవ, మేదరగడ్డ, రైవాడ రిజర్వాయర్లు ఎండిపోయాయి. తాడిపూడి నుంచి నీరు రావడం లేదు. పోలవరం నీరు అనకాపల్లి వరకు వచ్చిందని చెబుతున్నారు. మరి ఆ నీరు విశాఖకు ఎందుకు రాలేదు? ఈ సమస్యపై ఒక్క మంత్రి అయినా సమీక్ష నిర్వహించారా?వచ్చే ఏడాది వర్షాలు పడతాయని చెప్పడానికి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోలేదు. కరవు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, నగరానికి నీరు ఎలా అందించాలి, పరిశ్రమలకు నీరు ఎలా ఇవ్వాలన్న దానిపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. రాజకీయ విమర్శలు మానేసి తక్షణమే విశాఖ ప్రజల దాహార్తి తీర్చే చర్యలు చేపట్టాలని గుడివాడ్ అమర్నాథ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు -
దళితులంటే సునీతమ్మకు నచ్చదా?
అనంతపురం: దళితులంటే పరిటాల సునీతకు నచ్చదా? అంటూ గొరిదిండ్లకు చెందిన దళిత మహిళలు ఎమ్మెల్యే సునీతపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరులో గొరిదిండ్ల దాడి విషయంలోని బాధితులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సీపీ ఆలమూరు ఓబులేసు, దళిత మహిళలు మాట్లాడుతూ గొరిదిండ్లకు అనూష తన భర్త, తండ్రిని కోల్పోయి ఉన్న ఒక్క కూతురిని చూసుకోవడానికి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే అదే గ్రామానికి చెందిన అక్కులప్ప అనే వ్యక్తి అనూష పట్ల అనుచితంగా ప్రవర్తించి, అత్యాచార యత్నం చేశాడన్నారు.బుధవారం రాత్రి అక్కులప్ప మధ్యం తాగి అనూషను కత్తితో పొడవగా, తీవ్రంగా గాయపడిందన్నారు. అనూషపై దాడిని అడ్డుకోబోయిన హరీష్ కుమార్, మహేంద్ర, శివానందను గొడ్డలితో దాడి చేశారన్నారు. ప్రస్తుతం వారు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడి చేసిన వారిపై అక్కులప్ప, మధు, సోమశేఖర్, రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేవలం అక్కులప్పపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుకున్నారన్నారు. మిగిలిన వారిని టీడీపీ నాయకుడు బాలాజీ ఎమ్మెల్యే సునీత ఇంట్లో దాచిపెట్టారన్నారు. కక్షలను పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే సునీత.. నియోజకవర్గంలో మహిళల పట్ల ఎన్ని దాడులు జరిగినా ఎమ్మెల్యే సునీత మాత్రం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన దళిత నాయకులు అన్నారు. పరిటాల సునీత ఎప్పుడు అధికారంలోకొచ్చినా ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉన్నా.. మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఊర్లు విడిచే పరిస్థితి వచ్చిందన్నారు. నలుగురిపై కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని బాలాజీ ఎవరి పేరు చెబితే వారిపైన మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ బాల పోతన్న, యూత్ కన్వీనర్ కొండారెడ్డి,మాజీ డీసీసీబీ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, లక్ష్మిరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, రమేష్ కేశవరెడ్డి, మాధన్న, గోవింద్ , ఆదినారాయణ, లక్ష్మి, అఖిల, లలితమ్మ, సంగమ్మ,రామక్క,లక్ష్మక్క, ముత్యాలక్క,నారాయణమ్మ,కుంటెమ్మ,నాగమణి, శాంతమ్మ, కుళ్లాయప్ప, పెద్దన్న పాల్గొన్నారు. అమ్మ లేకపోతే అనాథనైతా..మా అమ్మను కత్తితో పొడిచారు.. మా నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. మా అమ్మ కూలి పనులు చేస్తూ నన్ను చదివిస్తోంది. మా అమ్మను వదిలేయండి.. మా అమ్మను కత్తితో పొడిచారు. మా అమ్మ లేకపోతే నేను బతకను. నన్ను అనాథను చేయకండి అంటూ అనూష కూతురు ప్రీతి సుధ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అందరినీ కలచివేసింది. సమావేశంలో మాట్లాడుతున్న దళిత నాయకులు ఇదీ చదవండి: రాణీగారి తోటలో చంపేశారు -
రాజ్యసభలో టీడీపీ ఎంపీల పరుష పదజాలం సరికాదు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్ పరుష పదజాలం ఉపయోగించడంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వారి తీరు సరికాదని రాజ్యసభ చైర్మన్‌కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో జూలై 30న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్‌ఫెయిర్ మీన్స్ నిరోధక) సవరణ బిల్లు–2026పై చర్చ సందర్భంగా తాను ప్రసంగిస్తున్న సమయంలో సానా సతీష్ బాబు పదేపదే వైఎస్సార్సీపీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానే కాకుండా బెదిరింపులకు గురిచేసే విధంగా ఉన్నాయని ప్రస్తావించారు. ‘నా ప్రసంగానికి అంతరాయం కలిగించి, ఆలోచనాక్రమాన్ని దెబ్బతీసి, నా వాదనను సమర్థంగా వినిపించకుండా చేయడమే సానా సతీష్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల ఉద్దేశం’ అని వైవీ తెలిపారు. అలాగే, ఆగస్టు 5న సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు–2026పై చర్చ సందర్భంగా మరో టీడీపీ సభ్యుడు చింతకాయల విజయ్ సభా నిబంధనలకు విరుద్ధంగా పరుష పదజాలం ఉపయోగించారని సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇది రాజ్యసభ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ సభలో ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు తోటి సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన లేదా బెదిరింపు వ్యాఖ్యలు చేయకూడదని సుబ్బారెడ్డి తెలిపారు. అది రాజ్యసభ సభ్యుడి భావప్రకటనా హక్కుకు భంగం కలిగించడమేనని స్పష్టంచేశారు. పార్లమెంటరీ నైతికత, సభా మర్యాదల ఉల్లంఘనపై పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు, ప్రివిలేజ్ కమిటీకి వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు. -
నాడు హేమాహేమీలు.. నేడు బ్యాక్ బెంచర్లు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు చంద్రబాబు పక్కన కూర్చొని టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్ నేతలను ఇప్పుడు పట్టించుకునే వారే లేకుండాపోయారు. తమకు పదవులు దక్కకపోగా, కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ సన్నిహితులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు, తొలిసారి గెలిచిన వారు కీలక పదవుల్లో కూర్చొని హవా చెలాయిస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకూ ఒక రోజు వస్తుందని, ఆ రోజు తమ సత్తా, విలువ ఏపాటిదో తెలిసొస్తుందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీలో సీనియర్ల దుస్థితికి యనమల రామకృష్ణుడు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఆయనకు టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మంత్రి పదవి దక్కింది. ఆరి్థక మంత్రిగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాంటి నేత ఇప్పుడు 42 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి ఏ పదవీ లేకుండా మిగిలిపోయారు. తనకు రాజ్యసభకు వెళ్లాలని ఉందని బహిరంగంగా చెప్పుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన, లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన సానా సతీష్ కు మాత్రం రెండోసారి రాజ్యసభ సీటు కట్టబెట్టారు. తన సమకాలికుడిని, కష్టకాలంలో అండగా నిలిచిన సహచరుడిని చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ పార్టీలో నడుస్తోంది. నాడు మంత్రులు.. నేడు ఎమ్మెల్యేలు 2014–19లో చంద్రబాబు కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించిన చాలా మంది ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు. నాడు డిప్యూటీ సీఎంగా, హోం మంత్రిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్ప ఇప్పుడు పెద్దాపురం ఎమ్మెల్యే మాత్రమే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోగా, ప్రాధాన్యతే లేకుండా పోయింది. వ్యవసాయ మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారిదీ అదే పరిస్థితి. సోమిరెడ్డిని కొత్త కమిటీల్లో జాతీయ అధికార ప్రతినిధిగా నియమించి అవమానించారనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న నేతకు ఇప్పుడు టీవీ డిబేట్లలో పార్టీ వాణి వినిపించే బాధ్యత అప్పగించారు. పార్టీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు నుంచి పలుమార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రలకు కూడా మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. మరికొందరి పరిస్థితి ఇంకా అవమానకరంగా మారింది. పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే టికెట్‌ను వదిలేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను కావాలని పక్కన పెట్టేశారు. ఆయన్ను టీడీపీ ఇన్చార్జి పదవి నుంచి కూడా పక్కకు తప్పించారు. గతంలో జల వనరుల మంత్రిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు గత ఎన్నికల్లో టికెట్టే దక్కలేదు.కొత్త వారికి మాత్రం కిరీటాలుసీనియర్లను అవమానకరంగా పక్కనపెడుతూ.. కొత్త వారికి మాత్రం కిరీటాలు పెడుతుండడంతో వారు రగిలిపోతున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు నేరుగా కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు. ఫిరాయింపు నేత లావు శ్రీకృష్ణదేవరాయలుకు లోక్‌సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారు. పార్టీ కమిటీల్లోనూ లోకేశ్ కోటరీకే పదవులు దక్కాయి. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కిలారు రాజేశ్ ముగ్గురూ లోకేశ్‌కు అనుయాయులే. జాతీయ ఉపాధ్యక్షుల్లో సానా సతీష్ , పీతల సుజాత, బుద్ధా వెంకన్న, నూకసాని బాలాజీ, బి.రాంగోపాల్ రెడ్డిలు లోకేశ్ సిఫార్సులతోనే పదవులు దక్కించుకున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన భాష్యం రామకృష్ణ, సానా సతీష్ , చింతకాయల విజయ్ను రాజ్యసభకు పంపారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసి, క్లిష్ట సమయాల్లో చంద్రబాబు వెంట ఉన్న వారంతా ఇప్పుడు బ్యాక్ బెంచీలకు పరిమితమయ్యారు. తొలిసారి మంత్రులైన వారు రెండేళ్లయినా ఇంకా శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. లోకేశ్ చుట్టూ ఉన్న కొద్ది మంది కోటరీ వ్యక్తులకే పదవులు వరిస్తున్నాయని వారు లోలోపల రగిలిపోతున్నారు. -
బొత్స అంటే బ్రాండ్..! స్పీచ్ ఇరగదీసిన బొత్స అనూష
-
లోకల్ ఎన్నికల్లో ఒక్కొక్కడికి.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో TDP జలీల్ ఖాన్
-
DSC స్కామ్ లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్యే కూనతో కుమ్మక్కైన SAAP
-
చంద్రబాబుకు జలీల్ ఖాన్ అల్టిమేటం
విజయవాడ: ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు కేవలం చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులతో మాత్రమే సరిపెడుతున్నారన్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు జలీల్‌ఖాన్ అల్టిమేటం జారీ చేశారు. ఈసారి కచ్చితంగా విజయవాడ మేయర్ సీటు ముస్లింలకే ఇవ్వాలన్నారు. ‘విజయవాడ మేయర్‌గా మైనార్టీలకు అవకాశం కల్పించాలి. మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ అయితే నా కుమార్తెకు అవకాశం ఇవ్వాలి. బీజేపీ మైనార్టీల ఇంపార్టెన్స్ ను గుర్తించింది. కానీ చంద్రబాబు వైఖరి నాకు నచ్చడం లేదు. అనుభవం ఉండి కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదు. విజయవాడలో పార్టీ గెలవాలన్నా...పార్టీ క్యాండెట్ గెలవాలన్నా మైనార్టీల సహకారం అవసరం. ముస్లింలకు మేయర్‌గా అవకాశం ఇస్తే పోటీ ఉండదు. నాకు ఊహతెలిసినంత వరకూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టిక్కెట్ ముస్లింలకే ఇచ్చేవారు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోనే ముస్లింలకు ఎమ్మెల్యే సీటు లేకుండా చేశారు. ఆ రోజే నాకు బాధ కలిగినా నాలోనే దాచుకున్నా. ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు ...రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం లేదు. చిన్న చిన్న నామినేటెడ్ పదవులతో సరిపెట్టేస్తున్నారు. 2019లో నా కుమార్తెను కోరి తెచ్చుకున్నారు. ఇండిపెండెంట్‌ను బరిలోకి దించి నా కుమార్తెను ఓడించారు. నా కుమార్తె ఓటమిలో కూడా కుట్ర జరిగిందికానీ నేను పేర్లు చెప్పలేదు ... చెప్పినా ఉపయోగం ఉండదని చెప్పలేదు. టీడీపీలోయాక్షన్ ఉండదరు..రియాక్షన్ అసలే ఉండదు’ అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి’ -
ఇంకా సీఎంకాలేదు.. లోకేష్ కు మాజీ IAS కౌంటర్
-
‘చంద్రబాబు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని.. కృష్ణా, గోదావరి నీటి నిర్వహణను లోపభూయిష్టంగా మార్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆ ఫలితంగా రాష్ట్ర మంతటా రైతులకు అన్యాయం జరిగిందని.. వ్యవసాయం దండుగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయట పడాలన్నారు. ఇంకా అదే ఆలోచనలో ఉన్నందునే రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.‘‘శ్రీశైలం ప్రాజెక్టు కింద సాగయ్యే పంట భూములన్నీ బీడులుగా మారాయి. రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తే రైతుల కష్టాలు, కన్నీళ్ళు కనపడతాయి. ఇది ఎల్‌నినో కాదు.. ముమ్మాటికీ ఎల్లోనినోనే. తీవ్ర కరువు ఏర్పడినా ఎల్లో మీడియా చంద్రబాబుకు భజన చేస్తోంది. శ్రీశైలానికి భారీగా వరద అనీ, జలకళతో రాయలసీమ రిజర్వాయర్లు అంటూ వార్తలు రాశారు. అంత జలకళ ఉంటే.. మరి గ్రేటర్ రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదు?..కనీసం ఆరుతడి పంటలకు కూడా ఎందుకు నీరివ్వటం లేదు?. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం నీరు ఉన్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎందుకు నీరు ఇవ్వటం లేదు?. రాయలసీమ ప్రజలు ఏం ద్రోహం చేశారని ఇంత కక్ష చంద్రబాబూ?. శ్రీశైలంలో 840 అడుగులకు చేరితే ఇక పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇవ్వలేరు. అనాలోచిత నీటి నిర్వహణ కారణంగానే నీటి ఎద్దడి. నెల్లూరు బ్యారేజి కింద వేలాది ఎకరాల వరి పైరు ఎండిపోతోంది. శ్రీశైలం కింద సాగు చేసే రైతులు పూర్తిగా నష్టపోయారు..వెలిగొండ, పోలవరం వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అయినా పంట పొలాలకు సాగు నీరు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టును సైతం చివరికి రిజర్వాయర్ నుండి బ్యారేజిగా మార్చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటి విడుదల చేయించాలి. ఎండిపోతున్న చీనా చెట్లు, అరటి తోటలు, వరిపైరు, శనగ తోటలు కనపడటం లేదా?. రోడ్డున పడుతున్న రైతుల కష్టాలు కనపడటం లేదా?. కర్ణాటక, తెలంగాణాలో సాగు నీరు ఇస్తుండగా లేనిది ఏపీలో ఎందుకు ఇవ్వరు?. చంద్రబాబు రాయలసీమలోని పొలాలు చూస్తే రైతుల కష్టాలు కనపడతాయి?. వ్యవసాయం దండగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయటకు రావాలి’’ అని శైలజానాథ్ హితవు పలికారు.ఇదీ చదవండి: ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం


