Te3n
-
ఈ వారం యూటూబ్ హిట్స్
బ్యాటిల్‌ఫీల్డ్ 1 : ట్రైలర్ ఈ ఏడాది అక్టోబర్ 21న విడుదల కాబోతున్న వీడియో గేమ్ ‘బ్యాటిల్‌ఫీల్డ్ 1’ ట్రైలర్ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తయారౌతున్న ఈ గేమ్‌ను స్వీడన్ కంపెనీ.. ‘ఈ డైస్’ అభివృద్ధి చేస్తోంది. బ్యాటిల్‌ఫీల్డ్ సిరీస్‌లో ఈ ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్ 14వ ది. గేమ్ ఆడేవారే ఇందులో షూటర్ కాబట్టి దీనిని ఫస్ట్ పర్సన్ వీడియో గేమ్ అంటున్నారు. ఇందులో చారిత్రక యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. శతఘు్నలు గర్జిస్తాయి. శత్రువులు నేల కూలుతారు. యుద్ధట్యాంకులు, విమానాలు, నౌకలు.. కళ్ల ముందు యుద్ధవాతావరణాన్ని సృషించి గేమ్ ఆడేవారిని సాయుధుడైన సైనికుడిలా, దేశభక్తుడిలా మార్చేస్తాయి. డేనియల్ బెర్లిన్ డిజైన్ చేసిన ఈ కొత్త బ్యాటిల్‌ఫీల్డ్ గతంలో వచ్చినవాటికన్నా మరింత భిన్నంగా ఉండబోతోందని నిర్మాత అలెగ్జాండర్ గ్రాండెల్ చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్ లలో ఇది రిలీజ్ అవబోతోంది. తొలి బ్యాటిల్ ఫీల్డ్ గేమ్ ‘బ్యాటిల్‌ఫీల్డ్ 1942’ అనే పేరుతో 2002లో మార్కెట్లోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ఆధారంగా అది తయారైంది. టిఇ3ఎన్ : ట్రైలర్ రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో జూన్ 10 న విడుదలకు సిద్ధమౌతున్న బాలీవుడ్ చిత్రం టిఇ3ఎన్ ట్రైలర్ ఇది. 2013లో వచ్చిన కొరియన్ చిత్రం ‘మాంటేజ్’ ఆధారంగా ఈ.. టిఇ3ఎన్ను థ్రిల్లర్ మూవీగా మలిచారు. అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్దికీ, విద్యాబాలన్, సవ్యసాచి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రంలో.. అమితాబ్ మనవరాలు ఏంజెలా ఎనిమిదేళ్ల క్రితం కిడ్నాప్ అవుతుంది. అప్పటి నుంచీ ఆయన న్యాయం కోసం పోరాడుతూనే ఉంటారు. తన మనవరాలు ఆచూకీ తెలిసిందా అని అడిగేందుకు రోజూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వస్తుంటాడు. అయితే అక్కడ ఆయనకు నిర్లక్ష్యమే సమాధానంగా ఎదురవుతూ ఉంటుంది. ఎవరూ పట్టించుకోరు. ఏ విషయమూ చెప్పరు. చివరికి ఒక మతబోధకుడిని (నవాజుద్దీన్ సిద్దికీ) ఆశ్రయిస్తారు అమితాబ్. నవాజుద్దీన్ గతంలో పోలీసు. అతడి సహాయంతో ఏంజెలాను ఎవరు అపహరించిందీ అమితాబ్ తెలుసుకునే క్రమంలో సినిమా మలుపు తిరుగుతుంది. ఏంజెలా లాంటిదే మరో కిడ్నాప్ జరుగుతుంది. దానిని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ విద్యాబాలన్, నవాజుద్దీన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా ఏంజెలా కిడ్నాపర్ల విషయమై అమితాబ్‌కి ఆయన సొంత ప్రయత్నాల వల్ల సమాచారం దొరుకుతుంది. టిఇ3ఎన్.. ఉద్వేగం, ఉత్కంఠ కలిసిన చిత్రం అని ఈ ట్రైలర్‌ను చూస్తే అర్థమౌతుంది. -
కంగనాపై టాప్ హీరోయిన్ ప్రశంసలు
ముంబై: హృతిక్ రోషన్‌తో ఎఫైర్ వివాదంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్‌కు విద్యాబాలన్ మద్దతు పలికింది. కంగనా స్వయంశక్తితో పైకొచ్చి తన కాళ్లపై తాను నిలబడిందని ప్రశంసించింది. విద్యా బాలన్ తాజా సినిమా 'తీన్' టీజర్ లాంచ్ సందర్భంగా హృతిక్-కంగనా వివాదంపై ఆమెను విలేకరులు ప్రశ్నించారు. 'అది నాకు సంబంధించిన విషయం కాదు. నేనెవరినీ జడ్జ్ చేయలేను. కానీ స్వయంశక్తితో పైకొచ్చిన కంగనా అంటే నాకు ఎంతో గౌరవభావం ఉంది' అని విద్య పేర్కొంది. 'మహిళలుగా మేం ఇతరులు పైకొస్తున్నప్పుడు వారికి అండగా ఉంటాం. కుటుంబసభ్యులు, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు ఎదుగుతున్నప్పుడు మహిళలు వారికి అండగా ఉంటారు. కానీ మా కోసం మేం అరుదుగా నిలబడతాం. తను (కంగన) కూడా తన కాళ్లపై తాను నిలబడి పైకొచ్చింది. అందుకు ఆమెకు నా జోహార్లు అర్పిస్తున్నాం. ఆమెకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నా' అని విద్యా బాలన్ పేర్కొంది. -
అభిమానుల వల్లే మేం ఈ స్థానంలో ఉన్నాం!
న్యూఢిల్లీ: ప్రతి ఆదివారం ముంబైలోని ఆయన బంగ్లా ముందు వేలమంది అభిమానులు గుమిగూడుతారు. ట్విట్టర్లో ఒక భారతీయ నటుడిగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఆయన. ఆయన రాసే 'బ్లాగ్'ను క్రమంతప్పకుండా చదివే పాఠకులు ఉన్నారు. అయినా 73 ఏళ్ల ఆ బాలీవుడ్ లెజండ్ ఇప్పటికీ తన అభిమానుల పట్ల కృతజ్ఞాత భావంతోనే ఉన్నారు. అభిమానులు ఒక నటుడి కెరీర్లో కీలకమైన భాగమని, వారి వల్ల తాము ఈ స్థాయిలో ఉన్నామని వినమ్రంగా చెబుతారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. నాలుగు దశాబ్దాల తన సినిమా ప్రస్థానంలో అమితాబ్ బచ్చన్ ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. విమాన ప్రయాణంలో తనను చూసో, తనతో సెల్ఫీలు దిగో అభిమానులు ఎంతోగానో సంతోష పడుతుంటారని ఆయన చాలాసార్లు ట్విట్టర్లో పంచుకున్నారు. అయితే, భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న అమితాబ్ మాత్రం ఇందులో తన ప్రత్యేకతేమీ లేదంటున్నారు. ఒక నటుడిగా, సెలబ్రిటీగా సాధారణంగానే తనకు ప్రేక్షకాభిమానం లభిస్తుందని, అది నటుడి కెరీర్లో భాగమని తెలిపారు. 'సెలబ్రిటీగా ఉన్న ఎవరికైనా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. అభిమానులు నటుడి కెరీర్లో కీలకభాగం. వారి వల్ల మేం ఈ స్థాయికి ఎదిగాం. వారి పట్ల శ్రద్ధ చూపడం లేదా, వారి దృష్టిని తమ వైపు తిప్పుకోవడం సమర్థనీయమే' అని అమితాబ్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమితాబ్ నటించిన 'వజీర్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు 'టీఈ3ఎన్' సినిమాతో కూడా ఈ ఏడాది ఆయన ప్రేక్షకులను పలుకరించనున్నారు. -
స్కూటర్ మీద చక్కర్లు కొట్టిన అమితాబ్!
కోల్‌కతా: దాదాపు ఏడాది కిందట సైకిల్ తొక్కి హల్చల్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా స్కూటర్ నడిపారు. చక్కగా హెల్మెట్ పెట్టుకొని, గళ్ల చొక్కా, ముదురు రంగు ప్యాంటు తొడుక్కొని ఆయన అలా కోల్‌కతా వీధుల్లో స్కూటర్‌పై సవారీ చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార కేంద్రానికి చిరునామా అయిన రైటర్స్ బిల్డింగ్ వద్ద శనివారం ఈ దృశ్యం కనిపించింది. రిబూ దాస్‌గుప్తా రూపొందిస్తున్న తాజా చిత్రం 'టీఈ3ఎన్' (Te3N) సినిమా కోసం అమితాబ్ ఇలా స్కూటర్ ఎక్కారు. గతంలో 'పీకూ' సినిమా కోసం అమితాబ్ సైకిల్ తొక్కి.. అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. 'పీకూ'లో దీపికా పదుకొణే తండ్రిగా నటించిన అమితాబ్ తాజాగా రిబూ దాస్‌గుప్తా సినిమాలో విభిన్న పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విఖ్యాత సినీ దిగ్గజం సుజయ్ ఘోష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, విద్యాబాలన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అమితాబ్ శ్రద్ధగా దర్శకుడి సూచనలు వినడం.. కొన్ని సెకండ్లపాటు కోల్‌కతా వీధుల్లో స్కూటర్ నడుపడం.. అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆయన అభిమానులు, ప్రజలకు ఎంతో సంతోషం కలిగించింది. T 1154 - 'TE3N' a novel idea and a novel film ... riding in Kolkata .. cycle PIKU .. motor cycle 'TE3N' pic.twitter.com/03sHCOiAvM — Amitabh Bachchan (@SrBachchan) November 28, 2015