teacher MLCs
-
ఈ రిజల్ట్ ఎలాంటి ప్రభావం చూపదు: సజ్జల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైఎస్సార్సీపీని బాగా ఆదరించారని, అలాగే ఫలితంతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని శనివారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో పేర్కొన్నారు. ఓట్ల బండిల్లో ఏదో గందరగోళం జరిగింది.కౌంటింగ్‌లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిద్ది అని అనుకోవద్దంటూ ప్రతిపక్ష టీడీపీకి చురకలంటిచారాయన. అలాగే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని గుర్తు చేశారు. ఇవి సొసైటీని రిప్రజెంట్ చేసేవి కావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు. పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీకి వెళ్లాయి. ఈ ఫలితంతో.. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారాయన. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదు. అలాగే.. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదు. ఎందుకంటే.. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదు. అసలు ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు? అని టీడీపీని, యెల్లో మీడియాను ప్రశ్నించారాయన. ‘‘మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్ల లో ఎక్కువగా లేరు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేస్తోంది. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయొచ్చు అని తెలిపారు సజ్జల. అయితే.. మొదటిసారి ఉపాధ్యాయుల స్థానాలు గెల్చుకున్నామని చెప్పిన ఆయన.. ఉపాధ్యాయులు తమను బాగా ఆదరించారని చెప్పారు. ‘‘తొలిసారి టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం మాకు పెద్ద విజయం. మా ఓటర్లు వేరే ఉన్నారు. మాకు సంతృప్తికరంగానే ఓట్లు వచ్చాయి. అలాగని.. ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపవు’’ అని మరోసారి స్పష్టం చేశారాయన. ఇదీ చదవండి: రెండు సీట్లకే ఎగిరి గంతేయడం టీడీపీ స్టైల్! -
ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీలతో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సమావేశం అయ్యారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రైవేట్ వర్శిటీల బిల్లుపై చర్చిస్తామన్నారు. ప్రైవేట్ వర్శిటీల బిల్లుపై నిర్లయం తీసుకున్నాక మాతో చర్చలెందుకని టీచర్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, ఏవీఎస్ శర్మ, గేయనంద్, వై. నివాస్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
టీచర్ ఎమ్మెల్సీలుగా సూర్యారావు, రామకృష్ణ
కాకినాడ/గుంటూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు, టీడీపీ అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ విజయం సాధించారు. ఉభయగోదావరి జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతిచ్చిన పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమొక్రెటిక్ ఫ్రంట్) అభ్యర్థి రాము సూర్యారావు.. తన సమీప టీడీపీ ప్రత్యర్థి చైతన్యరాజుపై విజయం సాధించారు. చైతన్యరాజుపై సూర్యారావు 1,526 ఓట్ల అధిక్యం సాధించారు. గుంటూరు-కృష్ణా నియోజకవర్గ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన డాక్టర్ ఏఎస్ రామకృష్ణ విజయం సాధించారు. రెండు జిల్లాల్లో పోలైన 13,047 ఓట్లలో 12,672 ఓట్లు అర్హమైనవిగా నిర్ధారించారు. వీటిలో రామకృష్ణకు 7,146, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 5,383 ఓట్లు వచ్చాయి. చైతన్యరాజు ఓటమిపై టీడీపీలో కలవరం ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) ఓటమి ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. బుధవారం శాసనసభ వాయిదా పడిన అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీహాలులో ఆ పార్టీ శాసనసభా పక్షం(టీడీఎల్పీ) భేటీ అయింది. ఈ సమయంలో ఓటమి సమాచారం.. అధినేత చంద్రబాబు సహా అందరినీ కంగుతినిపించింది. అరడజను మంది మంత్రులను, 40 మందికిపైగా ఎమ్మెల్యేలను ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా పంపినప్పటికీ చైతన్యరాజు ఓటమి పాలవడం వారికి షాకిచ్చింది. ఓటమి విషయంపై మాట్లాడుతూ.. చంద్రబాబు సంబంధిత నేతలపై మండిపడ్డారు.రూ.30 కోట్లకుపైగా ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదన్న అంశం నేతలందరినీ విస్మయానికి గురిచేసింది.