Teachers Harassment
-
అధ్యాపకులను వేధిస్తోన్న ప్రిన్స్‌పాల్‌పై సీరియస్
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని గత సర్కారు మసిపూసిన మారేడుకాయ చందంగా చేయగా.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపడుతున్న విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తున్నారు. మహిళా అధ్యాపకులపై వేధింపుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.. రెండున్నరేళ్లుగా ఈ కళాశాలలో ప్రిన్సిపాల్‌పై మహిళా అధ్యాపకులు ఫిర్యాదులు చేస్తున్నా పెడచెవిన పెట్టడానికి దారి తీసిన పరిస్థితులపై శనివారం నిఘా వర్గాలు సమాచారం సేకరించాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు వేధింపులకు పాల్పడుతున్నారని దళిత కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ ఉదయశాంతి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన తీరును కూడా ఆరా తీశారు. ఆ సమయంలో హఠాత్తుగా అనారోగ్యానికి గురైనట్టు ప్రిన్సిపాల్ ఆస్పత్రిలో జాయిన్ కావడం, తదనంతర పరిణామాల్లో కేసును నీరు గార్చేసిన వ్యవహారాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. వేధింపులు ఎదుర్కొన్న ఉదయశాంతితో పాటు 17 మంది మహిళా అధ్యాపకులు మూకుమ్మడిగా లిఖిత పూర్వకంగా అప్పటి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మికి ఫిర్యాదు చేసినా.. బాధ్యులపై చర్యలకు ఇంతకాలం మోకాలడ్డిన వారెవరనే దానిపై ప్రభుత్వం నిజాలు తవ్వితీస్తోంది. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక దళిత మహిళా అధ్యాపకురాలు ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పుకున్నా గత టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం అసలు కేసు నీరుగారిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారకులెవరనే విషయంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ సాగిస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో కళాశాల ప్రిన్సిపాల్ తీరును జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నీరుగారిస్తే గార్చారు, కనీసం ఆయనపై వేసిన విచారణలోనైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బాధితులంతా నిరీక్షించారు. ప్రిన్సిపాల్‌పై విచారణకు గత ప్రభుత్వంలో అప్పటి రాజమహేంద్రవరం ఆర్జేడీ వైవీ సుబ్బారావు నియమితులయ్యారు. ఫిబ్రవరి 11న ఆయన విచారణ జరిపారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై ఉదయశాంతితో పాటు 17 మంది ఉపాధ్యాయులు మూకుమ్మడిగా ఒకే లేఖపై సంతకాలు పెట్టి మరీ వాంగ్మూలమి చ్చారు. అయినప్పటికీ నాటి టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సింపుల్‌గా తీసుకుందనే విమర్శలున్నాయి. అందుకే వాటి పూర్వాపరాలను ప్రస్తుత ప్రభుత్వం తవ్వి తీస్తోంది. నాటి విచారణ సమయంలో మినిట్స్ నమోదు చేసిన అప్పటి, ప్రస్తుతæ ఇంటర్మీడియట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (రాజమహేంద్రవరం) కార్యాలయ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, అప్పటి ఆర్జేడీ వైవీ సుబ్బారావుల వ్యవహార శైలిపై కూడా దృష్టి సారించారని సమాచారం. మహిళా అధ్యాపకులందరూ ఒక్కటై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడానికి దారి తీసిన పరిస్థితులు, అప్పటి ఇంటర్మీడియట్ బోర్డులో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించిన వారిలో ఎవరెవరు దీని వెనుక ఉన్నారనే అంశాలన్నింటినీ నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. స్పందించిన మంత్రులు ఇటీవల మహిళా అధ్యాపకులు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు ఫిర్యాదు చేసిన నేపథ్యం, ‘సాక్షి’లో 17న ‘వేధింపుల్లో ‘ప్రిన్స్’పాల్’, 18న ‘ఈయనో ప్రిన్సిఫ్రాడ్’ శీర్షికలన వచ్చిన వరుస కథనాలను మంత్రులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంతకాలం కాలయాపన చేస్తున్న తీరును వారు తప్పుపట్టారని తెలిసింది. అంతమంది మహిళా అధ్యాపకులు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడమేమిటంటూ మంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని ఆర్జేడీకి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ వీర్రాజును ఆర్జేడీ నగేష్‌కుమార్ సోమవారం విచారించనున్నారు. జూనియర్ కళాశాలలోనే ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ సెలవులపై వెళ్లరాదని కళాశాలకు ఆర్జేడీ ఆదేశాలు జారీ చేశారు. ఒకపక్క ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధమవుతూండగా ప్రిన్సిపాల్ వీర్రాజు ఆదివారం కళాశాలలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను అభివృద్ధి చేస్తూంటే వేధిస్తున్నానంటూ ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. కాగా, అభివృద్ధి ముసుగులో ఆయన డొనేషన్లు తీసుకువచ్చి లెక్కాపత్రం లేకుండా చేశారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. తాను అంతా నిజాయతీగానే పని చేశానని చెబుతున్న ప్రిన్సిపాల్ మాటల్లో వాస్తవమేమిటన్నది ఈ విచారణలోనైనా తేలుతుందని అధ్యాపకులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి నలుగురిలో చులకనైపోతామనే భయంతో మహిళలు వేధింపుల వ్యవహారాల్లో ముందుకు రాని పరిస్థితి. అటువంటిది రెండేళ్లుగా ప్రిన్సిపాల్ వేధింపులపై ధైర్యంగా వారు పోరాడుతున్న తీరును ప్రభుత్వం కూడా ఆషామాషీ వ్యవహారంగా తీసుకోలేదని, అందుకే ఆర్జేడీని విచారణకు ఆదేశించిందని అంటున్నారు. విచారణ సమయంలో ప్రిన్సిపాల్‌ను దూరం పెట్టకుంటే మరోసారి అన్యాయమైపోతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
చదువుల యజ్ఞంలో సమిధలు
ఈమధ్య వరసబెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, హాస్టళ్లలో చోటు చేసుకున్న ఉదంతాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పి, విజ్ఞానవంతుల్ని చేస్తారని ఆశించి పిల్లలను పాఠశాలలకూ, కళాశాలలకూ పంపిస్తే అక్కడున్న గురువులు వారితో అమానుషంగా ప్రవర్తించి ప్రాణాలు తీయడం, వారు తనువు చాలించడానికి కారకులు కావడం వీటన్నిటా కనిపిస్తుంది. ఇందులో చాలా ఉదంతాలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లోనివే. గుంటూరు నగరం సమీపం లోని ఒక కార్పొరేట్ విద్యా సంస్థ హాస్టల్లో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కార ణంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి తీవ్ర జ్వరంతో కన్నుమూశాడు. బాబు మరణాన్ని తట్టుకోలేని అతడి తల్లిదండ్రులు ఇటీవల ఆత్మహత్య చేసుకు న్నారు. పలుకుబడి ఉన్నవారి విషయంలో మినహాయిస్తే చాలా ఉదంతాల్లో పోలీ సులు కేసులు పెట్టడం, కారకుల్ని అరెస్టు చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ మొత్తంగా వీటికి దారితీస్తున్న ధోరణులను సరిచేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా చదువుల పేరిట మారణహోమం నిరాటంకంగా సాగుతోంది. టీచర్ కొట్టడం వల్ల ఒంటిపై గాయాలయ్యాయనో, కళ్లు దెబ్బతిన్నాయనో, తలకు దెబ్బ తగిలిందనో వార్తలు రావడం ఇటీవలికాలంలో బాగా పెరిగింది. వీటి గురించి వివిధ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా, అలా చేయడం చట్టరీత్యా నేరమవుతుందని చెబుతున్నా అవి పదే పదే పునరావృతమవుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం నిరుడు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే విద్యాసంస్థల్లో పిల్లలను దండించిన ఘటనలు 385 నమోదయ్యాయి. ఇందులో 28 ఆత్మహత్య ఉదంతాలకు కూడా దారితీశాయి. ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి ఏం జరుగుతున్నదో సులభంగానే ఊహిం చుకోవచ్చు. టీచర్లకూ, విద్యా సంస్థల యాజమాన్యాలకూ పిల్లలతో వ్యవహరించే తీరుతెన్నులపైనా, వారిని దండిస్తే ఉండే పర్యవసానాలపైనా సరైన అవగాహన కలిగించక పోవడంవల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది. బోధనా రంగంపై పాలకులకు ఉన్న నిర్లక్ష్యమే ఇందుకు కారణం. కార్పొరేట్ స్కూళ్లనూ, కళాశాలలనూ ఆదా యాన్ని ఆర్జించి పెట్టే సంస్థలుగా మాత్రమే పాలకులు పరిగణిస్తున్నారు. ఈ సంస్థల నిర్వహణపై చట్టాల్లో అనేక నిబంధనలున్నా అవన్నీ కింది స్థాయి అధికారులకు అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలుగా మిగిలిపోతున్నాయి. ఇక టీచర్లు వృత్తిపరంగా ఏ స్థాయిలో ఉన్నారో, పిల్లలతో ఎలా మెలగుతున్నారో తెలు సుకునే విధానాలు లేవు. ఈ విషయంలో ప్రభుత్వ బడులు కొద్దో గొప్పో నయం. అక్కడ ఉపాధ్యాయ శిక్షణలో ఉత్తీర్ణులైనవారుంటారు. జిల్లా మొదలుకొని మండల, గ్రామ స్థాయి వరకూ ఏదో ఒకమేర ఎవరో ఒకరి అజమాయిషీ ఉంటుంది. శ్రద్ధగల కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నచోట కనీసం బోధన ఎలా జరుగుతున్నదన్న సమీక్ష ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల వంటివి తమ కార్యక్రమాల ద్వారా, తాము వెలువరించే పత్రికల ద్వారా ఉపాధ్యాయులను చైతన్యపరుస్తుంటాయి. వీటన్నిటికీ అతీతంగా ఉంటూ ఏదీ పట్టనట్టు ఉండేవారు, ఇతరేతర వ్యాపారాలపై దృష్టి పెట్టేవారు అక్కడా తారసపడతారు. కానీ వీరి శాతం తక్కువ. ఇష్టాను సారంగా ఉంటూ, ఎవరినీ లెక్క చేయకుండా, దేన్నీ లక్ష్యపెట్టకుండా కాసులు పోగేసు కోవడమే ధ్యేయంగా పనిచేసేవి కార్పొరేట్ విద్యా సంస్థలే. చదువుకొనడాని కొచ్చిన పిల్లలను వినియోగదారులుగా, తాము ఉద్ధరించాల్సిన సరుకుగా పరిగణించి... చదువు పేరిట బట్టీ పట్టించడం, ఎప్పటికప్పుడు పరీక్షలు పెడుతూ ఆశించని ఫలితాలు రానప్పుడు వారిని హింసించడం, దూషించడం పరిపాటిగా మారింది. తోటి విద్యార్థుల ముందు లెక్చెరర్ తనను అవమానించాడని నొచ్చుకుని హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి నిరుడు నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే మరో కార్పొరేట్ కళాశాలలో ఒక విద్యార్థిని లెక్చెరర్ దారుణంగా కొట్టడానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. దీనిపై రేగిన దుమారం సద్దుమణగక ముందే మెదక్ జిల్లా సిద్దిపేటలో మరో కాలేజీ ప్రిన్సిపాల్ ఒక బాలికపై దొంగతనం నేరం అంటగట్టడమేకాక... ఆ ‘నేరానికి’ ఆమెను తోటి విద్యార్థుల ముందే కొట్టాడు. ఆ అవమాన భారంతో ఆ చిట్టితల్లి కళాశాల భవనం పైనుంచి దూకి తనువు చాలించింది. గురువులకు ఏకాగ్రత, సృజనాత్మకత, ఓపిక చాలా అవసరం. వీటన్నిటికీ మించి తాము నిత్యం వ్యవహరించాల్సి ఉన్న పిల్లలపైనా, తమ వృత్తిపైనా వారికి ఎంతో మమకారం ఉండాలి. తనకు తెలిసి ఉన్న జ్ఞానాన్ని పిల్లలకు పంచడంలో, ఆ క్రమంలో వారికేర్పడే సందేహాలను, సమస్యలను తీర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. టీచర్ చెప్పేదానిలో తమకు బోధపడనిదేమిటో నిర్దిష్టంగా వెల్లడించడం అందరికీ సాధ్యపడదు. అందుకవసరమైన తార్కిక శక్తి అందరిలోనూ ఒకలా ఉండదు. ఇలాంటి భిన్న మనస్తత్వాలున్నవారిని తీర్చిదిద్దడమే టీచర్ ముందుండే సవాలు. దీన్ని ఎదుర్కొనలేనివారే దండనపై ఆధారపడతారు. తమ వైఫల్యాన్ని పిల్లలకు అంటగట్టి వారిలో అపరాధ భావన పెంచుతారు. ఇందువల్ల ఆ పిల్లల్లో అంతర్లీనంగా ఉండే శక్తియుక్తులు అడుగంటుతాయి. టీచర్ చేతిలో దండ నకు గురైనవారే కాదు... దాన్ని చూసినవారు సైతం మొద్దుబారతారు. ఇక కీచక పాత్ర పోషించే టీచర్లు సరేసరి. బోధనా రంగంలో చాలా తరచుగా కనిపిస్తున్న ఇలాంటి క్షీణ విలువలను సకాలంలో అదుపు చేయకపోతే అది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. ఉపాధ్యాయ శిక్షణ కోసం ఇప్పుడు అమలు చేస్తున్న కోర్సులు మొదలుకొని బోధన తీరుతెన్నులపైనా, విద్యను అమ్మకపు సరుకుగా మారుస్తున్న వర్తమాన ధోరణులపైనా సమగ్ర సమీక్ష జరిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం తక్షణావసరం. ఆ పని చేసేవరకూ ఈ మారణహోమానికి ముగింపు ఉండదు. -
ఉపాధ్యాయుల వేధింపులపై విద్యార్థుల ఆందోళన
ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విశాఖలోని సంఘీవలసలో ఉన్న ఎన్నారై నర్సింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులను అధ్యాపక సిబ్బంది కొన్ని రోజులుగా పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే శారీరకంగా కూడా హింసిస్తున్నారు. దీనిపై బాధితులు యాజమాన్యాన్ని ఆశ్రయించినా పట్టించుకోలేదు. వారిని బుధవారం ఉదయం కళాశాల నుంచి బయటకు పంపించింది. దీనికి నిరసనగా విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
పిల్లలపై వేధింపులపై ...నటి రజని మనోగతం
-
వెకిలి ’చే’ష్టలు