ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విశాఖలోని సంఘీవలసలో ఉన్న ఎన్నారై నర్సింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులను అధ్యాపక సిబ్బంది కొన్ని రోజులుగా పరుష పదజాలంతో దూషిస్తున్నారు.
అదేమిటని ప్రశ్నిస్తే శారీరకంగా కూడా హింసిస్తున్నారు. దీనిపై బాధితులు యాజమాన్యాన్ని ఆశ్రయించినా పట్టించుకోలేదు. వారిని బుధవారం ఉదయం కళాశాల నుంచి బయటకు పంపించింది. దీనికి నిరసనగా విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.