Nursing students
-
నర్సింగ్ విద్యార్థిని రవళి మృతి
సాక్షి, వరంగల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోహిణి నర్సింగ్ కళాశాల విద్యార్థిని కాందారపు రవళి(20) రెండు రోజులుగా రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం, గోపాల్‌పూర్‌కు చెందిన కాందారపు తిరుపతి, రజిత దంపతుల పెద్ద కూతురు కందారపు రవళి హంటర్‌రోడ్డులోని రోహిణి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఈనెల 7న రాత్రి 10.30 గంటల సమయంలో హాస్టల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు, యాజమాన్యం రోహిణి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో తుదిశ్వాస విడిచింది. మృతదేహాన్ని ఎంజీఎంకు పంపించి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. విచారణ అనంతరం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల గోడు పట్టించుకోరా..? రవళి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు రోహిణి కళాశాల యాజమాన్యం తెలియజేయకుండా రవళి స్నేహితులు తెలియజేశారు. ఆ తరువాత రోహిణి ఆస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనతో రవళిని చూడటానికి తల్లిదండ్రులకు అనుమతించారు. రవళి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చేరవేసిన తోటి విద్యార్థినులను తల్లిదండ్రులకు కలువనివ్వలేదు, ఆ విద్యార్థినులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడి అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రి రవళి మృతిచెందిన విషయం కూడా యాజమాన్యం మృతదేహాన్ని ఎంజీఎం పంపడానికి అన్ని సిద్ధం చేసుకున్నాకే తెలియజేసినట్లు తెలిసింది. ఈ సంఘటనల నేపథ్యంలో రవళి మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ గోడును యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల ఎదుట విలపించినట్లు తెలిసింది. పోలీసులతో వాగ్వాదం.. నర్సింగ్ విద్యార్థిని రవళి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం పలు విద్యార్థి సంఘాల నేతలు రోహిణి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సుబేదారి పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు యాజమాన్యానికి బాసటగా నిలిచి మృతురాలి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని వివిధ సంఘాల నేతలు ఆరోపించారు. మృతదేహాన్ని అర్ధరాత్రి ఎంజీఎంకు ఎందుకు పంపించారని వారు ప్రశ్నించారు. గోపాల్పూర్ గ్రామ సర్పంచిని అడ్డుగా పెట్టుకుని యాజమాన్యం తల్లిదండ్రులకు తీరని అన్యాయం చేశారని, ఈ సంఘటనపై అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి రవళి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో విద్యార్థి సంఘాల నేతలు తిరపతియాదవ్, కన్నం సునిల్, మేడ రంజిత్, కాడపాక రాజేందర్, వినోద్ లోక్‌నాయక్, ఎండీ పాషా, ఏకు ప్రవీణ్, నరేష్, దుప్పటి సుభాష్, రాకేష్ పాల్గొన్నారు. -
దీపావళి వేళ నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వారి ఇంట దీపావళి వెలుగులు నింపింది. ఆ విద్యార్థుల స్టైపెండ్‌ను మూడింతలకుపైగా పెంచింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్టైపెండ్ పెంపుదల వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పెంపుదల నర్సింగ్ స్కూళ్లు, నిమ్స్‌ల్లో చదువుతున్న జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థులకు వర్తిస్తుంది. ఎంఎస్సీ (నర్సింగ్) విద్యార్థులకు కూడా స్టైపెండ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంఎస్సీ(నర్సింగ్) మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.9 వేలు, రెండో ఏడాది విద్యార్థులకు రూ.10 వేల స్టైపెండ్ అందజేస్తారు. -
నర్సింగ్ కాలేజీలో నరకం.. నిజమే!
సాక్షి, తిరుపతి రూరల్: ‘ఒకే భవనంలో రెండు కళాశాలలు. తరగతి గదులు..హాస్టల్ గదులకు సైతం అదే భవనం.. నాలుగేళ్ల కోర్సును బోధించేందుకు కేవలం ఇద్దరే అధ్యాపకులు. నర్సింగ్ బోధన దేవుడెరుగు.. వంటపని, ఇంటి పని, సొంత పనులతో సహా పొలం పనులను సైతం బలవంతంగా చేయిస్తూ యాజమాన్యం నరకం చూపుతోంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కరుణించలేదు సరికదా, మా కష్టాలను యాజమాన్యానికి అమ్ముకుని కాసులు దండుకున్నారు. ఈ నరకం నుంచి మమ్మల్ని కాపాడండి’ అంటూ శ్రీ వెంకట విజయ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తిరుపతి సబ్–కలెక్టర్ ఎదుట కన్నీరుమున్నీరు అయ్యారు. తిరుపతికి సమీపంలోని శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులపై జరుగుతున్న వేధింపులపై విచారణ జరిపేందుకు మంగళవారం తిరుపతి సబ్–కలెక్టర్ మహేష్‌కుమార్ కళాశాలకు వెళ్లారు. కళాశాలను మూసివేస్తున్నట్లు తగిలించిన బోర్డును చూసి ఆశ్చర్యపోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసివేస్తున్నట్లు యాజమాన్యం అందులో పేర్కొంది. శ్రీ వెంకట విజయ కళాశాలను మూసివేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ కళాశాల లెటర్ ప్యాడ్‌పై కరస్పాండెంట్ బండి. విజయ పేరుతో ప్రకటన విడుదలైంది. సబ్–కలెక్టర్ ఎదుట విద్యార్థినుల కన్నీరు ప్రభుత్వం ఆదేశంతో శ్రీ వెంకట విజయ నర్సింగ్ కళాశాలలో తిరుపతి సబ్–కలెక్టర్ మహేష్‌కుమార్, జిల్లా డాక్టర్ రామగిడ్డయ్య, డీసీహెచ్‌వో సరళమ్మ, డీఐవో హనుమంతరావు, విచారణ కమిటీ సభ్యులు గీత, లలితాదేవి విచారణ చేశారు. కళాశాల యాజమాన్యం గేటు మూసివేయడంతో బయట ఉన్న విద్యార్థినులతో మాట్లాడారు. దీంతో కళాశాలలో ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను వివరించారు. తమను విద్యార్థినులుగా కాకుండా కూలీలుగా చూస్తారని, వంట పని, పెరటి పని, గదుల శుభ్రత నుంచి వారి ఇంట్లో పాచిపని సైతం చేయిస్తారని కాయలు కాసిన చేతులను చూపించారు. కళాశాల నిర్వాహకురాలు విజయకు చెందిన వ్యవసాయక్షేత్రంలో పొలం పనులు చేయాలని, లేకుంటే దారుణంగా శారీరక హింసలకు గురి చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. నాలుగేళ్ల కోర్సులకు కేవలం ఇద్దరు మాత్రమే అధ్యాపకులు ఉన్నారని, కనీస పరిజ్ఞానం కూడా లేకుండా బోధన చేస్తారని వాపోయారు. క్లినికల్ పరిజ్ఞానం లేకుండానే ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై స్టాఫ్ నర్సులుగా బలవంతంగా ఉద్యోగాలు చేయిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అంతా లోపభూయిష్టం: సబ్ కలెక్టర్ ఒకే భవనంలో రెండు నర్సింగ్ కళాశాలలను నిర్వహించడమే కాకుండా నిపుణులైన అధ్యాపకులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నట్లు, క్లినికల్ అనుభవం లేకుండానే కోర్సులను తూతూమంత్రంగా పూర్తి చేయిస్తున్నట్లు వెల్లడైందని తిరుపతి సబ్–కలెక్టర్ మహేష్‌కుమార్ మీడియాకు తెలిపారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. తమపై కళాశాల యాజమాన్యం వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు చెప్పినట్లు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి విముక్తి కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం స్పందించకుంటే మాపై ఇంకా వేధింపులు కొనసాగుతునే ఉండేవన్నారు. ఇప్పటికైనా మరో కళాశాలలో విద్యను కొనసాగించేందుకు తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
నర్సింగ్ విద్యార్థుల కాపీయింగ్
స్థానిక వైద్య కళాశాలలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) వార్షిక పరీక్షలకు నర్సింగ్ విద్యార్థులు చీటీలతో హాజరవుతున్నారు. పరీక్షల చీఫ్ ఎగ్జామినర్ డాక్టర్ సిద్ధాబత్తుని నాగేశ్వరమ్మ బుధవారం కొంత మంది విద్యార్థుల వద్ద చీటీలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి చీటీలతో హాలులోకి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష హాలులోకి బూట్లు, సాక్సులు వేసుకురావద్దని ఆదేశించారు. గుంటూరు మెడికల్: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) వార్షిక పరీక్షలకు హాజరయ్యే నర్సింగ్ విద్యార్థులు రోజూ చీటీలతో పరీక్షా హాలులోకి ప్రవేశిస్తున్నారు. దీంతో బుధవారం తనిఖీలు నిర్వహించిన పరీక్షల చీఫ్ ఎగ్జామినర్ డాక్టర్ సిద్ధాబత్తుని నాగేశ్వరమ్మ పలువురు విద్యార్థుల వద్ద చీటీలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి చీటీలతో హాలులోకి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు బూట్లు, సాక్సుల్లో చీటీలను పెట్టుకుని వస్తున్నట్లు అనుమానం రావటంతో హాలులోకి బూట్లు, సాక్సులు లేకుండా హాజరవ్వాలని ఆదేశాలిచ్చారు. పలువురు సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల దగ్గర ఏమైనా చీటీలు ఏమైనా ఉన్నాయోమోనని తనిఖీ చేయించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి జీఎన్ఎం వార్షిక పరీక్షలు గుంటూరు వైద్య కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈనెల 13 వరకు థియరీ, 15 నుంచి 23వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 ప్రైవేటు నర్సింగ్ స్కూల్స్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్న ఈ పరీక్షలకు విద్యార్థులు రోజూ చీటీలను తీసుకురావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిర్వాహణ బాధ్యతలను ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌కు అప్పగించారు. కొంత మంది కార్యాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగా నియమించి నర్సింగ్ స్కూల్ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ వారికి లోపాయికారీ ఒప్పందాలు ఉండటం వల్లే విద్యార్థులు భయం, బెరుకు లేకుండా చీటీలను పరీక్ష హాలులోకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో నర్సింగ్ నిబంధనల ప్రకారం బోధనా సిబ్బంది, ప్రాక్టికల్స్ చేసే సౌకర్యాలు ఉండవు. కానీ ఆ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత రావటంపై వైద్య సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్కూల్ విద్యార్థులను పరీక్షల సమయంలో చూసీచూడనట్లు వదిలివేయటం వల్లే వారికి మంచి ఫలితాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సంజయ్ బెయిల్‌పై విడుదల
నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సంజయ్‌పై ఈ నెల 12న పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి సంజయ్ 20 రోజుల పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న(గురువారం) ఎస్సీ ఎస్టీ కోర్టు సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి గురువారం, శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది. -
పాలమూరులో కేరళ వాసులు
దేవభూమి, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు.. అందాలకు నిలయమైన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. భారీ వరదలు ముంచెత్తడంతో చిగురుటాకులా వణికి పోతోంది. చిరుజల్లులతో పర్యాటకులకు ఆహ్లాదం పంచే మలయాళ సుగంధ మందారం కుంభవృష్టితో గజగజలాడింది. డ్యాములు, నదులు, రిజర్వాయర్లు కలిసి సంద్రంగా మారడంతో కకావికలమైంది. వరదల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నివాసం ఉంటున్న కొందరు కేరళలో ఉన్న తమ ఆప్తులు, ఆత్మీయులు ఎలా ఉన్నారోనని కలత చెందుతున్నారు. ఫోన్ల ద్వారా ‘మీరు అక్కడ క్షేమంగా ఉన్నారా.. మన ఊరు ఎలా ఉంది.. మన వాళ్లు ఎక్కుడున్నారు..’ అంటూ యోగక్షేమాలను వాకబు చేస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ పలకరించగా తమ బంధువుల విషాదగాధను పంచుకున్నారు. ఆత్మకూర్ మహబూబ్‌నగర్ : కేరళలో సంభవించిన భారీ విపత్తునకు 250 మందికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వవర్గాల అంచనా. సుమారు 7లక్షల మందికిపైగా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గినా ఎటుచూసినా మోకాళ్ల లోతు నీళ్లు.. పీకల్లోతు కష్టాలు. ఊళ్లకు ఊళ్లే ఏర్లుగా మారాయి. భూలోకస్వర్గంగా పేరొందిన సుందరప్రదేశం మరుభూమిగా మారింది. సర్వం కోల్పోయి ఎంతోమంది ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కేరళ వాసులకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో సత్సంబంధాలు ఉన్నాయి. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు ఉపాధి అవకాశాల కోసం పాలమూరులో సుమారు రెండువేల మందికిపైగా స్థిరపడ్డారు. మధుర స్మృతులు చెదిరాయి.. మా స్వగ్రామం కేరళలోని త్రిశూల్ జిల్లా వరకంచి మండల కేంద్రం.. ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాను. మా ఊరి అందాలను గత ఏడాది ఇక్కడి నుంచి తీసుకెళ్లి మా కుటుంబసభ్యులు 25 మందికి చూపించాను. వారం రోజుల పాటు అక్కడే ఎంతో ఎంజాయ్‌గా గడిపాం. ఆ మధుర స్మృతులు మరవకముందే మా ఊరు వరదల్లో మునిగిపోయింది. మా వాళ్లు సాగుచేసిన వరి పైరు, కొబ్బరి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇది విని చాలా బాధపడ్డాను. - ఆన్సి శ్రీధర్, ప్రిన్సిపాల్, ఎంవీ.రామన్ స్కూల్, ఆత్మకూర్ ఊరు ధ్వంసమైంది మాది కేరళలోని కన్నూర్ జిల్లా ఏరోమ్ స్వగ్రామం.. వరద ఉధృతి కారణంగా మా ఊళ్లోని రోడ్లు, భవనాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మా కుటుంబసభ్యులు ఐదెకరాల్లో పండించిన వరి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. నాతో పాటు ఇక్కడే ఉంటున్న భార్య, పిల్లలను వారం రోజుల క్రితమే స్వగ్రామానికి పంపించేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. వరదల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాం. - సత్యం, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు, ఆత్మకూర్ మమ్మల్ని ఆదుకోండి కేరళలోని మలప్పురం జిల్లా నిలంబుర్ మండల కేంద్రం మాది. మున్సిపాలిటీ కేంద్రమైన మా ఊరు వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయింది. ఎంతో సుందరమైన మా ప్రదేశం. రాష్ట్రం మొత్తం వరదల ఉధృతికి అతలాకుతలమైంది. సుమారు రూ.20వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కేంద్రం ప్రకటించిన రూ.500కోట్లు ఏమూలకు సరిపోవు. మా రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాలు ముందుకు రావడం సంతోషం. ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. - సల్మాన్, ప్రైవేట్ ఉపాధ్యాయుడు, ఆత్మకూర్ 10 మంది చనిపోయారు.. కేరళలోని కొట్టాయం జిల్లా చంగరసిరి మండలం త్రికొడ్డితాని స్వగ్రామం.. మా ఊరు పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. నిత్యం ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి మా ఊరు వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయింది. మా ఊళ్లో 10మందికి పైగా చనిపోయారు. చేతికొచ్చిన పంటలు పూర్తిగా పోయాయి. మా వాళ్లు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎంతో అందమైన ప్రదేశం పూర్తిగా మునిగిపోవడం ఎంతో బాధగా ఉంది. - నిషా, ప్రైవేట్ ఉపాధ్యాయురాలు, ఆత్మకూర్ అల్లాడిపోతున్నారు.. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా ఉడుంబన్ సోలా మండలం నేడుగండం మా స్వగ్రామం. వరదల కారణంగా మా ఊరు పూర్తిగా మునిగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాగునీరు, తిండికి మా ఊరివాసులు అల్లాడిపోతున్నారు. ఐదుగురు ఇప్పటికే చనిపోయారు. చాలామందిని సహాయక శిబిరాలకు తరలించారు. ఇంకా కొంతమంది అక్కడే ఉండిపోయారు. వారికి సహాయం అందించి ఆదుకోవాలి. - లతారాజ్, ప్రైవేట్ ఉపాధ్యాయురాలు, ఆత్మకూర్ మేమున్నామని.. సాక్షి, వనపర్తి : భారీవర్షాలు, వరదలు భూతల స్వర్గంగా కొనియాడే కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి సాయం చేసే వనపర్తి జిల్లావాసులు కేరళ ప్రజలకు మేమున్నామని.. సాయం చేసేందుకు ముందుకు కదలిలారు. కేరళ వరద బాధితులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముంపు నిర్వాసితులను ఆదుకోవాలని కలెక్టర్ శ్వేతామహంతి పిలుపునివ్వడంతో పలువురు వ్యాపారులు, ఉద్యోగులు, స్వచ్ఛసంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. గెజిటెడ్ అధికారులు రూ.లక్ష చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ జోషి గోపాలశర్శ రూ.25వేలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అమరేందర్‌రెడ్డి రూ.15వేలు అందించారు. వరద బాధితులకు ఆర్థిక సాయం వనపర్తి : కేరళ, ఆదిలాబాద్ వరద బాధితులకు ఆర్థికసాయం చేశారు. మంగళవారం కలెక్టర్ శ్వేతామహంతికి చెక్కు అందజేశారు. స్థానిక ప్రజావైద్యశాల తరఫున డాక్టర్ మురళీధర్ కేరళ వరద బాధితులకు రూ.లక్ష, ఆదిలాబద్, ఆసిఫాబాద్ నిర్వాసితులకు రూ.25 వేలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఆదిలాబాద్ బాధితులకు రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు. ముందుకొస్తున్న దాతలుకేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లాలో ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. సోమవారం కలెక్టర్ శ్వేతామహంతిని కలిసి పలువురు చెక్కులు, డీడీలు అందజేశారు. పీడీఎస్‌యూ విద్యార్థులు రూ.7,166, వనపర్తి కలెక్టర్ కార్యాలయం ‘ఏ’ సెక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ రూ.15వేలు, వనపర్తి కల్వరిటౌన్ చర్చి ఆధ్వర్యంలో రూ.22వేలు, పురుషుల డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రూ.1,050 కలెక్టర్‌కు అందించారు. వీరితో పాటు పలువురు నేరుగా కేరళ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుండగా మరికొందరు వనపర్తి జిల్లా కలెక్టర్ ఖాతాలో నేరుగా డబ్బును జమచేస్తున్నారు. కలెక్టరేట్లో వరద బాధితులను ఆదుకునేందుకు ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం అందే అవకాశం ఉంది. కష్టాల్లో కన్నోళ్లు.. ∙పాలమూరులో నర్సింగ్ కోర్సు చదువుతున్న కేరళ విద్యార్థులు ∙క్షణంక్షణం కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకుంటున్న వైనం ∙రాష్ట్రం కోలుకోవాలని నిత్యం ప్రార్థనలు సాయం కోసం వేడుకోలు పాలమూరు : ప్రకృతి ప్రకోపానికి సుందర ప్రదేశం కేరళ కాకావికలమైంది. పచ్చటి పొలాలు, ఇళ్లు, ఊళ్లు వరద తాకిడికి నామరూపాల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఎటూచూసినా బురద దిబ్బలే కనిపిస్తున్నాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు జిల్లా కేంద్రంలోని నవోదయ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. కేరళలో నెలకొన్న విషాదం నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులను తలచుకుంటూ కుమిలిపోతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. మంగళవారం ‘సాక్షి’తో తమ ఆవేదన పంచుకున్నారు. మూడురోజులుగా ఆహారం లేదట మాది కేరళలోని కొల్లెం జిల్లా కున్నత్తు స్వగ్రామం.. పాలమూరు జిల్లా కేంద్రంలోని నవోదయ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. మా అమ్మ అజిత, తాతయ్య కార్తీకేయ, మా అన్నయ్య అతుల్ ఇంటివద్దే ఉంటున్నారు. వారితో ఫోన్లో మాట్లాడాను. మూడు రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా గడిపారని చెబుతున్నారు. మా ఇంటి రెండో అంతస్తులో విద్యుత్ లేకుండా రెండురోజుల పాటు ఉండి ఇతరుల సాయంతో సహాయక శిబిరంలోకి వెళ్లామని చెప్పారు. మూడు రోజులుగా ఫోన్ కలవడం లేదు. అందరికీ మంచి జరగాలని ప్రార్థన చేస్తున్నా.. చదువు మీద ధ్యాస ఉండటం లేదు. మేం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయాను. - అతుల్య, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి, మహబూబ్‌నగర్ కొండచరియలు విరిగి పడ్డాయి కేరళలోని ఇడుక్కి జిల్లా ఐడిమాలి స్వగ్రామం మాది. మా అమ్మ షీనా, నాన్న షిబి, సోదరులు స్టిల్జో, సిఫినా అక్కడే ఉంటారు. మా ఇంటి సమీపంలో ఉండే కొండచరియలు విరిగిపడ్డాయి. మేం నివాసం ఉండే ప్రాంతం కొండలతో చాలా అందంగా ఉండేది. ప్రస్తుతం అది గుర్తించలేకుండా ఉంది. దీంతో ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మా కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. వారితో మాట్లాడటానికి వీలుపడటం లేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉన్నప్పటికీ అక్కడి వాతావరణం బాగా లేకపోవడంతో వెళ్లడం లేదు. - సిఫియా, నర్సింగ్ విద్యార్థిని ఫోన్లు కలవడం లేదు.. కేరళలోని కొట్టాయం జిల్లా తలయోలసంబు స్వగ్రామం మాది. మా ఇంటి వద్ద నాన్న రాజు, అమ్మ సుధ, అన్నయ్య ఆదర్శ ఉంటున్నారు. మా ఇంటి లోపలికి వరద చేరింది. వాళ్లంతా సహాయక శిబిరాలకు వెళ్లిపోయారు. వారితో మాట్లాడి ఐదు రోజులవుతుంది. పూర్తిగా కరెంట్ నిలిచిపోవడంతో సెల్ఫోన్లు సైతం పనిచేయడం లేదు. మా కుటుంబసభ్యులు ఎలా ఉన్నారోనని ఆందోళనగా ఉంది. అక్కడ మా వారికి నీరు, ఆహారం ఎలా అందుతుందనే విషయంపై దిగులుగా ఉంది. ప్రస్తుతం కొంత వరకు వర్షాలు తగ్గాయని తెలిసింది. వాతావరణ పరిస్థితి కుదుటపడితే మా ఊరికి వెళ్తాం. - అశ్విత, నర్సింగ్ విద్యార్థిని వరదల్లో మా కుటుంబం కేరళలోని పతనంథిట్ల మండలం పందాలం స్వగ్రామం. ఊళ్లో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. మా ఊర్లో అమ్మ పాప్పచన్, నాన్నమ్మ రోసమ్మ, అన్నయ్య మబ్లే, అమ్మమ్మ అన్నమ్మ ఉంటున్నారు. మా కుటుంబం పూర్తిగా వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు బృందాలు రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు రోజులుగా ఫోన్ ట్రై చేస్తున్నా కలవడం లేదు. వారు ప్రస్తుతం ఎలా ఉన్నారనే సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నాను. మా కుటుంబంతో పాటు స్థానికులు బాగుండాలని మేం ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నాం. - మెర్లీన్, నర్సింగ్ విద్యార్థిని -
చూసుకో.. రాసుకో!
‘‘నర్సింగ్ పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వస్తున్నాయి. మాస్ కాపీయింగ్ జరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాగైతే చెడ్డ పేరు వస్తుంది. పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్, స్లిప్పులు పెట్టడం వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి’’ ఇదీ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన హెచ్చరిక. ‘‘ఆ సూపరింటెండెంట్ మాటను లెక్కచేయడమేంటిలే.. మన పని మనం చేసుకుందాం’’ అనుకున్నారో ఏమో యథేచ్ఛగా స్లిప్పులు తెచ్చేశారు. ఇష్టానుసారంగా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. చివరకు సుమారు పది మంది వరకు విద్యార్థులు స్లిప్పులు చూసి రాస్తూ ఇన్విజిలేటర్లకు పట్టుబడ్డారు. మరోవైపు ఆర్ఎంసీ కళాశాల ఆవరణ బయట, డ్రైనేజీల్లో స్లిప్పులు దర్శనమివ్వడంతో పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ ఏ విధంగా జరిగిందో అర్థమవుతోంది. కాకినాడ వైద్యం: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో శుక్రవారం నుంచి ప్రారంభమైన నర్సింగ్ పరీక్షల్లో జోరుగా మాల్ ప్రాక్టీస్ జరుగుతోంది. జిల్లాలో ఉన్న సుమారు 37 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. ఇందులో జీజీహెచ్‌కు చెందిన ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ నుంచి కొంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జీఎన్ఎం నర్సింగ్ పరీక్షలో అధికంగా మార్కులు సాధిస్తే ప్రభుత్వం భర్తీ చేసే జీఎన్ఎం నర్సింగ్ పోస్టుల్లో కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులకు అధికంగా మార్కులు వచ్చేలా ఈ స్లిప్పులు అందజేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా స్లిప్పులు రాసుకునేలా ఒక్కో ప్రైవేట్ కాలేజీ నుంచి రూ.50 వేలు వంతున జీజీహెచ్‌లోని నర్సింగ్ పాఠశాలల బాధ్యతను చూసుకుంటున్న ఓ గుమస్తా వసూలు చేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడిన సదరు ఉద్యోగి పరీక్షా కేంద్రాల్లో నియమించిన ఇన్విజిలేటర్లకు తలో కొంత ఇచ్చి మేనేజ్ చేస్తానని నర్సింగ్ స్కూళ్ల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1,272 మంది హాజరు శుక్రవారం జరిగిన తొలిసంవత్సర పరీక్షకు జిల్లాలోని 37 నర్సింగ్ కాలేజీల నుంచి 1,433 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,272 హాజరయ్యారు. 161 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని కాకినాడ ఆర్డీవో ఎల్ రఘబాబు పర్యవేక్షించారు. ఇద్దరు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్లు లేకుండా రావడంతో పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు నిరాకరించడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆలస్యంగా ప్రారంభమైన నర్సింగ్ పరీక్షలు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో శుక్రవారం నుంచి నర్సింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షకు సంబంధించిన పరీక్షా పేపర్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసే ప్రక్రియలో విద్యుత్ కోత సంభవించడం, సర్వర్ నెమ్మదిగా పనిచేయడం వంటి సాంకేతిక కారణాలతో అనుకున్న సమయం కంటే సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా పరీక్షను అధికారులు నిర్వహించారు. ఫలితంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగాల్సిన పరీక్ష 9.45 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12.45 గంటలకు ముగిసింది. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ సత్యసాయి నర్సింగ్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సాయంత్రం సత్యసాయిపై కృతజ్ఙతను చాటుతూ నర్సింగ్ కళాశాల విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు. సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. -
రోడ్డెక్కిన నర్సింగ్ విద్యార్థులు
-
రోడ్డెక్కిన నర్సింగ్ విద్యార్థులు
- లాకౌట్ అయిన మెడ్విన్ ఆస్పత్రి.. విద్యార్థుల ఆందోళన - పోలీసులపై రాళ్లురువ్విన నర్సింగ్ విద్యార్థులు.. తీవ్ర ఉద్రిక్తత - ఇద్దరు ఫొటోగ్రాఫర్లు సహా పలువురికి గాయాలు హైదరాబాద్: నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పత్రి మూతపడటంతో లక్షల రూపాయలు చెల్లించిన నర్సింగ్ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లురువ్వడంతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మూడు నెలలుగా మెడ్విన్ ఆస్పత్రి మూతపడటంతో అందులో నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. హాస్టల్లో కరెంట్ నిలిపేస్తున్నారని, గదులు తెరవడంలేదని, మెస్ సౌకర్యం లేక కొన్ని రోజులుగా పస్తులుంటూ హోటళ్లలో తింటున్నామని, ప్రస్తుతం తమ వద్ద డబ్బులు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. సుమారు 2 గంటల పాటు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన విరమించాలని విద్యార్థులకు సూచించారు. యాజమాన్యంతో తాము చర్చిస్తా మని పోలీసులు హామీ ఇచ్చినా విద్యార్థులు వెనక్కితగ్గలేదు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపై రాళ్లురువ్వారు. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. దీంతో అక్కడ యుద్ధ వాతావ రణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు విద్యార్థులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విద్యార్థుల ఆందోళనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన పలు పత్రికలకు చెందిన ఫొటోగ్రాఫర్లు సతీష్, సంజయ్‌చారితో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనలో నర్సింగ్ విద్యార్థులు శ్రీను, సుష్మిత, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు నెలలుగా పస్తులుంటున్నాం.. ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించి మెడ్విన్ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నామని నర్సింగ్ విద్యార్థులు చెబుతున్నారు. 250 మంది వద్ద లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి యాజమాన్యం.. ఇప్పుడు ఆస్పత్రిని, మెస్‌ను తెరవకుండా తమను రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ కావూరి, ఆయన కుమార్తెలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చదువు మధ్యలో ఆగిపోవడంతో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత నర్సింగ్ విద్యార్థులు కోరారు. -
నర్సింగ్ విద్యార్థినులకు అస్వస్థత
► కలుషితాహారం తిని వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన 21 మంది ► రిమ్స్ నర్సింగ్ హాస్టల్లో పర్యవేక్షణ లోపం ► ఆహార కాంట్రాక్టర్‌కు మెమో జారీ ఒంగోలు సెంట్రల్: రిమ్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో దాదాపు 180 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా రిమ్స్‌లోనే ఉన్న నర్సింగ్ కళాశాలలోనే ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే హాస్టల్లో ఉన్న విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో ఉదయం 6 గంటల సమయంలో ఈ విషయాన్ని రిమ్స్ అధికారులకు తెలిపారు. అనంతరం ఐదుగురు విద్యార్థినులు రిమ్స్ క్యాజువాలిటీ అత్యవసర చికిత్స విభాగంలో తీవ్ర కడుపునొప్పితో చేరారు. అనంతరం మరో ఐదుగురు తీవ్ర వాంతులతో, ఇంకో 11 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం చేరారు. మధ్యాహ్నానికి పలువురు విద్యార్థినులు కోలుకున్నారు. మిగిలిన వారిలో మూడో సంవత్సరం నర్సింగ్ విద్యార్థినులు లావణ్య, హర్షితల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించారు. వీరికి బీపీ చాలా తక్కువగా ఉండటంతో అత్యవసర చికిత్స అందించారు. మరో 24 గంటలు పరిశీలనలో ఉంచారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు దగ్గర ప్రాంతాల వారు హుటాహుటిన రిమ్స్‌కు చేరుకుని, తమ పిల్లల పరిస్థితి వాకబు చేసి ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థినులకు లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టర్ ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. గురువారం రాత్రి దోసకాయ కూరతో కూడిన అన్నాన్ని విద్యార్థినులకు పెట్టారని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.వల్లీశ్వరి తెలిపారు. ఆహారంలోనో, పాత్రల్లోనూ కలుషితమై విషపూరితమైనట్లు చెప్పారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రిమ్స్ వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబులు రిమ్స్‌కు చేరుకుని పరామర్శించారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ నామినేని కిరణ్‌కుమార్, డాక్టర్ ఎం.వెంకయ్య, డాక్టర్ హనుమానాయక్, నర్సింగ్ సిబ్బంది వైద్య సేవలు అందించారు. వసతి గృహంపై కొరవడిన పర్యవేక్షణ: రిమ్స్ నర్సింగ్ కళాశాల వసతి గృహంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆహార కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అనేక సార్లు ఆహారం బాగాలేదని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్ గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదు. ఈమధ్యే వైద్య కళాశాల విద్యార్థినులు తమకు కూడా నాణ్యమైన ఆహారం అందించడం లేదని, అధిక ధరలు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కలెక్టర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇది జరుగుతుండగానే నర్సింగ్ కళాశాల వసతి గృహంలో ఆహారం కలుషితమై విషాహారంగా మారింది. ఆహారం విద్యార్థినులు గానీ, రోగులు గానీ తినే ముందు ఆర్ఎంఓ, డైటీషియన్లు తప్పని సరిగా రుచి చూడాలి. బాగుంది అంటేనే విద్యార్థులకు గానీ, రోగులకు గానీ వడ్డించాలి. అయితే ఈ నిబంధన అమలు కావడం లేదు. ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడుతున్న అధికారులు నాసిరకం భోజనాన్ని విద్యార్థినులకు అందిస్తున్నారు. ఆహార కాంట్రాక్టర్‌కు మెమో: రిమ్స్ నర్సింగ్ కళాశాల వసతి గృహానికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ లక్ష్మీ నారాయణకు ప్రాథమికంగా మెమో జారీ చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఆహార శాంపిల్‌ను నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. పూర్తి నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉపాధ్యాయుల వేధింపులపై విద్యార్థుల ఆందోళన
ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విశాఖలోని సంఘీవలసలో ఉన్న ఎన్నారై నర్సింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులను అధ్యాపక సిబ్బంది కొన్ని రోజులుగా పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే శారీరకంగా కూడా హింసిస్తున్నారు. దీనిపై బాధితులు యాజమాన్యాన్ని ఆశ్రయించినా పట్టించుకోలేదు. వారిని బుధవారం ఉదయం కళాశాల నుంచి బయటకు పంపించింది. దీనికి నిరసనగా విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
నర్సింగ్ హాస్టల్లో కలుషిత నీరు సురక్షితం కాదంటూ ఇప్పటికే అందిన నివేదిక ఎంజీఎం : అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల ధనార్జన వెరసి నర్సింగ్ విద్యార్థుల ప్రాణానికి ముప్పు తెస్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పరి పాలనాధికారులు వ్యవహారశైలితో వరంగల్‌లోని నర్సింగ్ స్కూల్, అన్‌మ్యారీడ్ హాస్టల్ నిర్వహణపై నిత్యం వివాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఆరు నెలల క్రితం ఆహారం కలుషితం కావడంతో సుమారు 50 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురికాగా... తూతూ మంత్రం చర్యలతో అధికారులు సరి పెట్టారు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకోకుండానే విద్యార్థులే మెస్ నిర్వహించుకున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కొత్త కాంట్రాక్టర్‌కు మెస్ నిర్వహణ ను అప్పగించారు. తాజాగా కలుషిత నీరు సరఫరా చేస్తున్నారంటూ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్వాసన.. కలుషితం నర్సింగ్ స్కూల్ ప్రాంగణంలోని బోరు ద్వారా ఆర్ఓఆర్ ప్లాంట్‌కు అక్కడి నుంచి విద్యార్థుల కు తాగునీరు అందిస్తున్నారు. అయితే, గతం లో ఓసారి బోరు మోటార్ మరమ్మతుకు రాగా.. బోర్ను తెరవడంతో అందులో పంది కొక్కు పడి మృతి చెందిందని విద్యార్థులు చెబుతున్నారు. అనంతరం మోటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నీరు అందించినా... వాసన వస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి విద్యార్థులు తీసుకువెళ్లారు. దీంతో ఈ నీటిని ఇటీవల ప్రయోగశాలకు పంపించగా.. సురక్షితం కాదని తేలింది. అయితే, మరోసారి ప్రయోగశాల అధికారులు స్వయంగా నర్సింగ్ స్కూల్ కు వచ్చి పరీక్షల కోసం నీటిని తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన రిపోర్టు శనివారం అందుతుందని సమాచారం. ఈ మేరకు విద్యార్థుల కు ప్రస్తుతం మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్న అధికారులు.. రిపోర్టు వస్తే ఏం చర్యలు తీసుకోనున్నారో తెలుస్తుంది. చెత్తాచెదారంతో హాస్టల్ ప్రాంగణం నర్సింగ్ హాస్టల్ ప్రాంగణం చెత్తాచెదారంతో నిండిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రత పాటించి పలువురికి ఆదర్శంగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఎంజీఎం పరిపాలనాధికారులు పట్టించుకోవడం లేదు. స్కూల్ ప్రాంగణం మొత్తం పనికి రాని మంచాలు, పాడైన కూలర్లు ఇత్యాది దర్శనమిస్తాయి. ఎక్కడెక్కడో విరిగిన ఫర్నీచర్‌ను సైతం తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు. అన్‌మ్యారీడ్ హాస్టల్లో కాంట్రాక్టర్ నర్సింగ్ విద్యనభ్యసించే విద్యార్థుల కోసం నర్సింగ్ స్కూల్ ప్రాంగణంలోనే హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్లో అన్‌మ్యారీడ్ విద్యార్థులు తప్ప ఎవరు ఉండకూడదనేది నిబంధన. కానీ పరిపాలనాధికారులు తమకు అనుమతి ఇచ్చారంటూ కొందరు స్టాఫ్‌నర్సులతో పాటు ఏకంగా కాంట్రాక్టర్ హాస్టల్లోనే నివాసముంటున్నారు. అయితే స్కూల్ విద్యార్థులకు కాంట్రాక్టర్ పద్ధతిన ఆహారం అందించే వ్యక్తికి హాస్టల్లో స్థానం కల్పించడమేమిటని పలువురు వైద్యులతో పాటు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. సైతం చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎం జీఎం పరిపాలనపై దృష్టి సారించడంతో పా టు హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.