Teachers post
-
సార్లొస్తారు
త్వరలో డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్..! ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు కుమ్రంభీం జిల్లాలోనే అత్యధిక ఖాళీలు.. నిర్మల్ జిల్లాలో స్వల్పం మంచిర్యాల సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు మోక్షం లభించనుందా..? ప్రభుత్వం టెట్, డీఎస్సీ నిర్వహించడం ద్వారా ఐదేళ్ల తరువాత నిరుద్యోగుల ఆశలు తీర్చనుందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెపుతున్నాయి అధికార వర్గాలు. జిల్లాల వారీగా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీని వేర్వేరుగానే నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్లు ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ముందుగా టెట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే డీఎస్సీ ప్రకటన రానున్నట్లు – మిగతా 2లోu సమాచారం. అన్నీ సక్రమంగా కుదిరితే మార్చిలో టెట్ నోటిఫికేషన్ ప్రకటించి, ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ చివరి వారం లేదా మేలో వెలువరించి జూలై నాటికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. టెట్, డీఎస్సీ కలిపి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1,867 కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 989 టీచర్ పోస్టులు ఖాళీ ఉండ గా, నిర్మల్ జిల్లాలో అతితక్కువగా 175 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఐదేళ్ల తర్వాత.. : ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లుగా అవకాశాలు లేవు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీఎ స్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడమే చివరిది. అప్పటి నుంచి నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందని ఆశతో ఉన్న వారికి రెండున్నరేళ్ల తరువాత ఉప ముఖ్యమంత్రి ప్రకటన ఊపిరినిచ్చింది. నాలుగు జిల్లాల్లో కలిపి 1,867 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఖాళీల సంఖ్యలో మార్పులు ఉంటాయా అన్న విషయాన్ని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా.. ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరిస్తే నాలుగు జిల్లాల్లో 1ః28 చొప్పున సుమారు 55 వేల మంది పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కుమ్రంభీంలోనే అధిక ఖాళీలు.. : ఉమ్మడి పరి ధిలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఈ జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 989 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మారుమూల మండలాలైన బెజ్జూరు, కెరమెరి, తిర్యాణి, కౌటాల, సిర్పూర్(టి), చింతల్మానేపల్లి, దహెగాం, వాంకిడి, జైనూర్ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోనే అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల, భీమిని, భీమారం, కాసిపేట, అదే విధంగా నిర్మల్ జిల్లాలోని కడెం, పెంబి, కుంటాల, సారంగాపూర్, ఖానాపూర్, లోకేశ్వరం, ఆదిలాబాద్ జిల్లాలోని బేల, జైనథ్, నేరడిగొండ, నార్నూర్, ఉట్నూర్, తలమడుగు, ఇంద్రవెల్లి మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉన్నట్టు సమాచారం. -
డీఈడీ కిలాడీ కాలేజీలు!
మౌలిక సదుపాయాల్లేవు.. బోధన సిబ్బంది లేరు స్కూళ్లు, కాలేజీల్లోనే కోర్సు నిర్వహణ అదే సిబ్బందితో డీఈడీ విద్యా బోధన నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఫీజు రీయింబర్స్మెంట్ రాదంటూ వసూళ్లు సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టులపై ఆశతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్)లో చేరుతున్న వారిని ప్రైవేట్ కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి! యాజమాన్య కోటా సీటును లక్షన్నర వరకు అమ్ముకుంటున్న యాజమాన్యాలు కాలేజీల నిర్వహణలోనూ అడ్డదారులు తొక్కుతున్నాయి. మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండానే కాలేజీలను నిర్వహిస్తున్నాయి. సిబ్బంది ఉండరు.. విద్యార్థులు రారు! రాష్ట్రంలోని 50 శాతం డీఎడ్ కాలేజీల్లో ల్యాబ్ సదుపాయాలు లేవు. పక్కా భవనాలు లేవు. రేకుల షెడ్లు, స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, బీఎడ్ కాలేజీల్లోని రెండు గదుల్లో రెండేళ్ల డీఎడ్ కోర్సును నెట్టుకొస్తున్నాయి. మెరుగైన విద్యా బోధన, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. కొన్ని కాలేజీల్లోనైతే అసలు బోధనా సిబ్బందే కనిపించడం లేదని.. మరికొన్ని కాలేజీల్లోనైతే విద్యార్థులు కూడా లేరని విద్యాశాఖ తనిఖీల్లోనే వెల్లడైంది. డీఎడ్ కాలేజీల అక్రమాలపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 100కు పైగా కాలేజీలపై ఫిర్యాదులు అందాయి. అక్రమ మార్గంలో నిర్వహిస్తున్న కాలేజీలు దాదాపు 250కి పైగా ఉన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా.. కన్వీనర్ కోటాలో డీఎడ్ సీటు వచ్చినా విద్యార్థులను చేర్చుకునేందుకు యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేవని, ఫీజు రీయింబర్స్మెంట్ రాదంటూ విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని కాలేజీలైతే మీరు రావాల్సిన పని లేదని హాజరు మినహాయింపు ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ. 10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ముడుపుల మాయ! ఓ కాలేజీకి రెన్యువల్ అవకాశం ఇవ్వాలంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నేతృత్వంలో ఆర్జేడీ, డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో తనిఖీలు జరపాలి. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా సర్టిఫై చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏటా తనిఖీల తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాలేజీల అక్రమాలకు మరికొన్ని ఉదాహరణలు.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒకే క్యాంపస్‌లో ఏడు కాలేజీలున్నాయి. అన్నింటికీ ఒకటే అడ్రస్. బీఎడ్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మా-డీ, డీఎంఎల్టీ, ఐటీఐతోపాటు డీఎడ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల స్కూళ్లలో, మరికొన్ని చోట్ల కాలేజీల్లో, ఇంకొన్ని చోట్ల ఇంజనీరింగ్ కళాశాలల్లో డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఆ క్యాంపస్‌లోని అన్ని కాలేజీలకు సిబ్బంది అంతా ఒకరే. కాలేజీలకు అనుమతులు, రెన్యువల్స్ దరఖాస్తు చేసుకున్నపుడు సిబ్బంది పేర్లు కాగితాలపై చూపిస్తున్నారు. తనిఖీలు చేస్తే సిబ్బంది ఒకరిద్దరే ఉంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌తో కలిపి 8 మంది బోధనా సిబ్బంది ఉండాలి. సొంత వెబ్సైట్ ఉండాలి. కళాశాల భవనం, సిబ్బంది, విద్యార్థుల వివరాలను చూపాలి. 70 శాతం కాలేజీలకు వెబ్‌సైటే లేదు. కొన్ని కాలేజీలు స్థలాలు, భవనాలకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు అందజేసిన ట్లు సమాచారం. కొన్ని చోట్ల కాలేజీలే లేవు. వాటిని ఎక్కడ నిర్వహిస్తున్నారో అంతుబట్టదు. స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న డీఎడ్ కోర్సుకు ఆయా కాలేజీల్లోని సిబ్బందినే బోధకులుగా చూపుతున్నారు. -
ప్రశాంతంగా టెట్
సాక్షి, చెన్నై: ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే వారికి టెట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం సరికొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ క్రమంలో టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నం గందరగోళం మధ్య సాగింది. పరీక్ష నిర్వహణ తేదీ పలుమార్లు వారుుదా పడింది. ఎట్టకేలకు పరీక్ష జరిగినా అభ్యర్థుల విద్యార్హతతో సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడం, 150 ప్రశ్నలకు గంటన్నర మాత్రమే సమయం కేటాయించడం విమర్శలకు దారి తీసింది. ఫలితంగా పరీక్ష రాసిన ఆరు లక్షల ప్రశాంతంగా టెట్ మందిలో రెండు వేల మందే ఉత్తీర్ణులయ్యూరు. దీంతో మూడు గంటల సమయాన్ని నిర్ణయించి మళ్లీ పరీక్షలు నిర్వహించి ఖాళీల్ని భ ర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పకడ్బందీ టెట్ నిర్వహించేందుకు ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు తీసుకుంది. శనివారం పేపర్ 1(డీఎడ్), ఆదివారం పేపర్ 2(బీఎడ్) పరీక్ష జరగనున్నట్లు ప్రకటించింది. నిఘానీడలో పరీక్ష శనివారం తొలి పేపర్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. అత్యంత కట్టుదిట్టమైన నిఘానీడలో పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉదయూన్నే చేరుకున్నారు. పది నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రంలోని 677 కేంద్రాల్లో 2.67 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. చెన్నైలోని కేంద్రాల్లో 50 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో మహిళా అభ్యర్థులు అధికం. ఆదివారం బీఎడ్ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. సుమారు 4.11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. లీక్ కలకలం టెట్ పేపర్ ధర్మపురిలో లీక్ అరుునట్లు వచ్చిన సమాచారం అభ్యర్థులు, అధికారులను ఆందోళనలో పడేసింది. ధర్మపురిలో ఓ ముఠా పేపర్ లీక్‌కు పాల్పడినట్లు, ప్రశ్నపత్రాలను వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఓ చోట అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రచారం బయలుదేరిన పరీక్ష కేంద్రం వద్ద నుంచి విచారణ వేగవంతం చేశారు. ధర్మపురి ఎస్పీ అష్రాకార్గ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కృష్ణగిరి సరిహద్దుల్లో తనిఖీలు వేగవంతం చేశారు. ఆ సరిహద్దుల్లో ఐదుగురి వద్ద ప్రశ్నపత్రాలు లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. అరుుతే ఈ ప్రశ్నపత్రాలు నకిలీవిగా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ప్రశ్నపత్రాల్ని సృష్టించి అభ్యర్థుల్ని మోసగించడం లక్ష్యంగా ఈ ముఠా కుట్ర చేసినట్లు విచారణలో తేలింది. ప్రశ్నపత్రాలను రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకు విక్రరుుంచినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో కృష్ణగిరికి చెందిన గణపతి, హోసూరుకు చెందిన కృష్ణ, చంద్రశేఖర్, తలికి చెందిన అశోక్‌కుమార్, మరో వ్యక్తి ఉన్నారు. -
వెక్కిరిస్తున్న ఉర్దూ ఉపాధ్యాయుల ఖాళీలు
సాక్షి, మంచిర్యాల : విద్యార్థులకు ఉర్దూ విద్య అందని ద్రాక్షగా మారింది. ఉర్దూ విద్యార్థులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తరగతి గదుల కొరత, సొంత భవనాల లేమితో విద్యార్థులు ఇతర మాధ్యమం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంగ్ల మాధ్యమం వైపు విద్యార్థులను ఆకర్శించేందుకు ప్రతిష్టాత్మకంగా రూ.3 కోట్లతో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు ఉర్దూ మాధ్యమాన్ని విస్మరించడంపై ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుల కొరత జిల్లావ్యాప్తంగా 116 ప్రాథమిక, 28 ప్రాథమికొన్నత, 21 ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాలలు మొత్తం 165 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 29,133 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 650 పోస్టులు ఉండగా, 582 మంది మాత్రమే ఉన్నారు. 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం.. ఇంకా కనీసం 1000 మంది ఉపాధ్యాయులు కొరతగా ఉన్నారు. ఉపాధ్యాయులు లేక, బోధన సరిగా జరగక పలు పాఠశాలలు మూతబడే పరిస్థితి ఉంది. ఇంకొన్ని చోట్ల వందల సంఖ్య లో విద్యార్థులుంటే ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. బీరెల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో 103 మంది విద్యార్థులుంటే కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. సారంగాపూర్ యూపీఎస్‌లో 98 విద్యార్థులుంటే ముగ్గురు, మామడ యూపీఎస్‌లో 90 మంది విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. సిబ్బంది కొ రత ఉండడంతో ఉపాధ్యాయులపై పనిభారం ఎక్కువవుతోంది. ఫలితంగా రెండు, మూడు తరగతులకు కలిపి బోధిస్తున్నారు. అద్దె దిక్కు లేదు.. 25 మంది విద్యార్థులుంటే ఓ తరగతి గది నిర్మించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ జిల్లాలో 30 నుంచి 50 మంది విద్యార్థులున్న సుమారు 68 స్కూళ్లలకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాల్లోనే తరగతులు కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. సొంత భవనాలు మంజూరు చేయని ప్రభుత్వం అద్దె భవనాలకు కిరాయి చెల్లించేందుకూ మొండికేస్తోంది. దీంతో కొన్ని చోట్ల ఉపాధ్యాయులే తమ జేబులోంచి అద్దె చెల్లిస్తుంటే.. ఇంకొన్ని చోట్ల ఏళ్ల నుంచి అద్దె లేకుండానే ఉర్దూ మీడియం స్కూళ్లు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సొంత భవనాలు లేని పాఠశాలలు 60కిపైనే ఉన్నాయి. మంచిర్యాలలోనే 8 స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్‌లో చాలా స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నిర్మల్ పట్టణం పంజేషా, చిక్కడపల్లి, మోతీనగర్, ఈద్గావ్, శాంతినగర్, ఇతర ప్రాంతాల్లో 2007 నుంచి అద్దె లేదు. దీంతో ఇరుకైన గదుల్లోనే ఉపాధ్యాయులు బోధిస్తే.. విద్యార్థులు పాఠాలు వినాల్సి వస్తుంది. మరోపక్క.. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో బోధించేవారు లేక జిల్లాలో ఉర్దూ మీడియం విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైంది. జిల్లాలో ముస్లింల జనాభా ఎక్కువ. ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో కనీసం ఒక్కరినైనా ఉర్దూ మీడియం చదివించేవారు. కానీ ఐదేళ్ల నుంచి ఉర్దూపై పాలకులు చూపుతోన్న వివక్ష.. ప్రైవేట్ ఉర్దూ మీడియం పాఠశాలలు లేకపోవడంతో ముస్లింలు తమ పిల్లలను ఇతర మాద్యమాల్లో చేర్పిస్తున్నారు. ఈ విషయమై డీఈవో కార్యాలయ సంబంధిత సెక్షన్ అధికారి శ్రీహరి బాబు స్పందిస్తూ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు, తరగతి గదుల కొరత ఉన్న మాట వాస్తవమేనని పోస్టుల మంజూరు, గదుల నిర్మాణం ప్రభుత్వం నుంచే రావల్సి ఉందని వివరణ ఇచ్చారు. పోస్టులు మంజూరు చేస్తేనే.. - వహీద్‌ఖాన్, ఉపాధ్యాయుడు జిల్లాలో ఉర్దూ మీడియం స్కూళ్లలో బోధకులు, వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర మాధ్యమాల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉర్దూ ఇప్పుడు అంతరించిపోతుంది. జిల్లాలో వందలాది ఉపాధ్యాయ పోస్టులు అవసరమున్నాయి. విడతలుగా అన్నింటినీ భర్తీ చేస్తేనే ఉర్దూ మీ డియం చదివేందుకు విద్యార్థులు ముందుకువస్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని నివేదించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది.