teachers Rationalization
-
టీచర్ల పోస్టులపై సుదీర్ఘ కసరత్తు
- ఆదర్శ పాఠశాలలపై వెలువడని ఉత్తర్వులు - రేషనలైజేషన్ పరిస్థితి అంతే - ఇంకా కొలిక్కిరాని వైనం ఒంగోలు వన్‌టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు జరుగుతుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై రోజుకో ఉత్తర్వులు జారీచేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ వ్యవహారం కూడా ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జారీచేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి ప్రకటించాల్సి ఉంది. అయితే ఖాళీల వివరాలు ప్రకటించాలంటే ముందుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు పూరై ్త ఆ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడాలి. అయితే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, రేషనలైజేషన్ వ్యవహారంపై జిల్లా నుంచి సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆమోదముద్ర పడ లేదు. దీంతో ఖాళీల వ్యవహారం గందరగోళంగా మారనుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విషయంలో.. ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు విషయంలో మొదట పట్టుదలగా వ్యవహరించింది. జిల్లాలో మొత్తం 483 ఆదర్శ ప్రాధమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పీ సిసోడియా జీవో ఎంఎస్ నం.46, తేదీ 7.8.2015 ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక్కో ఆదర్శ ప్రాధమిక పాఠశాలకు అన్ని వసతులు కల్పించాలంటే సుమారు రూ. 25 లక్షలు వ్యయమవుతుందని అంచనా. అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై పట్టును సడలించారు. మొదట కిలోమీటర్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయమన్నారు. ఆ మేరకు జిల్లాలో మొదట 513 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటవుతుందని లెక్కలు కట్టారు. అనంతరం ఆ సంఖ్య 437కు కుదించారు. అయితే ఈ సంఖ్య కూడా 383కు పడిపోయింది. దీనిపై ఇంకా చిక్కుముడి వీడ లేదు. రేషనలైజేషన్‌లో.. ఉపాధ్యాయులు, పాఠశాలల రేషనలైజేషన్‌లో కూడా సందిగ్ధత సాగుతోంది. రేషనలైజేషన్‌లో గత ఏడాది చివరి నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందుకు బదులుగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి పాఠశాలలలోని విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని హేతుబద్ధీకరణ చేయాలని కోరుతున్నారు. ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు.... ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ల సర్దుబాటు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. జిల్లాలో మొత్తం 465 మంది ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు ఉన్నారు. ప్రభుత్వం మొదట ప్రకటించిన ప్రకారం 130 మంది కంటే ఎక్కువ పిల్లల ఉన్న ఆదర్శ పాఠశాలలకు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. జిల్లాలో ఇటువంటి పాఠశాలలు కేవలం 83 మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం 382 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు మిగులుగా తేలుతున్నాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, రేషనలైజేషన్ విషయంలో ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం మార్పులు, చేర్పుల కోసం డీఈవో కార్యాలయంలోని ఏపీవో, సిబ్బంది మంగళవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఈ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు చేసి కమిషనర్ ఆమోద ముద్ర పడితే కానీ ఖాళీల కసరత్తు కొలిక్కిరాదు. -
చెప్పిందొకటి.. చేస్తోందొకటి!
* టీచర్ల రేషనలైజేషన్, బదిలీల్లో గందరగోళం * ఇష్టారాజ్యంగా విధానాలు అమలు * మార్గదర్శకాల్లో ఒకటుంటే కలెక్టర్లు చెబుతున్నది మరొకటి * సీనియారిటీ జాబితాల్లో రోస్టర్ కమ్ మెరిట్ అమలు పట్టని అధికారులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. విద్యాశాఖ మార్గదర్శకాల్లో ఒకటుంటే.. జిల్లాల్లో కలెక్టర్లు మరో విధంగా చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఒకలా పేర్కొంటే విద్యాశాఖ మరో రకంగా మార్గదర్శకాలు ఇస్తోంది. సీనియారిటీ జాబితాల రూపకల్పనలో అన్ని జిల్లాల్లో రోస్టర్ కమ్ మెరిట్‌ను అమలు చేయడం లేదు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా చేస్తున్నారు. ఇక మిగులు (సర్ప్లస్) పోస్టులను గతంలోనే ఆయా జిల్లాలోని స్కూళ్లలోనే సర్దుబాటు చేయగా.. ఈసారి వాటిని ఇతర స్కూళ్లకు కేటాయించకుండా డీఈవోల ఆధీనంలోకి తెచ్చిపెట్టారు. దీంతో ఆ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవీ సమస్యలు.. 2014, సెప్టెంబర్ నుంచి జూన్ 30 మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని సంఘాలు చెబుతున్నాయి. అందుకే జూన్ 2015ను ప్రామాణికంగా తీసుకొని హేతుబద్ధీకరణ చేయాలంటున్నాయి. 2014 సెప్టెంబర్ నాటి సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం వల్ల విద్యార్థులకు అనుగుణంగా టీచర్లు రాలేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సొంత ఆలోచనలు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం 0 నుంచి 19 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఒక టీచర్‌ను ఇవ్వాలి. కానీ కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18 మంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు టీచర్లు ఇస్తామంటున్నారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 50 మందికి మించి విద్యార్థులు ఉంటే ఆ స్కూల్‌ను కొనసాగించాలని, లేదంటే సమీపంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విలీనం చేయాలి. కానీ వరంగల్ జిల్లాల్లో 40 మంది విద్యార్థులు ఉన్నా ఆ స్కూళ్లను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇది ఉత్తర్వులకు వ్యతిరేకం కావడంతో డీఈవోలు ఒప్పుకోవడం లేదు. అన్ని జిల్లాల్లో రేషనలైజేషన్ పూర్తి కాలేదు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం రాత్రి వరకు కూడా ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. భార్యాభర్తలు ఇద్దరికి 10 చొప్పున ప్రాధాన్య పాయింట్లు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట ఆ ఉత్తర్వులను అమలు చేయాలని, ఆ తర్వాత ప్రాధాన్య పాయింట్లు ఇద్దరిలో ఒక్కరే ఉపయోగించుకోవాలని విద్యాశాఖ రెండుసార్లు వివరణ మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఆ పాయింట్లను ఉపయోగించుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. మరి వాటిని ఒక్కరికే పరిమితం చేస్తూ మార్పు చేసేదేలా? అన్న గందరగోళం ఏర్పడింది. ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేస్తున్నపుడు స్పౌజ్ పాయింట్లు వర్తింపచేయాలి. కానీ పక్క జిల్లాలో పని చేస్తున్నా వర్తింపజేస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఇతర ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోంది. ఆరు జిల్లాల్లో సర్దుబాటు చేయగా ఇంకా 4 వేలకు పైగా మిగులు పోస్టులు ఉన్నట్లు తేలింది. నిజామాబాద్‌లో 623, నల్లగొండలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్లో 826 పోస్టులు మిగులు (సర్ప్లస్)గా తేల్చినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరు. ఆదిలాబాద్‌లో 551 పోస్టులు ఖాళీలు ఉండగా, మెదక్‌లో 458 పోస్టులు, మహబూబ్‌నగర్‌లో 931, రంగారెడ్డిలో 1,894 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
‘డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం టీటీజేఏసీ సమావేశం సందర్భంగా పలువురు నిరుద్యోగులు అక్కడికి వచ్చారు. టీటీజేఏసీ తరపున డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సందర్భంగా టీటీజేఏసీ చైర్మన్ వెంకట్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరుతో నోటిఫికేషన్ జారీలో జాప్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.