teaching hospitals
-
కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో నాన్-క్లినికల్ అంశాల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
-
వైద్యులు పని ప్రదేశంలోనే నివాసం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులంతా పని ప్రదేశంలోనే నివాసం ఉండాలని, బోధనాస్పత్రుల్లోని డాక్టర్లందరూ రోజూ విధులకు హాజరు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. డ్యూటీ సమ యంలో కూడా కొందరు వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బోధనాస్పత్రులపై గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, ప్రభు త్వాస్పత్రులన్నీ దీనిపై దృష్టి సారించాలని కోరారు. బోధనాస్పత్రుల్లో పరిశోధనలు పెంచాల న్నారు. ప్రభుత్వాస్ప త్రుల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, ఆయా విభాగాధి పతులు, సీని యర్ ప్రొఫెసర్లు డ్యూటీ చార్ట్ ప్రకారం ఓపీలో సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు 99.9 శాతానికి చేరుకున్నా యని, గాంధీలో అవయవ మార్పిడి విభాగం త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు. ఆస్పత్రుల్లో మూడు నెలలకు సరిపడా మందులు తప్పకుండా ఉండా లని, వైద్యులు జనరిక్ మందులు మాత్రమే రాయా లని సూచించారు. వారంరోజుల్లో అన్ని ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తేవాలన్నారు. సమీక్షలో వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ సంచాలకులు శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే విధులకు హాజరవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో సెలవులో ఉన్న వైద్యులు వెంటనే విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒకేచోట ఐదేళ్లకుపైగా పనిచేసిన వారిలో 30 మంది వైద్యులు, సిబ్బందిని ఇటీవల బదిలీ చేశారు. బదిలీ అయిన వైద్యుల్లో కొందరు తమకు కేటాయించిన స్థానాల్లో చేరకపోగా, చేరిన కొందరు సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో వీరితోపాటు పలు కారణాలతో కొద్ది నెలలుగా విధులకు హాజరవ్వని 40 మందికిపైగా వైద్యులు వెంటనే విధులకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. అనారోగ్య కారణాలను చూపి సెలవులో ఉన్న వైద్యులకు మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ పరీక్షల్లో ఆరోగ్యం బాగున్నట్టు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. వివరాలు పంపండి వైద్య ఆరోగ్యశాఖ బలోపేతానికి అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో వేలసంఖ్యలో వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీచేసింది. తద్వారా 900 వరకు పీజీ సీట్లు పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పీజీ సీట్ల సంఖ్య, క్యాడర్ స్ట్రెంత్, పీజీ సీట్ల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల వారీగా నివేదికలు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్లకు 2021–22 ప్యానెల్ సంవత్సరానికిగాను ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించడానికి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జూమ్‌లో వర్చువల్‌గా కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. క్లినికల్, నాన్–క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తోంది. -
అవయవ మార్పిడికి నజరానా
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్స చేస్తే.. సదరు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు అందజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు చేయడంపై వైద్యులు దృష్టి సారించాలని.. వైద్య పరికరాలు, మందులు ఇతర అవసరాలను సమకూర్చుకునేందుకు నిధులు ఇస్తామని తెలిపారు. సదరు డాక్టర్లకు, పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. పేదలకు వైద్యం అందించడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. నంబర్ వన్‌గా నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి బాసరలో బసచేశారు. గురువారం ఉదయమే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తర్వాత ముధోల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి, నిర్మల్‌లో నిర్మించనున్న 250 పడకల జిల్లా ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఆదిలాబాద్‌లో రూ.150 కోట్లతో నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ఏడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు: దేశంలో పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మనదేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మూడే మెడికల్ కాలేజీలు వచ్చాయని.. ఏడేళ్ల స్వరాష్ట్ర పాలనలో ఏకంగా 17 ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అప్పట్లో వరంగల్‌లో రైతులు బస్తాకు రూపాయి చొప్పున జమ చేసుకుని ఆస్పత్రి కట్టుకుంటే.. తర్వాత సమైక్య పాలకులు దానిని మెడికల్ కాలేజీగా మార్చారన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పనితీరుపై నెలనెలా సమీక్షిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. ఇక సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఈ నెల 5న హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్‌కార్డు అందిస్తామన్నారు. దేశం మెచ్చుకుంటుంటే.. ఇక్కడ విమర్శలు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు దారుణమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో తెలంగాణ ఇంటింటి సర్వే చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన తీరును నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో బస్తీ దవాఖానాల ఏర్పాటును 15వ ఆర్థిక సంఘం మె చ్చుకుందని తెలిపారు. ఈ రెండింటినీ మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్న సూచనలు చేశాయని వివరించారు. సొంత జాగా ఉంటే ఇల్లు సొంత జాగా ఉన్న పేదలు ఇల్లు కట్టుకునేందుకు వీలుకల్పించే కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నా రని హరీశ్‌రావు తెలిపారు. 57 ఏళ్లు దాటినవారికి పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, రేఖా శ్యాంనాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
బోధనాసుపత్రుల్లో కోవిడ్, నాన్‌కోవిడ్ సేవలు
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మార్చి నెల నుంచి అన్ని బోధనాసుపత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆస్పత్రుల్లో ఇక నాన్‌కోవిడ్ సేవలనూ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆస్పత్రులకు కరోనాతోనే కాకుండా పలు ఆరోగ్య సమస్యలతో వచ్చే వారు ఎక్కువ మంది ఉంటున్న నేపథ్యంలో ప్రతి బోధనాసుపత్రిలో కోవిడ్, నాన్ కోవిడ్ విభాగాలను ఏర్పాటు చేయాలని వైద్య విద్యా డైరెక్టర్ శనివారం ఆదేశాలిచ్చారు. కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరే వారికి ప్రత్యేక పడకలు, రూములు కేటాయించి, మిగతా వాటిని నాన్‌కోవిడ్‌కు ఉపయోగించాలని సూచించారు. కోవిడ్ బాధితులకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి మిగతా ప్రాంతాన్ని నాన్‌కోవిడ్ సేవలకు వాడుకోవాలని పేర్కొన్నారు. యాక్సిడెంట్ కేసులు, ఈఎన్టీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో వచ్చేవారికి ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ సేవలను పునరుద్ధరించాలని ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఆస్పత్రుల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే, నాన్ కోవిడ్ సేవలనూ కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో బోధనాసుపత్రులకు ప్రసవాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో గర్భిణులకు ప్రత్యేక వార్డులు కేటాయించాలని ఆదేశించారు. కోవిడ్, నాన్‌కోవిడ్ సేవలను రెండింటినీ ఒకే ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం వల్ల రోగులకు ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. -
బోధనాస్పత్రులు మరింత పటిష్టం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీఎత్తున పోస్టులను భర్తీచేయనుంది. ఇప్పటికే 695 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేసిన సర్కారు త్వరలో మరో 355 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకోనుంది. ఇవన్నీ కొత్తగా మంజూరు చేసిన పోస్టులు కావడం గమనార్హం. వీటితో పాటు సుమారు 900 మంది వైద్యేతర అంటే పారా మెడికల్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది. దీంతో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితో బోధనాసుపత్రులు మరింత పటిష్టం కానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు అస్సలు చేపట్టకపోవడం.. సేవలన్నీ పీపీపీ (ప్రైవేటు, ప్రభుత్వ, భాగస్వామ్యం) పద్ధతిలో ఉండటంతో బోధనాస్పత్రులను పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవు. వైద్యుల కొరత ఇక ఉండదు ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రధాన లోపం వైద్యుల కొరతే. ఇకపై ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కొత్తగా ఏర్పాటుచేస్తున్న క్యాన్సర్ బ్లాకులకూ వైద్యులను నియమించనున్నారు. ఇలా పెరుగుతున్న పడకలు, యూనిట్లకు అనుగుణంగా 355 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి వెళ్లింది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వైద్యవిద్యా వర్గాలు తెలిపాయి. పదోన్నతుల నిరీక్షణకు స్వస్తి ఇదిలా ఉంటే.. కొత్త నియామకాలు లేకపోవడంతో ఏళ్ల తరబడి పనిచేసినా పదోన్నతులు వచ్చేవి కావు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాగానే పాత వారికి వెంటనే అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి వస్తుంది. అలాగే, అసోసియేట్లుగా ఉన్న వారందరికీ ప్రొఫెసర్లుగా పదోన్నతి రానుంది. గతంలో లాగా పదోన్నతుల కోసం దశాబ్దాల తరబడి వేచిచూసే పరిస్థితి ఉండదు. -
బోధనాస్పత్రుల అధ్యాపకులకు యూజీసీ వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య విద్య బోధనాస్పత్రుల్లోని అధ్యాపకులకు యూజీసీ వేతనాలను అమలుచేస్తూ సర్కారు బుధవారం జీఓ జారీ చేసింది. వైద్య కళాశాలల్లోనూ అర్హులైన అధ్యాపకులందరికీ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని అధ్యాపకులతో సమానంగా ఈ పీఆర్సీ వర్తిస్తుందని తెలిపింది. పెంచిన వేతన సవరణ 1 జనవరి 2016 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు లతో రాష్ట్రంలో 9 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని 230 ట్యూటర్లు, 1561 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 614 అసో సియేట్ ప్రొఫెసర్లు, 461 ప్రొఫెసర్స్ లబ్ధి పొందనున్నారు. కాగా పీఆర్సీ ఎరియర్స్ వస్తాయనుకుంటే తమకు భంగపాటు ఎదురైందని తెలంగాణ ప్రభు త్వ వైద్యుల సంఘం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్య క్తం చేసింది. త్వరలోనే ఎరియర్స్ జీఓతో పాటు ఏడో వేతన సవరణకు అనుగుణంగా రవాణా భత్యం మంజూరు చేయాలని సంఘం కోరింది. కాగా అధ్యాపకులందరికీ ఎరియర్స్ కింద రూ.525 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. -
కళకళలాడుతున్న బోధనాస్పత్రులు..
సాక్షి, అమరావతి: ఓ వైపు నియామకాలు.. మరోవైపు పదోన్నతులతో బోధనాసుపత్రులు కళకళలాడుతున్నాయి. గత పదేళ్లుగా వైద్యులకు న్యాయబద్ధంగా రావాల్సిన పదోన్నతులను, ఖాళీగా ఉన్న వందలాది వైద్య పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో గత పది రోజులుగా బోధనాసుపత్రుల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వైద్యులు పదోన్నతులతో, కొత్తగా వచ్చిన యువ వైద్యులూ విధుల్లో చేరుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంస్కరణల్లో భాగంగా ఉన్నతస్థాయి కమిటీని వేయడం, రాష్ట్రవ్యాప్తంగా ఆ కమిటీ పర్యటించి నివేదిక ఇవ్వడం.. దీని ఆధారంగా పోస్టులను భర్తీ చేయడం వంటివన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఏళ్లతరబడి డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ నిర్వహించకుండా, పదోన్నతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంతో వైద్యులు ఒకే పోస్టులో దశాబ్దాల తరబడి ఉండిపోవాల్సి వచ్చిందని వైద్యులు వాపోయారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటపడ్డామన్నారు. ఇవీ మార్పులు.. ♦నాడు–నేడు పనులకు సంబంధించి 11 బోధనాసుపత్రుల్లో కన్సల్టెన్సీల నియామకం ♦కొత్తగా 665 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకం పూర్తి ♦ఒకేసారి 89 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి ♦అడిషనల్ డైరెక్టర్ల పదోన్నతులు పూర్తి చేసి ఏడుగురికి ఆర్డర్లు ♦మరో వందమందికి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు ♦స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌టెక్నీషియన్లను జిల్లాల వారీగా నియామకం ♦ఒక్క ఏడాదిలోనే 56 పీజీ వైద్య సీట్లు పెంపు ♦కరోనా వ్యాప్తి నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో 1,170 మంది మెడికల్ ఆఫీసర్ల నియామకం. -
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బోధనాసుపత్రి
రాష్ట్రంలోని 13 జిల్లాలను ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని, వాటిలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సులు ప్రారంభించడంపై దృష్టి సారించాలి. ఇదే సమయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు మెడికల్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. వాటి పరిధిలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అంశాలపై సమగ్ర విధానం ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ మే నాటికి వైద్య, ఆరోగ్య శాఖలో అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్), జీఎంపీ (గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీ చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనివల్ల సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్ సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది అని, కొత్త విధానం గురించి ఆలోచించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని అధికారులు సూచాయగా తెలుపుతూ.. నాలుగైదు ఆసుపత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని సీఎంకు వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, ఈ బోధనాసుపత్రులు స్వయం శక్తితో నడిచేలా ఆలోచించాలని సీఎం సూచించారు. ప్రజారోగ్య రంగం గురించి ఇదివరకటి ప్రభుత్వాలు ఆలోచించలేదని, అందువల్లే ఇవాళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఏర్పాటు చేసి, భవిష్యత్తులో అవి మెరుగ్గా నడిచేలా ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు అవుతాయని, దీంతో భవిష్యత్తులో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అవ్వాతాతలకు కంటి పరీక్షలు మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద ఈ నెల 17వ తేదీ నుంచి అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నామని, దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు వివరించారు. జూలై వరకూ మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్క్రీనింగ్, లోపాల గుర్తింపు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అన్నీ సమకాలంలో జరుగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా, అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్యులకు సూచనలు చేయాలని, తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్లపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అర్హులు ఎవ్వరూ కూడా మిగిలిపోకూడదని, ఎవరైనా మిగిలిపోతే వలంటీర్లను వినియోగించుకుని గుర్తించాలని ఆదేశించారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 46,725 మందికి ఫిబ్రవరి 2 వరకు రూ.33.14 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అవుతున్న సందర్భంలోనే రోగుల విశ్రాంతి సమయానికి ఇవ్వాల్సిన డబ్బును చేతిలో పెట్టాలని, మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనున్నామని, గుర్తించిన వారి వైద్యం వివరాలు ఆరోగ్య కార్డులో పొందుపరచనున్నట్లు అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం ఆరా తీశారు. 17న ఆసుపత్రుల్లో నాడు–నేడు ప్రారంభం ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ.. ‘నాడు– నేడు’లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని, ఈ విషయంలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. నాడు – నేడులో భాగంగా 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నాడు –నేడు కింద 11 మెడికల్ కాలేజీలు, 6 బోధనాసుపత్రుల్లో ,13 జిల్లా ఆసుపత్రుల్లో కూడా అభివృద్ధి పనులు చేపడతారు. కొత్తగా 7 మెడికల్ కాలేజీలు, 8 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 1 క్యాన్సర్ ఆసుపత్రి, 7 నర్సింగ్ కాలేజీల నిర్మాణం చేపడతారు. కాగా, ఈ నెల 17న ఆసుపత్రుల్లో నాడు– నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో ప్రారంభించనున్నారు. అదే రోజు సబ్‌సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూల్లోనే ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1.43 కోట్ల కుటుంబాలు వైఎస్సార్ నవశకం ద్వారా రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలను ఆరోగ్యశ్రీకి అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వార్షికాదాయ పరిమితిని రూ.5 లక్షల వరకు చేసినందున ఇంత మందికి లబ్ధి కలుగుతోందన్నారు. వీరందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కొత్త కార్డులను మార్చి 15వ తేదీలోగా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 72, చెన్నైలో 23, బెంగళూరులో 35 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 వేల మంది రోగులు చికిత్స చేయించుకున్నారని అధికారులు వివరించారు. ఈ నెల 17న ఎనీమియా ముక్త్ భారత్‌లో భాగంగా ఐఎఫ్ఏ టాబ్లెట్లు, సిరప్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సదరం సెంటర్లు 52 నుంచి 167కు పెంచామని, వారానికి 8,680 మందికి స్లాట్లు ఇస్తున్నామని, డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 3 వరకు 20,642 మందికి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు జోన్లు ఇలా.. 1. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం 2. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 3. కృష్ణా, గుంటూరు 4. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి 5. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం -
రోగుల సహాయకులకూ ఉచిత భోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో రోగుల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్పేషెంట్లుగా చేరిన వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆహారం (డైట్) అందిస్తున్నా వారి సహాయకులు మాత్రం భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అవస్థలు తొలగించేందుకు ఇన్‌పేషెంట్ల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం సమకూర్చనున్నారు. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా ఉచితంగా భోజనం అందించేందుకు వైద్య విద్య సంచాలకులు కసరత్తు ప్రారంభించారు. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్)తో చర్చించి రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నారు. ఆర్థిక భారం నుంచి ఉపశమనం.. ఇస్కాన్ ఇప్పటికే హైదరాబాద్‌లోని నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం సమకూరుస్తోంది. అదే తరహాలో ఏపీలోనూ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వైద్య విద్య సంచాలకులను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి ఆదేశించారు. రోగులతో పాటు వారి సహాయకులకు కూడా ఆహారం అందచేయడం ద్వారా వైద్య చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చే కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఉచితంగా భోజనం సమకూరుస్తుండగా కాకినాడలోని రంగరాయ బోధనాసుపత్రిలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆహారాన్ని అందిస్తోంది. ఇలా కొన్ని ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం అందిస్తున్నా అన్ని చోట్లా ఈ సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భోజనం సమకూరుస్తున్న సంస్థలను అలాగే కొనసాగిస్తూ మిగతా ఆస్పత్రులకు భోజనం అందించడం లేదంటే అన్నీ ఒకరికే అప్పగించాలా? అనే అంశాన్ని ఇస్కాన్‌తో చర్చించిన అనంతరం నిర్ణయించనున్నట్టు వైద్య విద్య అధికారులు తెలిపారు. రోజూ 10 వేల మందికిపైగా ప్రయోజనం రాష్ట్రవ్యాప్తంగా 11 బోధనాసుపత్రుల్లో సుమారు 12 వేల వరకు పడకలున్నాయి. సగటున రోజూ 11,500 మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. వారి కోసం సహాయకులు కూడా వస్తుంటారు. ఉచిత భోజనం సమకూర్చడం వల్ల నిత్యం 10 వేల మందికిపైగా రోగుల సహాయకులకు మేలు జరుగుతుంది. రోగి సహాయకులు పాస్ చూపిస్తే డిస్చార్జి అయ్యే వరకు రెండు పూటలా భోజనం అందిస్తారు. వీలైనంత త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బోధనాసుపత్రుల తరువాత ఈ సేవలను 14 జిల్లా ఆస్పత్రులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
బోధనాసుపత్రులకు మంచిరోజులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా టీడీపీ హయాంలో నియామకమంటే ఏమిటో తెలీక కునారిల్లిన రాష్ట్రంలోని బోధనాస్పత్రులకు మంచిరోజులు వస్తున్నాయి. త్వరలోనే వీటిల్లో నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపినట్లుసమాచారం. ఇటీవల సీఎం.. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఈ శాఖకు సంబంధించిన తాజా స్థితిగతులపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. బోధనాస్పత్రుల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చామని.. ఈ పోస్టుల భర్తీకి ఆయన సుముఖత వ్యక్తంచేసినట్లు వైద్య విద్యాశాఖాధికారులు చెప్పారు. ఇందులో భాగంగా తక్షణమే 2,550మంది నర్సుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఓ అధికారి చెప్పారు. ఈ నిర్ణయంతో బోధనాస్పత్రులను పీడిస్తున్న నర్సుల కొరత తీరుతుందని ఆయనన్నారు. ఒక్కో ఆస్పత్రికి 231 మంది నర్సింగ్ సిబ్బంది రాష్ట్రంలో ప్రతి బోధనాసుపత్రిలో నర్సింగ్ కొరత కారణంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఉండాల్సిన నర్సుల కంటే చాలా తక్కువగా ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఐసీయూ వార్డుల్లో రోగులకు సేవలందించడం చాలా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో 2,550 మంది నర్సుల నియామకం కీలకంగా మారనుంది. ఏపీలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా 11 బోధనాసుపత్రులున్నాయి. వీటిలో నియామకాలు పూర్తయితే ఒక్కో ఆస్పత్రికి సగటున 231 మంది కొత్తగా నర్సులు వస్తారు. తద్వారా పలు కీలక వార్డుల్లో రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. కాగా, ఇప్పటికే వీటి నియామక ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వీలైనంత త్వరలోనే స్టాఫ్ నర్సుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలను పంపనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, నర్సులు, ఇతర మౌలిక వసతులు పెరిగితే వచ్చే ఏడాది ఎంబీబీఎస్ సీట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని కూడా వైద్య వర్గాలు చెప్పాయి. సూపర్ స్పెషాలిటీ బ్లాకులకు మోక్షం ఇదిలా ఉంటే.. 2014లో కేంద్ర ప్రభుత్వం అనంతపురం, విజయవాడలోని బోధనాసుపత్రుల్లో పీఎంఎస్ఎస్వై కింద సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఒక్కో దానికి రూ.120 కోట్లు కేటాయించింది. దీంతో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. రాష్ట్ర వాటా కింద ఒక్కో ఆస్పత్రికి రూ.30 కోట్లు ఇవ్వాలి. అంటే మొత్తం రూ.60 కోట్లు ఇవ్వాలి. ఈ వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సూపర్ స్పెషాలిటీ బ్లాకుల ప్రారంభోత్సవాలు నిలిచిపోయాయి. ఈ సొమ్ముతో వైద్యపరికరాలు కొనాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అవి ఆగిపోయాయి. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే రూ.60 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, దీనివల్ల ఈ రెండుచోట్లా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్పారు. -
పక్కాగా పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో పని చేసే వైద్యులకు శుభవార్త. వారికి ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభిస్తాయి. గతేడాదే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా సాంకేతిక కారణాలతో అది అమలుకాలేదు. ఆ తర్వాత వరుసగా ఎన్నికలు రావడంతో ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు సవరణకు నోచుకోలేదు. సవరణలు కోరుతూ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు సంబంధించిన ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి నరహరి ‘సాక్షి’కి తెలిపారు. 2016 యూజీసీ వేతన సవరణను అనుసరించి ఉత్తర్వులు వెలువడతాయని ఆయన ప్రకటించారు. తాజా నిర్ణయం ప్రకారం.. బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక స్కేల్లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. పదోన్నతుల కోసం ఎదురుచూపు... ప్రస్తుతం పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైరయ్యాకే అంటే ఖాళీలు ఏర్పడ్డాకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఖాళీలు కొన్నే ఉంటే కొందరికే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో పదోన్నతుల కోసం ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకోసం ఫైరవీలు జరిగి లక్షలకు లక్షలు సమర్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వైద్యులు ఆవేదన చేస్తున్నారు. ఒక్కోసారి పదేళ్లకు, పదిహేనేళ్లకు పదోన్నతులు వచ్చినవారూ ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలుగనుంది. అంతేకాదు వారికి పదోన్నతి వచ్చిన ప్రతీసారి కూడా స్కేల్స్‌ల్లోనూ మార్పులుంటాయి. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతి లేకపోయినా మధ్యమధ్యలో స్కేల్స్‌లో నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీత కాలంలో పదోన్నతులు ఇవ్వడంతో ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు ఇతర పోస్టులకు మారుతారు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినందున త్వరలోనే సవరణ ఉత్తర్వులు వెలువడతాయన్న ఆశాభావాన్ని డాక్టర్ నరహరి వ్యక్తం చేశారు. -
శవాలతో సావాసం మాకొద్దు..!
ఫోరెన్సిక్ మెడిసిన్‌పై అభ్యర్థుల్లో తగ్గుతున్న ఆసక్తి సగం పీజీ సీట్లు కూడా భర్తీకాని వైనం ప్రభుత్వాస్పత్రుల్లో శవ పరీక్షకు వైద్యుల కరువు పంచనామా చేసిన వైద్యులే మళ్లీ పాఠాలూ చెప్పాలి ప్రైవేటులో అవకాశాలు లేకనే రావడం లేదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఫోరెన్సిక్ మెడిసిన్‌కు సినిమాల్లో తప్ప వాస్తవంలో ఏమాత్రం ప్రాధాన్యత ఉండడంలేదు. పీజీ చెయ్యక పోయినా ఫర్వాలేదుగానీ, నాన్క్లినికల్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ కోర్సులో సీటు తీసుకోకూడదనే ఆలోచనలో అభ్యర్థులున్నారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీసం సగం పీజీ వైద్య సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండీ ఫోరెన్సిక్ మెడిసన్ సీట్లు 12 ఉండగా ఈ ఏడాది కేవలం 3 మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పీజీ చేసినా మార్చురీలో పనిచేయడం మినహా ఎక్కడా ప్రాధాన్యత లేదని ప్రస్తుతం ఫోరెన్సిక్ పూర్తిచేసిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ గత కొన్నేళ్లుగా రెగ్యులర్ పోస్టులకు నియామకాలు లేవు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలూ లేకపోవడం దీనిపై ఆసక్తి లేకపోవడానికి మరో కారణం. ప్రమాద కేసులు, ఆత్మహత్య కేసులు, మెడికో లీగల్ కేసులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే శవ పంచనామా జరగాలి. కానీ అక్కడ ఫోరెన్సిక్ వైద్యుల కొరత వేధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మొత్తం 11 బోధనాస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు ఉంటే అందులో శవ పరీక్షలు నిర్వహించే దిక్కులేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రమాద కేసులో మృతిచెందితే నిరీక్షణే ఏటికేటికీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మృతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి పోలీస్ స్టేషన్ పరిధిని బట్టి ఆయా జిల్లా ఆస్పత్రి లేదా బోధనాస్పత్రికి తీసుకెళతారు. కానీ బోధనాస్పత్రుల్లో 8 మంది ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులుండాల్సి ఉంటే కనీసం ఇద్దరు కూడా లేని పరిస్థితి. ఒక్కో బోధనాస్పత్రికి సగటున రోజుకు ప్రమాద లేదా ఆత్మహత్య మృతుల కేసులు 10 నుంచి 15 వరకూ వస్తుంటాయి. అంటే రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 నుంచి 200 వరకూ మృతులకు పంచనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు లేక చివరకు అటెండర్లు, వార్డు బాయ్లే శవ పంచనామా చేసి తూతూమంత్రంగా రిపోర్టు రాసే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు కడప రిమ్స్‌లో ఆరుగురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శవాలు ఎక్కువగా వస్తే పంచనామా జాప్యమవుతోంది. పోనీ శవాలకు సరిపడా ఫ్రీజర్లు(శీతల పెట్టెలు) ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో చాలా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులకు ఎంతోకొంత లంచమిచ్చి త్వరగా పంచనామా చేయించుకుంటున్నారు. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ వంటి పెద్దాస్పత్రుల్లో విపరీతంగా ప్రమాద మృతుల కేసులు పంచనామాకు వస్తుంటాయి. అలాంటి చోటే వైద్యులు లేరు. ఉన్న వైద్యులు పంచనామా చేయడంతోపాటు ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి. ప్రైవేటులో అవకాశాలు లేకనే.. ప్రభుత్వాస్పత్రుల్లోనే శవపంచనామా చేయాల్సి ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అభ్యర్థులకు అవకాశాలు లేవు. దీంతో కొంతమంది అనాసక్తి చూపిస్తున్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుల కొరత లేదు. త్వరలోనే పదోన్నతులు చేపడుతున్నాం. ఆ తర్వాత ఫోరెన్సిక్లో ఎండీ చేసిన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకుంటాం. – డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్)