రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కడసారి నివాళులు అర్పించేందుకు చెన్నై బయల్దేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే ఆ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది.
భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి బయల్దేరారు. కానీ, కాసేపటి తర్వాతే ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని తక్షణం వెనక్కి మళ్లించి ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. దాంతో రాష్ట్రపతి ఇక జయలలితకు ప్రత్యక్షంగా నివాళులు అర్పించే వీలు ఉంటుందో లేదో అన్నది అనుమానంగానే మిగిలింది.