రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం | mid air snag causes president plane go back to delhi | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం

Published Tue, Dec 6 2016 12:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం

రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కడసారి నివాళులు అర్పించేందుకు చెన్నై బయల్దేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే ఆ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. 
 
భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి బయల్దేరారు. కానీ, కాసేపటి తర్వాతే ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని తక్షణం వెనక్కి మళ్లించి ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. దాంతో రాష్ట్రపతి ఇక జయలలితకు ప్రత్యక్షంగా నివాళులు అర్పించే వీలు ఉంటుందో లేదో అన్నది అనుమానంగానే మిగిలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement