Telangana Builders Federation
-
నగరంలో రూపాయి పెట్టుబడికి రెట్టింపు రాబడి
హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ వరుసగా ఐదోసారి ఎంపికైందని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో రూపాయి పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు రాబడి వస్తుందని అన్నారు. శుక్రవారం ఇక్కడి తాజ్ డెక్కన్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తోపాటు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బిల్డర్స్ ఫెడరేషన్ సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతు తెలిపింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ బిల్డర్స్‌కు స్వీయ నియంత్రణ ఉండాలని, లంచాలతో మేనేజ్ చేస్తే వారి బ్రాండ్ దెబ్బతింటుందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఈ రంగంలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఐదేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో బిల్డర్స్‌కు లాభం కలిగిందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ గట్టి సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే మన లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్‌లాగా యువరైతుకు ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడి సమస్యను పరిష్కరించిన సీఎం దేశంలో మరెవరూ లేరన్నారు. కేసీఆర్‌కు వేరే ఎజెండాలు కూడా లేవని, రాష్ట్ర అభివృద్ధే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిల్డర్స్ ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ జక్కా వెంకట్‌రెడ్డి, చైర్మన్ పద్మారెడ్డి, అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, ట్రెజరర్ సతీశ్‌రెడ్డి, కార్యనిర్వాహక సభ్యులు సత్యనారాయణ, యాదవరెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నార -
రోడ్లు ఎవరు నిర్మిస్తే వారిదే బాధ్యత
-
రోడ్లు ఎవరు నిర్మిస్తే వారిదే బాధ్యత: కేటీఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే రెండేళ్లలో 290 కీలోమీటర్ల వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్)తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి ఏ కాంట్రాక్టర్లు అయితే రోడ్లు నిర్మిస్తారో ఏడెళ్లపాటు వారే పూర్తి బాధ్యత వహించే విధంగా నిబంధన తీసుకొస్తున్నామన్నారు. ఇందు కోసం హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను(హెచ్ఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగర ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు ఏడాదిలోపు సిగ్నల్ ఫ్రీ జంక్షన్లను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే నాలుగు స్కైవే ఫ్లైఓవర్లను నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. రెండు ఫ్లైఓవర్లను అంబర్‌పేట చే నెంబర్- ఉప్పల్, శామీర్‌పేట - తుర్కపల్లి రూట్లలో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. నర్సాపురం- బాలనగర్ రూ.400 కోట్లతో ఓ ఫ్లైఓవర్ నిర్మిస్తామని, బంజారాహిల్స్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటర్ కారిడర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నవంబర్ చివర్లో మెట్రో రైలు ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాదికల్లా మెట్రో పనులు పూర్తవుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. -
రెరా నుంచి నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను మినహాయించండి!
► ఐదేళ్ల వారంటీని నిర్మాణ లోపాలకే పరిమితం చేయాలి ► అనుమతులు, ఎన్వోసీ, ఓసీ అన్నింటికీ ఏకగవాక్ష విధానం ► ప్రభుత్వానికి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వినతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) బిల్లు అమలుకు శరవేగంగా అడుగులేస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని రెరా ముసాయిదా అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది. దీంతో రెరా బిల్లులోని నిబంధనల్లో స్వల్ప మార్పుల కోసం తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను రెరా నుంచి మినహాయించాలని వారి ప్రధాన డిమాండ్. ఈ సందర్భంగా టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకట్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. ► నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను, అభివృద్ధి పనులన్ని పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్ట్‌లను, శ్లాబులు పూర్తయిన నివాస భవనాలను మినహాయించాలి. ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు ప్రారంభమైన ప్రాజెక్ట్‌లను కనీసం రెండేళ్ల పాటు ఉపశమనం కల్పించాలి. ప్రధానంగా నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను రెరా నుంచి తొలగించకపోతే చాలా ఇబ్బందులొస్తాయి. ఎలాగంటే.. ఇప్పటికే ఆయా ప్రాజెక్ట్‌ల్లో కొంత విక్రయాలు, అది కూడా సూపర్ బిల్టప్ ఏరియా చొప్పున విక్రయించేశారు. ఇప్పుడు రెరా బిల్లులోకి నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను చేరిస్తే ధరల్లో తేడా ఉండటంతో పాత, కొత్త కస్టమర్లకు మధ్య ఇబ్బందులొస్తాయి. పైగా ఆయా ప్రాజెక్ట్‌లకు కూడా ఐదేళ్ల వారంటీ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఖాళీగా ఉన్న ఫ్లాట్ల చ.అ. ధరలను పెంచి విక్రయించాల్సి వస్తుంది. అప్పటికే ఆ ప్రాజెక్ట్‌లో కొన్న పాత కస్టమర్లకు, ఇప్పుడు కొనే కస్టమర్లకు ధరల్లో చాలా తేడా ఉంటుంది. ఇది అమ్మకాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ► ఐదేళ్ల వారంటీ నిబంధనను నిర్మాణ పరమైన లోపాలకు మాత్రమే పరిమితం చేయాలి. కొనుగోలుదారులకు ఫ్లాట్‌ను అందించిన రోజు నుంచి 5 ఏళ్ల వరకు ఫ్లాట్‌కు వారంటీ ఇవ్వాలని రెరా అంటోంది. కానీ, వాస్తవానికి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందించాక ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యత అపార్ట్మెంట్ నిర్వహణ సంఘానిది. అలాంటప్పుడు ఐదేళ్ల వారంటీ డెవలపర్ ఎలా ఇవ్వగలడు? నిర్మాణ లోపాలకు (స్ట్రక్చరల్) డెవలపర్ బాధ్యత ఉంటుంది గానీ ప్రాజెక్ట్‌లోని ఇతరత్రా ఉత్పత్తులు అంటే విద్యుత్ వైర్లు, రంగులు, టైల్స్, శానిటేషన్, లిఫ్ట్, జనరేటర్, మోటర్ల వంటి వాటికి కూడా వారంటీ ఇవ్వమనటం దారుణం. ఎందుకంటే పైన చెప్పిన ఏ ఉత్పత్తులను కూడా డెవలపర్ ఉత్పత్తి చేయడు. మరి అలాంటప్పుడు బిల్డర్ వారంటీ ఎలా ఇస్తాడు? పైగా షార్ట్ సర్క్యూట్స్, సహజ విపత్తులతో జరిగే ప్రమాదాలకు డెవలపర్లు బాధ్యత వహించలేరు. ► రెరాలోకి డెవలపర్లను, మధ్యవర్తులను మాత్రమే కాదు నిర్మాణ అనుమతులను మంజూరు చేసే ప్రభుత్వ విభాగాలనూ చేర్చాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, అగ్నిమాపక శాఖ ఇలా నిర్మాణ అనుమతులు, ఎన్వోసీ, ఓసీల జారీలో అనుబంధమై ఉన్న ప్రతీ విభాగాన్ని రెరా పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆయా విభాగాల్లో ఏ అధికారి సమయానికి అనుమతులు, ఎన్వోసీలు, ఓసీలు జారీ చేయకపోయినా నిర్మాణం ఆలస్యం అవుతుంది. దీంతో వ్యయం పెరగడమే కాకుండా ఆలస్యమైనందుకు డెవలపర్లకు వడ్డన పేరిట అదనపు భారం నిబంధన ఉంది. సింగిల్ విండో ద్వారా అనుమతులు, ఎన్వోసీలు, ఓసీలను అందించాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలి. ప్రభుత్వానికి జవాబుదారీ. ఒకవేళ అనుమతుల జారీలో అధికారి ఆలస్యం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ► కొనుగోలుదారులు చెల్లించే సొమ్ములో 70 శాతం ఎస్క్రో ఖాతాలో భద్రంగా ఉండగా.. ఆదాయపు పన్ను రిటర్న్, ఆడిట్ బ్యాలెన్స్ షీట్స్ వంటివి వెబ్సైట్లలో పొందుపర్చడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే సంస్థ ఆదాయ వివరాలు బహిర్గతమై రకరకాల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. పైగా ఈ తరహా నిబంధనతో చిన్న, మధ్యస్త డెవలపర్లు ఇబ్బందులకు లోనవుతారు. ఎదగలేరు కూడా. ఆయా వివరాలు రెరా ట్రిబ్యునల్‌కు మాకెలాంటి ఇబ్బంది లేదు -
పన్నులు తగ్గిస్తేనే!
• అధిక పన్నులే స్థిరాస్తిలో నల్లధనానికి కారణం • తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో అధిక పన్నుల భారం వల్లే న్యాయ సంపాదన కూడా నల్లధనంగా మారుతోందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అంటోంది. ప్రత్యేకించి వ్యవసాయ భూముల లావాదేవీల్లో ఎక్కువ శాతం జరుగుతోందని టీబీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి చెప్పారు. వారసత్వంగా వచ్చిందో లేక పైసా పైసా కూడబెట్టో సంపాదించుకున్న భూమిని విక్రరుుస్తున్నప్పుడు రకరకాల పన్నుల పేరిట 20-30 శాతం చార్జీలు చెల్లించాలంటే సామాన్యుడికి ఒంటపట్టట్లేదు. లేకపోతే ఈ పన్నును కూడా కొనుగోలుదారుణ్నే కట్టమంటాడు. అప్పటికే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని భరించిన కొనుగోలుదారుడు ఆదాయ పన్ను కూడా కట్టమంటే ససేమిరా అనక తప్పని పరిస్థితి. ఇద్దరూ కాదనడం వల్లే సక్రమ సొమ్ము కాస్త నల్లధనంగా మారుతోందని వివరించారాయన. అందుకే పన్నుల భారాన్ని తగ్గిస్తే స్థిరాస్తి రంగంలో లావాదేవీలు పారదర్శకంగా జరుగుతాయని సూచించారు. ఇంకా వారేమంటున్నారంటే.. ⇔ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న పన్నుల భారాన్ని 50 శాతానికి తగ్గిస్తే నిర్మాణ రంగంలో లావాదేవీలు పారదర్శకంగా జరుగుతారుు. గృహాలు, వాణిజ్య సముదాయాల ధరలు అందుబాటులోకి వస్తే కొనుగోళ్లు పెరిగి ప్రభుత్వం ఆదాయమూ అధికమవుతుంది. ⇔ వ్యాట్ 1.25, సర్వీస్ ట్యాక్స్ 4.5 శాతం, స్టాంప్ డ్యూటీ 6 శాతం ఇవన్నీ కలిపి 11.75 శాతంగా ఉంది. దీన్ని సగానికి తగ్గించాలి. ప్రత్యేకించి స్టాంప్ డ్యూటీని 2 శాతానికి తగ్గిస్తే సామాన్యులు సైతం రిజిస్ట్రేషన్ చేరుుంచుకునేందుకు ముందుకొస్తారు. ⇔ కేంద్రం పరిధిలో 25 శాతంగా ఉన్న ఆదాయ పన్నును కాస్త 5-8 శాతానికి తగ్గించాలి. ⇔ దశాబ్దం క్రితం 7-7.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లు కాస్త ఇప్పుడు 9.25-9.75 శాతానికి పెరిగారుు. వీటిని కూడా 5 శాతానికి తగ్గించాలి. నిర్మాణ రంగం మందగిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఉద్యోగాల కోత మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వమే స్తంభించిపోతుంది. ⇔ రైతులు, చిన్న వ్యాపారులు, వర్తకులు, కాంట్రాక్టర్ల వంటి వారందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు. వీరూ రుణాలకు అర్హత పొందుతారు. బ్యాంక్ రుణాల విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్ల కోత కారణంగా ఈఎంఐ తగ్గుతుంది.