పన్నులు తగ్గిస్తేనే! | want tax drops in reality sector | Sakshi
Sakshi News home page

పన్నులు తగ్గిస్తేనే!

Published Sat, Dec 10 2016 2:00 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

పన్నులు తగ్గిస్తేనే! - Sakshi

పన్నులు తగ్గిస్తేనే!

అధిక పన్నులే స్థిరాస్తిలో నల్లధనానికి కారణం
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో అధిక పన్నుల భారం వల్లే న్యాయ సంపాదన  కూడా నల్లధనంగా మారుతోందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అంటోంది. ప్రత్యేకించి వ్యవసాయ భూముల లావాదేవీల్లో ఎక్కువ శాతం జరుగుతోందని టీబీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి చెప్పారు. వారసత్వంగా వచ్చిందో లేక పైసా పైసా కూడబెట్టో సంపాదించుకున్న భూమిని విక్రరుుస్తున్నప్పుడు రకరకాల పన్నుల పేరిట 20-30 శాతం చార్జీలు చెల్లించాలంటే సామాన్యుడికి ఒంటపట్టట్లేదు.

లేకపోతే ఈ పన్నును కూడా కొనుగోలుదారుణ్నే కట్టమంటాడు. అప్పటికే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని భరించిన కొనుగోలుదారుడు ఆదాయ పన్ను కూడా కట్టమంటే ససేమిరా అనక తప్పని పరిస్థితి. ఇద్దరూ కాదనడం వల్లే సక్రమ సొమ్ము కాస్త నల్లధనంగా మారుతోందని వివరించారాయన. అందుకే పన్నుల భారాన్ని తగ్గిస్తే స్థిరాస్తి రంగంలో లావాదేవీలు పారదర్శకంగా జరుగుతాయని సూచించారు. ఇంకా వారేమంటున్నారంటే..

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న పన్నుల భారాన్ని 50 శాతానికి తగ్గిస్తే నిర్మాణ రంగంలో లావాదేవీలు పారదర్శకంగా జరుగుతారుు. గృహాలు, వాణిజ్య సముదాయాల ధరలు అందుబాటులోకి వస్తే కొనుగోళ్లు పెరిగి ప్రభుత్వం ఆదాయమూ అధికమవుతుంది.

వ్యాట్ 1.25, సర్వీస్ ట్యాక్స్ 4.5 శాతం, స్టాంప్ డ్యూటీ 6 శాతం ఇవన్నీ కలిపి 11.75 శాతంగా ఉంది. దీన్ని సగానికి తగ్గించాలి. ప్రత్యేకించి స్టాంప్ డ్యూటీని 2 శాతానికి తగ్గిస్తే సామాన్యులు సైతం రిజిస్ట్రేషన్ చేరుుంచుకునేందుకు ముందుకొస్తారు.

కేంద్రం పరిధిలో 25 శాతంగా ఉన్న ఆదాయ పన్నును కాస్త 5-8 శాతానికి తగ్గించాలి.

దశాబ్దం క్రితం 7-7.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లు కాస్త ఇప్పుడు 9.25-9.75 శాతానికి పెరిగారుు. వీటిని కూడా 5 శాతానికి తగ్గించాలి. నిర్మాణ రంగం మందగిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఉద్యోగాల కోత మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వమే స్తంభించిపోతుంది.

రైతులు, చిన్న వ్యాపారులు, వర్తకులు, కాంట్రాక్టర్ల వంటి వారందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు. వీరూ రుణాలకు అర్హత పొందుతారు. బ్యాంక్ రుణాల విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్ల కోత కారణంగా ఈఎంఐ తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement