విజయ డెయిరీ పునర్ వైభవానికి కృషి చేస్తా
పాడి పరిశ్రమ సహకారాభివృద్ధి సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పాడి రైతుల సంక్షేమం కోసం విజయ డెయిరీ పునర్ వైభవానికి కృషి చేస్తానని కొత్తగా నియమితు లైన తెలంగాణ పాడిపరిశ్రమ సహకారాభివృద్ధి సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి స్పష్టం చేశారు. బుధ వారం హైదరాబాద్ లాలాపేటలోని విజయభవన్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. విజయభవన్ ఎదుట ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు.
పాడి రైతులను ఆదుకునే క్రమంలో లీటరు పాలపై రూ. 4 ప్రోత్సాహాకాన్ని సీఎం అందిస్తున్నారని లోక భూమారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి.నగేశ్, శాసనసభ్యులు బాపూరావు, విఠల్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పురాణం సతీశ్, సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, జడ్పీటీసీ నాగేశ్వరరావు, ముఠాగోపాల్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్ర మంలో కార్మిక సంఘం నాయకులు యాదయ్య, విజయ డెయిరీ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్‌మురళి, జీఎంలు దేవీదాస్, ప్రవీణ్, రమేశ్, డీడీలు మధు సూదన్‌రావు, కృష్ణస్వామి, వివిధ జిల్లాల నుంచి పాడి రైతులు పాల్గొన్నారు.