Telangana Electricity Trade Unions Front
-
23 తర్వాత సమ్మె.. మరో హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యా లతో మంగళవారం సాయంత్రం విద్యుత్ సౌధలో జరిపిన చర్చలు విఫలమయ్యాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీటఫ్) ప్రకటించింది. గతంలో ప్రకటించిన విధంగా మంగళవారం మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నెల 23న వరంగల్‌లో మహాసభ నిర్వహించి సమ్మెపై ప్రకటన చేస్తామని టీటఫ్ చైర్మన్ ఎన్.పద్మారెడ్డి, కన్వీనర్ ఇ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలి పారు. 23వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లుగా విలీనమైన ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఏపీఎస్ ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేస్తే న్యాయపర ఇబ్బందులు ఎదు రవుతాయని యాజమాన్యం తేల్చి చెప్పడంతోపాటు ఇతర డిమాండ్ల దాటవేత వైఖరిని ప్రదర్శించడంతో చర్చల నుంచి టీటఫ్ నేతలు వైదొలిగామన్నారు. విద్యుత్ సంస్థల యాజ మాన్యాల తరఫున ట్రాన్స్‌కో జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు నేతృత్వంలో డైరెక్టర్ల బృందం టీటఫ్‌తో గంట పాటు చర్చలు నిర్వ హించింది. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ వర్తింప జేయడం సాధ్యం కాదని, వీటికి బదులుగా స్టాండింగ్ ఆర్డర్స్‌ను వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ఆర్టిజన్లకు మూలవేతనాన్ని త్వరలో ఖరారు చేస్తామని, డీఏ స్థానంలో వీడీఏ పాయింట్లు ఇస్తామని, చనిపోయిన ఆర్టిజన్ల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని పేర్కొంది. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయడంతో పాటు డీఏ, టీఏ, హెచ్ఆర్ఏ, పీఆర్సీని వర్తింపజేయాలని చర్చల్లో టీటఫ్ పట్టుబట్టింది. 1999 ఫిబ్రవరి 1 నుంచి సర్వీసులో చేరిన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ పెన్షన్ పథకాన్ని వర్తింపజేయాలన్న డిమాండ్‌పై సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో చర్చించాల్సి ఉందని, ఇందుకు సమయం కావాలని అధికారులు కోరారు. యాజమాన్యాలపై గౌరవ భావంతో ఈ నెల 11న వరంగల్‌లో నిర్వహించాల్సిన ధర్నాను విరమించుకుని చర్చలకు వస్తే తమకు అన్యాయమే జరిగిందని టీటఫ్ పేర్కొంది. చర్చల సందర్భంగా యాజమాన్యం స్పందన సరిగా లేదని ఆరోపించింది. చర్చల్లో టీటఫ్ చైర్మన్ ఎన్.పద్మారెడ్డి, కన్వీనర్ ఈ.శ్రీధర్, కో చైర్మెన్ ఎంఏ వజీర్, కో కన్వీనర్లు ఎస్.శ్రీధర్ గౌడ్, కె.కుమారస్వామి, జి.సాయిబాబా, మజీద్, గంబో నాగరాజు, సాయిలు పాల్గొన్నారు. చర్చలు సఫలం..: టీఆర్ఎస్కేవీ విద్యుత్ సంస్థలతో చర్చలు విఫలమైనట్లు 21 సంఘాలతో ఏర్పడిన టీటఫ్ ప్రకటించగా, చర్చలు సఫలమయ్యాయని అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) ప్రకటించింది. ఆర్టిజన్లకు స్టాండింగ్ రూల్స్ అమలుకు తాము సానుకూలంగా ఉన్నామని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం హామీనిచ్చిందని టీఆర్వీకేఎస్ నేతలు ప్రకాశ్‌రావు, జాన్సన్, సీహెచ్ రమేశ్‌లు పేర్కొన్నారు. -
‘విద్యుత్’ సమ్మె ఉపసంహరణ
► ప్రభుత్వం, ట్రేడ్ యూనియన్ల మధ్య చర్చలు సఫలం ► దశలవారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ► మార్చి 31లోగా మార్గదర్శకాలు ► నేరుగా వేతనాలపై సీఎం దగ్గర మరోసారి సమావేశం ► ట్రేడ్ యూనియన్లు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం సాక్షి, హైదరాబాద్: అపరిష్కృత డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగాలని ఇచ్చిన పిలుపును తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స ఫ్రంట్ (టీఈటీయూఎఫ్) ఉపసంహరించుకుంది. 13 కార్మిక సంఘాలు ఫ్రంట్‌గా ఏర్పడి సమ్మెకు పిలుపునివ్వగా, ఇందులోని 1104, 327, తెలుగునాడు కార్మిక సంఘాలు శనివారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డితో చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రాన్సకో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదివారం మిగిలిన 9 సంఘాల నేతలతో చర్చలు జరిపి సమ్మె విరమణకు ఒప్పించారు. రిజర్వేషన్లు, స్థానికత నిబంధనల వల్ల క్రమబద్ధీకరణకు అర్హత సాధించని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఈ 9 కార్మిక సంఘాలు కోరగా, ఈ అంశంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామని ట్రాన్సకో సీఎండీ కార్మిక నేతలకు హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 10 లక్షల బీమా సాధ్యమైనంత త్వరగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని యాజమాన్యాలు తెలిపాయి. అదేవిధంగా జెన్కో విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రమాదాల్లో మృతి చెందితే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు అంగీకరించాయి. జెన్కో ప్లాంట్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 12 శాతం ప్రత్యేక అలవెన్స చెల్లిస్తామన్నాయి. కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లుగా విధుల్లో చేరిన కాలం నుంచే జూనియర్ లైన్మెన్లకు నోషనల్ ఫిక్సేషన్ ఇస్తామని హామీ ఇచ్చాయి. 1999-2004 మధ్య కాలంలో నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పన అంశాన్ని మళ్లీ ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపాయి. మార్చి 31లోగా ‘క్రమబద్ధీకరణ’ మార్గదర్శకాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శ కాలను వచ్చే ఏడాది మార్చి 31లోగా జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చారుు. తెలంగాణ ట్రాన్సకో, జెన్కో, డిస్కంల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆదివారం ఆయా సంస్థల యాజమాన్యాలు, టీఈటీయూ ఎఫ్ నేతల మధ్య రాతపూర్వకంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో.. సీఎం కేసీఆర్ హామీ మేరకు దశల వారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని యాజ మాన్యాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన 8,800 సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులు, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మరో 5,816 కొత్త పోస్టులతో ఔట్ సోర్సింగ్ ఉద్యో గుల క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చాయి. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను 2017 మార్చి 31లోగా జారీ చేస్తామని తెలిపారుు.