‘విద్యుత్’ సమ్మె ఉపసంహరణ
► ప్రభుత్వం, ట్రేడ్ యూనియన్ల మధ్య చర్చలు సఫలం
► దశలవారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
► మార్చి 31లోగా మార్గదర్శకాలు
► నేరుగా వేతనాలపై సీఎం దగ్గర మరోసారి సమావేశం
► ట్రేడ్ యూనియన్లు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: అపరిష్కృత డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగాలని ఇచ్చిన పిలుపును తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్‌స ఫ్రంట్ (టీఈటీయూఎఫ్) ఉపసంహరించుకుంది. 13 కార్మిక సంఘాలు ఫ్రంట్‌గా ఏర్పడి సమ్మెకు పిలుపునివ్వగా, ఇందులోని 1104, 327, తెలుగునాడు కార్మిక సంఘాలు శనివారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డితో చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రాన్‌సకో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదివారం మిగిలిన 9 సంఘాల నేతలతో చర్చలు జరిపి సమ్మె విరమణకు ఒప్పించారు. రిజర్వేషన్లు, స్థానికత నిబంధనల వల్ల క్రమబద్ధీకరణకు అర్హత సాధించని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఈ 9 కార్మిక సంఘాలు కోరగా, ఈ అంశంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామని ట్రాన్‌సకో సీఎండీ కార్మిక నేతలకు హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది.
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 10 లక్షల బీమా
సాధ్యమైనంత త్వరగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని యాజమాన్యాలు తెలిపాయి. అదేవిధంగా జెన్‌కో విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రమాదాల్లో మృతి చెందితే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు అంగీకరించాయి. జెన్‌కో ప్లాంట్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 12 శాతం ప్రత్యేక అలవెన్‌స చెల్లిస్తామన్నాయి. కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మెన్లుగా విధుల్లో చేరిన కాలం నుంచే జూనియర్ లైన్‌మెన్లకు నోషనల్ ఫిక్సేషన్ ఇస్తామని హామీ ఇచ్చాయి. 1999-2004 మధ్య కాలంలో నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పన అంశాన్ని మళ్లీ ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపాయి.
మార్చి 31లోగా ‘క్రమబద్ధీకరణ’ మార్గదర్శకాలు
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శ కాలను వచ్చే ఏడాది మార్చి 31లోగా జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చారుు. తెలంగాణ ట్రాన్‌సకో, జెన్‌కో, డిస్కంల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆదివారం ఆయా సంస్థల యాజమాన్యాలు, టీఈటీయూ ఎఫ్ నేతల మధ్య రాతపూర్వకంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో.. సీఎం కేసీఆర్ హామీ మేరకు దశల వారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని యాజ మాన్యాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన 8,800 సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులు, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మరో 5,816 కొత్త పోస్టులతో ఔట్ సోర్సింగ్ ఉద్యో గుల క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చాయి. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను 2017 మార్చి 31లోగా జారీ చేస్తామని తెలిపారుు.