telangana pradesh committee
-
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్‌గా పదవి చేపట్టారు. ఇక నేడు రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో... జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో గాంధీ భవన్ వద్ద సందడి నెలకొంది. కాగా అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకంపై ఆది నుంచి అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వి. హనుమంతారావు విడిగా గాంధీ భవన్‌కు చేరుకున్నారు. కాగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం జరుగుతున్న సమయంలో, కొంతమంది కార్యకర్తలు సమావేశ ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. బారీకేడ్స్ ధ్వంసం చేసి, కుర్చీలను చిందరవందరగా పడేశారు. -
పండుగ వేళ చావుడప్పులా?
రైతు కుటుంబాలకు భరోసా కల్పించండి: టీపీసీసీ సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ వేళ రాష్ట్రంలో చావు డప్పులు మోగుతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అయినా బాధిత కుటుంబాలను పరామర్శించే పాలకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ఉపనేతలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో ఇప్పటికే 200 మందికిపైగా చనిపోయారని పొన్నాల వాపోయారు. తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రాష్ట్రానికి రప్పించి ఆర్థికసాయం అందించడమే కాకుండా అధికారంలోకి వస్తే ఆదుకుంటామనే భరోసా కల్పించామని ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అమలుగాక, కొత్తగా రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఇకనైనా స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి మాట్లాడుతూ, రైతులకు భరోసా కల్పించి ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరారు. ‘స్థానిక కాంగ్రెస్ నేతలు రైతులకు ఆర్థికసాయం చేస్తున్నారు. అవసరమైనప్పుడు మేం వెళ్లి పరామర్శిస్తాం’ అని పొన్నాల బదులిచ్చారు. గాంధీజీ, శాస్త్రీజీ జయంతి వేడుకలు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో బాపూజీ,శాస్త్రీజీల చిత్రపటాలకు టీపీసీసీ నేతలు పొన్నాల,జానారెడ్డి, షబ్బీర్‌అలీ,సుధాకర్‌రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడారు. -
రాజధానిలో కాంగ్రెస్ నాయకుల రగడ
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇప్పటి వరకు జిల్లాకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ లొల్లి ఇప్పుడు రాజధానికి చేరింది. ఆధిపత్య పోరు, అనుచరుల కోసం ఆరాటం, అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం తదితర విషయాలతో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో రసాభాసగా మారింది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని, జిల్లాలో దశాబ్దాల తరబడి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల వచ్చిన నాయకుల మాటలకు విలువ ఇవ్వడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలు చేసిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కూడా తెలియకుండా పదవులు కట్టబెట్టడం, హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లి పదవులు తెచ్చుకోవడంతో పార్టీలో పలువురు నాయకులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని.. ఇలా అయితే పార్టీ భవిష్యత్ దెబ్బతింటుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో తెలంగాణలోని పది జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి వారి బలాబలాలు, గెలుపోటములపై సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోరం కనకయ్య, వగ్గెల మిత్రసేన, కుంజా సత్యవతి, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, పార్టీ జిల్లా ఇన్చార్జ్ వట్టి కుసుమ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా పార్టీ వ్యవహారం, నియామకాలపై అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో ఇంతకాలం పని చేసిన వారికి కాకుండా ఎవరో చెప్పిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇటీవల వేసిన జిల్లా సమన్వయ కమిటీని కూడా ఇష్టాను సారంగా వేశారని, దీంతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని ఆరోపించినట్లు తెలిసింది. పార్టీని నమ్ముకొని ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కడి నుంచో వచ్చి ఖమ్మంలో పెత్తనం చేసే వారికి ప్రాధాన్యం ఇస్తే స్థానిక నాయకులను కించపరిచినట్లే అవుతుందని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై మండిపడినట్లు తెలిసింది. ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు కూడా తెలియకుండా పార్టీలోని పదవులను కట్టబెడుతున్నారని, ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లి పదవులు తెచ్చుకుంటే స్థానిక నాయకులకు విలువ ఏం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికంటే పార్టీకి నష్టం చేసే వారికే ప్రాధాన్యం ఉంటోందని, ఇలా అయితే పార్టీ అభ్యర్థులు ఎలా గెలుస్తారని టీపీసీసీ నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అందరిని కలుపుకుపోయే వారిని నియమించాలని జిల్లా నాయకులు కోరినట్లు సమాచారం. అదేవిధంగా పార్టీ కార్యాలయ నిర్వహణలో కూడా మార్చులు తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. నిర్వాహకులు పులిపాటి వెంకయ్య ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఒంటెత్తు పోకడతో కార్యకర్తలకు ఇబ్బందిగా ఉందని టీపీసీసీ ముందు పలువురు నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయనను తొలగించాలని పలువురు నాయకులు పట్టుబట్టినట్లు సమాచారం. ఈనెల 10, 11న సమీక్షా సమావేశాలు ఈనెల 10, 11 తేదీల్లో పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ వట్టి కుసుమ కుమార్ తెలిపారు. 10వ తేదీన డీసీపీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులు, అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జెడ్పీటీసీ అభ్యర్థులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా 11వ తేదీ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆయా ప్రాంతాలకు చెందిన నియోకవర్గ ఇన్‌చార్జ్‌లు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌన్సిలర్లతో ఆయా మున్సిపల్ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు కుసుమ కుమార్ చెప్పారు. -
53 మందితో మేనిఫెస్టో.. 37 మందితో ప్రచార కమిటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో, ప్రచార కమిటీలను నియమించారు. 53 వుంది సభ్యులతో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వూజీ ఉప వుుఖ్యవుంత్రి దామోదర రాజనర్సింహ, 37వుంది సభ్యులతో ఏర్పాటైన ప్రచార కమిటీకి వూజీవుంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యు ఆదేశాలు జారీచేశారు. టీపీసీసీ అనుబంధ సంఘాలకు చెందిన 15 మంది నాయుకులకు ఇరుకమిటీల్లో చోటు కల్పించారు. అదేవిధంగా 2009 ఎన్నికల్లో ప్రచార కమిటీలో ఉన్న 15 మంది నాయకులను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో చేర్చారు. వీరికితోడు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేష్‌షెట్కార్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.యాదవరెడ్డి, భానుప్రసాద్, కె.ఆర్.ఆమోస్, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి, సుల్తాన్ అహ్మద్, రెడ్యానాయక్, సీహెచ్.ఉమేశ్‌రావు, అద్దంకి దయాకర్ ప్రచారకమిటీలో సభ్యులుగా ఉన్నారు. మేనిఫెస్టో కమిటీ విషయానికొస్తే..పార్టీ సీనియర్ నేతలందరికీ చోటు కల్పించారు. ఎం.సత్యనారాయణరావు, వి.హనుమంతరావు, పి.నర్సారెడ్డి, డి.శ్రీనివాస్, కె.జానారెడ్డి, జె.గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కె.ఆర్.సురేష్‌రెడ్డితోపాటు పలువురు సిట్టింగ్ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారిలో ఉన్నారు. అలాగే ఉస్మానియా వర్శిటీ మాజీ వైఎస్ చాన్సలర్ డాక్టర్ టి.తిరుపతిరావు, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ఎంవీరాజేశ్వరరావు (ఫాప్సీ), శేఖర్‌రెడ్డి(క్రెడాయి) ఉప్పల శ్రీనివాస్ (జేఏసీ), ప్రొఫెసర్ మురళీ మనోహర్, కట్టాముత్యంరెడ్డి, ప్రొఫెసర్ కిషన్‌రావు, ప్రొఫెసర్ బీవీ శర్మ, ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఎం.శ్రీనివాసరెడ్డిలను కూడా మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా నియమిం చారు. కొత్తగా ఏర్పాటైన ఈ రెండు కమిటీల సభ్యులతో శుక్రవారం పొన్నాల సమావేశం కానున్నారు.