సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో, ప్రచార కమిటీలను నియమించారు. 53 వుంది సభ్యులతో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వూజీ ఉప వుుఖ్యవుంత్రి దామోదర రాజనర్సింహ, 37వుంది సభ్యులతో ఏర్పాటైన ప్రచార కమిటీకి వూజీవుంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యు ఆదేశాలు జారీచేశారు. టీపీసీసీ అనుబంధ సంఘాలకు చెందిన 15 మంది నాయుకులకు ఇరుకమిటీల్లో చోటు కల్పించారు.
అదేవిధంగా 2009 ఎన్నికల్లో ప్రచార కమిటీలో ఉన్న 15 మంది నాయకులను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో చేర్చారు. వీరికితోడు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేష్‌షెట్కార్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.యాదవరెడ్డి, భానుప్రసాద్, కె.ఆర్.ఆమోస్, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి, సుల్తాన్ అహ్మద్, రెడ్యానాయక్, సీహెచ్.ఉమేశ్‌రావు, అద్దంకి దయాకర్ ప్రచారకమిటీలో సభ్యులుగా ఉన్నారు.
మేనిఫెస్టో కమిటీ విషయానికొస్తే..పార్టీ సీనియర్ నేతలందరికీ చోటు కల్పించారు. ఎం.సత్యనారాయణరావు, వి.హనుమంతరావు, పి.నర్సారెడ్డి, డి.శ్రీనివాస్, కె.జానారెడ్డి, జె.గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కె.ఆర్.సురేష్‌రెడ్డితోపాటు పలువురు సిట్టింగ్‌ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారిలో ఉన్నారు. అలాగే ఉస్మానియా వర్శిటీ మాజీ వైఎస్ చాన్సలర్ డాక్టర్ టి.తిరుపతిరావు, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ఎంవీరాజేశ్వరరావు (ఫాప్సీ), శేఖర్‌రెడ్డి(క్రెడాయి) ఉప్పల శ్రీనివాస్ (జేఏసీ), ప్రొఫెసర్ మురళీ మనోహర్, కట్టాముత్యంరెడ్డి, ప్రొఫెసర్ కిషన్‌రావు, ప్రొఫెసర్ బీవీ శర్మ, ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఎం.శ్రీనివాసరెడ్డిలను కూడా మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా నియమిం చారు. కొత్తగా ఏర్పాటైన ఈ రెండు కమిటీల సభ్యులతో శుక్రవారం పొన్నాల సమావేశం కానున్నారు.