రైతు కుటుంబాలకు భరోసా కల్పించండి: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ వేళ రాష్ట్రంలో చావు డప్పులు మోగుతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అయినా బాధిత కుటుంబాలను పరామర్శించే పాలకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ఉపనేతలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో ఇప్పటికే 200 మందికిపైగా చనిపోయారని పొన్నాల వాపోయారు.
తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రాష్ట్రానికి రప్పించి ఆర్థికసాయం అందించడమే కాకుండా అధికారంలోకి వస్తే ఆదుకుంటామనే భరోసా కల్పించామని ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అమలుగాక, కొత్తగా రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఇకనైనా స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి మాట్లాడుతూ, రైతులకు భరోసా కల్పించి ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరారు. ‘స్థానిక కాంగ్రెస్ నేతలు రైతులకు ఆర్థికసాయం చేస్తున్నారు. అవసరమైనప్పుడు మేం వెళ్లి పరామర్శిస్తాం’ అని పొన్నాల బదులిచ్చారు.
గాంధీజీ, శాస్త్రీజీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో బాపూజీ,శాస్త్రీజీల చిత్రపటాలకు టీపీసీసీ నేతలు పొన్నాల,జానారెడ్డి, షబ్బీర్‌అలీ,సుధాకర్‌రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడారు.
పండుగ వేళ చావుడప్పులా?
Published Fri, Oct 3 2014 2:20 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement