Telangana President
-
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ
Updates.. సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ►ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు కిషన్రెడ్డిక ఖడ్గం అందించారు. దీంతో, ఆయన చార్మినార్ ముందు ఖడ్గం ఎత్తి చూపించారు. అనంతరం.. అంబర్‌పేటకు బయలుదేరారు. ► అయితే, తెలంగాణలో బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి టెంపుల్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మొదట బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్‌కి వెళ్లి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు కిషన్‌రెడ్డి కూడా బండి రూట్లోనే వెళ్లారు. ► ఇదిలా ఉండగా.. కిషన్‌రెడ్డి నాలుగోసారి బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఇక, కిషన్‌రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, ప్రత్యేక తెలంగాణలో 2014లో ఒకసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ► కాగా, కిషన్‌రెడ్డి ఉదయం 11.45 గంటలకు పార్టీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ హాజరవుతారు. ► బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. -
ఢిల్లీ చేతుల్లో కమల దళపతి ఎంపిక!
► రాష్ట్ర నేతల్లో కుదరని ఏకాభిప్రాయం ► సారథి పీఠం పల్లెకా.. పట్నానికా..? సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి వారంలో కొత్త సారథి ఎంపిక కానున్నారు. అధిష్టానం పెద్దలు ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలతో వ్యక్తిగతంగా సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీ కోర్‌కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీల అధ్యక్షులతో రాష్ట్రపార్టీ ఇన్చార్జి కృష్ణదాసు విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జిల్లాల్లో పార్టీ బలాబలాలు, రాష్ట్ర పార్టీ ముఖ్యుల మధ్య సంబంధాలు, కార్యకర్తల అభిప్రాయాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై ప్రతీ రాష్ట్ర నాయకుడు కృష్ణదాసుకు నివేదికలు సమర్పించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారన్న అంశంపై నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను జాతీయ పార్టీయే తీసుకోనుంది. జాతీయపార్టీలో ఎవరెవరు? బీజేపీ జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన పి.మురళీధర్‌రావు ఉన్నారు. ఆయనను జాతీయ కమిటీలోనే కొనసాగిస్తే మరో నాయకుడికి అవకాశం ఉండదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం(ఆరేళ్లు) పనిచేసిన జి.కిషన్‌రెడ్డికి అదేస్థాయిలో ఎక్కడ అవకాశం కల్పిస్తారనేది మరో ప్రశ్న. పి.మురళీధర్‌రావుతోపాటు పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కొనసాగుతున్న కె.లక్ష్మణ్ పేర్లు అధిష్టానం మదిలో ఉన్నట్టు ముఖ్యనేతలు చెబుతున్నారు. మురళీధర్‌రావును ఒప్పించి జాతీయపార్టీలోకి కిషన్‌రెడ్డిని తీసుకునే అవకాశాలున్నాయని మరోనాయకుడు వెల్లడించారు. ఈ ఇద్దరు ముందుకురాని పక్షంలో పార్టీలో మిగతా రాష్ట్ర నేతల మధ్య తీవ్రంగా పోటీ నెలకొంటుంది. పల్లె ప్రాంతానికా.. పట్నానికా..? రాష్ట్ర పార్టీ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన పార్టీ అనే విమర్శ ఉంది. గ్రామీణ ప్రాంతాలపై అవగాహన, పల్లె ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేయాలనే పట్టుదల లేకపోవడం వల్లనే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించలేకపోతున్నదని జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఎదగడానికి చాలా అవకాశాలున్నాయని వాదిస్తున్నారు. జిల్లాల నేతలకు అవకాశం ఇవ్వాలని, దీనివల్ల పల్లె ప్రాంతాల్లో పార్టీ బలం పెరుగుతుందంటున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. పి.మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్‌లు పార్టీ పగ్గాలను చేపట్టడానికి విముఖంగా ఉంటే పోటీ తీవ్రంగానే ఉంది. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్లు పేరాల చంద్రశేఖర్‌రావు, ఆచారి వంటి నేతల పేర్లను రాష్ట్ర పార్టీ నేతలు ప్రతిపాదించారు. -
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషన్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో కీలక పదవి వరించనుంది. కిషన్‌రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గంలో 5 ప్రధాన కార్యదర్శులు, 5 ఉపాధ్యక్ష పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కార్యదర్శులు జేపీ నడ్డా, రాజీవ్‌ప్రతాప్ రూడీ, రాంశంకర్ ఖతేరియాలతో పాటు ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, ముక్తార్‌అబ్బాస్ నక్వీలను కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరితో ఏర్పాటైన ఖాళీలతో పాటు అంతకు ముందు నుంచే ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల భర్తీకి అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, హర్యానా నుంచి డాక్టర్ అనిల్ జైన్, మధ్యప్రదేశ్ నుంచి కైలాస్ విజయ్‌వర్గీయలతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరిని ప్రధాన కార్యదర్శులుగా నియమించడానికి పేర్లు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. కాగా తెలంగాణ నుంచి పి.మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్‌మాధవ్‌లు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.