Kishan Reddy To Take Charge As Telangana BJP President: Live Updates - Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Published Fri, Jul 21 2023 8:54 AM | Last Updated on Fri, Jul 21 2023 4:25 PM

Kishan Reddy Will Take Charge As Telangana BJP President Live Updates - Sakshi

Updates..

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు కిషన్‌రెడ్డిక ఖడ్గం అందించారు. దీంతో, ఆయన చార్మినార్‌ ముందు ఖడ్గం ఎ‍త్తి చూపించారు. అనంతరం.. అంబర్‌పేటకు బయలుదేరారు. 

► అయితే, తెలంగాణలో బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి టెంపుల్‌ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మొదట బండి సంజయ్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌కి వెళ్లి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు కిషన్‌రెడ్డి కూడా బండి రూట్‌లోనే వెళ్లారు.

► ఇదిలా ఉండగా.. కిషన్‌రెడ్డి నాలుగోసారి బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఇక, కిషన్‌రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, ప్రత్యేక తెలంగాణలో 2014లో ఒకసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

► కాగా, కిషన్‌రెడ్డి ఉదయం 11.45 గంటలకు పార్టీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ హాజరవుతారు.

► బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement