'ఎక్కడి వాళ్లు అక్కడే పనిచేసేలా చూడాలి'
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయి 10నెలలైనా ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం దారుణమని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఇప్పటికైనా ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
తెలంగాణ ఉద్యమాన్ని పరిహాసం చేసినవాళ్లు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు తెలంగాణ సచివాలయంలో పనిచేసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణ సచివాలయంలో ఇంకా ఆంధ్రా అధికారులు పనిచేస్తూ ప్రభుత్వానికి మచ్చ తేవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కీలకమైన ఆర్థికశాఖలో ఆంధ్రా ఉద్యోగుల ఆధిపత్యం కొనసాగుతోందని టీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది.