tele marketing
-
ఇబ్బందికర సందేశాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ఇబ్బందికర సందేశాలను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు ప్రారంభించింది. టెలిమార్కెటింగ్ సందేశాల టెంప్లేట్ల దుర్వినియోగంపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ శుక్రవారం ఆదేశించింది. కంపెనీల హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను కొంతమంది టెలిమార్కెటర్లు దుర్వినియోగం చేస్తున్నారని తాము గుర్తించామని తెలిపింది. ‘తాము కోరని వాణిజ్య ప్రకటనలు అందుకోవడం అనేది ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలం. వ్యక్తుల గోప్యతకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రాయ్ తెలిపింది. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018 కింద మెసేజ్ టెంప్లేట్ల దుర్వినియోగాన్ని ఆపడానికి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అధీకృత టెలిమార్కెటింగ్ కంపెనీలు సందేశాల కోసం మొబైల్ నంబర్లకు బదులుగా కంపెనీ పేరును సూచించే హెడర్లను ప్రదర్శిస్తాయి. టెలిమార్కెటింగ్ సందేశాల శీర్షికలు, కంటెంట్ టెంప్లేట్ల విధానంలో (కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్) మార్పులు చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇతర కంపెనీల పేర్లను పోలిన మెసేజ్ టైటిల్స్, హెడర్లు వినియోగదార్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ లాభాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది. బ్లాక్‌చెయిన్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదైన అన్ని హెడర్లను 30 రోజుల్లోపు తిరిగి ధృవీకరించాలని.. ధృవీకరించని హెడర్లను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. 30 రోజుల పాటు ఉపయోగించని అన్ని హెడర్లను తాత్కాలికంగా నిష్క్రియం (డీయాక్టివేట్) చేయడానికి 60 రోజుల్లోపు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. -
ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ చేస్తే, భారీ జరిమానా: ట్రాయ్
సాక్షి, న్యూఢిల్లీ: అవాంఛనీయ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు నిబంధనలను కఠినతరం చేసింది. రూ.10,000 వరకు జరిమానా విధింపుతోపాటు, టెలీమార్కెట్లకు కనెక్షన్ల తొలగింపు కూడా ఇందులో భాగంగా ఉండనుంది. మళ్లి మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదని ట్రాయ్ హెచ్చరించింది. 50 ఉల్లంఘనల తరువాత టెలిమార్కెటర్లు చేసే ప్రతీకాల్, లేదా ఎస్ఎంఎస్కు రూ. 10వేల దాకా పెనాల్టీ ఆ తరువాత కూడా ఉల్లంఘన కొనసాగితే, సంబంధిత ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లను రెండేళ్లపాటు బ్లాక్ చేయనుంది. ‘‘టెలికం చందాదారులు ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా ఉండేందుకు ‘ఎస్ఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1909’కు పంపించాలి. దీంతో లావాదేవీల సమాచారం మినహా అన్ని రకాల ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది’’అని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) తన నోటీస్‌లో పేర్కొంది. కేంద్ర స్థాయిలో టెలికం శాఖ ఒక డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను (డీఐయూ) ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, లైసెన్స్డ్ సర్వీస్ ప్రాంతంలోని క్షేత్రస్థాయి యూనిట్లలో టెలికం అనలైసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (టీఏఎఫ్‌సీవోపీ)ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నాయి. జరిమానాలు.. ట్రాయ్ విడుదల చేసిన నోటీస్ ప్రకారం.. రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ నుంచి అవాంఛనీయ వాణిజ్య సమాచారం వినియోగదారులకు వెళితే పలు రకాల పెనాల్టీలను విధించనున్నారు. తొలుత రూ.1,000 జరిమానాతో సరిపెట్టి.. ఆ తర్వాత నిబంధన ఉల్లంఘనకు రూ.5,000 చొప్పున జరిమానా విధించడంతోపాటు.. కనెక్షన్ రద్దు చేయడానికి సంబంధించి హెచ్చరిక జారీ అవుతుంది. మూడో ఉల్లంఘనను గుర్తిస్తే రూ.10,000 జరిమానాతోపాటు కనెక్షన్‌ను కూడా రద్దు చేయనున్నారు. ఇక నమోదు చేసుకోని టెలీమార్కెటర్ నుంచి అవాంఛనీయ కాల్ లేదా సందేశం వస్తే.. సంబంధిత టెలికం కనెక్షన్‌ను గుర్తిస్తారు. రోజుకు 20 కాల్స్, 20ఎస్ఎంఎస్ల పరిమితి అమల్లోకి వస్తుంది. గుర్తింపు ధ్రువీకరణ పూర్తయ్యే వరకూ డేటా వినియోగానికి అవకాశం ఉండదు. సిమ్‌లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ గైడ్‌లైన్స్ 2018 కింద అమలు చేయాల్సి ఉంటుందని ట్రాయ్ పేర్కొంది. -
బల్క్ ఎస్ఎంఎస్లపై మూడు రోజుల గడువు
న్యూఢిల్లీ: వినియోగదార్లకు బల్క్ ఎస్ఎంఎస్లు పంపే కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు టెలి మార్కెటింగ్ నిబంధనలకు అనుగుణంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇందుకు మూడు రోజుల గడువు ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. నమోదు చేయని పక్షంలో కస్టమర్లకు వాణిజ్యపర సమాచారం పంపకుండా నిరోధిస్తామని హెచ్చరించింది. అంతేగాక విఫలమైన కంపెనీల పేర్లను తమ వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత కూడా నియంత్రణ సంస్థకు అనుగుణంగా నమోదు కానట్టయితే టెలికం వనరులను ఉపయోగించి పెద్దమొత్తంలో సందేశాలను పంపడానికి వారిని అనుమతించరు. బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్ తదితర కంపెనీలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే.. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే కొత్త నిబంధనలను ట్రాయ్ అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వివిధ సంస్థలు పంపే వాణిజ్యపరమైన ఎస్ఎంఎస్లను వినియోగదారులకు చేరవేయడానికి ముందు.. నిర్దిష్ట నమోదిత సందేశం నమూనాతో టెలికం కంపెనీలు సరిపోల్చి, ధృవీకరించుకోవాలి. ఇందుకోసం టెల్కోలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇందులో నమోదైన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే అధికారికమైనవిగా భావించి సమ్మతించిన కస్టమర్లకు పంపుతాయి. నమోదు చేసుకోని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తాయి. ఈ విధానాన్ని ఎస్ఎంఎస్ స్క్రబింగ్‌గా వ్యవహరిస్తారు. కొత్త విధానంపై పరిశ్రమ వర్గాలకు ఇంకా పూర్తి అవగాహన రాకపోవడంతో సోమవారం నుంచి ఎస్ఎంఎస్లు, ఓటీపీల డెలివరీల్లో సమస్యలు తలెత్తాయి. (చదవండి: భయపడొద్దు.. సెల్ టవర్లు సురక్షితమే) -
టెలిఫోన్ వినియోగదారులు @91 కోట్లు
న్యూఢిల్లీ: టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది నవంబర్‌లో స్వల్పంగా పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 90.45 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య అదే ఏడాది నవంబర్‌లో 0.62 శాతం వృద్ధితో 91.01 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరోవైపు అవాంఛిత కాల్స్ విషయంలో టెలీ మార్కెటింగ్ కంపెనీలకు ఊరటినిచ్చే నిర్ణయాన్ని ట్రాయ్ తీసుకుంది. అవాంఛిత కాల్స్ పంపించినందుకు విధించే జరిమానాల్లో భాగంగా ఆ కాల్స్ చేసిన నంబర్‌ను ట్రాయ్ డిస్కనెక్ట్ చేస్తుంది. రూ. 500 చెల్లించి మళ్లీ ఈ నంబర్‌ను చలామణిలోకి తెచ్చుకోవచ్చని ట్రాయ్ వివరించింది. ఇక మొబైల్ వినియోగదారులకు సంబంధించి వివరాలు.. పట్టణ వినియోగదారుల సంఖ్య 60.06 శాతానికి తగ్గగా, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 39.94 శాతానికి పెరిగింది. టెలీడెన్సిటీ 73.69 శాతానికి పెరిగింది. 2013, అక్టోబర్‌లో 87.54 కోట్లుగా ఉన్న వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 2013, నవంబర్‌లో 88.11 కోట్లకు పెరిగింది. వెర్లైస్ సర్వీసులు అందించే మొత్తం కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీల వాటా 88 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ల వాటా 12 శాతంగా ఉంది. కంపెనీ నవంబర్‌లో కొత్త మొత్తం విని.