న్యూఢిల్లీ: టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది నవంబర్‌లో స్వల్పంగా పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 90.45 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య అదే ఏడాది నవంబర్‌లో 0.62 శాతం వృద్ధితో 91.01 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరోవైపు అవాంఛిత కాల్స్ విషయంలో టెలీ మార్కెటింగ్ కంపెనీలకు ఊరటినిచ్చే నిర్ణయాన్ని ట్రాయ్ తీసుకుంది. అవాంఛిత కాల్స్ పంపించినందుకు విధించే జరిమానాల్లో భాగంగా ఆ కాల్స్ చేసిన నంబర్‌ను ట్రాయ్ డిస్‌కనెక్ట్ చేస్తుంది. రూ. 500 చెల్లించి మళ్లీ ఈ నంబర్‌ను చలామణిలోకి తెచ్చుకోవచ్చని ట్రాయ్ వివరించింది. ఇక మొబైల్ వినియోగదారులకు సంబంధించి వివరాలు..
పట్టణ వినియోగదారుల సంఖ్య 60.06 శాతానికి తగ్గగా, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 39.94 శాతానికి పెరిగింది.
టెలీడెన్సిటీ 73.69 శాతానికి పెరిగింది.
2013, అక్టోబర్‌లో 87.54 కోట్లుగా ఉన్న వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 2013, నవంబర్‌లో 88.11 కోట్లకు పెరిగింది.
వెర్లైస్ సర్వీసులు అందించే మొత్తం కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీల వాటా 88 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ల వాటా 12 శాతంగా ఉంది.
కంపెనీ నవంబర్‌లో కొత్త మొత్తం విని.