telecaller job
-
తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్‌చేస్తే న్యూడ్ వీడియో కాల్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తున్న యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెకే శాపంగా మారింది. తన విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వేధింపులు పాలైంది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తోంది. వృత్తిలో భాగంగా నిత్యం అనేక మందితో సంస్థ ఫోన్ నుంచి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే టెలీకాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ క్లైంట్స్‌కు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వివరాలు అందించకూడదనేది ప్రాథమిక సూత్రం. ఓ సందర్భంలో ఈ యువతి ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్కు ఫోన్ చేసి తమ సంస్థ వ్యాపారం విషయం మాట్లాడింది. ఆ సంస్థకు కస్టమర్‌గా మారే విషయాన్ని తాను పరిశీలిస్తానంటూ చెప్పిన చంద్రవేగ్ కాస్త సమయం కావాలన్నాడు. సమాధానం చెప్పడం కోసం సంప్రదించడానికంటూ ఆమె వ్యక్తిగత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు అప్పటి నుంచి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయిన ఇతగాడు బాధితురాలికి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. విసిగివేశారిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు చంద్రవేగ్ నిందితుడిగా గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అవాంఛిత కాల్స్‌పై అవగాహన పెంచండి
న్యూఢిల్లీ: అవాంఛిత టెలిమార్కెటింగ్ కాల్స్‌కు సంబంధించి అమల్లోకి వస్తున్న నిబంధనల గురించి వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని టెలికం సంస్థలు కోరాయి. ఫిర్యాదులు, పరిష్కార విధానం పనిచేసే తీరు గురించి కస్టమర్లకు తెలిస్తే నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ‘డు నాట్ డిస్టర్బ్’ విధానం పనితీరు, ఐచ్ఛికాలను, ఫిర్యాదులను నమోదు చేసే ప్రక్రియ, నియోగదారులకు వారి హక్కుల గురించిన అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఇందుకోసం వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫండ్ నుంచి నిధులు ఉపయోగించవచ్చని మాథ్యూస్ చెప్పారు. అవాంఛిత కాల్స్‌పై కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉంచినవి, పూర్తి వివరాలు లేనందువల్ల తిరస్కరించినవి, విచారణ తర్వాత సహేతుకమైనవిగా పరిగణనలోకి తీసుకున్నవి తదితర అంశాలతో టెలికం సంస్థలు ప్రతి నెలా నివేదిక సమర్పించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తోంది. -
ఐయామ్ కాలింగ్ ఫ్రమ్
తెల్లవారింది మొదలు ‘ఐయామ్ కాలింగ్ ఫ్రమ్’ అంటూ టెలీ కాలర్ల నుంచి ఫోన్ రాగానే విసుక్కుంటాం. కానీ... టెలీ కాలర్ ఉద్యోగంలో ఉండే ఇబ్బందులను మనం పట్టించుకోం. ‘చాలామందికి టెలీ మార్కెటర్స్‌ని ఎగతాళి చేయడం ఒక హాబీ. వారి మనసు ఆ సమయంలో ఎలా ఉందనేది ఎవరూ అర్థం చేసుకోరు’ అని చెప్తున్న స్వరూప్ ‘ఐయామ్ కాలింగ్’ పేరున లఘుచిత్రం తీశాడు. నెల్లూరు వాసి అయిన స్వరూప్ ఆర్ఎస్జే... ప్రస్తుతం బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. అముల్ కంపెనీకి ఇతడు తయారుచేసిన ప్రకటన జాతీయ స్థాయిలో టాప్ 20లో నిలిచింది. మోఫిల్మ్ గోవా కాంటెస్ట్‌కి రూపొందించిన ప్రకటన ఫైనల్స్ వరకు వచ్చింది. రాక్ మ్యూజిక్ బ్యాండ్‌తో తయారైన ఒక పాటను ఎంటీవీలో టెలికాస్ట్ చేశారు. ‘డెరైక్టర్ కావాలనేది నాకు పెద్ద కోరిక. దానికి ముందు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా. దానికి రూపమే ఈ చిత్రం. ఉద్యోగ బాధ్యతలో భాగంగానే టెలీకాలర్స్ ఫోన్ చేస్తుంటారు. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది వారిని ఆట పట్టిస్తుంటారు. ప్రతివారి ఉద్యోగమూ గౌరవప్రదమైనదేనని భావించాలి. సినీ ప్రముఖులు చాలా మంది నన్ను అభినందించారు’ అని చెప్పాడు స్వరూప్. డా. వైజయంతి