Telengana Knowledge Center
-
‘నవోదయ’ సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ నవోదయ ఉద్యోగుల జాతీయ మహాసభలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: నవోదయ విద్యాలయ ఉద్యోగుల సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నవోదయ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలభారత నవోదయ విద్యాలయ ఉద్యోగుల సమాఖ్య 6వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ నవోదయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వారం రోజుల్లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వద్దకు నవోదయ ఉద్యోగ సంఘం ప్రతినిధులను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాజేంద్రన్, నవోదయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగదీశ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు వైఖరి అప్రజాస్వామికం
సాక్షి, సిటీబ్యూరో : ప్రజాస్వామ్య విలువలు, హక్కుల పరిరక్షణపై తెలంగాణ రాష్ర్టప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి ఎంతో అప్రజాస్వామికమని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావు అన్నారు. పదేళ్ల విప్లవోద్యమం పురోగతిపై ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించతలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభలకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. నియంతల పరిపాలనలోనూ ఇలాంటి నిర్బంధం కనిపించలేదన్నారు. ర్యాలీ, బహిరంగ సభలకు అనుమతిని కోరుతూ తాము హైకోర్టుకు వెళ్లినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు సదస్సుకే పరిమితం ... పదేళ్ల విప్లవోద్యమ పురోగతిపై మొదట సదస్సు నిర్వహించి అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ, ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ, పోలీసులు అనుమతి నిరాక రించడంతో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సుకే పరిమితమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందని వరవరరావు చెప్పారు. ప్రొఫెసర్ అమిత్భట్టాచార్య, ప్రొఫెసర్ హరగోపాల్, బొజ్జా తారకం తదితరులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. జార్ఖండ్ కళాకారులు జీతన్ మరాండీ నేతృత్వంలోసాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ర్యాలీకి అనుమతి లేదు: డీసీపీ పత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్ వరవరరావు ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు నేడు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల ర్యాలీకి అనుమతి ఇవ్వలేకపోతున్నామని ఆయన తెలిపారు. -
దళితుల అభివృద్ధికి ప్రణాళికలు
దళిత బహుజనఫ్రంట్ సదస్సులో వక్తల డిమాండ్ హైదరాబాద్: దళితుల సమగ్రాభివృద్ధికోసం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించాలని వక్తలు డిమాండ్‌చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి సవరణలు చేయూలని, దానికున్న పదేళ్ల పరిమితిని ఎత్తివేయాలని, ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు నిధులు విడుదల చేయూలని వారు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో దళిత బహుజనఫ్రంట్ ఆధ్వర్యంలో దళితుల సమగ్రాభివృద్ధిపై నిర్వహించిన రాష్ర్టసదస్సులో పలువురు వక్తలు వూట్లాడారు. వ్యవసాయాధార దళిత కుటుంబాలకు రెండో దశ భూపంపిణీని ప్రారంభించాలని విజ్ఞప్తిచేశారు. సెంటర్‌ఫర్ దళిత్‌స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బడుగు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే పాత్రను దళితసంఘాలు నిర్వహించాలన్నారు. దళిత యువతకు ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి అనుగుణంగా గ్రామాల్లో యువతకు ఎలాంటి ఉపాధికావాలి .. దానికి ఏమి చేయాలో సూచిస్తూ నివేదికను సమర్పించాలని కోరారు. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి దళితుల అభ్యున్నతికి గట్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 59 దళిత కులాలుండగా చిందోళ్లు, గుర్రపు మాల తదితర దళిత కులాల అభ్యున్నతికి అందరూ కృషిచేయకపోతే చరిత్ర క్షమించదన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన పి.శంకర్ మాట్లాడుతూ అసైన్డ్‌భూముల అన్యాక్రాంతాన్ని అరికట్టాలని, దళితులకు పంపిణీచేసిన భూములను భూసేకరణ చట్టం కింద ప్రజాప్రయోజనాల పేరుతో స్వాధీనం చేసుకోవద్దని కోరారు. ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటుచేసి దానికి మానవ హక్కుల సంఘం తరహాలో జ్యుడీషీయల్ అధికారాలు కల్పించి దళితులపై దాడులను నివారించాలని కోరారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, భూహక్కుల పరిశోధకురాలు ఉషా సీతాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షుడిగా పి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా బి.మొగులయ్యను ఎన్నుకున్నారు.