Telugu Atma Gourava Yatra
-
కాంగ్రెస్ భూస్థాపితమే లక్ష్యం: చంద్రబాబునాయుడు
సాక్షి, గుంటూరు: తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలోనూ భూస్థాపిత ం చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించేదాకా నిద్రపోనని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ దొంగలు పడ్డారని, లక్షల కోట్లరూపాయలు ఇటలీకి తరలిపోతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు ‘ఆత్మగౌరవ యాత్ర’ గురువారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మోతడక గ్రామం నుంచి ప్రారంభమయ్యింది. అంతకుముందు తాను బసచేసిన చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో గురుపూజోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు కాసేపు అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. నిడుముక్కల, తాడికొండ అడ్డరోడ్డు, రావెలలో ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగితే తాము ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలంటూ విద్యార్థులు ఆయన్ను నిలదీశారు. తమ భవిష్యత్ ఏంటంటూ ప్రశ్నించారు. సాగునీరు, ఉద్యోగాలు, చదువు, ఆదాయం వంటి సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించనని చంద్రబాబు అన్నారు. టీడీపీ విజన్ 2020ని కాంగ్రెస్ నేతలు విజన్ 420గా మార్చారని విమర్శించారు. తాను ఆడపిల్లలకు 33 శాతం రిజర్వేషన్‌తో కాలేజీల్లో సీట్లు ఇప్పించి చదివించి ఉద్యోగాలు ఇప్పించానన్నారు. ఆడపిల్లను కట్నం అడగని సామాజిక మార్పును తానే తెచ్చినట్లు చెప్పుకున్నారు. రైతుల్ని రుణాల రికవరీ పేరుతో ఒత్తిడి చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి వంటి అసమర్థ పరిపాలకుడిని ఇంతకుముందు చూడలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఓ ఉత్సవ విగ్రహమని ఎద్దేవా చేశారు. తమ చేతగానితనంతో వీళ్లు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు ఫైళ్ల మాయాన్ని ప్రస్తావిస్తూ ఫైళ్లను దాచలేని అసమర్థ ప్రధాని మన్మోహన్ విదేశీ దొంగలకు తాళాలిచ్చే తోలుబొమ్మగా మారారని విమర్శించారు. యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ తన కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, సాక్షి పత్రికపై తన అక్కసు వెళ్లగక్కారు. బాబు యాత్రలో ఆద్యంతం వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సాయుధ పోలీసు బలగాల హడావుడి ఎక్కువగా ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమాలను పట్టించుకోకుండా, పూర్తిగా రైతులు పొలంపనుల్లో బిజీగా ఉన్న ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని యాత్ర కొనసాగుతోంది. మోతడక నుంచి నిడుముక్కల, తాడికొండ అడ్డరోడ్డు, పొన్నెకల్లు, బేజాత్పురం, పాములపాడు, రావెల, మందపాడు, బండారుపల్లి, గరికపాడు మీదుగా తాడికొండకు చేరుకున్న చంద్రబాబు అక్కడ రాత్రి బసకు ఆగారు. -
చంద్రబాబుకు మతి భ్రమించింది: అంబటి రాంబాబు
ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది మీరు కాదా బాబూ? ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో సంబంధం ఉంటే జగన్ జైల్లో ఎందుకు ఉంటారు? మతి భ్రమించి మాట్లాడుతున్న బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి సమైక్యాన్ని కోరుతున్నది వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే ఏకపక్ష విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీలే విభజనపై చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి.. ఆయనతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలి సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుజాతి ఆత్మగౌరవం’ పేరిట సీమాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలో లేక విభజించాలనే దానికి స్పష్టంగా వైఖరి చెప్పకుండా... మతి భ్రమించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే మంచిదని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత ఏకపక్ష విభజనకు అనుకూలంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీలు వ్యవహరించాయి. కానీ ఏకపక్ష విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాణిని వినిపిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే’ అని అంబటి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా... ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఏ ఒక్కరికీ అర్థంకావడంలేదన్నారు. ‘చంద్రబాబూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. విభజించాలంటూ కేంద్రానికి మీరిచ్చిన లేఖను వెంటనే ఉపసంహరించుకోండి. మీరు, మీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి’ అని హితవు పలికారు. చంద్రబాబు చేస్తున్న యాత్రకు జనం రాకపోవడంతో.. వారికి అనుకూలంగా ఉండే కొన్ని చానెళ్లు ఆ దృశ్యాలను చూపించేందుకు చాలా ఇబ్బంది పడిపోతున్నాయన్నారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని బాబు కూడా తన యాత్రను ముఖ్య పట్టణాల ద్వారా వెళ్లకుండా సందులు, గొందుల్లో తిరుగుతున్నారని ఎద్దేశా చేశారు. విభజన లేఖను వెనక్కు తీసుకునే దాకా సీమాంధ్ర ప్రజల ఆదరణ బాబుకు దక్కదని అంబటి స్పష్టం చేశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది చంద్రబాబే.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని ప్రజలు నమ్ముతున్నట్లు అంబటి పేర్కొన్నారు. ‘ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాన్ని విభజించాలంటూ ప్రణబ్ కమిటీకి 2008లో లేఖ ఇచ్చారు. అంతేకాదు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదనడమే కాక, రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గతేడాది రాష్ట్రాన్ని విభజించాలంటూ ప్రధానికి లేఖలు రాసి, షిండేకు లేఖలు అందజేశారు’ అని వివరించారు. ఇంత చేసిన చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర చేస్తున్నానంటే సీమాంధ్ర ప్రజలు విశ్వసించేదెలా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ సీమాంధ్రుల హక్కు అని ఎక్కడైనా చెబుతున్నారా? హైదరాబాద్ నగరాన్ని మొత్తం తానే నిర్మించానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గేయడం లేదా అని అంబటి ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌కు బాబు ఒరగబెట్టింది ఏంటి? అసెంబ్లీ నిర్మించారా, చార్మినార్ కట్టించారా, మక్కామసీద్, బిర్లాటెంపుల్, ఎయిర్పోర్ట్, రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వీటిలో ఏ ఒక్కటైనా నిర్మించారా’ అని అడిగారు. హైదరాబాద్ మొత్తాన్ని సింగపూర్‌లా మార్చానని చెబుతున్న బాబు ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇంతగా గింజుకుంటున్న చంద్రబాబు రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉంచాలని, హైదరాబాద్‌పై సీమాంధ్రులకు కూడా హక్కు ఉందని ఏ ఒక్క చోటైనా చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ‘పాడిందే పాటరా పాచిపళ్ల దాసరి’ అన్నట్లు మహానేత వైఎస్ కుటుంబంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని అంబటి మండిపడ్డారు. అలాంటి పార్టీతో కుమ్మక్కు అయితే జగన్ జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అవిశ్వాసం సందర్భంగా విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినది మీరు కాదా? అని చంద్రబాబును అడిగారు. నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను మోసే కార్యక్రమం మీరు తీసుకొని ఇతరులను నిందించడమేమిటన్నారు. అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లయితే ఇప్పుడు రాష్ట్ర విభజన పరిస్థితి వచ్చుండేదే కాదు కదా? అని ప్రశ్నించారు. ‘అనునిత్యం సమయం, సందర్భం లేకుండా 24 గంటలు జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ రోజు జగన్ జైలుకు ఎందుకు వెళ్లారో, ఎవరిని ఎదిరించినందుకు ఇలా జరుగుతున్నదో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మరి ఆయన సుపుత్రుడు లోకేష్‌బాబు సంగతేంటి? ఆయన కొడుకు గురించి మాట్లాడాల్సి వస్తే పుంఖానుపుంఖాలుగా చెప్పాల్సి వస్తుంది’ అని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు సొల్లు కబుర్లు కట్టిపెట్టి రాష్ట్ర విభజనపై తన విధానమేంటో స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. ఈనెల 7న హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు వైఎస్సార్సీపీని ఆహ్వానించకపోవడానికి గల కారణాలేంటని మీడియా ప్రశ్నించగా... ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేం చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఏపీఎన్జీవోలు ఎందుకు ఆహ్వానించడం లేదో వారినే అడగాలి’ అని ఆయన అన్నారు. -
అధికారమిస్తే ఏడాదిలో పరిష్కరిస్తా!
రాష్ట్ర విభజనపై చంద్రబాబు విభజనపై ఎలాంటి టర్నింగ్ తీసుకోలేదు సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటా రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే విభజన సోనియా కుట్రను తెలుగుజాతి యావత్తూ తిప్పికొట్టాలి సాక్షి, గుంటూరు: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను... రాష్ట్రప్రజల గురించి నాకంతా తెలుసు... ఒక్క ఏడాది నాకు అధికారమిస్తే, అన్నిప్రాంతాల సమస్యల్ని పరిష్కరిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. ‘విభజన’ అంశంపై తాను ఇప్పటికీ ఎటువంటి టర్నింగ్ తీసుకోలేదంటూనే సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటానని తెలిపారు. తెలుగు ఆత్మగౌరవయాత్రలో భాగంగా ఆయన సోమవారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల బస నుంచి రెండోరోజు బస్సుయాత్రను ప్రారంభించారు. కొండమోడు, పెదనెమలిపురి, శ్రీనివాసనగర్, త్రిపురాపురం మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు, చల్లగుండ్ల, చీమలమర్రి, కండ్లకుంట గ్రామాల్లో పర్యటించారు. ఇటలీ వనిత సోనియా తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ సోనియా ఆటలో భాగమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రధాని మన్మోహన్సింగ్ రబ్బర్‌స్టాంప్‌గా తయారయ్యారని.. వ్యక్తిత్వం కోల్పోయిన ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నందునే ‘విభజన’ అంశాన్ని తెరమీదికి తెచ్చారని చెప్పారు. పప్పుసుద్ద రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు ఓట్లు, సీట్లు రాబట్టేందుకే సోనియా తంటాలు పడుతోందని విమర్శించారు. ఈ వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పావుగా మార్చుకుందని చెప్పారు. ఆ వసూళ్లరాయుడు ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లోనే ఉండి ఈ రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలని కుట్ర, కుతంత్రాలు పన్నుతుంటాడని విమర్శించారు. సోనియా కుట్రను తెలుగుజాతి యావత్తూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆనాడు దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీపెట్టి ఇందిర మెడలు వంచిన సంగతిని చరిత్ర చ దివి తెలుసుకోవాలన్నారు. ‘విభజన’ అంశంపై తాను ఇప్పటికీ ఎటువంటి టర్నింగ్ తీసుకోలేదని మరోమారు స్పష్టంచేశారు. కానీ సీమాంధ్రులకు న్యాయం జరిగేంతవరకు తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీనిచ్చారు. రెండో రోజు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరంలోనే ఉండిపోవడం గమనార్హం. రెడ్డిగూడెంలో బాబుకు సమైక్య సెగ టీడీపీ అధినేత చంద్రబాబుకు సమైక్య సెగ మొదలైంది. ఆయన సోమవారం రాత్రి రెడ్డిగూడెంలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు యువకులు ముందుకు దూసుకువచ్చి సమైక్యవాదానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. బాబు వ్యక్తిగత సిబ్బంది, రక్షణ వలయాన్ని దాటుకుంటూ బస్ వద్దకు చేరుకుని... సమైక్యవాదం వర్ధిల్లాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు ‘ఎవడ్రా మీకు ప్లకార్డులు ఇచ్చి పంపింది?’ అంటూ దుర్భాషలాడారు. వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగింపజేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపివేసి సత్తెనపల్లికి వెళ్లిపోయారు. -
భద్రతా వలయంలో బాబు యాత్ర
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర’ అంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన యాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలన్నీ టీడీపీ నేతలు తీసుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిన నేపథ్యంలో బాబు చేపట్టిన యాత్ర ఎలాంటి పరిణామాలకు తెరతీస్తుందోననే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలతో పాటు కార్యకర్తలు సైతం పోలీసుల మాదిరిగానే వ్యవహరిస్తూ ఎక్కడా ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా జాగ్రత్తపడ్డారు. వాస్తవానికి జడ్‌ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు చుట్టూ బ్లాక్‌క్యాట్ కమాండోలు రక్షణగా ఉన్నారు. వీరికి అదనంగా సుమారు వందమంది వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు యాత్ర కొనసాగించారు. కొన్నిచోట్ల జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేసిన యువకులను పార్టీ కార్యకర్తలు పక్కకు లాగేసి ఎవరూ నోరుమెదపకుండా చేశారు. గురజాల పరిసర నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను నేతలు యాత్రకు తరలించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటూ, బొగ్గు ఫైళ్లు మాయమయ్యాయంటూ చాలాసేపు చంద్రబాబు ఇలాంటి అంశాలకే పరిమితం కావడంతో సభికుల్లో అసహనం వ్యక్తమైంది. ఆత్మగౌరవ యాత్ర అంటూ వచ్చి ఇవన్నీ ఎందుకు ఏకరువు పెడుతున్నారో అర్థంకాక దిక్కులు చూడటం కన్పించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు దాచేపల్లి మండలం పొందుగల బ్రిడ్జి వద్ద ప్రారంభం కావాల్సిన చంద్రబాబు యాత్ర ఆశించిన మేరకు జన సమీకరణ జరగక పోవడంతో మూడు గంటలు ఆలస్యం అయింది. ఉదయం 9.30 గంటలకే నల్గొండ జిల్లా వాడపల్లి రాశీ సిమెంట్స్ అతిథి గృహానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వేచి ఉండాల్సి వచ్చింది. నల్గొండ పార్టీ నేతలను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12.30 గంటలప్పుడు పొందుగల బ్రిడ్జి వద్ద జనసమీకరణపై ఆరా తీయగా, అప్పటికి జనం వెయ్యిలోపే ఉన్నారని జిల్లా నేతలు సమాచారం ఇవ్వడంతో వారిపై చంద్రబాబు మండిపడినట్టు తెలిసింది. దీనిపై ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులతో ఆయన మాట్లాడారు. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పొందుగల బ్రిడ్జి వద్ద బాబు యాత్ర ప్రారంభమైంది. బ్రిడ్జి వద్ద ప్రసంగిస్తున్నప్పుడే కొందరు యువకులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే యరపతినేని రంగంలోకి దిగి వాతావరణం సద్దుమణిగేలా చూశారు. పొందుగల, దాచేపల్లి, పిడుగురాళ్లలో చంద్రబాబు చేసిన ప్రసంగాలన్నీ మూసధోరణిలోనే సాగాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన రోజే యాత్ర ప్రారంభించిన బాబు తన ప్రసంగాల్లో పలుమార్లు ఆయన్ను పొగుడుతూ మాట్లాడారు.