Telugu celebrations
-
పెదఅమిరంలో ఘనంగా అంతర్జాతీయ తెలుగు సంబరాలు
-
డల్లాస్‌లో ఘనంగా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో టాంటెక్స్ 122వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు వేడుకలు ఘనంగా ముగిశాయి. గత నెల సెప్టెంబర్16 నుంచి అక్టోబర్ 3 మంగళవారం వరకు జరిగిన ఈ సదస్సు ముగింపు వేడుకలకు అచ్చతెలుగు అష్టావధాని డాక్టర్ పలపర్తి శ్యామలానంద ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డల్లాస్, ఫోర్త్ వర్త్ మెట్రోప్లెక్స్ నగరాల్లోని తెలుగు వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే తెలుగు సంబరాలు చికాగో వేదికగా జరిపేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఆ వేడుకల్లో ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథమహారథులు విచ్చేస్తున్నారు. ఈ సంబరాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. బన్నీతో పాటు డీజే టీం కూడా సంబరాల్లో సందడి చేయనుంది. అమెరికాలో తొలిసారిగా నాట్స్ మూడు రోజుల పాటు మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలుగు సినీ గాయనీ గాయకులు హుషారైన పాటలతో ఈ మ్యూజిక్ నైట్ సాగనుంది. జూన్ 30 నుంచి జులై 2 వరకు కన్నులపండువగా సంబరాలు జరగనున్నాయి. వసుదైక కుటుంబం పేరుతో నాట్స్ సంబరాల టీం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం జరగనుంది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ దానికి తగ్గటుగానే ఈ సంబరాలు జరగనున్నాయి. అమెరికాలో తెలుగు వారంతా ఈ సంబరాలకు విచ్చేసి సంతోషాలను పంచుకోవాలని నాట్స్ పిలుపునిచ్చింది. సంబరాలకు సాహితీ ప్రముఖులు నాట్స్ నిర్వహించనున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి సాహితీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్లొననున్నారు. ప్రముఖ కవి నామిని సుబ్రమణ్య నాయుడు, ప్రముఖ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీనటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణిలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్, సిలికానాంధ్ర ఫౌండర్ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ వీదమాచినేని దుర్గాభవాని ఈ సాహితీ సంబరాల్లో పాలుపంచుకోనున్నారు. తెలుగు భాషా, సాహిత్యంపై ఈ సంబరాల్లో చర్చ జరగనుంది. బాస్కెట్ బాల్ పోటీలకు విశేష స్పందన ముందుగా స్థానిక తెలుగు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాట్స్ బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించింది. నేపర్విల్లె లోని ఫోర్ట్ విల్ యాక్టివిటీ సెంటర్ లో హైస్కూల్ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు జరిగాయి. చాలామంది విద్యార్థులు ఈ పోటోల్లో పాల్గొన్నారు. విజేతలకు నాట్స్ బహుమతులు అందించింది. చికాగోలోని శ్యాంబర్గ్ వేదికగా ఈ సారి సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. -
మేధా వలసలొద్దు.. డోన్ట్ క్విట్ ఇండియా
అది జూలై ఫోర్త్.. అమెరికన్ ఇండిపెండెన్స్ డే! ఆ రోజు అమెరికాలో పదివేలమంది తెలుగువారు ఓ చోటికి చేరి తెలుగు సంబరాలు చేసుకుంటున్నారు. వేదికమీద ‘ద స్టార్ స్ట్రాంగల్డ్ బ్యానర్ ’ అంటూ అమెరికా జాతీయగీతం పాడుతున్నారు. ఆ పాటలో చాలా పదాలు అర్థంకావట్లేదు కానీ దేశభక్తి మాత్రం తొణికిసలాడుతోంది. ఏ దేశ జాతీయగీతమైనా అంతేనేమో! వెంటనే ‘జనగణమన..’ ప్రారంభమైంది.. నరాల్లో రక్తం పరుగులిడుతోంది.. గుండెలో శ్వాసబరువుగా మారుతోంది... కళ్లు ఊటబావులవుతున్నాయ్.. నా చుట్టూ ఉన్న చాలామందిదీ అదే స్థితి. దీనినే దేశభక్తి అనాలా? ఇక ఆ తర్వాత షరా మామూలే! డాలర్లు, రూపాయలు మాట్లాడుకుంటాయ్. కస్టమ్ సూట్లు, డిజైనర్ చీరలు ఫొటోలు దిగుతాయ్. బర్గర్లు, బూరెలు పళ్లేలు వెతుక్కుంటాయ్. అమెరికా అక్కున చేర్చుకున్నా భారతీయతను మర్చిపోకుండా ఉండటానికి వారు పడుతున్న కష్టం రెండు పడవల మీద ప్రయాణంలా అనిపించింది! ఓర్లాండాలో మిత్రుడు శ్రీనివాస్ అన్న మాటలు గుర్తొచ్చాయి..‘అమెరికన్ సిటిజన్‌షిప్ కోసం వెళ్లినప్పుడు గుండెల మీద కుడిచేయి వేసి ఆ దేశ జాతీయగీతం పాడుతుంటే అమ్మని తాకట్టుపెట్టినట్టు అనిపించింది’ అని! తప్పులేదు బ్రదర్.. కూటి కోసం కోటి తిప్పలు! కానీ.. అవసరమొస్తే అదే అమ్మ కోసం శ్రీనివాస్ ఈ దేశానికి తిరిగిరాగలడా?.. అనుమానమే! న్యూయార్క్‌లో ఓ తెలుగులక్ష్మి నాలుగు చేతులా (వాళ్లాయనవి కూడా కలిపి) డాలర్ల పంట పండించింది. మట్టివాసన పిలుస్తోందంటూ చేస్తున్న వ్యాపారాన్ని చుట్టేసి, ఉద్యోగాన్ని కట్టేసి ‘ఫర్ గుడ్’ అంటూ ఈ దేశానికి తిరిగొచ్చింది. ఆ కుటుంబాన్ని వెరీగుడ్ అనొచ్చా... ఏమో.. ఎందుకంటే మట్టికొట్టుకుపోతున్న విలువల్ని కడిగేయడానికి డాలర్లను కరిగించేసింది మరి! ఆమె మళ్లీ వెళ్లిపోతుందా? శ్రీనివాస్ రాడేమో అన్న అనుమానానికీ.. లక్ష్మీ వెళ్లిపోతుందేమో అన్న భయానికీ లింక్.. దేశభక్తి! .. ఎన్ఆర్ఐలకున్న పాటి దేశాభిమానం మనకి లేదా? ఇదేం ప్రశ్న! 68 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పండగలా మనమూ జరుపుకుంటున్నాం కదా.. వాట్సప్పుల్లో ప్రొఫైల్ పిక్‌గా మువ్వన్నెల పతాకం పెట్టేస్తాం.. ఈ ఒక్క రోజుకి! ఫేస్బుక్లో దేశభక్తి నినాదాలు పోస్ట్ చేస్తాం.. లైకులు ఎక్కువ రాకపోయినా పర్లేదని! గల్లీ గల్లీలో తిరంగా ఎగరేస్తాం.. ట్రాఫిక్‌కు అడ్డయినా సరే! ఫ్రీడం సేల్‌లో తెగ కొనేస్తాం..డిస్కౌంట్లు మళ్లీ రావని! ఇంతేనా.. దేశభక్తి? నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తి?? పరాయిపాలకులను తరిమికొట్టిన స్ఫూర్తి ఏది? స్వరాజ్యంలో సొంతపాలకుల దోపిడీని తిప్పికొట్టే ధైర్యాన్ని ఎక్కడ దాచుకున్నాం? ఓటును నోటుకి ఎందుకు అమ్ముకుంటున్నాం? ఫ్రీడంని సేల్ చేశామా? లంచగొండి తనాన్ని నిలదీసే బదులు అదే లంచంతో మనం పాలకులకు బానిసలవుతున్నామా? బీ ద చేంజ్.. అని పిలుపునిచ్చిన బాపూజీ ఈ మార్పులను చూసి నోరెళ్లబెడతారేమో! పక్క దేశాల్లోని చట్టాలు మన దేశంలో ఎందుకు పనికిరావో తెలుసా? అక్కడ ఎంత స్వేచ్ఛ ఉన్నా చట్టానికి లోబడే ఉంటారు. ఇక్కడ అన్నింటికంటే ముందు ‘నేను’ అనుకుంటూ.. ఆ ‘నేను’కి స్వేచ్ఛ ఇవ్వాలనే దూకుడులో పక్కవాడికీ స్వేచ్ఛ ఉందని మరిచిపోతున్నాం. మూత లేని సీసాల్లో పీతల్లా మిగిలిపోతున్నాం. అందుకే.. కొంత స్వేచ్ఛని త్యాగం చేద్దాం. అధికారబలంతో అందినంత దోచే స్వేచ్ఛ.. పేదోడిని ఎప్పటికీ పేదరికంలో ఉంచే స్వేచ్ఛ.. లంచం అడిగే స్వేచ్ఛ.. ఇచ్చే స్వేచ్ఛ రూల్స్ బ్రేక్ చేసే స్వేచ్ఛ.. బాధ్యతని తెగ్గొట్టే స్వేచ్ఛ.. మానవతకు మచ్చ తెచ్చే స్వేచ్ఛ.. మనకొద్దు! అందుకే.. స్వాతంత్య్ర సంగ్రామం స్ఫూర్తిగా ఇప్పుడు మళ్లీ ఉద్యమిద్దాం. స్వరాజ్య ఉద్యమం చేద్దాం.. రాజకీయ ప్రక్షాళన చేద్దాం. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభిద్దాం.. అధర్మంపై గళమెత్తుదాం. సహాయనిరాకరణ మొదలెడదాం.. నయవంచకులు, కీచకులను బహిష్కరిద్దాం. స్వదేశీ నినాదాన్ని ఉద్యమంగా చేసుకుందాం.. ఉత్పత్తులను, హస్తకళలను ప్రోత్సహిద్దాం. చివరగా..ఒక ఉద్యమాన్ని బలంగా చేద్దాం.. Don't Quit India. మేధా వలసలు ఆపండి! ఆశ మిగిలే ఉంది.. యువతరంలో స్ఫూర్తి, శక్తి కొత్తగానే ఉంది. యంగ్ ఎనర్జీ ఇంకా సుషుప్తావస్థలోకి జారుకోలేదు. ఫేస్బుక్ వాల్స్ పసలేని నినాదాలను కాదు ప్రభుత్వాలను వణికించే విప్లవాలనూ సృష్టించాయి! రాజకీయాల్లో పేరుకున్న చెత్తను ప్రక్షాళన చేయడానికి చట్టసభల్లో చేరి తమ సత్తాను చాటుతున్నారు! మట్టికొట్టుకుపోయిన వీధులనే కాదు మనుషుల మనసులనూ శుభ్రంచేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు! బాపూ... బీ ద ఛేంజ్.. నువ్వన్న మాటలు వట్టిపోలేదు! దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్.. గురజాడా.. నీ జాడలు నిజం నిజం! ఇది నా దేశం! మేరా భారత్ మహాన్! ఈ మార్పులను అమలుచేసే ఆ యంగ్ ఎనర్జీకి సలాం! జైహింద్! ఖద్దరు ధరించండి... వివేకవర్ధిని పాఠశాల ప్రాంగణంలో మహాత్మాగాంధీ 1929లో ఇచ్చిన ఈ పిలుపు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. అనిబిసెంట్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబా ఆమ్టే వంటి మహోద్యమకారులు ప్రసంగించిన, సందర్శించిన 107 ఏళ్ల చరిత్ర ఉన్న విద్యాలయాన్ని ఒక్కసారి చూడాలనిపించింది. అణువణువునా చరిత్ర స్ఫూర్తిని ప్రసరిస్తున్న వివేకవర్ధినికి వందనం.