Tempo vehicle
-
ముంబైలో మరో ‘నిర్భయ’
సాక్షి, ముంబై: దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకున్న నిర్భయ తరహా ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాజాగా పునరావృతమయ్యింది. నగర శివారు సాకినాక ప్రాంతంలో ఖైరానీ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున టెంపో వాహనంలో 34 ఏళ్ల మహిళపై దుండగుడు కిరాతకానికి ఒడిగట్టాడు. అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హింసించాడు. కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూసింది. నిర్భయ గ్యాంగ్‌రేప్ ఘటనలో జరిగినట్లుగానే ముంబైలో బాధితురాలి మర్మాయవాల్లోకి దుండగుడు ఇనుప రాడ్ దూర్చి రాక్షసంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికితోటు కత్తిపోట్ల వల్ల తీవ్ర రక్తస్రావమై బాధితురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. ఖైరానీ రోడ్డుపై వాహనంలో మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసిన సమీపంలోని ఓ కంపెనీ వాచ్‌మన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, సమాచారం ఇవ్వడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, బాధిత మహిళను అదే టెంపో వాహనంలో ఆసుపత్రికి తరలించామని పోలీసులు వివరించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మోహన్ చౌహాన్(45)గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిందితుడు దర్యాప్తులో తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి ముంబై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాని్న(సిట్) ఏర్పాటు చేశారు. మహిళపై అత్యాచారం చేసి, దారుణంగా హింసించి చంపడం మానవత్వానికే మాయని మచ్చ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈ సంఘటనపై వేగంగా దర్యాప్తు జరిపిస్తామని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారిద్దరూ కలిసి ఉంటున్నారా? ఇదిలా ఉండగా, బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడామని ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ చెప్పారు. తన కుమార్తె(బాధితురాలు) పట్టుబడిన నిందితుడితో గత 10–12 ఏళ్లుగా కలిసి ఉంటోందని, ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని చెప్పిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా గొడవ పడడంతో తీవ్రంగా కొట్టి ఉండవచ్చని భావిస్తున్నట్లు తల్లి తమ దృష్టికి తీసుకొచి్చందని అన్నారు. సాకినాకలో అత్యాచారం ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ డిమాండ్ చేశారు. ముంబైలో తమకు భద్రత లేదన్న భావన మహిళల్లో కలుగుతోందని చెప్పారు. మత్తుకు బానిసగా మారి అకృత్యం మహిళపై అత్యాచారం, హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పేర్కొంది. అత్యాచారం ఘటనలో మోహన్ చౌహాన్‌తోపాటు మరికొందరు పాల్గొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధిత మహిళలకు పెళ్లయ్యింది. 13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. సాకినాక ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన నిందితుడు మోహన్ చౌహాన్ ముంబైలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రాత్రిపూట సాకినాకలో పుట్‌పాత్‌లపై నిద్రిస్తుంటాడు. మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. మహిళపై అత్యాచారం చేసిన సమయంలో అతడు మత్తులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మోహన్ చౌహాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి అతడిని ఈ నెల 21 దాకా రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలిచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి
నెల్లూరు / సంగం: కళాకారులతో వెళుతున్న టెంపో వాహనం బోల్తాపడి గాయకుడు మృతిచెందిన ఘటన సంగం మండలంలోని దువ్వూరు–సిద్ధీపురం మార్గమధ్యలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారి వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన సుస్వర పాటకచ్చేరి బృందం టెంపో వాహనంలో మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు వెళ్లింది. అక్కడ పాటకచ్చేరి నిర్వహించింది. బృందం బుధవారం మైదుకూరు నుంచి నెల్లూరుకు వాహనంలో నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మండలంలోని దువ్వూరు–సిద్ధీపురం మధ్య నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై టెంపో ముందు చక్రం టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న రొయ్యలగుంతలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి గుంతలోకి దిగి ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ఘటనలో గాయకుడు, డ్రైవర్ అయిన కిషోర్ (45) అక్కడికక్కడే మృతిచెందాడు. మహిళా సింగర్లు ప్రశాంతి, రమ్య, జ్యోతి, సిరి, డ్యాన్సర్లు వినోద్, సాయి, అత్తిలి, సాయి, విద్యాసాగర్ తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ఉన్న కళాకారులకు సంబంధించిన రూ.లక్ష విలువ చేసే వాయిద్య పరికరాలు ధ్వంసమయ్యాయి. సంగం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 108 రాక ఇక్కట్లు ఘటన జరిగిన వెంటనే 108కి సమాచారం అందించడంతో ఒక వాహనం వచ్చింది. ఇందులో ప్రశాంతి, రమ్య, జ్యోతి, సిరిలను తరలించారు. మిగిలిన వారిని తరలించేందుకు మరో వాహ నం రావడం తీవ్రంగా ఆలస్యమైంది. దీంతో క్షతగాత్రులు రోడ్డుపై పడుకొని విలపిం చారు. స్థానికులు వారిని వెంటనే ఆటోలో బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాహనం రాకపోవడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
సాక్షి, బంగారుపాళెం: చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని కేజీ సత్రం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, టెంపో ట్రావెలర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11మంది బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి టెంపో ట్రావెలర్ వాహనం మాట్లాడుకుని మైసూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరు నుంచి తిరుమలకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుష్ప (48), నిషా సాహు (19), మునీషా సాహు (23) అక్కడికక్కడే చనిపోయారు. రామ్‌నాథ్ సాహు (64), శరత్ సాహు (45), అనంతపురం జిల్లాకు చెందిన టెంపో డ్రైవర్ గిరి తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని చిత్తూరు, బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. -
టెంపో వాహనం ఢీకొని పాదచారుడి మృతి
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఓ పాదచారుడిని అతివేగంగా వస్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. దాదాపు గంటసేపు రోడ్డుపైనే ప్రాణాలతో కొట్టుమిట్టాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి చివరకు ప్రాణాలు వదిలేశాడు. కాగా, పాదచారుడిని ఢీకొట్టిన అనంతరం టెంపో వాహనం డ్రైవర్ తన వాహనాన్ని పరిశీలించుకుని మరీ వెళ్లిపోయినట్టు సమాచారం.