tenth day
-
నిరసనల జోరు..నినాదాల హోరు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి హామీ లేకపోవడంతో వెనక్కి తగ్గేది లేదంటూ కార్మికులు పట్టు వీడట్లేదు. ఆందోళనల్లో భాగంగా సోమవారం బస్ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. డిమాండ్లపై స్పందించే వరకు వెనుకాడేది లేదన్న కారి్మకులు.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే కారి్మకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ మరణా లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం బస్‌డిపోలు, బస్టాండ్ల వద్ద ఆర్టీసీ కారి్మక జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి సంతాపసభలు నిర్వహించారు. రోడ్లపైకి 5,375 బస్సులు కారి్మకుల సమ్మె దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ఆర్టీసీ యాజమాన్యం సోమవారం 5,375 బస్సులు తిప్పినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 3,557 బస్సులు ఆర్టీసీ సంస్థవి కాగా, 1,818 బస్సులు అద్దె పద్ధతిలో తీసుకున్నవి. సురేందర్ మృతదేహానికి పోస్టుమార్టం ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్న కండక్టర్ సురేందర్‌గౌడ్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ రమణమూర్తి నేతృత్వంలో వైద్యుల బృందం సోమవారం పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు ఆస్పత్రిలో సురేందర్ మృతదేహానికి నివాళులరి్పంచారు. ముగిసిన అంత్యక్రియలు ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్న కండక్టర్ సురేందర్‌గౌడ్ అంత్యక్రియలు సోమవారం కార్వాన్లో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు, కారి్మకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు,కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు హెచ్‌సీయూ బస్ డిపో వద్ద తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కండక్టర్ సందీప్ అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితిని గమనించిన కారి్మకులు తక్షణం స్పందించి కొండాపూర్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కారి్మకుల సమ్మెకు మద్దతుగా సోమవారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాలు బస్‌భవన్‌ను ముట్టడించాయి. మంత్రి పువ్వాడ అజయ్ సంతాపం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి తీవ్రంగా కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థంచారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పదో రోజుకు రిలే దీక్షలు
తుని : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే దాడిశెట్టి ఆధ్వర్యంలో స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం పదో రోజుకు చేరాయి. కోటనందూరు మండలం బొద్దవరం, తొండంగి మండలం దానవాయిపేట, ఎ.కొత్తపల్లి పంచాయతీల పరిధిలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. వారికి పార్టీ తుని పట్టణ శాఖ అ«ధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. రిలే దీక్షలో బొద్దవరానికి చెందిన దొడ్డి బాబ్జీ, సుర్ల నానాజీ, వేగి అప్పలనాయుడు, సుర్ల అప్పలనాయుడు, యల్లపు దొరబాబు, లగుడు వరహాలు, యల్లపు రామసూరి, మళ్ల శ్రీను, యల్లపు రాము, తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మేరుగు ఆనందహరి, యనమల నాగేశ్వరరావు, గరికిన రాజు, మొసా సత్తిబాబు, అంగుళూరి శ్రీను, మడదా శ్రీనివాసరావు, మారేటి లక్ష్మణరావు, కుక్కా నాగరాజు, పిరాది గోపి, పి.పోలారావు, నేమాల రామకృష్ణ, అంబుజాలపు అచ్చారావు, ఎ.కొత్తపల్లికి చెందిన వనపిర్త సూర్యనారాయణ, సాపిశెట్టి చిన్న, వడ్లమూరి కృష్ణ, బెక్కం చంద్రగిరి, గర్లంక బాబ్జీ, డి.నాగు, మెయ్యేటి సత్యానందం, వనపర్తి రాఘవ, శివకోటి శేషారావు, గణ్ణియ్య, వెలుగుల చిట్టిబాబు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దీక్షలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. అందరూ సమష్టిగా పోరాటం చేయకపోతే భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏకతాటిపై పోరాటం చేస్తే ఢిల్లీ పెద్దలు దిగివస్తారని నాయకులు స్పష్టం చేశారు. పదో రోజు దీక్ష చేస్తున్న వారికి పార్టీ నాయకులు షేక్ ఖ్వాజా, అనిశెట్టి నాగిరెడ్డి, కీర్తి రాఘవ, కుసనం దొరబాబు, నాగం గంగబాబు, గాబు రాజబాబు, బర్రే అప్పారావు, చోడిశెట్టి పెద్ద, వాసంశెట్టి శ్రీను, షేక్ బాబ్జి, కొప్పన రాజబాబు తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. -
పదో రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
పదో రోజు కొనసాగుతున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
పుష్కర కృష్ణ
-
కృష్ణమ్మ చెంత కోలాహలం
-
పదో రోజుకు జ్యువెలరీ సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ఆభరణాలు, బులియన్ వర్తకులు చేస్తున్న సమ్మె పదవ రోజుకు చేరింది. ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 2 నుంచి జరుగుతోంది. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. 1981, 2012ల్లో కూడా రత్నాలు, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. సురక్షిత సాధనంగా పుత్తడి: కాగా, ధరల్లో ఒడిదుడుకులున్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ 670-685 టన్నులకు పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఆభరణాల కంటే నాణాలు, కడ్డీలకే డిమాండ్ బాగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులుండడం, స్టాక్ మార్కెట్లు బలహీనతలు, కరెన్సీ విలువలు తగ్గడం వల్ల సురక్షిత సాధనంగా పుత్తడి ఉంటుందని వివరించింది.