సుప్రీం తీర్పు వరకూ ఆగమనండి
పదో షెడ్యూల్ అంశాలపై కేంద్ర హోంశాఖకు ఏపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: పదో షెడ్యూల్లోని అన్ని సంస్థలు తమకే చెందుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు అందుకు చెందిన నిధులన్నీ తమవేనని స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పదో షెడ్యూల్ వ్యవహారంపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినందున అక్కడినుంచి తీర్పు వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం పదో షెడ్యూల్ సంస్థల విషయంలో ఎలాంటి చర్యలను తీసుకోరాదని అడ్వొకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు పదో షెడ్యూల్లోని సంస్థలు, నిధులు విషయంలో యధాతథస్థితిని కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది.