నిస్సాన్ టెర్రానో కొత్త వెర్షన్, ధరెంతో తెలుసా?
జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తన ఎస్యూవీ టెర్రానోలో కొత్త వెర్షన్ ను సోమవారం లాంచ్ చేసింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.13.6 మధ్యలో(ఎక్స్ షోరూం ఢిల్లీలో) ఉండేటట్టు కంపెనీ నిర్ణయించింది. 2013 అక్టోబర్‌లో లాంచ్ చేసిన ఈ మోడల్‌కు పెద్దగా తేడా లేనప్పటికీ, 22 చిన్న చిన్న మార్పులతో దీన్ని ఆవిష్కరించింది. కాంపాక్ట్-ఎస్యూవీ సెగ్మెంట్ హ్యుందాయ్ క్రిటా, మారుతీ సుజుకీ విటారా బ్రిజాల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు నిస్సాన్ తన ఇంటీరియర్స్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వర్క్ చేస్తోంది.
2017 నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్‌లో చేసిన 22 కొత్త మార్పులు... నావిగేషన్‌తో కూడిన కొత్తగా 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ గుర్తింపు, ఎలక్ట్రికల్‌గా ఆపరేట్ చేసే ఓఆర్వీఎమ్స్, హిల్ క్లింబ్, క్రూజ్ కంట్రోల్ వంటి వాటిని ఈ వెర్షన్లో జతచేర్చింది. అంతేకాక, ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా పరమైన ఫీచర్లతో ఈ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 1.5 డీజిల్ ఇంజిన్ వంటి వాటిలో నిస్సాన్ ఎలాంటి మార్పులు చేయలేదు.
కొత్త వేరియంట్ ధరలు...
టెర్రానో ఎక్స్ఎల్ ధర - రూ.9.99 లక్షలు
టెర్రానో ఎక్స్‌ఈడీ ధర - రూ.9.99 లక్షలు
టెర్రానో ఎక్స్ఎల్డీ(ఓ) ధర -రూ. 11.92 లక్షలు
టెర్రానో ఎక్స్వీడీ పీఆర్‌ఈ ధర - రూ.13.60 లక్షలు