test event
-
భారత్ డబుల్ ధమాకా
టోక్యో: జపాన్ గడ్డపై భారత పురుషుల, మహిళల హాకీ జట్లు గర్జించాయి. ఒలింపిక్ టెస్టు ఈవెంట్లో భారత జట్లే విజేతలుగా నిలిచాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు కొత్తగా నిర్మించిన స్టేడియాలని ప్రాక్టికల్‌గా పరిశీలించేందుకు ఈ టోర్నీలను నిర్వహిస్తారు. ఇందులో పురుషుల జట్టయితే లీగ్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 5–0తో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ ని.), షంషీర్ సింగ్ (18వ ని.), నీలకంఠ శర్మ (22వ ని.), గుర్సాహిబ్జిత్ సింగ్ (26వ ని.), మన్దీప్ సింగ్ (27వ ని.) తలా ఒక గోల్‌తో భారత్‌కు ఎదురులేని విజయాన్ని అందించారు. మహిళల జట్టు జపాన్‌పై... భారత మహిళల జట్టు ఆతిథ్య జట్టును 2–1తో ఓడించి టైటిల్ గెలుచుకుంది. భారత్ తరఫున నవజ్యోత్ కౌర్ (11వ ని.), లాల్రెమ్సియామి (33వ ని.) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున మినామి (12వ ని.) ఏకైక గోల్ సాధించింది. -
భారత హాకీ జట్ల జోరు
టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు నిర్మించిన స్టేడియంలో టెస్ట్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఇందులో భారత హాకీ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన పోరులో పురుషుల జట్టు ఏకంగా అరడజను గోల్స్‌తో హోరెత్తించింది. దీంతో భారత్ 6–3 గోల్స్‌తో ఆతిథ్య జపాన్ను కంగుతినిపించి ఫైనల్ బెర్తు కొట్టేసింది. స్ట్రయికర్ మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగాడు. మన్దీప్ 9, 29, 30 నిమిషాల్లో మూడు గోల్స్ చేశాడు. మిగతా వారిలో నీలకంఠ శర్మ (3వ ని.), నీలమ్ సంజీప్ (7వ ని.), గుర్జంత్ సింగ్ (41వ ని.) తలా ఒక గోల్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది. ‘డ్రా’తో ఫైనల్‌కు... భారత మహిళల జట్టు చైనాతో ‘డ్రా’ చేసుకొని ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ అయినా నమోదు కాలేదు. ఈ ఫలితంతో భారత మహిళల జట్టు పాయింట్ల పట్టికలో 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో ఆతిథ్య జపాన్‌తో తలపడుతుంది. -
రియో ఒలంపిక్స్ టెస్ట్ ఈవెంట్ షెడ్యూల్ విడుదల
రియోడిజినారో: రియో ఒలంపిక్స్ టెస్ట్ ఈవెంట్ షెడ్యూల్ విడుదలైంది. 2016 లో జర్మనీలోని రియోడిజనారోలో జరగబోయే ఒలంపిక్స్ కు 21 విభాగాలకు ఈ ఏడాది టెస్ట్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. మరో 23 ఈవెంట్లకు 2016 జనవరి నుంచి మే వరకు టెస్ట్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. మొత్తం ఈవెంట్లను మూడు సెగ్మెంట్లుగా విభజించారు. మొదటి సెగ్మెంటయిన వాలీబాల్ ను 2015 మేలో నిర్వహించనున్నారు. ఈవెంట్ల రెండో విభాగంలో అవుట్ డోర్ విభాగాలైన బాక్సింగ్, బాస్కెట్ బాల్, డైవింగ్ లను నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నిర్వహించనున్నారు. చివరి ఈవెంట్లుగా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్ బాల్ లను నిర్వహించనున్నారు.