tgt teachers
-
పీజీటీ, టీజీటీలపై కఠిన చర్యలొద్దు
సాక్షి, అమరావతి: మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టళ్ల వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిపై నిర్వర్తించేందుకు ముందుకు రాని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)పై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. వార్డెన్ విధులు నిర్వర్తించాలని ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. వార్డెన్ విధులకు సిద్ధమైన పీజీటీ, టీజీటీలకే బాధ్యతలు అప్పగించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు రోజున అసలు వార్డెన్ స్థానంలో పీజీటీ, టీజీటీలు పనిచేయాలన్న నిబంధన కఠినమైనదే అయినప్పటికీ, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996లోని రూల్ 10(ఎ) ప్రకారం యజమాని ఆదేశాలను ఉద్యోగి పాటించి తీరాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. హాస్టళ్ల నిర్వహణకు అవసరమైన పోస్టులను సృష్టించి, అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తగిన యత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా హాస్టల్ డ్యూటీ నుంచి పీజీటీ, టీజీటీలకు విముక్తి కల్పించాలన్నారు. వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిలో నిర్వర్తించాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పలువురు పీజీటీ, టీజీటీలు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.రాజేష్ బాబు వాదనలు వినిపిస్తూ, విద్యా శాఖాధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ తరఫున న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులైన పీజీటీ, టీజీటీలు సర్వీసు రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనన్నారు. వారు నెలకో, రెండు నెలలకో ఓ రోజున వార్డెన్‌గా పని చేయాల్సి ఉంటుందన్నారు. -
డీఎస్ఎస్ఎస్బీలో 5807 టీజీటీ పోస్టులు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ)ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ)..అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 5807 ► సబ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ. ► అర్హత: మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజస్(ఎంఐఎల్)లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ(ఆనర్స్), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి నాలెడ్జ్ ఉండాలి. సీబీఎస్ఈ నుంచి సీటెట్‌లో అర్హత కలిగి ఉండాలి. ► వయసు: 32ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: వన్ టైర్/టూ టైర్ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 04.06.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.07.2021 ► వెబ్సైట్: https://dsssb.delhi.gov.in -
టీజీటీ పోస్టులకు 4,078 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు ఇప్పటివరకు 4,078 మందిని ఎంపిక చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తంగా 10 సబ్జెక్టుల్లో 4,362 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 9 సబ్జెక్టులకు సంబంధించిన 4,078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఒక్క సైన్స్ సబ్జెక్టులో 284 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదని పేర్కొంది. తాజాగా సోమవారం టీజీటీ ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఫలితాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇందులో 752 టీజీటీ ఇంగ్లిష్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని, మరో 37 మంది వికలాంగుల ఫలితాలను మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని పేర్కొంది. అలాగే ఒక పోస్టుకు సంబంధించి కోర్టు కేసు ఉన్నందున పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపింది. టీజీటీ హిందీ పోస్టులకు 354 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అందులో 20 మంది వికలాంగులకు సంబంధించిన ఫలితాలను వారి మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని వివరించింది. నెల రోజుల వ్యవధిలోనే.. నెల రోజుల వ్యవధిలోనే 5,405 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి, ఫలితాలను వెల్లడించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో టీజీటీ పోస్టులకు 4,078 మందిని, ఏఈఈ పోస్టులకు 132 మందిని, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు నలుగురిని, గ్రేడ్–2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 851 మందిని, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 340 మందిని ఎంపిక చేసి, ఫలితాలను ప్రకటించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ 30,490 పోస్టుల భర్తీకి 83 నోటిఫికేషన్లను జారీ చేసిందని, అందులో 11,023 పోస్టులను భర్తీ చేసిందని, మరో 19,024 పోస్టుల భర్తీ, ఫలితాల వెల్లడి వివిధ దశల్లో ఉంటుందన్నారు. 1న స్టాఫ్ నర్సు ఫైనల్ కీ.. స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫైనల్ కీని మే 1న వెబ్సైట్లో ఉంచనున్నట్లు వాణీప్రసాద్ తెలిపారు. వివరాలను వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఫైనల్ కీపై అభ్యంతరాలు స్వీకరించబోమని వెల్లడించారు. -
పేరుకే ఆదర్శం
నిజాంసాగర్: జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను రెండేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సదరు పాఠశాల ల్లో ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించాలి. జిల్లాలోని 15 మండలాల్లో గతేడాది నుంచి తరగతులను ప్రారంభించారు. మొదట్లో 6, 8వ తరగతితోపాటు ఇంటర్ ప్రథమ తరగతులకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులను లాటరీ పద్ధతిన పాఠశాలల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం రెండో సంవత్సరం ఆదర్శ పాఠశాలల్లో పదోతరగతి మినహా ఆరు నుంచి ఇంట ర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఆద ర్శ పాఠశాలల్లో తరగుతులవారీగా విద్యాబోధన చేపట్టేందుకు సరపడా ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్‌కు అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్ట లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో బోధించేం దుకు ఉపాధ్యాయులు, ఆధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యాబోధనకు గాను ఒక్కొక్క మోడల్ పాఠశాలల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని పలు మోడ ల్ పాఠశాలల్లో ఏడెనిమి మంది ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ అయ్యారు. ఆదర్శ పాఠశాలలకు ఉపాధ్యాయుల ఎంపిక పూర్తయినా అప్పటి ప్రభుత్వం వారిని పాఠశాలల్లో నియమించ లే దు. నిజాంసాగర్, మద్నూర్, కొత్తాబాది, ఎల్లారెడ్డి, గాందారి, సదాశివనగర్, రెంజల్ తదితర మండలాల్లోని ఆదర్శ పాఠశాలలు సమస్యలతో సతమవుతున్నాయి. ఆదర్శానికి ఆరు వందలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటితో పాటు మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. అలాగే సబ్జెక్టులవారిగా ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తి చేయకపోవడంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. గతేడాది ఆరకొర వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతతో విద్యాసంవత్సరాన్ని నెట్టుకొట్చారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోంది. ఈ విషయమై పాఠశాల నిర్వహకులు విద్యార్థుల తల్లితండ్రులతో ఇటీవల సమావేశమై పాఠశాలలో కనీస వసతులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల నిమాయకం కోసం ఒక్కొక్క విద్యార్థి రూ. 600 చెల్లిం చాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లిస్తేనే వసతులు కల్పించడంతోపాటు ప్రైవేట్ టీచర్ల నియమించొచ్చని నిర్వహకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న బోజనం తింటున్నా తాగడానికి మంచినీటి కొరత వేధిస్తోంది. ఈ సమస్య తీర్చడానికి విద్యార్థులు డబ్బులు చెల్లించాలని నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని విద్యార్థులను పంపిస్తే ఆరువందలు చెల్లిం చడం ఇబ్బందికరంగా మారుతోందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యాబోధనకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని తల్లితండ్రులు కోరుతున్నారు.